Wednesday, December 31, 2008

Srinivasa Ramanujan


Srinivasa Ramanujan, the greatest of all the twentieth century mathematicians, born at a time, a period, when India was lauded as Ratna Garbha, the nineteenth century.


India, with its ancient culture and its heritage gave birth to so many great persons, throughout its history from time immemorial. But, Ramanujan stands alone on a separate plane(t), because he was a warrior par excellence. He was not armed with weapons, but his own vision.


Throughout the centuries there were men who took first steps down new roads new roads armed with nothing but their own vision, Ramanujan certainly belongs to that class.


‘Ramanujan’ owns his name in such a way that the word itself causes and creates awe among the listeners and if a person tells others that he is a (some) Ramanujan, he was compared and liked to the Ramanujan.


His life was a tamely finished voyage, but not tamely made. His untimely death, he lived thirty two years four months and four days, may have stopped the flow of formulae, and identities, which Hardy once remembered with awe and affection that he was shown some half a dozen formulae per a day, but not the influence he created over many of modern-day number theorists.


Ramanujan left behind a vast number of results in his note books. Many of them were studied and proved by some professors/mathematicians partially. Still many of them are not satisfactorily proved.


Prof. Bruce C. Berndt, of University of Illinois, has spent much of his time, for over two decades to study each and every one of the 3254 entries in the Note books of Ramanujan. These were brought out and published by him, and his colleagues. Also there was a pre-posthumous work, of him, namely ‘The Collected papers’ have been a source for further researches to innumerable researchers world over.


Śruti and Smŗti (Smruthi)


Such a vast number of results is an incredible achievement in such a short life time, but it was made possible by the genius Ramanujan. As earlier said, his work of producing six results a day demonstrates the frantic pace at which he worked.


Once asked by others, Ramanujan replied that he was told those formulas by Namagiri Thayar (or Namagiridevi or Goddess of Namagiri) of Namakkal, his family deity, in his dreams. Some of the modernists ridiculed that statements, but this can be explained, and can be proved true by the ancient Indian tradition of Śruti and Smŗti.


Śruti means hearing, not mere hearing, but hearing to a Guru (teacher) with all concentration in a proper way. In the ancient periods the students were taught vocally but the Gurus, the Vedas and other scriptures. The students listen to them with all concentration, of course concentration personified. That is the reason for the Vedas are called Śrutis. Smŗti means remembrance. It is the art of remembrance that had lead to the preservation of all the Vedic literature.


It was told that Vedas were first told by the Lord Vishnu to the Brahma. Brahma heard them, and by remembering (Smŗti) them passed the knowledge on to the next (further) generations.


The students used to hear (Śruti) from the Guru, and remember the knowledge (Smŗti), and used it for practical purposes. Through the ancient concept Śruti and Smŗti, Ramanujan the student ‘listened to’ his Guru, the Goddess Namagiri Thayar, who used to appear in his dreams, and remembered the formulas told by her In this way, he produced a lot of formulas.


It is human nature to err, and that is the reason why some of his formulas were wrong, but the errors were very little. To be precise, he might not remember all the formulas told by the Goddess Namagiri Thayar, his Guru in his dreams.


Why and how he took Her counsel? What made him to take mathematics as his prime interest? When did he start his voyage in to the ocean of Mathematics? What sort of atmosphere, in which he has grown, thatMade him the man he is? This will be discussed in the following passages. We will start in the following way.Some of Ramanujan’s western friends who thought they knew him, would say that he was not really religious, that his mind was indistinguishable (?) from any brilliant westerner’s, that he was a Hindu only by a mechanical observance, or for form’s sake alone.


Was his mind indistinguishable from any brilliant westerners’? Had any westerner from the late eighteenth century to the dawn of the twenty first century produced results of Ramanujan’s class? Most of those so-called brilliant westerners spent years to even understand his formulae. (Some are there of equal brilliance, but they were tutored in a formal way). Still majority of his work unproved and some of his work is producing stunning applications in modern technologies and theoretical physics.


All the years he was growing up, he lived the life of a traditional Hindu Brahmin. He wore the topknot. He had felt sad and was reluctant when he had to cut his hair and remove his topknot, when he was to go to the west. He never grew moustache and beard. He was always clean shaved.


All his life he was a rigid vegetarian. He frequented local temples. He strictly participated in ceremonies and rituals at home. He regularly invoked his family deity’s name, the Goddess of Namagiri of Namakkal and based his actions on what he had taken to be her wishes.


He attributed to the Gods his ability to navigate through the shoals of mathematical texts written in foreign languages. He could recite from the Vedas, the Upanishads and other Hindu scriptures.


He had penchant for interpreting dreams, a taste for occult phenomena, a mystical bent, upon which his Indian friends unfailingly commented. It was said that he had predicted his death to his wife in his later years.


Ramanujan often lost in talking about Vedas and śastras, the ancient Sanskrit tomes, and gave running commentaries on their meanings.


At the age of twenty-one, he showed up at the house of a teacher, got drawn in to a conversation, and soon was expatiating on the ties he saw between God, zero and Infinity, keeping every one spell bound. It was the way often for Ramanujan. Losing himself in philosophical and mystical monologues, he would make bizarre, fanciful leaps of imagination that his friends and others did not understand but found fascinating any way.


This was evident in his mathematical equations also. They cannot make you understand them with much ease, but fascinate you.


It was no surprise that Ramanujan was inspired and lead by divine hand.It had been to Namagiri, the consort of the Lion-god Narasimha, to whom Ramanujan’s parents, childless then, had prayed for a child. Ramanujan’s maternal grandmother, Rangammal, was a devotee of Namagiri, and was said to enter a trance to speak to her. Many years earlier, before Ramanujan’s birth, Namagiri revealed (to) her that one day the Goddess would speak through her daughter’s son.


Ramanujan grew up hearing the story. All his life he invoked Her blessings, seek Her counsel. It was the Goddess Namagiri, he would tell his friends, to whom he owed his mathematical gifts. Namagiri would bestow mathematical insights in his dreams. Namagiri would tell and wrote equations on his tongue. He was the student and She was the Guru. He would hear from Her (Śruti), and would remember by rechanting the equations (Smŗti), wrote in his notebooks. Being a mortal, he would sometimes forget his lessons, due to which he erred.


What a great and live example to the ancient traditional Guru-Sishya relationship Between Namagiri and Ramanujan? It is to be remembered that Saraswathi is the Goddess of knowledge, and wisdom. Gayathri is the Goddess of Vedic scriptures. It is the great Indian tradition, which gives equal priority to the fairer gender (ladies).


Comparison with Einstein and Mozart


“What Einstein was to physics, Mozart was to music, Ramanujan was to mathematics,” says Clifford Stoll.


was arguably the greatest ever, inarguably the greatest of the twentieth century physicists. He has changed the face of modern day physics.


ఇది నేను శ్రీనివాస రామానుజన్ మీద తయారు చేస్తున్న లాంగ్ ఎస్సే. ఇంతవరకూ ఆయన గురించి టచ్ చేయని రీతిలో ఒక కొత్త పాయింట్ని తీసుకుని రాస్తున్నది. దీనిని Prof. Krishnaswami Alladi గారికి, Prof. K. Srinivasarao (Ex. Director, IMSc, Chennai) గారికీ, మరికొందరు ప్రముఖులకి చూపించటం జరిగింది. వారంతా ఎంతో మెచ్చుకుని ఈ రకం గానే వ్రాయమనీ, పూర్తి చేసిన తరువాత పబ్లిష్ చేయిద్దామనీ అన్నారు. మన తెలుగు బ్లాగర్ల కోసం అందులో కొంత భాగాన్ని నా బ్లాగులో పెడుతున్నాను.

Read more...

Thursday, December 18, 2008

మన గురించి మనకే తెలిపే దమ్మున్న పుస్తకం ఇది.


చాలా కష్టపడి సంపాదించిన పుస్తకం. దానికి తగ్గ మజానే, అనుభూతినే, ఆలోచనలే నాకు కలిగించింది.

ఆ పుస్తకం పేరు 'పెంట్ హౌస్ లెజెండ్'. అది రచయిత పెట్టుకున్న, మనసు పడ్డ పేరు. కానీ తానొకటి తలిస్తే దైవం ఒక తలుస్తాడు అనేది మనకందరికీ తెలిసిందే. అలా ఆ పుస్తకం పేరు 'Night of January 16th' గా మారి పోయింది. చివరికి అలాగే స్థిరపడి పోయింది.

ఆ కథ కూడా ఇంకో క్రొత్త కథ. దాని గురించి తెలుసుకోవాలన్నా ఈ పుస్తకాన్ని చూడాల్సిందే.

'Night of January 16th' ఒక డ్రామా. కోర్ట్ రూమ్ లో నే ప్రారంభం అయి అందులోనే కొనసాగి అందులోనే ముగిసే అద్భుతమైన డ్రామా. దీనికున్న ప్రత్యేకత ముగింపు మనకిష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. మన మనసుకి ఎలా అనిపిస్తే... కాదు కాదు. మన మనోఫలకం పైన ఎలాంటి భావాలున్తాయో అలాంటి ముగింపుని మనం ఇవ్వవచ్చు. అందుకే ఇది మన మనసి చిత్రాన్ని మనకే గీసి చూపే చిత్రకారుని వంటి పుస్తకం.

కథ ఏమిటంటే... (డ్రామా ప్రధానాంశం) Bjorn Faulkner అనే ఒక bussinessman తన ఇన్వెస్టర్లని ముంచేస్తాడు. ఇంతలో అతను ఆత్మహత్య చేసుకుంటాడు, కానీ అది ఆత్మహత్య కాదు. అతనిని అతని మాజీ priyuraalu Karen Andre చంపిందని ఆమెని accuse చేస్తారు. ఆ murder trial trial ఈ డ్రామా ప్రధానాంశం.

డ్రామా అంతటిలోనూ హీరో/విలన్ (మన మనసుని, మన జీవిత దృక్కోణాన్నీ అనుసరించి) ఐన Bjorn Faulkner కనపడదు. కానీ కథాంశం అంతా అతని మీదే. A sense of life గురించే, అతని జీవన గమనం ఆధారం గా రచయిత్రి vivaristhundi.

డ్రామా అంతా for/against సాక్షుల విచారణ, చివరికి తీర్పు అంతే. వేరే ఏమీ ఉండదు.

తీర్పుని ఆ రోజుల్లో ప్రేక్షకులలోనుంచీ select చేసిన jury ఇచ్చే విధం గా ఉండేది. మన చ్గాదవటానికి మాత్రం ఆ తీర్పు మనమే ఇవ్వాలి.

for/against వాదనలు రెండూ చాలా balanced గా రెండువైపులా నిష్పాక్షికంగా ఉండటం లో..., ఎక్కడా 'చదువరి'/ప్రేక్షకుని influence చేయని విధం గా మలుచటం లో రచయిత్రి విజయం సాధించిందని అనటం చాలా చిన్న మాట. (అసలు ఇలాంటి వాటిని స్త్రీలే సమర్ధంగా వ్రాయగలరు. ఒప్పుకుని తీరాలి).

మన తీర్పు మన జీవన దృక్పథాన్ని అనుసరించే ఉండాలని రచయిత్రి నియమం పెడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన value judgements ని ఒక్క క్షణం లో నిర్ణయించుకోవటమే. The metaphysics of our life at a glance.

ఇందులో ఒక అద్భుతమైన dialogue ఉంది. దాన్ని చదివి మనం ఈ పుస్తకాన్ని చదవాలా లేదా అని నిర్ణయించుకోవచ్చు.

"మనిద్దరిలో ఒకరే నిజం చెపుతున్నారు. అదెవరో మనిద్దరికీ తెలుసు."

Heroin/Villain Karen Andre, మొదటి act చివరిలో విలన్/హీరోయిన్ Nancy Lee Faulkner తో అంటుంది.

Artist తన కళని with liberty స్వీకరించే అవకాశాన్ని ఇవ్వటం చాలా అరుదు. ఆ అవకాశాన్ని మనకి Ayn Rand ఇచ్చింది. ఇక చదవటం మనదే ఆలశ్యం.

విన్నపం: నా రీవ్యూ చూసి మాత్రం ఎవరూ పుస్తకాన్ని చదవవద్దు. మీ judgement మీద depend అయి చదవండి. అదే రచయిత్రికీ, నాకూ ఇష్టం. లేనిదే ఆ పుస్తకం యొక్క లక్ష్యం నెరవేరదు.


హెచ్చరిక: "It's not a question of right or wrong. It's only whether cou can do it or not."

అనేది కథకి ఆయువు పట్టు లాంటి dialogue. దాని గురించి రచయిత్రి వ్రాసిన ముందు మాట చదివితే మనకి అర్ధం అవుతుంది. లేకుంటే అపార్ధం అవుతుంది. అందులోనూ ఈ మధ్య జరిగిన సంఘటనలని చూశాక.

Read more...

Monday, December 15, 2008

దాదా వెడలే 'సౌ'రవితేజము లలరగ


(గంగూలీ వీర విహారం తో Steve Waugh రిటైర్మెంట్ ని చిద్రం చేసి సగర్వం గా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని అందుకున్న వేళ! 2003-04 BG Series)


నేను
తొమ్మిదో తరగతిలో ఉండగా ఒక ఫైన్ ఉదయం మా ఫ్రెండు బీ శ్రీను గాడింటికి క్రికెట్ ఆడటానికివెళ్ళాను. వాడూ మరో నలుగురం కలసి ఎసెసెన్ కాలేజ్ గ్రౌండు కి వెళ్ళీ ఆట మొదలెట్టాము.ఆట మంచి రంజుగా సాగుతోంది.మా ఆపోజిట్ టీం ఉన్న పది ఓవర్లలో ఏభై నాలుగు కొట్టారు.

తరువాత మాదే బ్యాటింగ్. నలుగురమూ సింగిల్ సైడ్ (ఒకళ్ళే ఆడటం) ఆడాలి. ముందు యాజ్ యూజువల్ గా బీ శ్రీను దిగాడు. ముందు నన్ను దించరు. ఎందుకంటే మనకి అంత సీన్ ఉండదు. ఎప్పుడో తప్ప. మూడు లో దిగమన్నారు. సరే అని నేను వెళ్ళీ కూచున్నాను. శ్రీను గాడు బాగా కొడతాడని అందరికీ తెలుసు. పొట్టోడే కానీ మహా గట్టోడు. చక చకా మూడు ఓవర్లలో 22 కొట్టి ఔట్ అయ్యాడు. ఆ తరువాత ఇంకోడు దిగాడు. శ్రీను గాడు ఔట్ కాగానే వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. మహ ఐతే నెనో పది కొట్టి పోతానని అందరి ఎక్స్పెక్టేషన్. రెండో వాడు మరో పది కొట్టి బాల్చీ తన్నేశాడు. (నిజం గానే. రన్నుకి వెళుతూ మధ్యలొ ఎవరో బాల్చీ పట్టుకుని వస్తుంటే అది చూస్తూ వాడు రనౌట్ అయ్యాడు.)

ఇక నేను రాక తప్పలేదు. ఎక్కడ లేని పోజులు కొడుతూ వెళ్ళి నించున్నాను. రమేష్ గాడు బౌలింగ్. వాడు మాంఛి స్పీడు గా వేస్తాదు. వాడంటే మాలో చాలా మందికి భయం. భలే స్పీడు గా వచ్చి బంతేయటానికి రెడీ అవుతుండగానే నేను ఆగరోయ్ అంటూ ప్రక్కకి తప్పుకున్నాను. అందరూ నవ్వారు. శ్రీను గాడేమో ఒరే 'ఓవర్లన్నా కాచుకో' అంటూ నస మొదలెట్టాడు. ఇంకా 21 బంతులున్నాయి. ఇంకో 23 కొట్టాలి.నా వల్ల కాని పని అది. అందుకే కనీసం ఒవర్లన్నా కాచుకుంటే బాగుంటుందని వాడి ఉద్దేశ్యం.

కానీ నా ఆలోచనలు వేరు గా ఉన్నాయి. నా ఆలోచన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేద్దామని. ఎందుకంటే మేము ఆల్రెడీ ఓడిపోతామని డిసైడ్ అయి ఉన్నాము. అందుకే అలా ఆడి ఒక ప్రయోగం చేయాలని నా ఆలోచన. ఇక్కడో విషయం చెప్పాలి. నాకు లెఫ్ట్ హ్యాండ్ పవరెక్కువ. టెన్నిస్ లో బ్యాక్ హ్యాండ్ అలవాటై ఆ చేత్తో థ్రస్ట్ ఎక్కువ అప్ప్లై చేయగలను. అప్పుడు హిట్టింగ్ చేయొచ్చు. గెలిస్తే గెలుస్తాం. లేదంటే ఎటూ వదిలేసిందేగా.

నేను లెఫ్ట్ హ్యాండ్ శ్టాన్స్ తీసుకున్నాను. శ్రీను గాడు తల పట్టుకున్నాడు. తిక్కలోడు ఎదోక మెంటల్ పని చేయందే ఊరుకోలేడు అని గట్టిగానే అన్నాడు. నేను పట్టించుకోలేదు. రమేష్ ఇంకొంచం స్పీడు పెంచి వేసిన బంతిని నేను స్ట్రైట్ బాట్ తో హాఫ్ వాలీ గా తీసుకుని ముట్టించాను. బంతి బౌండరీ దాటింది. అందరూ ఆశ్చర్యంగా చూశారు. నేను మాత్రం ఎప్పటిలాగే ఒక హాఫ్ స్మైల్ ఇచ్చాను.

"ఉరే వీడు గూంగ్లే లాగా ఆడుతున్నాడురా!" కిరణ్ గాడు అన్నాడు. "వాడెవరురా?" నేనన్నా. అర్ధం కాక. "వాడేరా మొన్న సెంచరీ కొట్టాడే వాడు రా." గంగూలీకి వచ్చిన తిప్పలు. "ఓ గంగూలీయా?" అన్నాను. "కాదురా వాడి పేరు గూట్లే రా!" అరిచాడు అక్కడ టూ సైడ్ ఆడుతున్న బుడ్డోడు.

ఆ బుడ్డోడు ఏమో కానీ ఆస్త్రేలియన్ల కంటికి మాత్రం ఈ కలకత్తా రాకుమారుడు గూట్లేనే. ఎందుకంటే వాళ్ళని వాళ్ళ దేశంలోనే, వాళ్ళ పద్ధతిలోనే ఎదిరించిన మొదటి మొగాడు. భారత క్రికెట్ లో ఒక్క మగాడు.

ప్రపంచ క్రికెట్ చరిత్రని మలుపు త్రిప్పిన వాళ్ళు ఇద్దరైతే, ఆ ఇద్దరూ మన దేశానికే చెందిన వాళ్ళే కావటం మనకి గర్వ (గంగూలీ ఈజాన్ ఇగోయిస్ట్. ఐ యాం ప్రౌడ్ ఆఫ్ ఇట్.) కారణమైన విషయం. వాళ్ళిద్దరిలో ఒకరు కపిల్ ఐతే మరో వ్యక్తి 'సౌ'రవితేజములలరగ ఈ మధ్యనే రిటైర్ అయిన దాదా గంగూలీ.

అప్పటి దాకా పాశ్చాత్యుల ఆధిపత్యంలో ఉన్న క్రికెట్ని 'భారతైజేషన్' చేశాడు కపిల్. ఒకే ఒక్క ఇన్నింగ్స్. నూటడెబ్బై ఐదు (175) పరుగులు. అంతే. భరతే క్రికెట్ సూపర్ పవర్. నిజమా కాదా?

అలాగే కంగారూల కుప్పిగంతులని కాళ్ళు విరగ కొట్టి మరీ ఆపిన వీరుడు గంగూలీ. ఒకే ఒక్క నూట నలబై నాలుగు. అనగా పన్నెండు స్క్వేర్. పన్నెండు. 1 అండ్ 2. మొదటిది ఆస్త్రేలియాదే ఐనా, రెండు భారతే అని చూపెట్టాడు. ఔనా కాదా? వాట్ డూ యూ సే?

తన చివరి సీరీస్ లోనూ వారిని మట్టి కరిపించి తన 'సౌ'శీల్యాన్ని జట్టు కి వారసత్వంగా వదలి తాను సగర్వంగా నిష్క్రమించాడు.

అలాంటి గంగూలీ విజేతల స్వర్గ ధామమైన 'వింబుల్డన్ విలేజ్' లో ఉండదగ్గ వ్యక్తీ. అందుకే రేపు 'వింబుల్డన్ విలేజ్' లో గంగూలీ గురించి ఆర్టికిల్ వ్రాస్తున్నాను. (నిజంగా రేపే. :-)

Read more...

Sunday, December 14, 2008

You oughtta do it స్వప్నికా!

Yeah you oughtta do it. నిఝంగా న్న్యాయం ఝరిగింది... భగవంతుడు చేసిన న్న్యాయం ఇది. నాకిప్పుడు చాలా ఆనందం గా ఉంది. ఇక ఆడపిల్లలు అందరూ స్వేచ్ఛగా తలలు ఎత్తుకుని మరీ తిరగొచ్చు.

నీకు అంత ఆనందం కలగటమే నాకు కావాలి. నీ మనసు ఇప్పుడు కుదుట పడింది అని నేను భావిస్తున్నాను. నాకైతే ఎగిరి గంతులు వెయ్యాలనేటంత సంతోషం కలిగింది. గ్రేసీ సింగ్ మీదొట్టు.

ఒకమ్మాయి మీద ఒకడు యాసిడ్ పోశాడు. వాడిని ఎన్కౌంటర్ చేసేద్దాం. అంతే ఇకెప్పుడూ అమ్మాయిల మీద ఎవరూ యాసిడ్ పోయారు. భయపడి పోతారు. ( బాబోయ్! నాకు బైమేసేసింది బాబోయ్!) నువ్వేమో మంచి పని జరిగిందని ఆనందించు. చూశావా నీకు ఒక్కదానికి కష్టం కలిగించి దేవుడు అమ్మాయిలందరినీ యాసిడ్ దాడులనుంచీ రక్షించాడు. చెప్పను కానీ నువ్వు 'పక్షి' (సాక్షి దిన పత్రిక) రామన్నయ్య బంగారానివి. ట్వంటీ ఫర్ క్యారెట్.... కాదు సారీ నేనూ ఒక పురుషుదినే కదా అందుకే తక్కువ చేశాను నిన్ను, ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ క్యారెట్ బంగారానివి.

కాదేమో? నువ్వు ఒక డైమండ్ వి. ఎందుకంటే వజ్రాన్ని వజ్రం తోనే కోయాలికదా. నీతో పెట్టు కున్నందుకు వాడు బుల్లెట్ తో కోయబడ్డాడు. నువ్వు "వాడికి పడిన శిక్ష తక్కువ. చాలా తేలికగా తప్పించుకున్నాడు," అన్నావు. నిజమే వాడికి పడిన శిక్ష చాలా చిన్నది. హాయిగా ఒక బుల్లెట్, రెండు... మహా ఐతే ఆరు చాలు వాడు పోయేటందుకు. మనసినిమాల్లో లాగ ఎన్ని బుల్లెట్లు దిగినా బ్రతికేందుకు వాడేమీ హీరో కాదు కదా. వాడొక విలన్.

కానీ సమాజానికి పడిన శిక్ష? ఎంత భయంకరమైంది? ఆటవిక న్యాయం. కాదిది. ఆటవిక న్యాయం లోనూ ఒక లాజిక్ ఉంటుంది. కానీ ఇక్కడ? న్యాయం? మనుషులు లా ప్రవర్తించారా జనులు? పండగలు చేసుకున్నారు. ఒక మనిషి ప్రాణం పోయినందుకు.

ఒక్కటే మాట. ఏసు అడిగినట్టు. వాడిని అనే ముందు మనలో ఎవరూ తప్పూ చేయలేదా? మనమంతా సుగుణ సంపన్నులమా? పండగలు చేసుకున్న విద్యార్ధి సంఘాల వాళ్లు అంతా గొప్ప సంస్కారం కలిగిన వాళ్లా? విద్యార్ధి సంఘాల నాయకవరేణ్యులు మహానుభావుల? ఎవరూ ఆడపిల్లలని ఏడిపించని వాళ్ళేనా?

బయటకి వెళితే ఎంతమంది ఆడ పిల్లలని కామ దృష్టితో చూడరు? నా ప్రశ్నలు దార్ తప్పాయి. ఎమోషన్. యస్. An ఎమోషన్. అదే నన్ను ఇక్కడ దారి తప్పించింది.

పోలీసులు జనం గోల భరించలేక వాళ్ళని ఏదో మర్డరు చేశారనుకుందాం. పోన్లే పాపం అని వదిలేయవచ్చు కదా? నెల కొకటి అన్నా చేయందే లిస్టు ఫిల్లవదుకదా! ఎమోషన్ లో జనానికి మతి తప్పింది. దేవుడు కూడా ఆంధ్రామృతం త్రాగి గతి తప్పినట్టున్నాడు. (ఏమంటావ్ కృష్ణయ్యా? నిన్ను కాదులే అంది. పాపం ఎవరో దేవుడట. ఒకడున్నాడంటున్నారు.).

---------------------------------------------------------------------------

వాడు చేసిన తప్పుకి చంపేశారు. బాగుంది. రేపు పిల్లాడి తండ్రో... లేక వారి వంశం లో ఎవరో దీనికి ప్రతీకారం తీర్చుకునేటన్దుకు పెద్ద పెద్ద exercise లు చేసి, పిస్టల్ పట్టుకుని కాల్చటం నేర్చుకుని, ఒక గుర్రపు స్వారీ చేసి, ఒక హీరోయిన్ తో డ్యూయెట్ పాడుకుని చివరాఖర్న వీడు పిల్లని చంపేసి 'ఇప్పుడు నా పగ చల్లారింది. నా వంశీకుల్ని చంపటానికి కారణమైన అమ్మాయిని (ఇప్పుడు బామ్మ) నేను చంపేశాను,' అంటాడు.

ఎవరి కోసం నాటకాలు? ఎవరిని ఉద్ధరించటానికి షోకులు? టీవీ వాళ్ళకి వేరే పనీ లేక చేసేదా ఇది? ఎందుకు అసలే మానసికంగా శారీరకంగా గాయపడిన పిల్ల ముహంలో మైకు పెట్టి అభిప్రాయం అడగటం ఎందుకు? న్యాయం జరగాలంటే మరో మార్గం లేదా? మైకుతోనే న్యాయమా?

నక్సలైటన్నలూ ఏమంటారు? తుపాకీ వదిలేసి (కమల్ అన్నట్టుగా లపాకీ కాదు. నిజం గానే తుపాకీ వదిలేసి) మైకు పట్టండి. అన్యాయం జరిగిన వాళ్ళందరి ఉం లో మైకు పెట్టి వారి అభిప్రాయాలని అడగండి. మీరు కోరుకున్న సామాజిక న్యాయం జరుగుతుంది.

-------------------------------------------------------------------------

ఇప్పుడు పిల్లగాడి తల్లి తండ్రుల పరిస్థితి ఏమిటి? దొరికారని ఎన్కౌంటర్ చేయతమేనా? మరి మన నాయకులూ చాలా సార్లు దొరికార్గా? మరి వాళ్లనేపుడు ఎన్కౌంటర్ చేస్తారు?

ఒక పని చేద్దాం. తప్పు చేసిన వాడిని చంపేద్దాం. దొరక గానే. అలా అలా చంపేద్దాం. అందరికీ భయం వేసి తప్పు చేయటం ఆపేస్తారు.

ఇది ఇలా ఉనుంది. యాసిడ్ పోసినందుకు కుర్రాడిని చంపేశారు కదా! ఇప్పుడు పోలీసుల్ని తప్పు చేసినందుకు నది రోడ్డులో కాల్క్ష్హి చంపేద్దాం. తర్వాత పోలీసుల్ని చంపినందుకు కాల్చిన వాళ్ళని చంపేద్దాం. లోపుల మానవ హక్కుల సంఘాలు పండగలు చేసుకుంటాయి. (వాళ్ళకి బ్రహ్మానందం యాభై పైసలు ఇచ్చి పండగ చేసుకునేటందుకు
encourage చేస్తాడు. అప్పుడు వాళ్లు బ్రహ్మానందానికి వంద నోటు ఇచ్చి బిర్యానీ తిని నువ్వే పండగ చేసుకో అంటారు.)

అప్పుడు చంపిన వాళ్ళని ఇంకొకరి చేత చంపిద్దాం. తరువాత ఇంకొకరిని ఇంకొకరి చేత.

ఫిర్? ఇంకో ప్రాణం తుర్.

ఒక పద్ధతీ పాడూ మనకి వద్దు. ఎందుకంటే మనం సామాజిక న్న్యాయం కి కట్టు పడ్డాం కదా. చక్కగా తప్పులు చేద్దాం. చంపేసుకుందాం. అప్పుడైతే హాయి హాయి గా అందరూ చచ్చి పోతారు. దేశం లో family planning అమలవుతుంది. యాసిడ్ తెచ్చిన family planning. ఎంత బావుంటుందో"రకరకాల ముసుగులు వేస్తూ ఎపుడో మరిచాం సొంత ముఖం"
--------------------------------------------------------------------------

స్వప్నిక మీద దాడి జరగటం ఎంత ఆటవికమో పిలాదినీ చంపటమూ అంతే. జనానికి కావాల్సింది వాళ్ల అహం చల్లారటం. రేపు ఎవరూ పిల్లని ఆదరించరు. అది జరగబోఎడే. ఏదో పెద్ద హీరోయిన్ లా మీడియా ముందు ఆక్రోశిస్తే ఏమి లాభం? వారం లో పోయే గొడవకి అందరికీ ఏదో ఒక తుత్తి టైపు ఆవేశం. కానీ long standing లో జరిగే నష్టాన్ని ఎవరూ పట్టించుకోడం లేదు.

1. స్వప్నిక ఒక అందమైన చిలుక లాంటి అమ్మాయి.

2. అమ్మాయి మీద యాసిడ్ పోసిన వాడొక పశువు.

3. వాడిని ఎన్కౌంటర్ చేసిన పోలీసులు అంత కన్నా హీనం.

4. మరి దానికి పండుగ చేసుకున్న వాళ్లు? ఏమవుతారు?

మనం ఆలోచించొద్దు. బుర్ర అసలే ఉపయోగించొద్దు. ఉపయోగిస్తే ఇలాంటి నేరాలు జరగవు. అప్పుడు మనం మాట్లాడుకునేందుకు టాపిక్కులే ఉండవు. హాయ్. హాయ్.


http://in.youtube.com/watch?v=p68rj879Zyg



నేను వ్రాసేటప్పుడు పాట వింటూ వ్రాశాను. (Otherwise I could not controll my anger, and emotions. I feel that's not right.) మీరూ వినండి. చూడండి. కానీ పరిష్కారం ఆలోచించే దిశ గా అడుగులు వేద్దాం. అంతే కానే ఆవేశాన్ని చూపించటం చేయొద్దు.

Read more...

Wednesday, December 10, 2008

రామాయణం - వాల్మీకి మహర్షి

రామాయణ మహాకావ్యం తో విడదీయరాని అనుబంధం కలిగిన పేరు వాల్మీకి మహర్షిది. వల్మీకములనుండీ ఉద్భావించినవాడు కావటం చేతనే వాల్మీకి గా ప్రసిద్ధుడైనాడు. అంతియే కాదు. పుట్టాను ఛేదించుకుని తానూ వచ్చినట్లే ఆ రామ కథను మనకి అందించి తాను ధన్యుడై, మనలనూ ధన్యులను చేశాడు.

శ్రీమదఖిలాండ సచ్చితానంద పరమాత్ముని సృష్టిలో వివేకము కలిగిన మానవ జాతి ఒక్కటి మాత్రమే గొప్పది. ఇటువంటి మానవ జన్మను సార్ధకం చేసుకునేటందుకు ధర్మ, అర్ధ, కామ, మోక్షములనే చతుర్విధ పురుషార్ధములను ఆర్జించుకోవాలి. ధర్మాన్ని అవలంబించి మిగిలిన పురుషార్ధములను ఆర్జించుకోవాలన్న ఉద్దేశ్యమే ధర్మాన్ని ప్రధమంగా నిలపటానికి కారణం అవుతుంది. ఈ విషయాన్ని గురించేకాకుండా... ధర్మాన్ని గురించి, ధర్మాచరణ గురించి, సోదాహారం గా వాల్మీకి మహర్షి వ్రాసిన కావ్యమే రామాయణం.

----------------------------------------------------------------

ఇది నేను మొదటి సారి టైపు చేసిన పోస్ట్. అంతకుముందు మా అబ్బాయి టైపు చేశాడు. అందుకే నా ఓపికను బట్టీ ఇంతే వ్రాశాను. ఇక ముందు పూర్తిస్థాయిలో వ్రాయాలి. నాకూ ఉత్సాహం వచ్చింది. పిల్లలని చూసి.

Read more...

Sunday, December 7, 2008

ప్రియా ప్రియా చంపోద్దే!

మూడు రోజుల క్రితం జరిగిన సంఘటన నా జీవితాన్నే మార్చేసేది. నేను కొంచం బలహీనుడిని ఐతే. నేను శారీరకంగా సన్నగా ఉన్నా, మానసికంగా ద్రుఢమ్ గానే ఉంటాను. అందువల్లే మళ్ళీ నా సహజ శైలిలోకి రాగలిగాను. (బ్లాగుల వ్రాతల విషైకంగా కాదు. మానసికంగా.

ఇంకా వాడి మాటలు నా మనసులో మారోమ్రోగుతూనే ఉన్నాయ్. "నువ్వే అంతా చేశావ్. సుఖంగా ఉన్న నా ప్రాణాన్ని కష్టాలలోకి నెట్టుకున్నాను. నువ్వింకోసారి నాకు కనపడకు."

వెల్. నేను కనపడను. దాంతో అంతా అయిపోతుందా? వాడి ప్రాణం సుఖ పడుతుందా?

సతీష్ నాకు నెల క్రితం కనిపించి, "ఏరా నాకో వెయ్యి ఇస్తావా?" అన్నాడు. నిజానికి వాడికి ఇవ్వటానికి వెయ్యి ఎక్కువేం కాదు. నాకు చాలా సార్లు వాడిచ్చాడు. నాకు సాధారణంగా ఇవ్వటానికి ఉంటే ఇక ఏమాత్రం ఆలోచించకుండా ఇచ్చేస్తాను. (అందరికీ కాదు). ఆ రోజెందుకో అడిగాను. "ఎంట్రా విషయం?" అని.

"రేపు జ్యోతి బర్త్డే. తనకి ఏమన్నా గిఫ్ట్ ఇద్దామని."

"నీ దగ్గర లేవా ఏంటి? అయినా బర్త్డే గిఫ్ట్ కోసం వెయ్యి ఎందుకురా?" (మా ఏజ్ ని బట్టీ అంత అవసరం లేదని నా నమ్మకం. ఎందుకంటే మేము ఇప్పుడిప్పుడే సంపాదిస్తున్నాం. కొంతవరకూ అమ్మా, నాన్నల మీద ఆధార పడి బ్రతుకుతున్నాం.)

"శాలరీ ఇంకా రాలేదు. ఇంట్లో పాకెట్ మనీ ఇవ్వలేదు.నాన్నగారు ఊళ్ళో లేరు. అందుకని..."

"నువ్వు నా దగ్గర నసగక్కర్లేదు. తీసుకోరా," అంటూ ఇచ్చేశాను. అంతటితో ఆగి ఇంతే ఈరోజు ఈ టపా పుట్టుండేది కాదు. నాకు మాటలు తప్పేవి.

"రేయ్ సత్తీ! ఎప్పుడూ నువ్వే బిల్స్ పే చేస్తున్నావని విన్నాను. ఒక్కోసారి తననీ కట్టనీ. ఎందుకంటే నువ్వూ, తనూ ఇద్దరూ కూడా పేరెంట్స్ మీద పార్శియల్లీ డిపెండెంట్. చెరో సారీ పే చేస్తే బర్డెన్ ఉండదు ఎవరో ఒక్కళ్ళ మీద."

వాడికి నా సంగతి తెలుసు. సాధారణంగా నేను చెప్పినవి ఏవైనా కాదనడు. కొంచం రీజన్ మీద బేస్ అయి ఉంటానని వాడికి తెలుసు. ఒకసారి మా ఫ్రెండ్ ఒకమ్మాయిపుట్టిన రోజైతే అందరూ పార్టీ అడిగారు. సమయం వచ్చినప్పుడు నా జేబుకూ బొక్కడుతుందని నేనొక సలహా ఇచ్చాను.

"అందరం పేరెంట్స్ మీద ఆధార పడ్డవాళ్ళం. పుట్టిన రోజైతే ఇలా పార్టీలు అడిగిభాయ పెట్టేకన్నా పుట్టిన రోజు పార్టీకి మనమే తలా కొంచం స్పెండ్ చేసి తనకే పార్టీ ఇద్దాం. మనకీ అంత బర్డెన్ ఉండదు. తనూ హ్యాపీగా ఫీల్ అవుతుంది."

అప్పటి నుంచీ ఎవరిదన్నా పుట్టిన రోజోస్తే మిగతా వాళ్ళం అందరం తలా కొంచం స్పెండ్ చేసి ఇంకా బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం. ఒక్కళ్ళే ఐతే అంత పెద్ద మొత్తం రాదు. కొంతమందికి ఆర్ధికంగా ఇబ్బంది కావొచ్చు. అదే ఇలా ఐతే చక్కగా ఎవరికీ అంత బర్డెన్ కాదు. ప్లస్, అసలు వ్యక్తికి తనకి మన వాళ్లు అందరూ నాకోసం స్పెండ్ చేస్తున్నారనే ఆనందం ఉంటుంది.

సరే! అసలు సంగతి. మా వాడు ఆసారికి ఏదో గిఫ్ట్ పెద్దదే ఇచ్చి గ్రాండ్ గా పార్టీ ఇచ్చుకున్నాడు తన లవర్ కి. వారం తరువాత ఏదో ప్రోగ్రాం పెట్టుకున్నారు. అప్పుడు బిల్ విషయం లో నేను చెప్పిన మాటలనే తను తన వాయిస్ గా చెప్పాడు. ఐతే ఆ అమ్మాయి వాడి మాటలని 'అర్ధం' చేసుకుని "ఇంత పిసినారి వాడిని ఎక్కడా చూడలేదు. ఇప్పిదే స్పెండ్ చేయని వాడివి రేపు పెళ్ళయిన తరువాతేమి స్పెండ్ చేస్తావ్?" అని విసుక్కుని వెళ్లి పోయింది. తరువాత మా వాడు చాలా సార్లు ఫోనులో మాట్లాడటానికి ట్రై చేసినా ఫోను లిఫ్ట్ చేయలేదా అమ్మాయి. నాల్రోజుల తరువాత ఆ పిల్ల కనబడితే వీడు విషయం అడిగాడు.

"నీలాంటి సోంబెరిగాదితో నాకు మాటలనవసరం. ఆడదాని సోమ్మునాసించే వెధవవి. ఇక నాకెప్పుడూ కనబడకు." అని వెళ్లి పోయింది. మావాడు ఆమాటలను సీరియస గా తీసుకున్నాడు. మర్నాడు మేము విన్నదేమిటంటే వాడు సూసైడ్ attempt చేశాడని.

నేనూ, ఇంకో ఫ్రెండూ వెళ్లి అడిగాము. అప్పటికి వాడు హాస్పిటల్ లోనే ఉన్నాడు. ఏదో ముభావంగా మాట్లాడి నన్ను పంపేశాడు. వీక్ గా ఉన్నాడు కదా అని నేను వచ్చేశాను. మర్నాడు నాకు ఫోనులో క్లాస్. చివరికి వాడి ప్రేమని నాశనం చేసిన పాపం నాదే అనీ, నా egotistic నేచర్ వల్లే వాడికి అలాంటి పాడు సలహా ఇచ్చానని. నాకు వాడి మీద ఉన్న అసూయ వల్లే ఆ పని చేశాననీ.

ఇదంతా విన్న ఇమ్రాన్ అమ్మాయిలంతా అంతే ననీ, డబ్బు పెట్టినంతకాలం మనతో ఉంటారనీ, ఆ తర్వాత వదిలేస్తాడనీ నాకు ఉపదేశామృతం చేశాడు కొత్త థియరీ. మామూలు మూడ్ లో నా ముందు ఇలాంటి మాటలు ఎవరూ అనలేరు.

నాకు అప్పుడు ఆ మూడ్ లో వాడు చెప్పేది నిజమేమో అన్పించింది.

దాంతో నేను రెండు రోజుల పాటూ మా వాల్లనేవరినీ కలవలేదు. కనీసం ఫోను కూడా లిఫ్ట్ చేయలేదు. దాంతో మొన్న చైతి నెట్ సెంటర్లో కనపడి. ఫోనుకూడా ఎత్తటం లేదేంటి అని అడిగింది. నేను ముభావం గా ఏమీలేదని తప్పించుకోజూశాను.

తను వదలకుండా నా వెంటే వస్తూ జూస్ త్రాగుదాం రమ్మంది. నేను మాట్లాడకుండా వెళ్ళ బోయాను. తను నా ప్రక్కనే నడుస్తూ ఇమ్రాన్ కి ఫోను చేసి విషయం కనుక్కుంది. "వాడేదో ఫ్రస్ట్రేషన్ లో ఏదో కూస్తే నువ్వెందుకు మమ్మల్ని ఎవాయిడ్ చేయాలి? వాడి బుర్ర లో గుజ్జే లేదు అనుకున్నా, ఈ మధ్య వాడు చేసే పనులని చూసి. ఇప్పుడు మట్టి కూడా లేదు. అంతా వాక్యూమ్ ఉందని అర్ధం అయింది. అయినా అట్లాంటి అమ్మాయినా వాడు ప్రేమించేది. ఆ మాత్రం అండర్ స్టాండింగ్ లేని పిల్లనే వాడు ప్రేమించాదంటేనే అర్ధం కావటం లేదూ వాడు మెదడు పాడిందని." అంటూ నన్ను ఒదారుస్తున్నదనుకుని కష్టపడి పోతున్నది.

నేనూ సీరియస్ గా మొహం పెట్టి అన్నా"సరే! పద వెళ్దాం. నేనోదిలేశాను వాడి సంగతి."

నాకు అర్ధం కానివి రెండు ఉన్నాయి. ప్రేమించిన వాడి జేబుకి బొక్కేయదమేనా అమ్మాయిల పని? (అందరూ కాదు. నాకు ఆ విషయం తెలుసు. నాకలాంటి అమ్మాయిలూ ఎదురవలేదు కూడా. అర్ధం చేసుకునే వాళ్ళనే ఎక్కువ చూశాను. లేదా మీక్ పర్సన్స్ ని చూశాను.)

ఒకమ్మాయో, లేదా ఒకబ్బాయో ఏదో చేస్తే అందరినీ అదే గాటన కట్టటం సమంజసమేనా? ఈ జనరలైజేషన్లు నాకు నచ్చవు. ఇమ్రాన్ గాడికి ఓ సారి నేను 'ఉపదేశామ్రుతాన్ని' బోధించాలి. ఈ మధ్య నేను ఎక్కువ వింటున్నాను. తక్కువ చెపుతున్నాను.

గమనిక: ఇదంతా నిజంగానే ఈ మధ్యే జరిగింది. పేర్లు మార్చాను. (అబ్బాయిలవీ, మొదతమ్మాయిది). ఎవరినీ నొప్పించేందుకు కాదు వ్రాసింది. ఇలా కూడా జరుగుతున్నాయేమితా అనీ, నేనేమన్నా తప్పుచేశానా అనీ... (రాస్తే అర్ధం అవుతుందని).

Read more...

Saturday, November 29, 2008

'థూ'గ్రవాదం - 'ఛీ'వ్రవాదం

ఇల్లు కాలి ఇల్లాలేడుస్తుంటే రా రమ్మని రంకు మొగుడు రాళ్ళేశాడంట.

రాయటానికి బాగోకున్నా రాయక తప్పలేదు. అలా ఉంది మా స్నేహితుని, మరికొందరి మాటలూ, చేష్టలూనూ. కడుపు రగిలిపోయింది. ముంబై లో ఉగ్రవాదుల దాడి జరిగి, ఇంగ్లాండు క్రికెటర్లు ఇంటి ముఖం పట్టారని వార్తని పేపర్లో చదివిన ఆ సదరు వ్యక్తీ, "అబ్బా! ఈ తీవ్రవాదులు ఇప్పుడే దాడి చేయాలా? ఈ రెండు వన్డే లూ మిస్సవుతున్నామే!" అన్నాడు. అంటే... ఈ రెండు వన్డేలూ ముగిసిన్తర్వాత దాడులు జరిగితే ఫర్వాలేదనా తన ఉద్దేశ్యం?

ముంబై లో మన సోదరుల జీవనం ఈ బాంబు దాడుల వల్లా, కాల్పుల వల్లా అస్తవ్యస్థం అవుతుంటే వన్డే క్రికెట్టు కావాల్సి వచ్చిందా? రేపు అదే కష్టం మనకూ వస్తే... అలాగే అనుకుంటామా? మన అమ్మా నాన్నలో, పెళ్ళాం పిల్లలో అలాగే ఏ 'బాజ్' హోటల్లోనో చిక్కుకుంటే కూడా అలాగే అనగలమా?

మొన్నటికి మొన్న హైదరాబాద్ లోనే దాడులు జరిగినై. అప్పుడు ఎంతమంది మరణించారో, ఎన్ని కుటుంబాలు నష్టపోయాయో అందరికీ తెలుసు. ఈ మధ్యలోనే ఢిల్లీ లోనూ, గౌహతీలోనూ, జైపూర్లోనూ, బెంగళూరు లోనూ, అక్కడా... ఇక్కడా... అని ఏమున్నది? ఎక్కడైనా మేము ఉంటాం. ఎంతమంది ప్రాణాలనైనా తీస్తాం అని ఉగ్రవాదులు, తీవ్రవాదులూ, తమ పంజాలను విసురుతుంటే అమాయక ప్రజా వారి కోరల నుండీ తప్పించుకునే మార్గం లేక విలవిల లాడు తూనే ఉంది.

మన నాయకులు, ఏదో సినిమా లో కోటా "మేం కండిత్తన్నం" అన్నట్టు గానే ఖండిస్తూ ప్రసంగాలను చేస్తున్నారే కానీ ఖండ ఖండాలైన చిన్నారుల దేహాల్నీ, ప్రజల మనసుల్నీ ఏనాడైనా పట్టించుకున్నారా?

"మాకే న్యాయం జరగలేదిన్తవరకూ..." అంటూ రాహుల్ గాంధీ అన్నాడే కానీ న్యాయం జరిపించే పనిని తన యువ భుజ స్కంధాల మీద వేసుకుని, పూనుకుని, తీవ్రవాదాన్ని అంతం చేసే ప్రక్రియలో పాల్గొన్నాడా?

ఈ మధ్యనే (ఒక సంవత్సర కాలంలోనే) ఎన్నో నగరాల్లో దాడులు జరిగాయి. ఇంటిలిజన్స్ నివేదికలూ ఉన్నాయి. అయినా మన ప్రభుత్వం కళ్లు తెరవలేదు. తెరచి నిజం చూడలేదు. ఎంత సేపూ, ప్రతిపక్షాలని ఎలా దెబ్బతీయాలా అనే ఆలోచనే కానీ, దెబ్బ తింటున్న ప్రజల హృదయాల్నీ, దేహాల్నీ బాగుచేయాలనే ఆలోచనా సాలోచనా లేదు. ఉన్నదల్లా ఓటాలోచనే. ఓటి ప్రభుత ఇది.

హిందూ ఉగ్రవాదం తయారైందని వ్యాఖ్యానించగలరు కానీ, దేశం లోకి భూ, వాయు, మార్గాలలోనే కాదు, జల మార్గాల నుంచీ చొచ్చుకుని రాగలం అనే ఆ 'ఛీ'వ్రవాదులని మాత్రం పసిగట్టలేదు. అలా చేస్తే ప్రజలు బాగుంటారు కదా. బాగుంటే తమని లక్క చేయరు కదా. అలా ఐతే తమకు ఓట్లుండవు కదా. సంతోషం గా ఉన్నా మనిషికి వేరెవరితోనూ అవసరం ఉండదు. కానీ మన నాయక వాయసాలకి జనం తో అవసరం. జనం వారి మాటలని వినేది కష్టాలలో ఉన్నప్పుడే. అందుకే ఏ నాయకుడూ ఈ రోజుల్లో జనాలు సుఖం గా ఉండాలనుకోవటం లేదు. ఎంత సేపూ మీకు అవి ఇస్తాం, ఇవి ఇస్తాం, అంటారే కానీ, మీ ధన మాన ప్రాణాలని కాపాడుతాం అని ఏ రోజూ చెప్పరు.

జనం కూడా ఏదైనా మ్యాచి ఈ రోజు వస్తే చాలు, ఈ హీరోయిను ఎలా తిరుగుతున్నది, నా కడుపు చల్లగా ఉంటే చాలు, ఎవదేలా చస్తే నాకెందుకు? అనే భావనలతో ఉంటున్నారు కానీ సమైక్య భావాలని కూడా గట్టుకుని కనీసం నాయకులని నిలేద్దాం అనే ఆలోచన కూడా లేకున్నారు.

ఎంత సేపూ, హిందూ తీవ్రవాదం, ముస్లిం తీవ్రవాదం, అనే కానీ, తీవ్రవాదాన్ని ఏ మతమూ ప్రోత్సహించదు. అనే నిజాన్ని గుర్తించరు. మనలో ఉన్న లోపాలే మనలని కబళిస్తున్నాయనే కనీసపు స్పృహ లేకుండా ఆ మతం వారు మమ్మల్ని చంపారు కనుక మేమూ వారిని చంపుతామనే భావజాలాన్ని పెంచుకుని, సమస్యని జటిలం చేస్తున్నారే కానీ పరిష్కార మార్గాలని ఆలోచించటం లేదు.

మన కోసం ఎందఱో జవానులు ఈ రోజున తమ ప్రాణాలని లెక్క చేయకుండా పోరాడి ఆ తుచ్చులని మట్టు పెట్టారు. వారిని సేబాషందాం. కానీ మనం మాత్రం ఏ మాత్రం వీర్యం లేకుండా ఏదో నడిచి పోతే చాలు అనుకుందాం. మనిషికి కావలసినది ఆలోచన. అంతే కానీ మూక మనస్తత్వం, ఏ ఆలోచనా లేని వ్యక్తిత్వం కాదు.

క్రికెట్టు కన్నా మనుషుల ప్రాణాలే మిన్న అని చెప్పిన కెవిన్ పీటర్సన్ నయం. ధనమెంతున్నా జనం లేని దేశమేనాడూ బాగు పడదు. ప్రజల ప్రాణాలని కాపాడలేని ప్రభుత ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. అందుకే ప్రజలే కళ్లు తెరవాలి ఆలోచించాలి. ఒక rational దృక్పథాన్ని అలవరుచుకుని తమని తామే ఎలా కాపాడు కోవాలని యోచించాలి. ఆట ఈరోజు కాకుంటే రేపు చూడొచ్చు. ప్రాణాలు ఈ రోజు పోతే రేపు రావు. జనహితం కానిదేదైనా మాంసపు ముక్కలో పడ్డ విత్తు లాంటిదే. కుళ్ళటమే కానీ, మొలకెత్తదు.

Read more...

Wednesday, November 26, 2008

రాధాకృష్ణం

కళ్ళలో నీవు ఉంటే...
చీకటే లేదుగా...

శ్వాసగా నీవు ఉంటే...
మరణమే రాదుగా...

రూపమే వేరు అయినా...
మనసు ఒకటే కదా...

మనసులో ప్రేమ ఉంటే...
ద్వేషమే లేదుగా...

ప్రేమలో కరిగిపోదాం....
సత్వరం ఒక్కటౌదాం ...

ఏకమయినా మనసులోని...
ఎత్తునే చాటుదాం...

గాలిలో ఏకమవుదాం...
తనువులే విడిచి పోదాం...

ప్రకృతి పురుషులవుదాం...
పృద్విలో కరిగిపోదాం...

దేవునీ రూపమంటూ...
ప్రేమనే చాటుకుందాం...

ప్రేమలో ఇంకిపోతూ ...
లోకమే వీడిపోదాం...

Read more...

Monday, November 24, 2008

తేలుకుట్టింది.

ఒక సారి ధోనీ భజ్జీని మూడో వన్డేలో గెలిపించిన సందర్భంగా రాంచీకి పిల్చి ఆతిథ్యం ఇచ్చాడు. కొంసేపు గడిచినతర్వాత, వాళ్ళిద్దరూ ఒక పాడుబడ్డ ఇంట్లోకి షికారు కెళ్ళారు. అప్పుడో తెలు భజ్జీని కుట్టింది.

Bhajjee: A crab just bit my toe.

Dhonee: Which one? .

Bhajjee: How do I know? All crabs are look alike.

మరిన్ని జోకులకి చూడండి... booksandgalfriends.blogspot.com

Read more...

Sunday, November 23, 2008

నువ్వూ నేనూ

సప్త స్వరాలన్నీ
సప్త వర్ణాలుగా మలచి
నా మది పై బాణమేశావు

వర్ణాస్త్రానికి బందీనై
ఊహాలోకాన విహరించాను.

ప్రేమసాగారాన పవళించిన నీకు
పూజా పుష్పాలుగా నీ రంగులనే
పువ్వులుగా మలచి మాలగా ఇద్దామంటే
నాకు ఎదురైంది పుష్ప విలాపం.

జాలి ముప్పిరి గొన వాటినొదలి
నన్నే నీకిచ్చాను.

ప్రేమతో పాలిస్తావో...
అమ్మలా లాలిస్తావో...
నాలా నిలబెడతావో ఇక నీ ఇష్టం.

వర్ణరంజితమైన లోకంలో
వానజల్లు లా కురిశావు.
మోడువారిన నా గుండె పై
ఆశా పుష్పాలు చిగురిప జేశావు.

చెట్టునడిగాను, పుట్టనడిగాను,
నీ పేరు చెప్పమని,
నాకొకటే చెప్పావయి
నీవూ నేనూ వేరుకామని.

Read more...

Sunday, November 9, 2008

నన్నపనేని బాంబు

ఒకసారి రోజా, నన్నపనేని రాజకుమారి ఇద్దరూ కలిసి వై ఎస్ రాజశేఖర రెడ్డి కారులో బాంబు పెట్టాలని ప్లాన్ చేసుకున్నారు. వన్ ఫైన్ మార్నింగ్ వాళ్ళిద్దరూ కలిసి సెక్యూరిటీని ఛేదించుకుని మొత్తానికీ కారు దగ్గరకు వెళ్ళగలిగారు.

ఎన్నో సినిమాల్లో ఈ బాంబుల ప్రహసనం చూసినందువల్ల ఈ పనిని రోజానే నెత్తికెత్తుకోగా, నన్నపనేని మాత్రం ఊపెకుహ లాగా ఎవరన్నా వస్తున్నారా అనికాపలాగా నించుంది. రోజా సీరియస్ గా తన పనిలో నిమగ్నమైంది. బాంబుని దాదాపుగా సెట్ చేసే టైం లో నన్నపనేని రోజాతో ఇలా అంది, "అమ్మే రోజా! మనం సెట్ చేసేలోపల్నే ఈ బాంబు గానీ పెల్తే ఏముతాది?"

"నువ్వూకో అక్కా! అందుకేగా నేను ఇంకో బాంబు తెచ్చీసినాను."

Read more...

Tuesday, November 4, 2008

సెహ్వాగ్ - హర్భజన్

వీరేంద్ర సెహ్వాగ్ కి తానూ ఢిల్లీ నుంచీ వచ్చానని మహా పొగరు. ఆ పొగరంతా సర్దార్జీ ఐన హర్భజన్ మీద చూపుతుంటాడు. ఐతే మన భజ్జీ కూడా తక్కువేమీ తినలేదు.

ఒకసారేమైందంటే...

"నేను దేశ రాజధాని నుంచీ వచ్చాను. మా నగరం లో ఎందఱో దేశ భక్తులు జన్మించారు. ఒకవేళ జన్మించక పోయినా వారందరూ మా నగరం లో ఉన్నారు." అని సెహ్వాగ్ అన్నాడు.

"రాష్ట్రం లోనూ తక్కవా 'కేసరి' అనే బిరుదు పొందిన వ్యక్తీ మా సొంతం" దానికి సమాధానంగా భజ్జీ.

ఐతే మనం ఒక పందెం వేసుకుందాం. ఎవరురాష్ట్రాల వారి దేశ భక్తులని వారు చెపుదాం. చెప్పిన ప్రతీసారీ అవతల వారి ఒక వెంట్రుకని పీకాలి." (సెహ్వాగ్ కి భజ్జీ పొడుగు వెంత్రుకలంటే కొంచం అసూయ.

భజ్జీ ఓకే అన్నాడు.

పందెం మొదలైంది. ముందు భజ్జీ ఒక పేరు చెప్పి సెహ్వాగ్ వెంట్రుకని పీకాడు. ఈసారి వీరు వంతు. తానొక పేరు చెప్పి భజ్జీ వెంట్రుకని పీకాడు. కొంత సేపటికి భజ్జీకి పేర్లు తట్టటంలేదు. మధ్యలో వీరూ కొందరు పంజాబీలని ఢిల్లీ లో ఉన్నారనే సాకుతో కబ్జా చేసి భజ్జీ వెంత్రుకాలని పీకాడు. సందర్భంలో వీరూ లాలా లజ్పత్ రాయ్ పేరుని కూడా కబ్జా చేశాడు. దాంతో భజ్జీకి మండింది.

కొంసేపు ఆలోచించి, తన వంతు రాగానే 'జలియన్ వాలా బాగ్' అని వీరూ జుట్టు అంతా పీకేశాడు. అప్పటి నుంచీ సెహ్వాగ్ మనకి గుండుతోనే దర్శనం ఇస్తున్నాడు.

ఇది మా ఫ్రెండ్ చైతన్య చెప్పింది. జోక్ ట.

:నోట్: సరదాకి మాత్రమే వ్రాసింది. వీరేంద్ర సెహ్వాగ్ అలాంటి వాడు కాదు. పైగా భజ్జీ వీరూ ఫ్రెండ్స్. గంగూలీ శిష్యులు కూడా.

Read more...

Saturday, November 1, 2008

ఐసు - బిప్పు రూలు.

ఒకప్పుడు 'అమలా పురం ఐశ్వర్యా రాయ్', 'భీమవరం బిపాషా బసు' అని ఇద్దరమ్మాయిలు స్నేహితులు. ఇద్దరిదీ ఒకే కంచం, ఒకే మంచం. పెళ్లి కాక ముందు లెండి.

వీళ్ళకి కాలం ఖర్మం కలిసొచ్చి (కలిసి రాక) పెళ్లి అయింది. వీళ్ళ భర్తలూ పాపం స్నేహితులే. వీళ్ళ స్నేహాన్ని చూసి దేవుడికి కుళ్ళు పుట్టిందేమో... పాపం వాళ్ల వాళ్ల భర్తలు ఒకేసారి యాక్సి డెంటు లో మరణించారు.

అమ్మలక్కలూ, అయ్యలన్నలూ వచ్చి వారిని పరామర్శించే వారు. కొంతకాలానికి 'భీమవరం బిపాషా బసు' ఒకతన్ని ఇష్టపడి పెళ్లి చేసుకుని మళ్ళీ సుఖం గాఉంది. ఐతే ఆమె స్నేహితురాలు 'అమలా పురం ఐశ్వర్యా రాయ్' మాత్రం విషాదం లోనే మునిగి ఉంది. (ఇక్కడ విలువలగురించి కాదు. విషయం వేరే!).

అప్పుడు అమ్మలక్కలూ, అయ్యలన్నలూ, తనతో "ఎందుకమ్మాయీ అంత బాధ పడి పోతావూ... పాపం! ఎంతకాలమలా ఉంటావ్/ నువ్వూ ఉప్పూ కారం తినే దానివే కదా! చిన్న వయసు లోనే ఎంత కష్టం?" అనే వాళ్లు. కొంత కాలం తరువాత "అమ్మాయీ! మళ్ళీ పెళ్లి చేసుకుని హాయిగా గతాన్ని మరచి పోయి జీవితాన్ని అనుభవిన్చమ్మా! చిన్న దానివి. ఇంకా ఎంతో జీవితాన్ని చూడాలి." అన్నారు.

ఇక 'భీమవరం బిపాషా బసు' గురించి మాత్రం "భర్త పోయి రెండేళ్లన్నా కాలేదు. మళ్ళీ పెళ్లి చేసుకుని కులుకుతోంది. చూడమ్మా చోద్యం!!!???" అన్నారు.

అందుకే 'మై డియర్ ఫ్రెండ్స్...' లోకుల గురించి కాదు. మన గురించి బ్రతకాలి. వారికి కావలసింది కేవలం 'ఉపదేహామ్రుతాన్ని' పంచి పెట్టే మహదవకాశం.

'ఉపదేశామృతం' మాట 'వైష్ణవి' వ్రాసిన 'దీపావళి వంటకం' లో చూశాను. పదం బాగుందని adopt చేసుకున్నాను. తనకి థాంక్స్. ఒప్పుకున్నందుకు.

Read more...

Wednesday, October 29, 2008

శ్రీరామాయణ కథా ప్రారంభం


శ్రీ రామాయణమా? లేక శ్రీమద్రామాయణమా? అన్నది పండితులకి వచ్చే ప్రశ్న. అక్కడి నుండీ మొదలై మొదట గా "సంక్షేప రామాయణం" వ్రాయబడుతుంది.


ఎందఱో రామాయణం వ్రాశారు. మళ్ళీ ఎందుకు?


ఎందుకు సరే! ఇప్పుడో పెద్ద సమస్య వచ్చి పడింది. బ్లాగుల్లో రామాయణాన్ని గురించి దుమారాలే రేగాయి. చాలా మంది చాలా రకాలుగా వ్రాసేశారు. మంచిగా చెడుగా. అయినా నాకు రామాయణాన్ని మళ్ళీ వ్రాయాలని కోరిక కలిగింది. కానీ నేను వ్రాసేకన్నా మా నాన్నగారు ఐతే మరింత బాగా వ్రాస్తారని, (ఆయన సంస్కృతాంధ్ర పండితులు) ఆ బాధ్యతని ఆయనకే అప్పజెప్పాను. అయన అందుకు నా అదృష్టం కొద్దీ సమ్మతించారు.


అసలెందుకు రామాయణాన్ని వ్రాయాలని పించిందంటే...


గత ఏడాది నేను హైదరాబాద్ లో మా మేనత్త గారి ఇంట్లో కోచింగ్ కోసం ఉండగా మా దూరపు చుట్టాలు ఐన "శ్రీమాన్ వేదాల నరసింహాచార్యులు", వారి ధర్మపత్ని, "కనకమ్మ" గారు 'ధనుర్మాసం' సందర్భం గా అక్కడికి వచ్చారు. అప్పుడు నాకు వారు మా నాన్నగారి తండ్రికి తమ్ముడి వరుస అవుతారనీ వారిదీ మా సొంత ఊరు ఐన ముత్తుపల్లి అగ్రహారమే అనీ తెలిసింది. అంటే ఆయన నాకు తాతగారూ, ఆవిడ నాకు మామ్మ అవుతారు. వారు నన్నెంతో అభిమానించారు. ఆ రోజు మాటల సందర్భం లో తాతగారికి 'సంక్షేప రామాయణం' గొప్పగా వచ్చనీ, వారు దానిని పారాయణం చేస్తారనీ తెలిసి నాకూ ఆయన చేత ఉపదేశం pondaalani కోరిక కలిగింది.


నేనా రోజున ఆయనని అడిగాను. అందుకు మామ్మా, తాతా సంతోషం తో ఒప్పుకుని నన్నూ, రంగనాథ్ మామనీ వారి ఇంటికి ఒక మంచిరోజు చూసుకుని రమ్మన్నారు.


ఆ తరువాత రెండు నెలలకి, అనగా ఫిబ్రవరి పదిహేడున వెళ్ళాము. తాతా మామ్మా ఎంతో ఆదరించి మాకు రామాయణాన్ని ఉపదేశించారు. నేను జీవిత కాలంలో పొందలేని అభిమానాన్ని ఆ రోజున ఆ పుణ్య దంపదుల వద్ద పొందాను.


ఆ తరువాత వారిని మళ్ళీ కలిసింది, యాదృశ్చికమో, లేక భగవత్సంకల్పమో కానీ 'శ్రీరామ నవమి. ఆ తరువాత కలవలేక పోయాను.


ఈ జూలై ఇరవై రెండున మామ్మ పోయింది. చిత్రమేమిటంటే అది ఆవిడ పుట్టిన రోజు. నాకీ విషయాన్ని రంగనాథ్ మామ చెప్పాడు. నేనిక మామ్మని చూడలేనని ఆ రోజు ఎంతో బాధ పడ్డాను. అందుకే మామ్మకి నివాళిగా వారు నాకుపదేశించిన 'సంక్షేప రామాయణాన్ని' అనువదించి కొంతలో కొంత అయినా ఋణాన్ని తీర్చు కోవాలని అనుకున్నాను. ఐతే ఆ పనిని నేను చేయలేను. అందుకే మా నాన్న ని అడిగాను ఆయన అందుకు సమ్మతించారు.
'సీతా రాముల' లాంటి ఆ పుణ్య దంపదులకి ఈ 'రామాయణం' అంకితం.


తరువాత poste 'రామాయణారంభం'.

Read more...

Monday, October 27, 2008

జమీల్య - 2

పున్నమి (నా భాషలో చెప్పాలంటే జమీల్య) చెప్పుకుంటూ పోయింది.

"'జమీల్య' ఎంత అందమైన పేరు? అసలు ఆ కథ సొగసంతా ఆ పేరులోనే ఉంది. చిన్ఘిజ్ ఐత్మాతోవ్ అద్భుతంగా చెప్పాడు కథని. సయ్యద్. ఒక చిన్న పిల్లడు. అతని మాటల్లోనే రచయిత తన కథని నడిపిస్తాడు. అంటే first person narration అన్న మాట."

నేను 'తమ్ముడి మాట' అనబోయి తమాయించుకున్నాను. ఆ కోకిల పాటకి అడ్డు రాకూడదని.

తను కొనసాగించింది. "మనిషి హృదయాన్తరాళాల్లో ఏ మూలో దాగున్న భావుకతని తట్టి లేపే కథ అది. జమీల్య ని సాదిక్ బలవంతంగా ఎత్తుకుని వచ్చి పెళ్లి చేసుకుంటాడు. అదెలాగంటే... జమీల్య తో ఒక సారి గుర్రప్పందేలలో ఒడి పోతాడు సాదిక్. ఆ అవమానాన్ని తట్టుకోలేక తనని బలవంతం గా ఎత్తుకుని వెళ్లి పెళ్లి చేసుకుంటాడు.

"అసలు మగాళ్ళంతా ఇంతేనా? అనిపిస్తుంది చాలాసార్లు. ఆడవాళ్ళు తమ మీద గెలిచినా వారికది అవమానమే! తట్టుకోలేరు. చేతనైతే గెలవాలి. లేదా ఓటమిని హుందాగా అంగీకరించాలి. సాదిక్ కి అది తెలీదేమో. ఐత్మాతోవ్ మనకా మాటని అంతర్లీనంగా చెప్తాడు. సయ్యద్ రూపంలో.

జమీల్య. తన పేరుకు తగ్గట్టుగానే అందమైంది. ఎంత అందమైంది? తన జీవితాన్ని ప్రేమించుకునేటంత అందమైంది. 'ఆమె స్వాభావం లో ఏదో మగవాళ్ళ లక్షణాలు, అదొక మోస్తరు దుడుకుతనం...తనని అకారణంగా పల్లుట్టు మాటైనా అంటే ఊరుకోడు. వాళ్ళని నోరేత్తనీయకుండా మొహం మీదే నాలుగూ అనేసేది' అని మనకి సయ్యద్ చెపుతాడు.

"ఇరుగు పొరుగు అమ్మలక్కలు తన అత్తగారికి చెపితే ఆమె సమర్ధనగా 'ఇదే మంచిది లెండి. మా కోడలు ఉన్నమాట చెపుతుంది. అనేదేదో మొహం మీదే అంటుంది. ఇదే నయం. ఎదుట నోరు నొక్కుకుని చాటున తిట్టటం కంటే. మీ వాళ్ల మౌనం ఓ నటన. ఆ మౌనం - కుళ్ళిన కోడి గుడ్డు: పైకంతా నునుపూ, నిగనిగా. ఇహ లోపలా - ముక్కు మూసుకోవాల్సిందే.' అంతటి అభిమానం. (అయినా...). అలా ఐత్మాతోవ్ మనకి జమీల్యాని పరిచయం చేస్తాడు.

"అసలు జమీల్యా అమ్మాయిలకి డ్రీం గాళ్. ఏ మాయామర్మమూ తెలీని, చిన్నపిల్ల లాంటి మనస్తత్వం. ఎంత ఒత్తిడిలో ఉన్నా కూడా తటాలున నవ్వటం! చెంగు చెంగున లేడి పిల్లలా గెంతతం. కాలాగాడు మరి. అత్తగారిని కావిలించుకుని చిన్న పిల్ల లా ముద్దెట్టటమ్. అబ్బ! అలా ఉండాలనీ, అంత హాయిగా జీవించాలనీ ఎవరికి ఉండదు.

"అందుకే జమీల్యా సయ్యద్ కి నచ్చింది. తనకి వదినె గారవుతుంది. బిడియం అంటే తెలీని తానంటే గ్రామంలో అందరికీ అంగీకృతం కాదు. అంతే గా తన జీవితాన్ని ప్రేమించటం అంటే ఈ లోకం లో ఒక నేరం. అలాటి వారిని అందరూ అంగీకరించలేరు.

"అవునబ్బాయ్! నువ్వు ఎందుకు చచ్చిపోవాలనుకున్టున్నావ్?" ప్రావాహానికి ఆనకట్ట వేసినట్టు అడిగింది. నా కళ్ళలోకి చూస్తూ.

"నీకేలా తెలుసు?" అడగ బోయాను. వెంటనే తను ఒక దయ్యం అనీ, తనకి ఆ మాత్రం తెలీటం ఆశ్చర్యం కాదనీ నాకు గుర్తొచ్చింది. అందుకే నేను "ముందు నువ్వు చెప్పు. తరువాత నేను చెప్తాను." అన్నా.

తను నిట్టూర్చింది. మళ్ళీ కొనసాగించింది. "చంటీ! ఆడ పిల్లలు కనిపిస్తే అబ్బాయిల కళ్లు ఎక్కువ గా స్కాన్ చేయాలనే ప్రయత్నిస్తాయి. యుద్ధం రోజులయి, ఆ ఊరిలో అందరూ అంటే చాలా కుటుంబాలలో వయసున్న వారిని సైనికులగా పంపాల్సి వచ్చేది. ఊళ్ళో మిగిలేది సంనాసులూ, చిన్న పిల్లలూనూ. అందరి కళ్ళూ జమీల్య మీదే.

"కొందరు సంనాసోల్లకి తానంటే ఏ ఆడదైనా పడి చస్తుందని ఒకరకమైన ఫీలింగు. అలాంటి వారు ఎక్కడైనా ఉంటారు. అలాంటి వాడే ఒస్మాన్. వాడొకసారి తనని అల్లరి పెట్టబోతే జమీల్యా అన్న మాటలు నాకెంత నచ్చాయో. 'యుద్ధం నుంచీ తిరిగి రాని సైనికుని భార్యగా నూరేళ్ళూ ఉంటానుకానీ నీ లాంటి చచ్చు దద్దమ్మ మొహం మీద ఉమ్మనైనా ఉమ్మను.'

ఇది కాదు. తన మనోభావాలని మనం చదవాలి. ప్రేమ లేని పెళ్లి ఎంత గొప్ప కుటుంబం లోకి తీసుకెళ్ళినా జమీల్యా లాంటి అమ్మాయి ఎక్కువ కాలం ఉండలేదు. అందుకే దనియార్ మీద తనకి ఉన్నది ప్రేమే అని గ్రహించగానే బంధనాల అడ్డుతెరాలు తొలగించుకుని వెళ్లి పోయింది.

"సాదిక్ తన ఇంటికి సైనిక స్థావరం నుంచీ ఉత్త వ్రాసే సన్నివేశాన్ని ఐత్మాతోవ్ చాలా బాగా చెప్తాడు. సంప్రదాయ బద్ధం గా పెద్దలందరికీ తన నమస్కారాలను చెప్పి చివరలో 'జమీల్యాని కూడా అడిగానని చెప్పండి.' అంటాడు. అక్కడే తనకి భార్య మీద ఉన్న ప్రేమ తెలుస్తుంది. అక్కడ సయ్యద్ భావాలని చదివితే అంతర్లీనంగా ఐత్మాతోవ్ ఎలాంటి సెటైర్ వేశాడో మనకి తెలుస్తుంది.

"ఇది కాదు చంటీ! అసలు విషయం ఇప్పుడు చెప్పుతాను."

నేను నాకు తెలీకుండానే ఆ మాటలని మంత్ర మ ఉగ్దుందిని అయి వింటూనే ఉన్నాను. నేను ఎప్పుడు వాలానో తెలీదు కానీ ఆ స్మశానంలో ఓనా ఎడమ అరచేతిలో తల పెట్టుకుని అలా వింటూనే ఉన్నాను.

నేను వింటున్నానో లేదో అని ఒక సారి చూసి తను నవ్వింది. "ఎందుకు నవ్వావ్?" అడిగాను.

"నువ్వెక్కడ పడుకున్నావో తెలుసా?"

(సశేషం)

Read more...

Sunday, October 26, 2008

"జమీల్య"

ఆ మర్నాడు నన్ను నేను సెల్లు లో కనుగొన్నాను. అలా ఎందుకయ్యిందో తరువాత చెపుతాను. అంతకు ముందు ఓ పడి గంటల క్రితం నేను ఆ దయ్యం తో అన్నాను. "నీ పేరు నాకు నచ్చలా."

"ఎందుకు?"

"పున్నమి, 'పున్నామ నరకం' లాగా ఉంది. అందులోనూ నాకు పున్నమి చంద్రుడు నచ్చడు."

ఎవరో కిసుక్కున నవ్వినట్టు అనిపించింది. ఎవరా అని తల త్రిప్పి చూశాను. ఒక తలలేని ఆకారం. ఆడ దయ్యమే అనుకుంటా. "ఓరబ్బీ! నీగ్గానీ దిమాక్ఖరాబ్ గానీ ఐతున్నదా? అట్లగైతే నిన్ను ఎర్రగాద్దకి పంపాలె!" అంటూ నా మీదకి వచ్చింది. ఎంత చావాలనిపించినా ఆ తల లేని దయ్యాన్ని చూసి వెన్నులో ఒణుకు వచ్చింది. "బాబోయ్!" అని కేక వేయబోయా. "ఏయ్! సోనియా గాంధీ నువ్వూరుకో! తను నా ఫ్రెండ్." పున్నమి అంది.

తను కూచింది తన శవ పేటికలో. "ఎందుకట్టా లేచావ్?" అడిగాను. భయాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తూ.

"పున్నమి సెంద్రుడు నచ్చట్లేదంటవ్? ఎర్రి నా కొడుకల్లె ఉన్నవ్ బిడ్డా!"

"ఓరి నాయనోయ్! నువ్వు తెలంగాణా దయ్యానివా? యాస సరిగ్గానే ఉందా?"

"అదా! నేను ఆ యాసని ట్రై చేస్తున్నాను. 'మళ్ళీ తెలంగాణా దయ్యం' అనకు. కేసీయార్ ఎగిరి తంతాడు." అంది సదురు సోనియా గాంధీ. "తను ఎక్కువ గా పున్నమి రోజుల్లోనే లేచి తిరుగుతుంది. అందుకే ఆ పేరు పెట్టాము."

"అంటే పూర్వ నామదేయాలు కూడా ఉంటాయా మీకు?"

"ఉన్నాయి అమ్మా నాన్నా పెట్టిన పేర్లు. ఇక్కడ మాకు నచ్చిన పేర్లు పెట్టుకుంటాము."

పున్నమి మా సంభాషణని ఎంజాయ్ చేస్తున్నట్టుంది. అందుకే మేలి ముత్యాలు ఒలక పోస్తున్నట్టు చిరు నవ్వులు చిందిస్తోంది. నెల రాజు 'తిండి తిని నెల రోజులయ్యింది' అన్న టైపులో మొహం పెట్టాడు. ఆమె ముందు వెల వెల పోతున్నందుకు.

"మరి నీ పేరు సోనియా గాంధీ ఎందుకు?" వినాశ కాలే విపరీత బుద్ధి అనుకుంటూ. ఎక్కడ అది నా మీద పడుతుందో అన్న భయం ఉన్నా నా చావు ఎప్పుడొచ్చినా ఏమిటి నష్టం అనుకుంటూ ధైర్యంగా ఉన్నా.

"దానికి బుర్ర లేదని ఆ పేరు పట్టాము కానీ, రా చంటీ! మనం మాతాడుకుందాం," అంది పున్నమి.

"నిన్ను నేను ఏమని పిలవను?"

"పున్నమి నచ్చలేదన్నావుగా! నువ్వే పేరు పెట్టు."

"జమీల్య!"

"చాలా బాగుంది. దాని అర్ధం తెలుసా?"

"తెలుసు. అరబ్బీలో 'అందమనది' అని అర్ధం."

"అబ్బో! చంటి బాబు కి అరబ్బీ కూడా వచ్చే?"

"రాదు." ఏడుపు మొహంతోఅన్నాను. "ఆ పేరు చిన్ఘిజ్ ఐత్మాతోవ్ వ్రాసిన ఒక నవల లోది. హీరోయిన్ పేరు. నాకుబాగా నచ్చిన పేరు అది."

"అబ్బో! అయ్యగారు కళా పోషకులే!" కళ్లు పెద్దవి చేస్తూ ఎక్కిరించింది.

"నీకా కథ తెలుసా?"

"చదివాను. ఈ మధ్యే! ఒక శాపులోనుంచీ కొట్టేసి. ఆ హీరోయిన్ నాకూ బాగా నచ్చింది. నాకూ తనలా ఉండాలనిపించింది."

"ఐతే ఆ కథ చెపుతావా?"

"చదివానన్నావ్?"

"నీ మాటల్లో వినాలనీ..."

"సరే! విను" అంటూ మొదలెట్టిందికాదు కానీ ఆ కథ గురించి చెపుతాను. అయినా ఇది చెప్పు. నీకు పున్నమి అన్న నా పేరు ఎందుకు నచ్చ లేదు?"

"నాకు పంచమి చంద్రుడంటే ఇష్టం."

"గురుడికి తిక్కేమన్నా ఉందా?"

"కాదు పంచమి చంద్రుడు ఎలా ఉంటాడు?"

ఇలా అంటూ గాల్లో చూపించింది. నిజంగానే అక్కడ ఆ ఆకారం నాకు గాల్లో కనిపించింది. సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యాను.

"ఇలా కదా! అలా చూడు. నవ్వుతున్నట్టు లేదూ! అదే పున్నమి చంద్రుడు అదోలా నోరు తెలుచుకుని నిద్దరోతున్న న్యాయం లా ఉంటాడు. అదీ కాక కొంచం ఏడుపు సింబల్లా!"

"నీలోనూ విషయం ఉందబ్బాయ్! ;-) కానీ ఏడుపు సింబల్ సరిగా లేదేమో! కథ విను." ముగ్ధ మనోహరంగా నవ్వింది.

ఆ కలకూజిత స్వరం లోనుంచీ ఆ కథ గురించి ఇలా విన్నాను.

(సశేషం)

Read more...

Friday, October 17, 2008

పున్నమి - ఏ'కాంత'వేళ

చిక్కని చీకటిలో నాకు వెన్నల మాత్రమే తోడుంది. వెండి వెన్నెల పిండార బోసినట్లు నన్ను కౌగిలించుకుని గిలిగింతలు పెడుతున్నా నా మనసు పౌర్ణమి చంద్రుని వలె విషాదంగా ఉంది. నేనప్పుడు ఏకాంతంగా లేను. ఒంటరిగా ఉన్నాను. తుంటరి పిల్లగాలి నిదురించే తోటలో అల్లరి చేస్తూ నా ముంగురులని కవ్విస్తోంది.

ఆకాశం లో నక్షత్రాలు బొంతకేసిన కుట్లు లాగా ఉన్నాయి. చిక్కి పోయి. పున్నమి చంద్రుడు నోరు తెరుచుకుని చూస్తున్నాడు నా కష్టాన్ని. ఇంతలో సెలయేటి గల గల లా నవ్వు వినిపించింది. ఎవరా అని మబ్బుల్లోంచీ తొంగి చూసిన చందమామలా బింకంగా ఆ వైపు చూశాను. దిక్కు కూడా నాకు గుర్తులేదు.

నిశ్శబ్దం తన శ్రుతిని సరి చేసుకుంది. ఆ గొంతుతో పాటూ తనూ పాదాలని. ఓనిడా సేల్ల్ఫోన్లో కాల్ చేసేటప్పుడు వచ్చే సిగ్నల్ లాగా ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపు ని చూసి చంద్రుడు దాక్కున్నాడు మబ్బుపిల్ల వెనుక. సిగ్గు పడి. అంతందంగా నేను లేనే అని.

మళ్ళీ చిమ్మ చీకటి. మరో సారి అదే నవ్వు. పంచమి కాంతుల రాకేశుడు సరిగమల సప్త స్వరాలాలపించినట్టుగా ఆమె నా ముందు నిలిచింది. చేతిలో ఒక క్రొవ్వొత్తి. నా ఎదలోని చీకట్లని తరిమివేసేందుకు. నా ముందునుంచీ తనలా సాగిపోతుంటే నేను అనుసరించాను. ఆమె నావైపోకసారి చూసి నవ్విందలా మళ్ళీ. ఎద పొంగి గండి పడటంతో నేను కాసేపలా ఆగి కొంచం దూరంగా ఆమె వెనుకే వెళ్లాను. ఎంతసేపు గడిచిందో తెలీదు. రేతుంటరి కళ్ళప్పగించాడు ఆ వదనారవిందానికి. నాకూ నవ్వొచ్చింది. పైన ఉన్న చలువ భామలనొదలి ఈ కలువ భామ వెంట పడ్డాడే అని.

ఆమె ముందుకి సాగుతూనే ఉంది. సెలయేటి అలలా. దారిలో రెండు నల్లని గండు పిల్లులు. మీసం మెలేస్తూ ఆమె ని చూచారు. నేనలా గుడ్లప్పగించాను. ఏమి చేస్తుందో ఈ సోయగాల పసిడి చిన్నది. చేతిలోని క్రొవ్వొత్తిని అలాగే పట్టుకుంది. చంటి పాప అమ్మ రొమ్ముని పట్టుకున్నట్లు. చంద్రుడు ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్లు తన ప్రయాణాన్ని ఆపేశాడు. చుక్కలన్నీ పెద్దవైనై. ఆ దృశ్యాన్ని చూద్దామని. ఉత్కంఠత తో.

తను ముందు కెళ్ళింది. వారూ ఆమెని అనుసరించారు. పాల ధార వెనుక దొంగ పిల్లిలా. ఆమె నడిచింది. చిన్నగా... వెళ్ళింది ఒక ఇంటిలోకి. వారూ అనుసరించారు. నేనలా ముందుకి దుమికాను. కాపాడుదామని. తలుపులు మూసుకున్నాయి. ఐదు నిమిషాలు గడిచాయి. తన్నలా ఒదిలేశానే అని బాధ.

తలుపులు తెరుచుకున్న గుదిలోంచీ వచ్చిన దేవతలా ఆమె నా ముందుకి వచ్చింది. ముఖంలో మెరుపుల వెలుగులు. ఏమైందో? వారేమి చేశారో? "ఏమయ్యారు?" అడిగాను. "కోరిందిదొరికి వెళ్ళారు అలా ముందుకు" అంది. ఆ మాటలు కోకిల కూతలు. తోడు రానా అన్నాను. నీకిష్టమా అంది. అవును అన్నాను నేను. సరే! అంది. తన వెంట సాగాను. అలా అలా నడిచాము. ఊరు దాటాము. పొలాలనీ దాటాము. తనతో మాటల్లో పడి నా దారిని నేను మరిచాను.

"మీ ఇల్లెక్కడ?" అడిగాను. నవ్వింది సమాధానం గా. "రాగలవా?" అన్నట్లు.

"రాగాలనేమో!" అన్నాను. ఉత్సుకతతో. ముందుకు సాగామలా. అలా. అలా. తల తిప్పి చూశాను రాత్ కా బాద్శాహ్ ని. ఏడువ లేక నవ్వాడు. "నీకు దొరకదుగా" అన్నట్టు నేను ఒక చూపువిసిరి ఆ చుక్కలు నీకు అందనివి. ఈ పంచమి కాంతుల జాబిలమ్మ నాకే అన్నాను. మౌనంగానే. ఇంతలో తను ఎటో తిరిగింది. నేనూ తననే అనుసరించాను. నాకాశ్చర్యం ఎక్కడకెళ్తోందని.

తను వెళ్ళింది. నేనాగాను. రమ్మని పిలిచింది. కమ్మగా నవ్వింది. నేనూ నవ్వాను చాలా కాలం తరువాత. సహజంగా. నాలుగాడుగు వేశానో లేదో...

ఒక పెట్టె తెరుచుకుంది. తనలా వెళ్లి అందులో పడుకుంది. కళ్లు పెద్దవయ్యాయి. పౌర్ణమి చంద్రునిలో మచ్చలలా.

నవ్వో నిట్టూర్పో తెలీదు. నాలోంచీ ఒక శబ్దం వచ్చింది. "నా పేరు చెప్పనే లేదు కదూ. 'పున్నమి'"

"నాపేరు...."

"ఒద్దులే. ముద్దుగా ఉన్నావు. చంటీ అంటాను సరేనా?"

"సరే!"

"నేనెవరో చెప్పనా?"

"చెప్పు."

"నేనొక దెయ్యాన్ని." మళ్ళీ నవ్వింది. చల్లగా. ఆత్రంగా చూసింది. నేను భట పడుతానని. లేదు. కొన్ని గంటల క్రితం చావు గురింది ఆలోచించిన వాడిని కదా!

అక్కడే కూల పడ్డాను. "ఏమిటి వెళ్ళవా?" అంది.

లేదన్నాను. "కథ చెపుతావా" అడిగాను.

సరే! అంది. అప్పుడే నాకు బ్రతకాలనే కోరిక ఉదయించింది.

ఆ దయ్యం చెప్పిన కథలు నాలో ఒక ధైర్యాన్ని పెంచాయి. ఆ కథలు "పున్నమి చెప్పిన కథలు."

Read more...

Monday, October 13, 2008

"రామాయణం"

నాకు అంతర్జాలంతో పరిచయం శూన్యం. ఎప్పుడన్నా పిల్లలు చెప్పి చూపిస్తే చూడటమే. ఈ మధ్య మా అబ్బాయి బ్లాగులనే పేరుతో అంతర్జాలంలో ఏవేవో వ్రాస్తున్నానని చెప్పాడు. వాటిని పరిశీలిస్తే కొన్ని బాగానే అనిపించాయి. కొందరు బ్లాగ్గర్లు వ్రాసిన వాటిని తెచ్చి చూపగా అంతర్జాలంలో తెలుగు బాగానే వెలుగుతున్నదన్న ఆశ కలుగుతున్నది.

కూజంతం రామ రామేతి
మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితా శాఖం
వందే వాల్మీకి కోకిలం

నన్ను సంక్షేప రామాయణాన్ని వ్యాఖ్యాన సహితంగా వ్రాయమని ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. అయితే ఓపిక లేక ఉపేక్షిస్తూ వచ్చాను. అయితే తన వాదనతో నన్ను మొత్తానికీ ఉత్సాహ పరిచి నన్ను ఒప్పించాడు. అంతర్జాలం లో పెడతానని అనటం తో, ఆ మధుర కావ్యాన్ని మరలా తలుచుకునే భాగ్యం నాకు కలిగింది.

ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు కోరుతూ నా వీలుననుసరించి 'రామాయణం' అనబడే ఆ మధుర కథను నా శైలిలో అనువాదము చేసే పనిని చేపడుతాను.

సెలవ్.

వేదాల రాజగోపాలాచార్య.

Read more...

Saturday, October 11, 2008

వాన్ టూ త్రీ... FedEx కి నో ఎంట్రీ!

Rafael Nadal ఈ సంవత్సరాన్ని number one గానే ముగించటం ఖాయమైంది. తన క్రీడా జీవితం లో రికార్డులని బద్దలు కొత్తతమే కానీ మిస్ అవటం తెలీని FedEx తొలిసారిగా ఒక అద్భుతమైన రికార్డుని మిస్ అవుతున్నాడు. :-((
అది వరుసగా ఎక్కువ సార్లు Tennis Season ని number one గా ముగించటం.

Pete Sampras వరుసగా ఆరు సంవత్సరాలు ఆ రికార్డుని సాధించగా, Jimmy Conners ఆ రికార్డుని ఐదేళ్లు సాధించాడు. ఇప్పటికి 2004-07 season లలో number one గా ఉన్న FedEx ఈసారి తన rank ని కోల్పోవటం ద్వారా ఆ అరుదైన రికార్డుని Pete Sampras నుంచీ అందుకునే అవకాశాన్ని కోల్పోవటం బాధగానే ఉన్నా Pete Sampras రికార్డు అలాగే ఉండటం నాకు personal గా ఆనందం కలిగించింది. Theoretical గా అసాధ్యం కానప్పటికీ అవకాశాలు బహు స్వల్పం.

World Men's Rankings Top ten: (tennis magazine news letter సౌజన్యంతో)
Rank
Name
Country
Ranking Pts
1
Rafael Nadal
ESP
7000
2
Roger Federer
SUI
5930
3
Novak Djokovic
SRB
4960
4
Andy Murray
GBR
2995
5
Nikolay Davydenko
RUS
2400
6
David Ferrer
ESP
2315
7
David Nalbandian
ARG
1975
8
Andy Roddick
USA
1970
9
Juan Martin del Potro
ARG
1685
10
Stanislas Wawrinka
SUI
౧౬౭౦
----------------------------------------------------------------------------------------

ఇందాకన వీరేంద్ర సెహ్వాగ్ 46 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. రేపు దూరంగా పోతున్న బంతిని వేటాడి ఔట్ అయ్యాడంటారు జనం. కానీ అదే బంతికి ఫోర్ వస్తే? ;-)
----------------------------------------------------------------------------------------

Lance Armstrong మళ్ళీ సైక్లింగ్ బరిలో దిగుతున్నాడు. Kudos. రా రా రా రారా Armstrongoo.
----------------------------------------------------------------------------------------

ఈసారి Oliver Kahn గురించి వ్రాస్తాను.

Read more...

Tuesday, October 7, 2008

'గన్'గూలి : ది లాస్ట్ ఎయిమ్.

మొత్తానికీ అందరూ కలిసి గంగూలి ని దించేశారు. The pride of India has hung up his boots.

భారత కెప్టెన్ గా గుబాళించిన సౌరభం తన సువాసనలని మన కందరికీ వదిలేసి తను మాత్రం అంతర్జాతీయ యవనిక మీద నుంచీ తొలగి పోతున్నాడు. Pure and stylish తరహా క్రికెట్ ని ఇష్టపడే వాళ్ళకి ఇప్పుడు ఆ భాగ్యం లేకుండా చేసి, 'దాదా'పుగా గెంతెయబదకుండానే గౌరవం గా తప్పుకుంటున్నాడు.

సౌరవ్ గంగూలీ గురించి నేను వ్రాయాలని అనుకున్నాను. కానీ ఇలా అని మాత్రం అనుకోలేదు. సరే! మనమందరం ఆ కలకత్తా రాకుమారునికి దసరా శుభాకాంక్షలతో వీడుకోలు చెబుదాం. ఆస్సీస్ సీరీస్ లో గంగూలీ విజయవిహారం చేయాలని అందరం కోరుకుందాం. అతని శిష్యుడు సెహ్వాగ్ అన్నట్టుగా కనీసం 3-1 తేడాతో మన వాళ్లు గెల్చి 'గన్'గూలి కి విజయానందం తో వీడుకోలు చెప్పాలని... మన విజయ సారధి... సగర్వంగా తన కేరీయర్ ని ముగించాలి అని కోరుకుంటూ.

మీకు కూడా దుర్గాష్టమి శుభాకాంక్షలు.

Read more...

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

Archiva

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP