Tuesday, July 28, 2009

వాన కాలపు ఙ్ఞాపకాలు మరువం ఏనాడు...



"మాటల మూటలు
చిరు చిరు అలకలు
చిటిపొటి ఆటలు
వానలో చిందులు.



తడిసిన మొగ్గలు
నునులేత సిగ్గులు
'కంది'న బుగ్గలు
నీకు నా హగ్గులు


(The last 2 lines are private ;-))



కాగితం పడవలు
మిరపకాయ బజ్జీలు
వాన కాలపు ఙ్ఞాపకాలు

మరువం ఏనాడు."


***

నేను ఇక్కడ వ్రాసిన కవితకి వచ్చిన స్పందనకు ప్రతిస్పందన మొదటి చివరి stanzas. The smaller font can be ignored. Rest is for everybody.

Read more...

Sunday, July 19, 2009

పెళ్ళంటే ఏమిటంటే...


ధర్మార్థకామమోక్షాల సాధనే మానవ జీవత పరమార్థం అంటారు కదా. మరి పెళ్ళి అంటే మీకు తెలుసా? ధర్మ బద్ధమైన జీవనం గడపటంలో వివాహం మిక్కిలి పాధాన్యతని సంతరించుకుంది. మరి అలాంటి పెళ్ళెంటే ఏమిటి


ధర్మం కోసం చట్టబద్ధత*,
అర్థం కోసం కట్నం,
కామం కోసం సంసారం,
.................................
.................................
.................................
ఇవన్నీ అయ్యాక, మోజు తీరగానే
పెళ్ళానికి మోక్షమిచ్చి పంపి, మళ్ళా ధర్మ సాధనకోసం మరో...

ఈ విధంగా మనవుడు తన జీవన పరమార్థాన్ని నెరవేర్చుకుంటున్నాడు. ;-)


*అక్కడ భార్య అని ఉంది. మిత్రుల సుచన మేరకు ఇలా. ఏది కావాలో అది చదువుకోండి. ఎందుకంటే... మనది ప్రజాస్వామ్యం. మీకా స్వేచ్ఛ ఉంది కదా...! ;-)

ఓ పాతిక లక్షల కట్నం కోసం తనని చక్కగా అమ్ముకున్న నా ఒక మరీ అంత క్లోజ్ కాని మిత్రునికి త్రీ ఛీర్స్!!!

అంకితం: కట్నం తీసుకోను అన్న కుర్రాడికి ఏదో లోపం ఉంటుంది అనుకునే అమ్మాయిల తల్లితండృలకందరికీ విచ్చలవిడిగా. పండగ చేసుకోండి.

Read more...

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP