Friday, August 12, 2011

"అయ్యో వ్రత కథ" అనఁబడు స్కాంద పురాణమందలి అఙ్కోపరి ఖండము


/hihi

ఇవాళ వరలక్ష్మీ వ్రతం కదా! అప్పుడప్పుడూ ’అయ్యో రామా!’ అనుకొనెడి ఆడ పడుచుల కొఱకై...
కంపుటేరు/టైపురైటరు కీబోర్డు నందు (సినిమాల్లో ఆర్తీ అగర్వాల్ పెట్టుకునే నందు, నందిని అనే పేరుకూ, దీనికీ ఏ సంబంధమును లేదని తెలియజేయుటకు చిదానించుచుంటిమి) 

అనబడే (ఐ బడా/బడే అక్షరమే. ఎంత పొగరో దానికి. ఒహఠి లాగా ఉంటుంది. మరియూ ఇగో నకు సంకేతము. అసలైన ఇగో అయిన నేవిధమైన ఇబ్బందియు లేదు గాని, దాని యసలు యర్థము తెలియని వారికుండిన ఎన్నియో ఇబ్బందులు) అక్షరము ప్రక్కనే  అను మరియొక అక్షరము కలదు. కమ్ప్యూటరు వాడక సమయమున ఐ బదులు ఓ, మరియూ ఓ బదులు ఐ వచ్చిన ఇబ్బందులు గూర్చి పలువురు పలుమార్లు వాపోయి యుంటిరి.
అట్టి సమయమున మనిషి వెలువరించు భావమునకు సంకేత రూపమొహఠి కలదు. దాని గూర్చి తరువాత చర్చించెదము. 

మన తెలుగు భాష యందలి పదమయిన అయ్యో ఎటుల వచ్చెననిన... కమ్ప్యూటరు కీబోర్డు వలన. ఇది పలువురకు యాశ్చర్యముగ తోచినను, ఇది యదార్థము. నిక్కము. సత్యము. ఐ, మరియు, ఓ ల వల్ల సమస్య ఉత్పన్నమైనది కాన దానికి సంకేత నామముగ ఐఓ అని ఉంచితిరి. క్రమముగ నదియె (ఏ నది కాదు. ఉంచిన అదియె అని భవము) ఐయో గను, ఆ పైన జనుల నోళ్ళ యందు నాని క్రమముగ అయ్యో గ స్థిర పడెను. అప్పటి నుంచీ, సమస్యలేవి యైనను ఉత్పన్నమయినప్పుడు మనుజులు అయ్యో అని అనుచుంటిరి


స్కాంద పురాణము: అఙ్కోపరి ఖండము, 3:2

ఆతనిన్!

2 comments:

6' Soldier August 12, 2011 at 7:06 PM  

దమ్ము దులిపేశావు

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

Archiva

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP