Friday, September 23, 2011

కొరియానం: A Journey Thru Korean Cinema


/hihihi                                 

రెండున్నరేళ్ళ క్రితం లీ చాంగ్-డాంగ్ తీసిన బఖా సటాంగ్ లేదా పిపెర్మిన్ట్ కాం౨డీ అన్న సినిమాని మా ఫ్రెండ్ బలవంతం మీద చూశాను. పేరు తమాషాగా ఉంది. నాకసలే రొమాన్సెస్, రొమాన్టిక్ కామెడీలంటే ఇష్టం. అఫ్కోర్స్! ఒక జాన్ర కి చెందిన త్రిల్లర్స్ అన్నా కూడా ఇష్టమే. కాకపోతే అవి పాప్కార్న్ తింటూ ఎన్జాయ్ చేసే తరహావి :). ఇది కూడా అలాంటిదేనేమో అని చూసే ప్రయత్నం చేస్తే, ప్రారంభమే అదో రకంగా అనిపించింది.  ఎక్కడో తేడా కొట్టి కాస్త ఎన్క్వైరీ చేస్తే ఇది నేననుకున్న రొమాన్టిక్ కామెడీనో, పేరులాగా పాప్కార్న్ ఎన్టర్టైన్మెంట్ తరహానో కాదు. చూడాలన్నా కాస్త స్టఫ్ ఉండాలి అని అర్థమయింది. సరే అని మళ్ళా చూశాను.
Narration లో ఒక రకమైన రిథమ్ ఉంది. గుండెనెక్కడో తట్టి పలకరించే తది ఉంది. ఏడు భాగాలుగా (narration packets అనుకోవచ్చు. అంటే ఏడు ఎపిసోడ్లలో సినిమా కథ నడుస్తుంది)) ఉన్న సినిమాలో మొదటి భాగం చివర ప్రోటగనిస్ట్ (హీరో అనుకోవటం తప్పు) “I’m going back,” అంటూ మనని వెనక్కి తీసుకుని వెళతాడు. అంత వరకూ ముగిసే సరికి కథలో లీనమయ్యాను. Then rest is history! :D  
ఈ సినిమాని గురించి వివిధ రకాలుగా నేను చాలా చోట్ల వ్రాశాను. నవతరంగంలోనే మొదటగా తెలుగులో వ్రాసినా, తరువాత వ్రాసినది మాత్రం ఆంగ్లంలోనే. అలా ఆంగ్లంలో మొదటగా వ్రాసినది… Passion for Cinema లో. అక్కడ వచ్చిన వ్యాఖ్యలలో ఒకటి ఓల్డ్‍బాయ్ గురించి పరిచయం చేసింది. చేస్తూ, సినిమా ఎంత బాగుంటుందో, వయలెన్స్ అంత భీకరంగా (Shall we say gruesome?) ఒక కాషన్ కూడా అందింది. కాస్త ప్రయత్నాలు చేసి, దొరక్క అక్కడే వ్యాఖ్యలో ఇదే విషయాన్ని మెన్షన్ చేస్తే, మరికొన్ని వివరాలు తెలిశాయి. యూట్యూబ్ లో చూస్తుంటే 25:1 Best fight scene in movie history అన్న పేరుతో ఓల్డ్‍బాయ్ లో దాదాపూ నలభై నిమిషాల దగ్గర వచ్చే ఒక ఐకానిక్ సన్నివేశం దొరికింది. నాలుగైదు సార్లు చూస్తే బాగా నచ్చింది. అక్కడే దొరికిన మిగతా వీడియోలను చూశాను. రకరకాల సినిమాలు. ఎక్కువ భాగం స్టంట్ సన్నివేశాలే. అన్నింటి గురించీ ఎన్క్వైరీ చేశాను. ఆ ప్రయత్నంలో నాకు మొదటగా దొరికింది సిమ్పతీ ఫర్ మిస్టర్ వెన్జెన్స్. అప్పుడే తెలిసింది ఓల్డ్‍బాయ్ ఇదే డైరక్టర్ తీసిన వెన్జెన్స్ ట్రైలాజీ లో రెండవ భాగమని. మొదట మిస్టర్ వెన్జెన్స్ చూస్తే ఒక పనైపోతుందని వెతికితే, అసలలాంటివి మా ఊళ్ళో దొర్కనే దొరకవని తేలింది. పైగా కొంత మంది వింతగా చూడటం కూడా తటస్థించింది. లాభం లేదని ఆశలు వదిలేసుకుంటున్న తరుణంలో ఆల్రెడీ కొరియానంలో మునిగి తేలుతున్న వ్యక్తి పరిచయమయ్యాడు. కొన్ని హలోలూ, మరికొన్ని హలోలూ తరువాత, ఇనీవిటబుల్ గా, “నువ్వేమి చేస్తుంటావబ్బాయీ?” అన్న ప్రశ్న వచ్చింది. ఫలానా, ఫలానా అన్న వివరాలు ఇచ్చాను. మాటల్లో బఖా సటాంగ్ గురించి రావటంతో, ఆ మిత్రుడితో నేను వ్రాసిన ఆర్టికిల్స్ గురించి చెప్పాను (సెల్ఫ్ డబ్బా, స్వోత్కర్షా, స్టెఫీ గ్రాఫ్, అనిల్ కుంబ్లే ఎట్సెటరా ఎట్సెటరా). పంపించరా పిల్లకాయ్ అంటే పంపించాను. బ్రహ్మాండంగా వ్రాశావురా బాలకా (SSSA ;- ) అని అయితే కొరియన్ సినిమా మీద ఇంటరెస్టుందా? అన్న వేశారు. రవి తేజ ఇష్టైల్లో, “ఫఢి ఛచ్చిఫోథానన్హుఖోంఢీ”. అన్నా. “అయితే నీకు కిమ్ రే-వన్ తెలుసా?” అన్నారు. “వాడా? మా ఇంటి ప్రక్కనే,” అన్న లెవిల్లో… “సూపరు, ఫాస్పేటు, లైము,” అదీ ఇదీ అంటూ బిల్డప్ ఇచ్చాను. ఎందుకంటే ఆ సదరు మా సూపరు, ఫాస్పేటు, లైము నటించిన “…ఇంగ్” అన్న సినిమాని చూసి ఉన్నాను. “అయితే సోక్రటేస్ చూశావా?” అన్నారు. “సోక్రటీస్ తెలుసు కానీ, మీరు చెప్పిన సినిమా తెలియదు. సోక్రటీస్ జీవిత చరిత్రా? అది సెవెన్త్ లోనో, ఎయ్త్ లోనో ఇంగ్లీషు రీడర్లో ఉండేది,” అన్నా. “ఇలా అయితే నీకు ఘాట్ఠిగా తెలిసిన నాలుగు వరల్డ్ సినిమా చెప్పు బాబూ,” అన్నారు. “మైకెలా౨న్జెలో ఆం౨టానియానీ (అప్పట్లో కాస్త ప్రెస్టీజియస్ ఆ పేరు ;-) ), మార్టీన్ స్కోర్సెసే, పీటర్ జాక్సన్… అలా నాలుగైదున్నరారు పేర్లు వదిలి చివరగా అస్మత్ (సినిమా) గురుభ్యోన్నమః, “ అన్నాను. “ఆయనెవరు?” అన్న ప్రశ్న వస్తే, “ఆయనెవరో తెలియదా? ఆగస్టు పాదారున పుట్టిన వీరుడూ, కెనడియన్ యోధుడూ…,” అన్న లెవిల్లో బిల్డప్పిచ్చాను.
రెండు నెల్ల పాటూ అటు వైపు నుంచీ సమాధానం లేదు. నేనూ నా గొడవల్లో పడి మర్చిపోయాను. కానీ ఓల్డ్‍బాయ్ వదల్లా నన్ను. దాంతో అసలు ఏమి జరిగిందబ్బా అని కాస్తంత ఎన్క్వైరీ చేస్తే తెలిసిన విషయం… మా కొరియాన మిత్రుడికి ఒక మెసేజ్ వెళ్ళిందట! ఏమనంటే… “ఒక్కొక్కటీ కాదు షేర్ ఖాన్! వంద సినిమాల్ని పంపు. లేక పోతే వీణ్ణి భరించటం కష్టం,” అని. గట్టిగా ఆన్లైన్ పరిచయమే తప్ప ముఖం కూడా చూసి ఎరుగను. వీడికి అన్ని సినిమాలా?” అనుకుని, వాడు అడిగినప్పుడే చూద్దామని ఊరుకున్నారట. నేనూరుకోనుగా, మెయిల్స్ పెట్టి, నా వ్రాత కోతలు పంపీ, అలా ఇలా విసిగిస్తే, చివరాఖరికి “నీ రాతల్లో ఒక స్పార్కుమ్దబ్బాయీ,” అన్నారు. “అయ్యా! స్పార్కుంది హైదరాబాదు విద్యానగర్ లో కదా! (స్పార్క్ ఒక గేట్/పీజీ ఎన్ట్రన్స్ కోచింగ్ సెన్టర్)” అన్నాను as usual గా నా స్టైల్లో. “ఇదే నీతో సమస్య. కుళ్ళు జోకులేస్తావు. నువ్వు వ్రాసిన స్టైల్లో ఒక స్పార్క్ ఉంది. స్ట్రీమాఫ్ కాన్షస్నెస్ లా ఉన్నా, మల్టిపుల్ రీడింగ్స్ కి ఆస్కారమిచ్చే గుణముంది. కీపిటప్! అని కహృ,” అన్నారు. (SSSA ;-) ). “ధన్యః, ఆ విషయం నాకునూ తెలుసును,” అని పళ్ళికిలించా ఇలా :D “నీకు సరిగ్గా సినిమాలు చూట్టం రాదు. ముందు అది నేర్చులో. ఇప్పటికి వెన్జెన్స్ ట్రైలాజీ పంపుతున్నాను. సినిమాల మీద మామూలు ఇంట్రస్టు కాకుండా కాస్త అపేక్ష ఉంటే కనుక వీటిని చూడు. నువ్వు విన్నట్టే వయలెన్స్ ఎక్కువ వీటిలో. కానీ, ఎలాగోలా చూడు. ఏమన్నా సాయం కావాలంటే నన్ను అడుగు. అంటే వన్ ఫీట్ కాదు. ఆస్క్ మీ అని కహృ. ఆ పెసిమిజ్మ్ నీకు నచ్చదు. డార్కర్ టోన్ నీకు సహించదు as of what I gathered in our conversations. కానీ సినిమాల మీద మామూలు ఇష్టం కన్నా ఎక్కువ ఇష్టం ఉంటె మట్టుకూ చూడు. అలా అయితే చెప్పు. బాక్స్ సెట్ పంపుతాను,” అన్నారు.
“తప్పకుండా! ధన్యోస్మి సోదరా!” అన్నాను. “నాకు తెలుగు రాదు కనుక ఇంగ్లీషులో చెప్పు,” అన్నారు. “Thanks a lot అని కహృ,” అని సెలవిచ్చాను. పదిహేను రోజుల తరువాత బాక్స్ సెట్ అందింది. అలా ఆ మిత్రుని సహాయమ్తో, కొరియానం మొదలెట్టాను. క్రమంగా ఆయన చెప్పిన ‘నాకు సినిమాలు చూట్టమ్ రాదు’ అన్న మాటకర్థం తెలిసింది. విషయం తెలిసింది కనుక ఎలా చూడాలో (ఒక ఫిల్మ్‍మేకర్) అలా చూట్టమ్ నేర్చుకున్నాను. క్రమంగా కొరియన్ సినిమాతో ప్రేమలో పడి, దాన్నే మాతృ భాష గా అంగీకరించి, దాదాపూ 250 సినిమాలు చూశాను. బఖా సటాంగ్ తో మొదలయి, ఓల్డ్‍బాయ్ సెర్చింగ్ లో లోపలకు వెళ్ళి, వెన్జెన్స్ ట్రైలాజీ బాక్స్ సెట్ తో వేగ పుంజుకున్న నా కొరియానం ఎంతో అద్భుతంగా సాగిమ్ది. సాగుతూనే ఉంది. అదే మిత్రుని సహాయంతో వరల్డ్ సినిమా సాగరాన్ని కూడా ఈదగలుగుతున్నాను. ఆ ఎడ్వెన్చరస్ జర్నీలోని కొన్ని ఘట్టాలే ఈ కొరియానం – A Journey Thru (Korean) Cinema.
ఇంతకీ కొరియానం అంటే కొరియన్ సినిమా ప్రయాణమనే కాదు. కొరియన్ సినిమా అనే పడవనెక్కి చేసిన వరల్డ్ సినిమా ప్రయాణమన్నమాట. ఈ కొరి Kori కాదు. Query. ప్రశ్న, బదులు రూపంలో సినిమాను గురించి నేను నేర్చుకుంటూ చేసిన ప్రయాణం. అలా ఓల్డ్‍బాయ్ అన్నది నా సినీ ప్రస్థానంలో ఒక మైలు రాయిలా నిల్చిపోయింది. టెర్మినేటర్ 2: జజ్‍మెంట్ డే తరహాలో.
/bye

3 comments:

విజయ క్రాంతి September 23, 2011 at 1:51 PM  

koria movies are more intense compared to any others in the world. I have seen almost hundreds of movies of koria , as i don't mind which genre the movie is .
Some how i can able to see the violence of those movies as they even make it a art .
If you still not seen these movies try them Mother, Our Town etc..if you need list then let me know :-)

గీతాచార్య September 23, 2011 at 8:15 PM  

విజయ క్రాంతి garu,

Actually I have seen Mother. And not seen Our Town. Any list is welcome. If at least one movie is there in it, it will be helpful for me. Thank you in advance :-)

శ్రీ September 23, 2011 at 8:53 PM  

బాగుంది, నేను కొన్ని కొరియన్ సినిమాలు చూసాను. The man from nowhere చూసారా? మీరు చెప్పిన సినిమాలు చూస్తాను. Oldboy నేనూ చూసాను. ఆ సినిమా టేకింగ్ బాగనే ఉంటుంది. సినిమా మధ్యలో కొంచెం డీవియేట్ అయిపోయాను.

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP