Thursday, May 3, 2012

Joss Whedon, Boyapati, Sampath Nandi దర్శకత్వంలో The Avengers Part II

Joss Whedon, Sampath Nandi, Boyapati Seenu దర్శకత్వంలో...

The Avengers: The Battle against The Six super Heroes

Avengers Part II

ఎవన్జెర్స్ సినిమాలో చివర్లో కొందరు ఎవెన్జెర్స్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తారు. కొందరు వాళ్ళను స్వేచ్ఛగా వదిలేయటం గురించి నెగటివ్ గా మాట్లాడుతారు. దాంతో ఈ సూపర్ హీరోలకు కోపం వస్తుంది. ఠా౨ట్! ఇన్ని కష్టాలు పడి ఇన్ని సేవలు చేసినా మమ్మల్ని ఇలా అంటారా అని. మా స్టార్కు (ఐరన్ మా౨న్) తన గాళ్‍ఫ్రెండ్ ను వదిలేసి మరీ వచ్చాడు అని హల్క్ కు మహా కోపం వచ్చేస్తుంది.

మొదటి పార్టు చివరలో ఒకమ్మాయి తనను కెప్టెన్ అమెరికా కాపాడాడనీ, మిగతా ఎవన్జెర్స్ కూడా చాలా కష్టపడ్డారనీ చెప్తుంది. కానీ ఆ సీన్ ను ఈ సెకండ్ పార్ట్ కోసమని తీసేస్తారు.

ఎటొచ్చీ మనం మాటలు పడటం తప్పదని అర్థం చేసుకుని వాళ్ళంతా మనమే భూమి మీద దాడులు మొదలెడితే అడ్డుకునే వాళ్ళే ఉండరని డిసైడవుతారు. దానికి కెప్టెనమెరికా ఒప్పుకోడు. వీల్లేదంటాడు. ప్రపంచంలో మిగతా చోట్ల ఏమైనా అమెరికాలో న్యూ యార్కునైనా మనం రక్షించాల్సిందే అంటాడు. అప్పుడు అతనికి "నీకు నాకు _______ ______" చూపించి కన్విన్స్ చేస్తారు. అంతా ఏకమై భూమి మీద ప్రతాపం చూపించటం మొదలెడుతారు.

ఇక్కడకు ప్లాట్ పాయింట్ ఒకటి ముగుస్తుంది.

ఇక్కడ ఇంకో వైపు నిక్ ఫ్యూరీకి క్రొత్త సమస్య పుడుతుంది. తనకు ఇంతకు ముందు ప్రపంచాన్ని రక్షించటానికి సహకరించిన వీరులే ఇవాళ విలన్లయి కూచోటంతో కుదేలవుతాడు. బాబూ Batman నువ్వు రారా నాయనా అని బ్రూస్ వేన్ ను పిలుస్తాడు. "నేను బౌలింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి," అని చెప్పి కుదరదంటాడు.

స్పైడర్ మా౨న్ను అడుగుతాడు. నేను ప్రపంచాన్ని రక్షించటం బోరు కొట్టి మళ్ళా మొదటి నుంచీ తీసుకుంటున్నారు. నేను సూపర్ హీరోగా మారాక అప్పుడు చూద్దాంలే అంటాడు.

సూపర్ మా౨న్న్ అడిగుతాడు. "బాబూ, నీ పేరు మాత్రమే ఫ్యూరీ. ఆ హల్క్ గాడి లైఫే ఫ్యూరీ. నన్ను సూపర్ ఫాస్ఫేటాఫ్ లైమ్ లో కలిపేసాడు వాడు. నా వల్ల కాదు," అని తప్పుకుంటాడు.

"ఎలా? ఎలా?? ఎలా???" అని ఫ్యూరీ తలపట్టుకుని కూచుంటాడు.

అప్పుడే బ్రహ్మాండమైన మెరుపు మెరుస్తుంది. కెప్టెన్ అమెరికా బదులు మహేంద్రసింగ్ ధోనీని పిలుస్తే ఎలా ఉంటుంది? అని ఆయన టీమ్ లో ఒకళ్ళు సలహా ఇస్తారు. Luck factor అయితే ఓకే కానీ, అన్న లాశ్టు మినిట్ దాకా సాగతీస్తే చాలా కష్టం. పైగా విదేశాల్లో సరిగా ఆడలేడు. అని ఫ్యూరీ కొట్టి పడేస్తాడు. అప్పుడు, అప్పుడు, అప్ఫుడ్ఢు న్హిజ్హమైన మెరుపు మెరుస్తుంది. పెద్దెంటీయారు ఆకాశంలోంచీ దిగి వస్తాడు.

నిజానికి ఇక్కడ ఇన్టర్వల్ ఉండదు. కానీ మా గుంటూరు హరి హర మహల్లో కాన్టీను వాడి కోసమని నిక్ ఫ్యూరీ ఆశ్చర్యంతో నోరు తెరచి ఎన్టీయారును చూస్తుండగా, ఆ తెరచుకున్న నోటినే ఫ్రీజ్ చేసి ఇన్టర్వల్ వేస్తారు.

మేమంతా వెళ్ళి సమోసాలో, స్వీట్ కార్నో, పఫ్ఫులో కొనుక్కొచ్చుకుని, కోక్కోలా త్రాగుతూ మళ్ళా సీట్లలొ కూచోగానే సినిమా మళ్ళా మొదలవుతుంది.

ఎన్టీయార్ ను చూసి, "ఏంటన్నట్లు" తలెగరేస్తాడు నిక్ ఫ్యూరీ. సర్రుమని కోపం వచ్చినా ఇక్కడ తెలుగు వారి ఆత్మ గౌరవం ప్రశ్న కాదనీ, ప్రపంచాన్ని రక్షించటమే తన తక్షణ కర్తవ్యమనీ గుర్తొచ్చి ఆయన ఎడమ చేత్తో అభయమిస్తూ, "మా మనవడు జూ॥ నటించిన దమ్ము చూడమని ఒక పైరేటెడ్ డీవీడీ ఇచ్చి అంతర్థానమవుతాడు. (ఇదొక చెహోవ్స్ గన్. జాగ్రత్తగా గుర్తుంచుకోండి).

నిక్ ఫ్యూరీ అండ్ టీమ్ దాన్ని ప్రొజెక్టర్లో వేసి చూస్తారు. అంతే! కర్తవ్యం బోధపడుతుంది. విజయశాంతి వచ్చి, "దమ్ము" నుంచీ ఎన్టీయారునూ, "రచ్చ" నుంచీ రామ్ చరణ్ నూ రిక్రూట్ చేసుకోమంటుంది. "సరే, నువ్వే వెళ్ళి జూ॥ ను ఒప్పించి పట్టుకుని రా," అంటాడు.

నేనే వెళ్ళి రామ్ చరణ్ ను పిలుచుకుని వస్తా అని బయలు దేరుతాడు. "ఎహెంతఠి హవమ్హాన్హం," అని పెద్దాయన చేతిని నోట్లో పెట్టుకుని బాధ పడుతాడు.

"మా తాతే చెపితే నేను కాదంటానా? ఎవరక్కడ! బోయపాటిని స్క్రీన్ ప్లే వ్రాసుకుని రమ్మనండి. కీరవాణిని వచ్చి background score కొట్టమనండి," అని లేచి నించుంటాడు.

"బాబూ తారక్! ఇది నిజ జీవితం నాయనా, ఇందులో స్క్రీన్ ప్లే లుండవు. నువ్వే ఫైట్ చెయ్యాలి," అంటుంది విజయశాంతి.

"అందుకే అత్తా చివర చివరల్లో  నీ సినిమాలు ఫ్లాపైంది. ముందు మీరెళ్ళి ఆ నిక్ ఫ్యూరీ గాణ్ణి నా దగ్గరకొచ్చి, రెండడుగులు వెనక్కు నిలబడి తల వంచుకుని బ్రతిమాలమని చెప్పండి, అప్పుడు ఒప్పుకుంటాను. లేక పోతే మన తెలుగు వారి ఆత్మ గౌరవమేమవుతుంది?"

"నీ సినిమాలు మాత్రం పెద్ద హిట్లా?" అని నోటి దాకా వచ్చినా, ఎందుకులే గొడవ అనుకుని, సరే అని విజయశాంతి వెళ్ళిపోతుంది.

కాసేపట్లో రామ్ చరణ్ణు వెంటబెట్టుకుని నిక్ ఫ్యూరీ వచ్చి, రెండడుగులు వెనక్కు నిలబడి, తల వంచుకుని వచ్చి ప్రపంచాన్ని రక్షించమని బ్రతిమిలాడుతాడు.

ఒకవైపు నిక్ ఫ్యూరీ ఇలా అడుగుతుండగానే, జూ॥ రాచ ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు వాటేస్కుని (ఢిల్లీ హైకోర్టు పర్మిషనిచ్చిందని డ్యూయెట్టూహించుకోకండి. ఛండాలంగా ఉంటుంది), టీవీ నైన్ వాళ్ళకు, "చూశారా మా తెలుగు హీరోల మధ్య మీరనుకునే లాంటి గొడవల్లేవ్," అని ఒక స్టేటుమెంటు పడేస్తారు.

బోయపాటీ, సంపత్ నందీ స్క్రీన్ ప్లే వ్రాయటం మొదలుపెడుతుండగా, కీరవాణి బీజీఎమ్ డౌన్లోడ్ చేస్తుండగా, పెద్దాయన తెలుగు వారి ఆత్మగౌరవం నిలబెట్టారని హీరోలిద్దరినీ ఆశీర్వదిస్తుండగా ఇప్పుడు నిజమైన ఇన్టర్వల్ పడుతుంది

INTERVAL.

మేము మళ్ళా బయటకెళ్ళి చాచ్చీలో, బిస్కెట్లో కొనుక్కొచ్చుకుని మళ్ళా సీట్లలో కూలబడుతాము.

యుద్ధం మొదలైంది. ఇద్దరూ కలసి ఒక్క వెంట్రుకా చెదరకుండా వాళ్ళను నిరోధిస్తుంటారు. ఉన్నట్టుండి పూనకం వచ్చినవాడిలా హల్క్ మన జూ॥ మీదకు దూసుకుని వస్తుంటాడు.

సీన్ కట్ చేస్తే,

అక్కడ నిక్ ఫ్యూరీ అండ్ టీమ్...

"వీళ్ళ తస్సారవ్వలో బొడ్డు, ఈళ్ళను చూడండయ్యా, ఉత్త చేతుల్తో ఎలా వాయిస్తున్నారో. అదే రాబర్ట్ డౌనీ అయితే ఆ ఐరన్ మా౨న్ సూట్ చెయ్యాలి. బ్రూస్ బా౨నర్ కైతే మేకప్పేయాలి. థార్ గాడికి కాస్ట్యూములెయ్యాలి. ఈళ్ళను చూడండి. బోల్డు బజెట్ మిగులు," అంటాడు ఫ్యూరీ. అందరూ హర్షధ్వానాలు చేస్తారు.

మళ్ళీ సీన్ కట్ చేస్తే,

ఇక్కడ హల్క్ మన జూ॥ చూసుకోనప్పుడు మీదకు వచ్చి చెయ్యి ఇలా విసురుతాడు. మనమేమో ఎన్టీయారు లాస్ట్ సెకనులో తప్పుకుంటాడనుకుంటాం. తెలుగు సినిమాలు చూసిన నాలెజ్ తో. కానీ ఇది హాలీవుడ్ సినిమా కనుక చూసుకోడు. ఆ అదురుకు ఎగిరి చాలా దురం గాల్లో పైకి లేచి మళ్ళా క్రిందకు పడిపోతుంటాడు. ఈ లోగా రామ్ చరణ్ హల్క్ మీదకు దుకుతాడు పిచ్చ కోపంతో. తనను కెప్టెన్ అమెరికా అడ్డుకోబోతే ఒక్కసారి కన్ను కొడతాడు. అంతే! కెప్టెన్ అమెరికా కంట్లో దోమ పడి ప్రక్కకు తప్పుకుంటాడు. బ్లా౨క్ విడోను manage చేసి, థార్ ను కాసేపు మూర్ఛ పోయేలా చేసి, ముందుకు సాగుతుండగా... Screen blank.

మూడు క్షణాల తరువాత...

స్క్రీన్ మీద ఐరన్ మాన్ రాబర్ట్ డౌనీ జూనియెర్ తమన్నాను కిడ్నాప్ చేస్తాడు. మళ్ళా వాడితో ఎక్కడ తమన్నా రొమా౨న్సు మొదలెడుతుందేమో అని రామ్ చరణ్ భయపడి, ఐరన్ మా౨న్ వెంట పడుతాడు.

ఒక ప్రక్క ఎన్టీయారు క్రింద పడిపోతున్నాడు. ఇంకో ప్రక్క హల్క్ అల్లకల్లోలం సృష్టిస్తున్నాడు. రామ్ చరణ్ తమన్నా కోసం వెళ్ళాడు. ఎలా? ఎలా?? ఎలా??? పెద్దాయన టెన్షన్ తో నేనే క్రిందకు రావాలా అన్నంత ఊగిపోతూ ధిక్ ధిక్ అంటున్నాడు.

స్క్రీన్ మళ్ళా బ్లాం౨క్. మూడు సెకన్ల తరువాత...

Outcredible Bulk గా స్పెషల్ పాత్రలో మన బాలయ్య బాబు...

హాల్లో విజిల్సే విజిల్స్. మేమైతే డా౨న్స్ చేశాము. ధన్, ధన్, ధన్ అంటూ హన్స్ జిమ్మర్ స్పెషల్ మ్యూజిక్కిస్తున్నాడు. ఈ నాలుగు నిముషాలూ క్రిస్ నోలాన్, జేమ్స్ కా౨మెరాన్ కలసి దర్శకత్వం వహిస్తారు...

బల్క్ రూపంలో వచ్చిన బాలయ్య బాబు ఒక్క గెంతులో హుసేన్ సాగర్ మీద నుంచీ, Statue of Liberty ఉన్న సముద్రం మీదకు లంఘించి, మన జూ॥ ను కాపాడుతాడు.

"హ! చూడు జూ॥ అక్కడ రామ్ చరణ్ తమన్నాతో డ్యూయెట్టేసుకున్నాడు. నువ్వు కూడా సమంతా ను తీసుకెళ్ళి నువ్వు మాంఛి రిమిక్స్ వేసుకో. కాసేపు కీరవాణిని నాకిచ్చి మన వాగ్గేయబస్సుడు తమన్ ను పిలుచుకెళ్ళు," అని, తన జేబులోంచీ సమంతాను తీసి ఇస్తాడు.

"సమంతాను పట్టుకెళితే మహేష్ బాబు ఫీలవుతాడేమో బాబాయ్? నాకు నయనతార చాలు."

"సమంతా బోరు కొట్టి సుకుమార్ సినిమాలో కాజల్ ను పెట్టుకున్నాడుగా. నయనతార నాకు హీరోయిను. నువ్వెళ్ళు ఈ పిల్లను తీసుకుని."

"బాబాయ్! మరి ఫైటింగు?"

"నేనున్నానుగా! ఒక్క సారి తొడగొడితే, ఆ సౌండుకే చస్తాడు ఆ హల్క్. నువ్వెళ్ళు. నేను చూసుకుంటాను. మీకయ్యాక నయన్ తో నేను డ్యూయెట్టేసుకోవాలి."

అటు రామ్ చరణ్-తమన్నాలు, ఇటు ఎన్టీయారూ సమంతాల డ్యూయెట్లను సంపత్ నందీ, బోయపాటీ చిత్రీకరిస్తుండగా, మరో వైపు జేమ్స్ కా౨మెరాన్-క్రిస్ నోలాన్ లు బాలయ్య బాబు బల్క్ గా చేసే యాక్షన్ సీన్లను అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు.

నిక్ ఫ్యూరీ గుక్క త్రిప్పుకోకుండా స్క్రీన్ వైపే చూస్తున్నాడు.

బాలయ్య బాబు పెద్దగా సింహ నాదం చేసి, పెద్దాయనకు నమస్కారం చేసి, ఘాట్ఠిగా తొడగొడుతాడు. ఆ సౌండుకే హల్క్ గుండె ఆగి ఛస్తాడు. (చచ్చినంత పనవుతుంది)

హాలంతా మళ్ళా విజిల్స్. నయన్ ను తీసుకుని బాలయ్య బాబు డ్యూయెట్ కోసం వెళ్ళిపోతాడు. జూ॥ రామ్ చరణ్ లు రిఫ్రెష్ అయి వచ్చి, మిగిలిన ఐదుగురు సూపర్ హీరోలనీ ఎదుర్కుంటుంటారు అలవోకగా.

Plot point II

ఇందాకన చెహోవ్స్ గన్ అని చెప్పుకున్నాము కదా! ఆ డీవీడి ని పైరేటెడ్ ఇచ్చాడు పెద్దాయన అని తెలుసుకున్న తెలుగు నిర్మాతల సంఘం వాళ్ళు నిక్ ఫ్యూరీ సుపీరియెర్లను కలుస్తారు. వాళ్ళు ఫ్యూరీని బాధ్యతల నుండీ తప్పించి, మన హీరోలను పట్టుకుని రమ్మని (ఎందుకు? ఇంగ్లీషు సినిమాల్లో అంతే ఉంటుంది. అంతే!) ఒక టీమ్ ను పంపిస్తారు.

ఇక ఇక్కడ...

ఒక వైపు జూ॥, ఇంకో వైపు రాచ. మధ్యలో బాలయ్య బాబు Outcredible Bulk గా ఆ సూపర్ హీరోల్ని వాయించేస్తుండగా ఈటీమ్ వచ్చి మీద పడుతుంది. పెద్దన్నర ఫైటు. ఎన్టీయారు, రామ్ చరణ్ లకు కీరవాణీ, బాలయ్య బాబుకు హన్స్ జిమ్మర్ background score ఇస్తుంటారు.

ఘోర సంగ్రామంలోలో తలలు ఎగిరి పడుతుంటాయి. ఈ ఉధృతిని తట్టుకోలేక హాక్ ఐ బాలయ్యా బాబు చూసుకోనప్పుడు ఒక బాణం గురిపెట్టి వేస్తాడు. బాణం ఇలా వస్తుంటుంది. ఒక ప్రక్క బాలయ్య బాబు కొన ఊపిరితో కూడా యుద్ధానికి వచ్చిన హల్క్ ను బల్క్ రుపంలో ఎదుర్కోవటంలో నిమగ్నమై ఉన్నాడు.

నిక్ ఫ్యూరీ టెన్షన్ లో 'బీప్' పోసేసుకున్నాడు. మహేష్ బాబేమన్నా వచ్చాడా అని స్క్రీనంతా వెతికాము. మహేషే కాదు. మహేష్ బాబు సుపర్‍స్టార్ కూడా రాలేదు. అంటే ఇది నిజంగానే టెన్షనన్నమాట.

బాణం బాలయ్య బాబుకు ఇక అంగుళం దూరంలోకి వచ్చేసింది. టెన్షన్ టెన్షన్ కాదు కాదు లెవెన్షన్ పుట్టేస్తోంది చూస్తున్న వాళ్ళకు.

పేద్ధ మెరుపు మెరిసింది. డైరెక్షన్ కోసమని శంకర్ నూ, background score కోసమని ఏఆర్ రహ్మాన్నూ వెంటేసుకుని వచ్చాడండీ...

రజనీ కాంత్!!!

వచ్చి బాణానికీ, బాలయ్య బాబుకూ మధ్యలో నించుంటాడు. ఇంచి గా౨పులో ఎలా నించుంటాడు? అనకండి. అదే రజనీ స్పెషల్. ఏఆర్ రెహ్మాన్ జైహో పాట కొడుతుండగా బాణం రజనీకి తగిలి రివర్సై ఆ ఆరుగురు సూపర్ హీరోల మీదా పడి పొడుం పొడుం చేసేస్తుంది.

మన హీరోలూ, హీరొయిన్లూ ఒకళ్లనొకళ్ళను వాటేస్కుని అభినందనలు చెప్పేసుకుని గ్రుపు ఫొటో దిగేస్తారు.

ఇటు వైపు మళ్ళా నిక్ ఫ్యూరిని మళ్ళా రిక్రూట్ చేసుకుని, ఈ సారి ఈ హీరోల్ని కూడా విమర్శిస్తే ఇక తమను దేవుడు కూడా కాపాడలేడని గుణపాఠం నేర్చుకుని,

ఆడియో ఫంక్షన్ ఏర్పాటు చేసి అందరినీ పొగిడేస్తారు.

కథ కంచికీ, మనం సినిమా హాల్నుంచీ రెస్టరెంటుకీ...

:D

కథ, స్క్రీన్‍ప్లే, సంగీతం, మాటలూ, పాటలూ, బొమ్మలూ,సినిమాటోగ్రఫీ, దర్శకత్వం, రాసేదీ, చూసేదీః గీతాచార్య

0 comments:

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP