Monday, August 27, 2012

కిరా కనుమరుగైందా?

Kira Argounova.

Ayn Rand వ్రాసిన ‘We the Living‘ అనే నవలలోని హీరోయిన్. ఆ నవలని సినిమాగా ఒక ఇటాలియన్ దర్శకుడు Ayn అనుమతి లేకుండా తీశాడు. అది తరువాత ఎలాగో Ayn కి తెలిసింది. చాలా కాలం తరువాత. దాని గురించి చాలా చోట్ల ఉంది. కనుక నేనా విషయాలను ప్రస్తావించ బోను. ఒక లింక్ ఇస్తే చాలు కదా.
అందుకే నేను వేరే విషయాలని ప్రస్తావిస్తాను. కాస్త నవల గురించి, కాస్త సినిమా గురించి. ఇంకేమన్నా చెప్తానా? ఏమో చూద్దాం.

Ayn Rand 1930 లలో వ్రాసిన ఒక నవల అది. దాని అసలు పేరు ‘Airtight’. కానీ నవల పూర్తి కావచ్చే సమయానికి Ayn ఆ పేరుని ఇలా మార్చింది. Ayn వ్రాసిన నవలలో అత్యంత ప్రాచుర్యం పొందిన The Fountainhead కన్నా ముందే వచ్చిన ఈ నవల సహజంగానే దానికన్నా ముందే సినిమాగా వచ్చింది. కాకపోతే Ayn అనుమతి లేకుండా, ఇంకా ఆశ్చర్యం తనకి అసలు తెలియకుండానే. కాకపోతే ఒక అదృష్టం. Ayn దానికి స్క్రీన్ప్లే రాయటం కానీ, నటీనటుల్ని ఎంపిక చేయటం కానీ జరుగలేదు. అసలు తనకి తెలియకుండానే అంతా జరిగిపోయింది అన్నావు, ఇక ఎలా ఎంపిక చేస్తుంది? అంటారా? లాజిక్ బాగుంది కానీ, మనం ముందుకు పోదాం.

ఒక ప్రీడిటర్మిన్డ్ సీన్ ని మనసులో ఉంచుకుని దానికి తగ్గట్టు సన్నివేశాలని అల్లుకుని, అద్భుతమైన డ్రామా సృష్టించి, ఆద్యంతం చదివించేలా ఉన్న ఆ నవలని ఇటాలియన్ దర్శకుడు, Goffredo Alessandrini తెరకెక్కించాడు.

కథ (విశ్లేషణ): మూడు ముక్కల్లో చెప్పటం కుదరదు కానీ ప్రయత్నిస్తాను. Ayn Rand వ్రాసిన We the Living చదివిన వారికి తెలిసిన కథే. ఆ మాటని నేను ఇక్కడ చెప్ప కుండా వదిలేస్తే ఇక నవతరంగంలోకి అడుగు పెట్టనివ్వరేమో. అందుకే మూడున్నర ముక్కల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను.

నవల ప్రకారం కిరా కుటుంబం బోల్షివిక్ విప్లవం తరువాత క్రిమియా నుంచీ పెట్రోగ్రాడ్ రావటంతో మొదలవుతుంది. అసలా సన్నివేశాన్నే Ayn బ్రిలియన్ట్ గా వర్ణిస్తుంది. మరి సినిమాలో ఎలా ఉందో? ఆ నగరానికి  రావటం, అక్కడ వారెదుర్కున్న పరిస్థితులు, సోవియెట్ యూనియన్లో ప్రజల స్థితిగతులు, మొదలైన వాటిని వర్ణిస్తూ, క్రమంగా మనకి కిరా character మీద ఒక అవగాహనని కల్పిస్తుంది రచయిత్రి. ఏ వర్ణననీ అనవసరంగా చేయకుండా, అవసరమైనంత మేరకే ఉంచటం ఆ నవలలో మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

ఇక కిరాకి కాలేజ్ లో పరిచయం అయ్యే కమ్యూనిస్ట్ యువకుడు ఆంద్రెయ్ తగనొవ్ (Andrei Taganov) గురించి తొలిపరిచయంలోనే మనకి ఒక అవగాహనని కల్పిస్తుంది. ఇక కథలో మరో ప్రముఖ పాత్ర లియో కోవలెన్స్కీయ్ (Leo Kovalensky).

అసలు కిరాకి, లియోకి మధ్య పరిచయమే చిత్రంగా జరుగుతుంది. లవ్ ఎట్ అస్ట్ సైట్. ఆంద్రెయ్ కి పోలార్ ఆపొజిట్ లియో character. వీరిమధ్య ప్రేమా, పెద్దలు ఒప్పుకోరనే మిష మీద, కమ్యూనిస్ట్ కోరలనుండీ తప్పుకోవాలనే కోరికతో వీరు విదేసాలకి వఎళ్ళబోవటం, ఆ ప్రయత్నంలో స్తెపాన్ తిమోషెన్కో అనే ఆఫీసర్‍కి పట్టుబడటం, ఈ సన్నివేశాలని మనకి నవలలో కళ్ళకి కట్టినట్టు వర్ణించబడ్డాయి.

ఇక సినిమా విషయానికి వస్తే కిరా పాత్రకి అలీదా వల్లి (Alida valli) ని ఎన్నుకుంటం దర్శకుని judgement గొప్పదనానికి నిదర్శనం. అచ్చు మన ఊహల్లో ఎలా ఊహించుకుంటామో అలాగే అలీదా కనిపిస్తుంది. ఆమె అభినయం సినిమాకి వెన్నెముక (నేను చూసిన కొన్ని సీన్లు, ఫోటోల ఆధారంగా). ఆంద్రెయ్ పాత్రలో Fosco Giachetti ఒదిగిపోగా, లియో పాత్రలో నటించిన Rossano Brazzi చక్కగా నప్పాడు. ముస్సోలినీ హయాం లో తీయబడిన ఈ సినిమాలో ఉన్న anti-communist theme ని చూసి అధికారులు తొలుత ప్రోత్సహించినా, అందులో కేవలం కమ్యూనిజాన్నే కాదు, అసలు ఏ రకమైన dictatorship నీ వదలలేదని తెలుసుకున్నాక సినిమాని నిషేధించారు. కానీ అప్ప్పటికే ఈ చిత్రం ప్రజల్లో ఒక లెజన్డరీ స్థాయిని అందుకుంది.

జైలుకి వెళ్ళాడు అనే మిష మీద కిరా తల్లిదండృలు లియోతో అనుబంధాన్ని ఒప్పుకోరు. దాంతో కిరా లియోతో కలసి బయటకి వెళ్ళిపోతుంది. వారి వేరు జీవితం, కమ్యూనిస్ట్ ప్రభుత్వంలో వారు పడ్డ కష్టాలూ, చివరకి బూర్జువాలకి విద్యాలయాల్లో ప్రవేశం లేదనే సాకువల్ల ఇద్దరినీ వాళ్ళ వాళ్ళ institutes నుంచీ expell చేయటం, అప్పటినుంచీ వారి బ్రతుకు పోరాటం, ఇంతలో లియోకి ట్యూబర్క్యులోసిస్ రావటం, దాని చికిత్సకోసం కిరా పడ్డా కష్టాలూ, ప్రభుత్వ అదికారులకు మొరపెట్టుకునే సమయంలో ఎదురైన ఛీత్కారాలూ, ఈ సమస్యల వల్ల లియో లో పెరిగిన cynical మెంటాలిటీ, మధ్య మధ్యలో ఆంద్రెయ్ చేసిన సహాయాలూ, ఇవన్నీ నవలలో మొదటి భాగంగా నిలుస్తాయి.
సినిమా కూడా, దాదాపూ, ఇక్కడి దాకానే తొలి భాగం. Noi Vivi. తొలి భాగం చివరి చివరిలో వచ్చే సన్నివేశాలు, సంభాషణలు, రచయిత్రి ఉపయోగించుకున్న సింబాలిక్ వివరణలూ, లియోకి వైద్యం అందని సందర్భంలో కిరా పడ్డ ఆవేదనా చదివేటప్పుడు మనని వెంటాడతాయి. మరి ఈ సమస్యల నుంచీ కిరా ఎలా గట్టెక్కింది? లియోని ఎలా బ్రతికించుకుంది? ఆంద్రెయ్ ఏమన్నా సహాయ పడ్డాడా?లేదా తనే ఆంద్రెయ్ ని ఉపయోగించుకుందా? అసలు పరస్పర వైరీ భావాలున్న ఆంద్రెయ్, కిరాల మధ్య స్నేహం (మొదట్లో) ఎలా ఏర్పడింది? కరుడుగట్టిన కమ్యూనిస్ట్ అయిన ఆంద్రెయ్ పాజిటివ్ కారక్టరేనా? ఒకవేళ ఐనా కిరాకి ఎందుకు ఆకర్షితుడయ్యాడు?

ఈ ప్రశ్నలకి సమాధానాలు ఈ నవల/సినిమా చదివి/చూసి తెలుసుకోండి అంటం పెద్ద ఫూలిష్నెస్. ఎందుకంటే ఇంతకన్నా పెద్ద ఇష్యూ ముందుంది. పైన చర్చించుకున్న విషయాలను కొన్ని కొన్ని themes గా, కథాగమనంలో ఉపయొగించుకుంది రచయిత్రి. వీటన్నింటినీ సమర్ధంగా, చిత్రానువాదంలో దర్శకుడు తెరకెక్కించాడు.
లియోకి అనారోగ్యం తగ్గుతుంది. ఆంద్రెయ్ తో కిరా అనుబంధం బలపడుతుంది. ఈ సారి లియో ప్రభుత్వం అంగీకరించని ప్రైవేటు వ్యాపారిగా మారుతాడు. విలాసాలకి బానిస అవుతాడు. ఈ లోపు మనం లియోని బ్రతికించుకోవటానికి కిరా ఏమి చేసిందో ఒకసారి చూడాల్సి ఉంటుంది.

ఒక పాత్రని ప్రవేశ పెట్టాలన్నా, ఒక వర్ణన చేయాలన్నా, అది కథ/నవలలో ఇంటిగ్రేట్ అవ్వాలనీ, లేనిదే ఆ పాత్రకి అర్థం ఉండదనీ, అది బాడ్ లిటరేచర్ అవుతుందనే Ayn Rand, ఈ నవలలో ఏ పాత్రనీ వృథాగా ప్రవేశ పెట్టలేదు. ఎన్నో చిన్న చిన్న, మధ్య తరహా పాత్రలని కథాగమనంలో, తాను అనుకున్న థీమ్ ని ప్రొజెక్ట్ చేయటానికి పరమాద్భుతంగా వాడుకున్నా, ఎక్కడా వాటి గురించి తలచుకోకుండానే నవల ఆసాంతం రివ్యూచేసుకునేలా చేయటం కూడా వింతే.
ఎందుకంటే ప్రధాన సంఘర్షణ అంతా ఈ మూడు పాత్రల మధ్యే ఉంటుంది. కానీ విచిత్రం కొన్ని కొన్ని చిన్న characters మనని వెంటాడతాయి. ఆలోచింపజేస్తాయి. అలాటి వాటిల్లో కొన్ని…

IRINA DUNAEV… కిరా కజిన్. కిరా కి దగ్గరి ఆలోచనలూ, మనస్తత్వం ఉన్న వ్యక్తి. కిరా అంటే అభిమానం. ఒక anti-proletarian తిరుగుబాటుదారుని ప్రేమించి, అతనికి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చి, చివరకి సొంత అన్న పట్టించటంతో GPU కి దొరికి సైబీరియాకి పంపబడుతుంది. ఈ క్రమాన్ని చాలా విపులంగా, ఉత్కంఠ కలిగేలా, మనని haunt  చేసేలా వివరిస్తుంది. ఇరీనా మంచి చిత్రకారిణి. ఈ విషయాన్ని మనకి చాలా చోట్ల స్ట్రెస్ చేస్తుంది రచయిత్రి. ఆ పిల్ల ఆఖరి సన్నివేశంలో కూడా ఆ వషయాన్ని సింబాలిక్ గా వాడటం రచయిత్రికి తాను ఎంచుకున్న కథాంశం మీద ఉన్న గ్రిప్ ని తెలుపుతుంది.

STEPAN TIMOSHENKO… ఆంద్రెయ్ కి మితృడు. లియో చేస్తున్న ఇల్లీగల్ వ్యాపారం గురించి ఆంద్రెయ్ కి (GPU లో ప్రముఖుడు కూడా) సమాచారం అందిస్తాడు. పార్టీలో క్రమంగా డిటీరియొరేట్ అయిన తన పొజిషన్ ని బట్టీ అదే పరిస్థితి ఆంద్రెయ్కి కూడా వచ్చునేమో అని ఆందోళన చెందుతాడు. ఇతనిని మనం ముందు, లియో కిరా లు దేశం నుంచీ తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు పట్టుకున్న అధికారిగా చూస్తాం. లియో తండ్రి క్రింద తాను పని చేసిన విషయాని గుర్తుంచుకుని తనని విడిపిస్తాడు కూడా.

MARISHKA… ముందు కిరా, లియోల రూం ని బలవంతంగా, పార్టీ సహాయంతో ఆక్రమించుకునే ఒక ప్రొలెటేరియన్ యువతిగా కనిపిస్తుంది. కానీ క్రమంగా ఒకానొక దశలో ఆ పాత్రమీద సానుభూతి కలిగేలా(…???) మారుస్తుంది. కిరా కజిన్
VICTOR DUNAEV (ఇరీనా అన్న) భార్యగా ఇరీనాని రక్షించే ప్రయత్నంలో అసహాయంగా మిగిలే పాత్ర.

VASILI DUNAEV… కిరాకి పెద్దనాన్న. కమ్యూనిస్ట్ వ్యతిరేకి. పూర్వపు రష్యా కోసం కలలు కంటూ ఇప్పటి ప్రభుత్వం యొక్క ఆగడాలని గూర్చి ఆవేదన చెందుతూ, అవసరార్థం, తన స్వార్ధం కోసం కమ్యూనిస్ట్ గా మారే విక్టర్ ని క్రమంగా అసహ్యించుకునే వ్యక్తి. ఇరీనా అరెస్ట్ తరువాత, తన చిన్న కూతురు Acia నితీసుకుని ఇంట్లో నుంచీ వెళ్ళిపోతాడు. కిరా అమ్టే మాహాభిమానం. గతవైభవానికి చిహ్నం. అలుపెరుగని పోరాట యోధుడు. చివరికి విజయమూ ఎరుగడు.

మీకో సంగతి చెప్పనా? మన సినిమాల్లో మధ్యతరుగతి మనస్తత్వానికి ప్రతీక, లేదా… జీవితం ఇంతే అని సరిపెట్టుకుని, గాలివాటం గా దొరికిందే పదివేలు అనుకుంటూ, నిరాశా నిర్వేదాల్లో బ్రతికే రకానికి చెందిన (నువ్వు నాకు నచ్చావ్ లో సుహాసిని ప్రొజెక్ట్ చేసే ఐడియల్ మధ్యతరగతి అమ్మాయి. నాకింతకన్నా తట్టలేదు. క్షమించండి) యువతి ఉంది ఈ నవలలో. ఆ పాత్ర చాలా సిగ్నిఫికెంట్ కిరా పాత్రని ఎలివేట్ చేయటంలో. Rand proved herself to be a master in creating characterizations, and in using them to convey her ideas. నవల చదవని వాల్ళు ఈ character ని కాస్త జాగ్రత్తగా పరిశీలించండి. చాలా ఆలోచిస్తారు. ఆ పాత్ర పేరు (ఎన్నో ఆశలు, ఎన్నో ఊసులు, చివరికి అడియాశలు) VAVA MILOVSKAIA.

PAVEL SYEROV… ఆంద్రెయ్ కి కమ్యూనిస్టిక్ opposite (anti-thesis అనొచ్చా? ) ఆ రోజుల్లో టిపికల్… అర్థం చేసుకోండి.

ఇంతమంది మనుష్యుల మధ్య కిరాని ఆదుకునేదీ, ఆమె వల్ల గాయ పడేదీ, తనని చూసి reproach feel అయేదీ ఆంద్రెయ్. అతని మిస్ట్రెస్ గా ఉండటానికి అంగీకరించి, ఆంద్రెయ్ ని ఒక private sanatorium లో ఉంచగలిగే డబ్బుని సాధిస్తుంది. (A tragic romantic triangle). ఈ సన్నివేశాలూ, నిజం తెలిశాక, లియోని పట్టుకునేటందుకు వెళ్ళి కిరా తనని మోసం చేసిందని తెలిశాకా, ఆ సమయం లో కిరా, ఆంద్రెయ్ ల మధ్య జరిగే కాన్‍ఫ్రంటేషన్, అక్కడ ఆంద్రెయ్ చూపే పరిణతి, ఓహ్! చదవాల్సిందే. నాకు దొరికిన ఒకటి రెండు నిమిషాల క్లిప్పింగులలో Fosco Giachetti హావభావాలూ, అమోఘం.

ఇంతకీ నువ్వు చెప్పేది నవల గురించా సినిమా గురించా? (No distortion please)
రాండ్ దృష్టిలో అలీదా వల్లి కిరా పాత్రకి suited to the T. ఆమె తప్ప వేరొకరిని ఊహించలేము. నాకూ అంతే అనిపించింది. క్కువ చూసింది ఫొటోలే. కానీ నేను నవల చదివేటప్పుడు ఊహించుకున్న రూపానికి చాలా సారూప్యత ఉండటం నా ఊహాశక్తి గొప్పదనమా? లేక దేవుని అద్భుతమా? (A mistaken word. May Ayn Rand pardon me), లేకపోతే ఆ పాత్రకి తగ్గట్టు ఒదిగిన అలీదా గొప్పదనమా? లేక పాత్రకి తగ్గ నటులని ఎంపిక చేయటంలో దర్శకునికి ఉన్న ప్రతిభా?

ఇక చివరి సన్నివేశాలలో (నవల క్లైమక్సూ, దానికి దారితీసేసన్నివేశాలు అనుకోండి) Ayn Rand touched unbelievable heights.

సినిమాని మొదట మొత్తం రెండు భాగాలుగా తీసినా Ayn Rand చేతిలోకి వచ్చాక మొత్తం మూడు గంటల ఏక చిత్రం గా మారింది. చూసిన కొందరు చెప్పిన మాట అద్భుతం. చూడని నాలాటి వాళ్ళూ ఆశించేదీ అద్భుతమే.

వీటికితోడు నన్నో ప్రశ్న వేధిస్తున్నది. కిరా లాంటి ఐడియలిస్ట్ అయిన అమ్మాయి నిజ జీవితంలో తారసపడుతుందా? (:-) అన్నీ డౌట్లే) తన విలువలనీ తన మనిషినీ (లియోని) ఇంత passionate గా ప్రేమించే అమాయి ఉంటుందా? This can be summed up by one dialogue from the movie and novel. ఆంద్రెయ్ అరస్టు చేసి విడిపించిన తరువాత లియో సినికల్ గా మారి, చివరికి ఒక జిగోలో లా మారుతాడు. ఆంద్రెయ్ పార్టీ నుండీ వెలివేయబడి, చివరకి ఆత్మహత్య చేసుకుంటాడు. కిరా దశం నుండి తప్పించుకునే ప్రయత్నంలో మరణిస్తుంది. ఇంకొద్ది క్షణాలలో తాను ఒక unconquered గా మారబోయే సమయంలో ఒక బోర్డర్ సెక్యూరిటీ గార్డ్ కాలుస్తాడు. But still Kira remains loyal to her love for Leo until the end, and says at one point “When a person dies, one does not stop loving him, does one?”


ఒక సందర్భంలో ఇరీనా లియో చిత్రం వేస్తూ సరదాగా అతనిని ఒక జిగోలో గా వేస్తుంది. Great symbolic scene. Pre determined ఏమో. ఇంతకీ మొదట చెప్పుకున్న ప్రీ డిటర్మిన్డ్ సీన్ లియోని ఆంద్రెయ్ అరస్ట్ చేసే సందర్భం.

Can anybody stop loving Kira? I can’t. She is one of the very few characters that haunted even after a long time. I read this novel first four years back. I still read it. It became a sentiment to me that I read it, and The Fountainhead during April to June every year.

0 comments:

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP