Kidnap... Lovers Paradize

She said to him with all affection, "You are my kid."

She said to him with all affection, "You are my kid."
మూడు రోజుల క్రితం జరిగిన సంఘటన నా జీవితాన్నే మార్చేసేది. నేను కొంచం బలహీనుడిని ఐతే. నేను శారీరకంగా సన్నగా ఉన్నా, మానసికంగా ద్రుఢమ్ గానే ఉంటాను. అందువల్లే మళ్ళీ నా సహజ శైలిలోకి రాగలిగాను. (బ్లాగుల వ్రాతల విషైకంగా కాదు. మానసికంగా.
ఇంకా వాడి మాటలు నా మనసులో మారోమ్రోగుతూనే ఉన్నాయ్. "నువ్వే అంతా చేశావ్. సుఖంగా ఉన్న నా ప్రాణాన్ని కష్టాలలోకి నెట్టుకున్నాను. నువ్వింకోసారి నాకు కనపడకు."
వెల్. నేను కనపడను. దాంతో అంతా అయిపోతుందా? వాడి ప్రాణం సుఖ పడుతుందా?
సతీష్ నాకు నెల క్రితం కనిపించి, "ఏరా నాకో వెయ్యి ఇస్తావా?" అన్నాడు. నిజానికి వాడికి ఇవ్వటానికి వెయ్యి ఎక్కువేం కాదు. నాకు చాలా సార్లు వాడిచ్చాడు. నాకు సాధారణంగా ఇవ్వటానికి ఉంటే ఇక ఏమాత్రం ఆలోచించకుండా ఇచ్చేస్తాను. (అందరికీ కాదు). ఆ రోజెందుకో అడిగాను. "ఎంట్రా విషయం?" అని.
"రేపు జ్యోతి బర్త్డే. తనకి ఏమన్నా గిఫ్ట్ ఇద్దామని."
"నీ దగ్గర లేవా ఏంటి? అయినా బర్త్డే గిఫ్ట్ కోసం వెయ్యి ఎందుకురా?" (మా ఏజ్ ని బట్టీ అంత అవసరం లేదని నా నమ్మకం. ఎందుకంటే మేము ఇప్పుడిప్పుడే సంపాదిస్తున్నాం. కొంతవరకూ అమ్మా, నాన్నల మీద ఆధార పడి బ్రతుకుతున్నాం.)
"శాలరీ ఇంకా రాలేదు. ఇంట్లో పాకెట్ మనీ ఇవ్వలేదు.నాన్నగారు ఊళ్ళో లేరు. అందుకని..."
"నువ్వు నా దగ్గర నసగక్కర్లేదు. తీసుకోరా," అంటూ ఇచ్చేశాను. అంతటితో ఆగి ఇంతే ఈరోజు ఈ టపా పుట్టుండేది కాదు. నాకు మాటలు తప్పేవి.
"రేయ్ సత్తీ! ఎప్పుడూ నువ్వే బిల్స్ పే చేస్తున్నావని విన్నాను. ఒక్కోసారి తననీ కట్టనీ. ఎందుకంటే నువ్వూ, తనూ ఇద్దరూ కూడా పేరెంట్స్ మీద పార్శియల్లీ డిపెండెంట్. చెరో సారీ పే చేస్తే బర్డెన్ ఉండదు ఎవరో ఒక్కళ్ళ మీద."
వాడికి నా సంగతి తెలుసు. సాధారణంగా నేను చెప్పినవి ఏవైనా కాదనడు. కొంచం రీజన్ మీద బేస్ అయి ఉంటానని వాడికి తెలుసు. ఒకసారి మా ఫ్రెండ్ ఒకమ్మాయిపుట్టిన రోజైతే అందరూ పార్టీ అడిగారు. సమయం వచ్చినప్పుడు నా జేబుకూ బొక్కడుతుందని నేనొక సలహా ఇచ్చాను.
"అందరం పేరెంట్స్ మీద ఆధార పడ్డవాళ్ళం. పుట్టిన రోజైతే ఇలా పార్టీలు అడిగిభాయ పెట్టేకన్నా పుట్టిన రోజు పార్టీకి మనమే తలా కొంచం స్పెండ్ చేసి తనకే పార్టీ ఇద్దాం. మనకీ అంత బర్డెన్ ఉండదు. తనూ హ్యాపీగా ఫీల్ అవుతుంది."
అప్పటి నుంచీ ఎవరిదన్నా పుట్టిన రోజోస్తే మిగతా వాళ్ళం అందరం తలా కొంచం స్పెండ్ చేసి ఇంకా బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం. ఒక్కళ్ళే ఐతే అంత పెద్ద మొత్తం రాదు. కొంతమందికి ఆర్ధికంగా ఇబ్బంది కావొచ్చు. అదే ఇలా ఐతే చక్కగా ఎవరికీ అంత బర్డెన్ కాదు. ప్లస్, అసలు వ్యక్తికి తనకి మన వాళ్లు అందరూ నాకోసం స్పెండ్ చేస్తున్నారనే ఆనందం ఉంటుంది.
సరే! అసలు సంగతి. మా వాడు ఆసారికి ఏదో గిఫ్ట్ పెద్దదే ఇచ్చి గ్రాండ్ గా పార్టీ ఇచ్చుకున్నాడు తన లవర్ కి. వారం తరువాత ఏదో ప్రోగ్రాం పెట్టుకున్నారు. అప్పుడు బిల్ విషయం లో నేను చెప్పిన మాటలనే తను తన వాయిస్ గా చెప్పాడు. ఐతే ఆ అమ్మాయి వాడి మాటలని 'అర్ధం' చేసుకుని "ఇంత పిసినారి వాడిని ఎక్కడా చూడలేదు. ఇప్పిదే స్పెండ్ చేయని వాడివి రేపు పెళ్ళయిన తరువాతేమి స్పెండ్ చేస్తావ్?" అని విసుక్కుని వెళ్లి పోయింది. తరువాత మా వాడు చాలా సార్లు ఫోనులో మాట్లాడటానికి ట్రై చేసినా ఫోను లిఫ్ట్ చేయలేదా అమ్మాయి. నాల్రోజుల తరువాత ఆ పిల్ల కనబడితే వీడు విషయం అడిగాడు.
"నీలాంటి సోంబెరిగాదితో నాకు మాటలనవసరం. ఆడదాని సోమ్మునాసించే వెధవవి. ఇక నాకెప్పుడూ కనబడకు." అని వెళ్లి పోయింది. మావాడు ఆమాటలను సీరియస గా తీసుకున్నాడు. మర్నాడు మేము విన్నదేమిటంటే వాడు సూసైడ్ attempt చేశాడని.
నేనూ, ఇంకో ఫ్రెండూ వెళ్లి అడిగాము. అప్పటికి వాడు హాస్పిటల్ లోనే ఉన్నాడు. ఏదో ముభావంగా మాట్లాడి నన్ను పంపేశాడు. వీక్ గా ఉన్నాడు కదా అని నేను వచ్చేశాను. మర్నాడు నాకు ఫోనులో క్లాస్. చివరికి వాడి ప్రేమని నాశనం చేసిన పాపం నాదే అనీ, నా egotistic నేచర్ వల్లే వాడికి అలాంటి పాడు సలహా ఇచ్చానని. నాకు వాడి మీద ఉన్న అసూయ వల్లే ఆ పని చేశాననీ.
ఇదంతా విన్న ఇమ్రాన్ అమ్మాయిలంతా అంతే ననీ, డబ్బు పెట్టినంతకాలం మనతో ఉంటారనీ, ఆ తర్వాత వదిలేస్తాడనీ నాకు ఉపదేశామృతం చేశాడు కొత్త థియరీ. మామూలు మూడ్ లో నా ముందు ఇలాంటి మాటలు ఎవరూ అనలేరు.
నాకు అప్పుడు ఆ మూడ్ లో వాడు చెప్పేది నిజమేమో అన్పించింది.
దాంతో నేను రెండు రోజుల పాటూ మా వాల్లనేవరినీ కలవలేదు. కనీసం ఫోను కూడా లిఫ్ట్ చేయలేదు. దాంతో మొన్న చైతి నెట్ సెంటర్లో కనపడి. ఫోనుకూడా ఎత్తటం లేదేంటి అని అడిగింది. నేను ముభావం గా ఏమీలేదని తప్పించుకోజూశాను.
తను వదలకుండా నా వెంటే వస్తూ జూస్ త్రాగుదాం రమ్మంది. నేను మాట్లాడకుండా వెళ్ళ బోయాను. తను నా ప్రక్కనే నడుస్తూ ఇమ్రాన్ కి ఫోను చేసి విషయం కనుక్కుంది. "వాడేదో ఫ్రస్ట్రేషన్ లో ఏదో కూస్తే నువ్వెందుకు మమ్మల్ని ఎవాయిడ్ చేయాలి? వాడి బుర్ర లో గుజ్జే లేదు అనుకున్నా, ఈ మధ్య వాడు చేసే పనులని చూసి. ఇప్పుడు మట్టి కూడా లేదు. అంతా వాక్యూమ్ ఉందని అర్ధం అయింది. అయినా అట్లాంటి అమ్మాయినా వాడు ప్రేమించేది. ఆ మాత్రం అండర్ స్టాండింగ్ లేని పిల్లనే వాడు ప్రేమించాదంటేనే అర్ధం కావటం లేదూ వాడు మెదడు పాడిందని." అంటూ నన్ను ఒదారుస్తున్నదనుకుని కష్టపడి పోతున్నది.
నేనూ సీరియస్ గా మొహం పెట్టి అన్నా"సరే! పద వెళ్దాం. నేనోదిలేశాను వాడి సంగతి."
నాకు అర్ధం కానివి రెండు ఉన్నాయి. ప్రేమించిన వాడి జేబుకి బొక్కేయదమేనా అమ్మాయిల పని? (అందరూ కాదు. నాకు ఆ విషయం తెలుసు. నాకలాంటి అమ్మాయిలూ ఎదురవలేదు కూడా. అర్ధం చేసుకునే వాళ్ళనే ఎక్కువ చూశాను. లేదా మీక్ పర్సన్స్ ని చూశాను.)
ఒకమ్మాయో, లేదా ఒకబ్బాయో ఏదో చేస్తే అందరినీ అదే గాటన కట్టటం సమంజసమేనా? ఈ జనరలైజేషన్లు నాకు నచ్చవు. ఇమ్రాన్ గాడికి ఓ సారి నేను 'ఉపదేశామ్రుతాన్ని' బోధించాలి. ఈ మధ్య నేను ఎక్కువ వింటున్నాను. తక్కువ చెపుతున్నాను.
గమనిక: ఇదంతా నిజంగానే ఈ మధ్యే జరిగింది. పేర్లు మార్చాను. (అబ్బాయిలవీ, మొదతమ్మాయిది). ఎవరినీ నొప్పించేందుకు కాదు వ్రాసింది. ఇలా కూడా జరుగుతున్నాయేమితా అనీ, నేనేమన్నా తప్పుచేశానా అనీ... (రాస్తే అర్ధం అవుతుందని).
కళ్ళలో నీవు ఉంటే...
చీకటే లేదుగా...
శ్వాసగా నీవు ఉంటే...
మరణమే రాదుగా...
రూపమే వేరు అయినా...
మనసు ఒకటే కదా...
మనసులో ప్రేమ ఉంటే...
ద్వేషమే లేదుగా...
ప్రేమలో కరిగిపోదాం....
సత్వరం ఒక్కటౌదాం ...
ఏకమయినా మనసులోని...
ఎత్తునే చాటుదాం...
గాలిలో ఏకమవుదాం...
తనువులే విడిచి పోదాం...
ప్రకృతి పురుషులవుదాం...
పృద్విలో కరిగిపోదాం...
దేవునీ రూపమంటూ...
ప్రేమనే చాటుకుందాం...
ప్రేమలో ఇంకిపోతూ ...
లోకమే వీడిపోదాం...
సప్త స్వరాలన్నీ
సప్త వర్ణాలుగా మలచి
నా మది పై బాణమేశావు
వర్ణాస్త్రానికి బందీనై
ఊహాలోకాన విహరించాను.
ప్రేమసాగారాన పవళించిన నీకు
పూజా పుష్పాలుగా నీ రంగులనే
పువ్వులుగా మలచి మాలగా ఇద్దామంటే
నాకు ఎదురైంది పుష్ప విలాపం.
జాలి ముప్పిరి గొన వాటినొదలి
నన్నే నీకిచ్చాను.
ప్రేమతో పాలిస్తావో...
అమ్మలా లాలిస్తావో...
నాలా నిలబెడతావో ఇక నీ ఇష్టం.
వర్ణరంజితమైన లోకంలో
వానజల్లు లా కురిశావు.
మోడువారిన నా గుండె పై
ఆశా పుష్పాలు చిగురిప జేశావు.
చెట్టునడిగాను, పుట్టనడిగాను,
నీ పేరు చెప్పమని,
నాకొకటే చెప్పావయి
నీవూ నేనూ వేరుకామని.
© Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008
Back to TOP