Monday, October 21, 2013

Achievement కి మీనింగ్ తెలియని బ్లడ్రా మాది!!!


పుట్టు

చదువుకో

ఉద్యోగం చెయ్

పెళ్ళి చేసుకో

ఇద్దరు పిల్లల్ని కను

You're settled.

Me: Are there anyone more settled?

SIRI: Are they happy?

Families: They are doing software jobs

SIRI: Are they happy?

Me: Oh SIRI, cute girl

Moral: Sometimes even SIRI shows some sense., which the society lacks miserably

/byebye

Read more...

Monday, October 7, 2013

చిరాకు టు ద పవరాఫ్ చిరాకు

రచన
వందనూరి జోగేంద్ర దేవి

ఖద

ఛాంగీ ఒక నిరుద్యోగ యువకుడు. యాజ్యూజువల్ గా అతని తల్లి ఈ మధ్యే చనిపోయింది. ఎందుకంటే హీరో అనాథ అయితే వచ్చే ఎఫెక్టే వేరప్పా!

డైరక్టర్ అనుకున్న పరిస్థితుల్లో  అతనికి రక్ష్మి అనే ఇంకో అనాథ తోడవుతుంది. ఇద్దరూ బోల్డు తెలివైన వాళ్ళు. ఛాంగీ ఎంత తెలివైన వాడో చారికకు తెలుసు. ఎలా అంటే అదొక పెద్ద flashback.

తల్లి బ్రతికున్నప్పుడు మందులకు డబ్బు అవసరమై వెతుకుతున్నపుడు చారిక కనిపిస్తుంది. చారిక పదహారేళ్ళకే ఆక్సుఫర్డులో యూకేజీ చదివేసింది. హయ్య బాబోయ్ కదా యిది. చారిక దగ్గరకు వెళ్ళి సాయి కుమార్తె  సహాయంతో పందెం వేస్తాడు. పందెంలో గెల్చినందుకు చారిక వంద నోటు ఇవ్వబోతే సున్నా కు విలువ లేదనీ, పైగా తను నంబర్ వన్ హీరో కనుక ఒక్క రూపాయి చాలని చెప్తాడు. అలా చారిక కు ఛాంగీ తెలివైన వాడని నమ్మకం ఏర్పడి పోతుంది. మందులకు వంద కావాలి. రూపాయే ఉంటంతో ఛాంగీ మందులు కొనలేడు. అవ్విధంబున సమయానికి మందులు అందక ఛాంగీ వాళ్ళ అమ్మ చనిపోతుంది.

కమ్యూనిస్టులు దీనికంతటికీ కారణం పెట్టుబడి దారీల దౌష్ట్యం అని బంద్ కు పిలుపిస్తారు. తిక్క రేగి అయన్ రాండ్ అట్లాస్ ష్రగ్డ్ వ్రాసింది. అది చూసి ఇన్స్పైరయి జోగేంద్ర దేవి ఈ ఖద వ్రాసింది.

ఒక రోజు రక్ష్మి స్ట్రాబెర్రీ లు తరుగుతుంటుంది. డబ్బు లేదు కదా స్ట్రాబెర్రీ లు ఎలా వచ్చాయ్ అనకండి. నంబర్ వన్ హీరో ఇక్కడ! !!

అవి తరిగి పోస్తున్న కాయితం లో ప్యూను ఉద్యోగానికి యాడ్ పడుతుంది. దానికి అప్లయ్ చేయమంటుంది రక్ష్మి. రూపాయి శ్టాంపంటించాల్సిన చోట పదకొండు రూపాయల లకు అంటించి పంపిస్తాడు ఛాంగీ.

ఇంటర్వ్యూకు  పిలుస్తాడు రావు గోపాల రావు. 

రాగోరా: ఏం చదువుకున్నావ్?

ఛా: కేంబ్రిడ్జి లో ఎలక్ట్రికల్ ఇంజనియెరింగ్. ( నంబర్ వన్ హీరో ఇక్కడ! )

రాగోరా: అలా అయితే నీకు ప్యూను ఉద్యోగం ఎందుకు బాబూ? Manager ని చేస్తాను.

ఛా: ఎంత కండ కావరం? ప్యూను ఉద్యోగం కోసం వచ్చిన నన్ను manager ని చేస్తా అంటావా?

రాగోరా: రూపాయి శ్టాంపు అవసరమైన చోట పదకొండు రూపాయిల శ్టాంపు అంటించావు. నీ తెలివి మరియూ తేటలు బహు ముచ్చటగా నున్నవి. పావలా అవసరం అయిన చోట ముప్పావలా మాటలు చెప్పి మా కంపెనీని పైకి తీసుకొస్తావనీ... నీ బుర్ర లో కరంటు ఉంది.

ఇంతలో చారిక అక్కడికి వస్తుంది. ఛాంగీ ని చూసి ఆశ్చర్యంతో నిలబడి పోతుంది. ఈ తింగరోడు plucking what అని!

ఛా: ఇంట్లో కరంటుందని ఎంత ఫొఘఱు నీకు! ఐదేళ్ళలో నీ factory ని ఐదు రోజులు మూయించక పోతే నా పేరు చిరంజీవే కాదు.

రాగోరా: ఏంచేసి మూయిస్తావ్? బందులు చేశా? రాస్తా రోకోలు చేశా? ఒకవేళ అలా చేస్తే మా పని మనిషి కూతురు నిచ్చి పెళ్ళి చేస్తాను.

చారిక: (మనసులో)  now his work,  armpit lick chandole go.

                       AGREEMENT

ఇక్కడ ఇంటర్వెల్.

దర్శకత్వ పర్యవేక్షణ: కారుతీ

కాసేపు బ్రహ్మానందాన్ని కొడతారు. అంటే కామెడీ సీన్లు. రెండు ఐటంసాంగ్ లు. సెకండాఫుకు కథ పెద్దగా మిగల్లేదు. అందుకు.

ఛాంగీ పావలా బిళ్ళ తో ట్రిక్కులు చేసి రాహుల్ గాంధి ని మెప్పించి కాంగ్రేస్ కు మద్దతిచ్చి ప్రభుత్వం పడిపోకుండా చూస్తాడు. కాంగ్రేస్ పాలనలో కరంటుత్పాదన తగ్గి current holiday ప్రకటిస్తారు. రాగోరా factory మూత పడుతుంది. ఐదో రోజు సాయంత్రం చిరరంజీవి రాగోరా ఇంటికి వెళతాడు. ఓటమినంగీకరించిన రాగోరా చిరంజీవి కి పని మనిషి కూతురు నిచ్చి, రాహుల్ గాంధీ కి చారికనిచ్చి పెళ్ళి చేస్తాడు.

Climax twist

రక్ష్మి ముఖ్య మంత్రి అవుతుంది

ఖద, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలూ, బొమ్మలు, ఎడిటింగ్, తీసింది, చూసేది:  హెమర్ గవేష్

Read more...

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP