Saturday, December 24, 2011

కరణం మల్లేశ్వరికి భారత రత్న ఇవ్వాలి!

సచిన్ టెన్డూల్కర్ కు భారత రత్న ఇవ్వాలని ఆ క్రికెట్ దేvoodoo గారి భక్తులు తెగ ఇదై పోతున్నారు. కానీ సచిన్ వల్ల దేశానికి ఏమి ఒరిగిందని? ఆడినందుకు డబ్బు తీసుకున్నాడు. కష్టపడి ఆడి అన్ని పరుగులు చేసినంత మాత్రానా భారత రత్నకు అర్హుడు ఎలా అవుతాడు?

కరణం మల్లేశ్వరికన్నా అర్హుడా? 

అసలు కరణం మల్లేశ్వరికి అవార్డు ఎందుకు ఇవ్వాలి?

౧) మహిళలకు ముప్పైమూడు శాతం రిజర్వేషన్లెటూపార్లమెంటుల్లో ఇవ్వలేదు కనుక అవార్డుల్లో అన్నా ఇచ్చితీరాలి.
౯) ఒలింపిక్స్ లో పతకం గెలిచిన ఏకైక మహిళ కనుక.
౧౭౬) అన్నిటికన్నా ముఖ్యంగా  దేశ యువతకు ఆదర్శంగా నిల్చినందుకు. వారికి స్ఫూర్తినిస్తున్నందుకు,

ఎలా అంటారా?

౧౦౧) రెండువేల సంవత్సరంలో ఒలిమ్పిక్ కాంస్య పతకం గెలిచినప్పుడు కోటి రూపాయిలిచ్చారు. చక్కగా వాటిని తీసుకుని బాం౨కులో వేసుకుని హాయిగా సెటిలైపోయింది. ఎంత చక్కని మార్గం? టీనేజ్ లో కాస్త కష్టపడి ఏదన్నా ఒక పతకం గెలిస్తే (ఒలిమ్పిక్స్ లో) గవర్నఎంటు ఇచ్చే డబ్బును ఫిక్సెడ్ చేసుకుని, ఆ వచ్చే వడ్డీతో కాలక్షేపం చెయ్యవచ్చు అని నిరూపించింది. ఇంకా...
౧౦౮) గవర్నమెంటువాళ్ళనడిగి ఏదైనా ఒక ఎకాడమీని స్థాపించవచ్చు. దానికో నాలుగైదారేడెనిమిత్తొమ్మిదిపదిపదకొండు ఎకరాల స్థలం వస్తుంది. సమయం చూసుకుని దాన్లో కొంత అమ్ముకుని మరికాస్త సొమ్ము చేసుకోవచ్చు. ఏదన్నా అంటే క్రీడాకారులకు ప్రభుత్వ మద్దతు లేదని వాపోవచ్చు.  తెలుగులో బ్లాగింగ్ వస్తే ఇంకా మంచిది వాపోయేందుకు :D
1098) అప్పుడప్పుడూ ఏవన్నా పదవులొస్తే వాటికి రాజీనామాలు చేసి వార్తల్లో నిలువవచ్చు.

100) ఇలా కడుపులోచల్ల కదలకుండా ఎలా హాయిగా బ్రతికేయ వచ్చో యువతకు ప్రాక్టికల్ గా చూపి ఆదర్శంగా నిలిచిన మల్లేశ్వరికి కాకుండా సచిన్ కు ఎలా ఇస్తారు భారత రత్న??? కమాన్! టెల్మీ!ఏం? ఎందుకు ఇవ్వకూడదు?

చీక్కులంకు చెందినందుకా?

ఎతెన్స్ ఒలిమ్పిక్స్  మధ్యలోనే వచ్చినందుకా?

డబ్బు బాగా సమకూరాక ట్రయినింగు డుమ్మా కొట్టి వళ్ళు పెంచినందుకా?

Read more...

Tuesday, December 6, 2011

Once again శ్వేత దినం:Happy Birthday VenuSrikanth

LOVE IS THE VALUE WHICH REMAINS UNPERTURBED DURING THE ROLLER-COASTER JOURNEY OF LIFE, BECAUSE IT CONCERNS WITH THE SPIRIT OF THE INDIVIDUAL RATHER THAN PERSON HIMSELF/HERSELF - RAMANUJAN, in The Philosopher


దేశం మొత్తం ఇవాళ బ్లాక్-డే జరుపుకున్నా, బ్లాగుల్లో మట్టుకూ ఇది శ్వేత దినమే. ఊక దంపుడు లెక్చర్లూ, ఎత్తుకొచ్చి, పెట్టొకొచ్చుకునే ప్రెస్టీజీలూ, వాపోవుడు సెక్షన్లూ, మేధావి ముసుగులూ లేకుండా ప్రశాంతంగా ఙ్ఞాపకాల ఊసుల్లో ముంచి తేల్చే వేణూశ్రీకాంత్ పుట్టిన రోజివాళ.Happy birthday brother. Long Live :)

I told you when we met, whatever happens in the following days, I'll remember you as a good brother. I still, because I love you bro. It always remains the same

Hail!

PS: This is my 100th post in this series (The Inquisistor). 

Read more...

Wednesday, October 19, 2011

ప్రత్యేక నరసరావుపేట రాష్ట్రం కోసం ఆమరణ నీరాహార దీక్షరేపటి నుండే. కార్యాచరణ ప్రణాలిక త్వరలో

/bye 

Read more...

Tuesday, October 18, 2011

సంధ్యా కవిత:

P O E T R Y – ఓ హృద్యమైన కవిత

vlcsnap-2011-10-13-14h19m26s30
పక్షులు కిలకిలారావాలతో ఆ ప్రాంతం సందడిగా ఉంది. పరిమళ భరితమైన మలయ మారుతం లేలేత చిగురాకులను పలుకరిస్తూ, ఊసులాడుతున్నది. నీలి రంగు తివాచీలా ఉన్న ఆకాశపు ప్రతిబింబాన్ని తనలో చూపెడుతున్న ఆ సరస్సు ప్రత్యేకమైన అందాన్ని సంతరించుకున్నది. చుట్టూ ఉన్న పచ్చటి ప్రకృతి హొయలుబోతున్నది. స్వప్న సీమలా ఉన్న ఆ వనము సంతోషానికి చిరునామాలా ఉన్నది. అలాంటి చోట ఎవరికైనా కవిత్వం ఉప్పొంగి వస్తుంది. కానీ ఒక విషయం. ఈ రోజుల్లో కవిత్వమంటే ఎందరికి ఆసక్తి ఉంది? ఎద ఉప్పొంగి ప్రవహించే భావాలను ఎంత మంది అక్షరాల రూపంలోకి మార్చి అనుభూతింపజేయ గలుగుతున్నారు? ఏవీ ఒకప్పటి కవిత్వపు సొగసులు? ఏవీ సరియయిన కవితా సంకలనాలు? గుండెను చెమ్మగిల్లేలా చేయగలిగే ఆ మాటల మంత్రాలేవి? ప్రస్తుత ప్రపంచంలో  గొప్ప కవి ఎవరు అంటే దశాబ్దాల క్రితంలా ఏ Wordsworth లా లేదా అలాంటి పేరు ఎందరు చెప్పగలరీ రోజుల్లో? కవిత్వాన్ని అనుభూతి చెంది, ఆస్వాదించ గల యువత ఎక్కడ?
కవిత్వం ఔడ్డేటెడ్!
కవిత్వం సరే! కమ్మని అనుబంధాలేవీ? ఆ అనుబంధాల ఊసులేవీ? తాతయ్యా, నాయనమ్మల కబుర్లేవి? అమ్మమ్మ ప్రేమగా పంచే తినుబండారాల గుబాళింపులేవి?
సున్నితమైన అనుబంధాలు ఔడ్డేటెడ్!
కనుమరుగైపోతున్న మానవ సంబంధాలను, అంతకు ముందే ఆ ప్రమాదంలో పడ్డ కవిత్వంతో పోలుస్తూ, కొరియెన్ దిగ్దర్శకుడు లీ చాంగ్-డాంగ్ తీసిన అద్భుత దృశ్యకావ్యమే ‘పోయెట్రీ’. ఒక చిత్రం చూడండి. పోయెట్రీ… పోయె ట్రీ. వెళ్ళిపోయిన వృక్షం. ఒకప్పుడు మహా వృక్షంలా వెలిగిన కవితా సాహితి ఇప్పుడు కనుమరుగవుతున్నదా? అన్న ప్రశ్నను, మాన సంబంధాలకు జతగలిపి, లోతైన ప్రశ్నలు రేకెత్తిస్తూ సాగుతుందీ సినిమా.
ఏ సినిమాకైనా మొదటి పది నిముషాలు కీలకం. కథ వాతావరణం లోనికి తీసుకుని వెళ్ళేందుకు. ఈ సినిమా ప్రారంభ దృశ్యం ‘హన్’ నదీ జలాల మీద. మొదట దర్శకుడు మనకు నీటిని చూపుతాడు. అలా ప్రవహించే నదీ జలాల సవ్వడులు వింటూ, ఆ నీలి నీటి ప్రవాహాన్ని చూస్తూ, ఒడ్డున ఉన్న పచ్చటి చెట్లను చూస్తూ మనం ప్రయాణం సాగిస్తుండగా కొంత మంది పిల్లలు ఆడుకుంటూ కనిపిస్తారు. వారి ఆటల ఊసుల్లో మనమున్న సమయంలో దూరంగా నీటిలో ఏదో కొట్టుకుని వస్తూ కనిపిస్తుంది. దగ్గరకు రాగా, రాగా అది ఒకమ్మాయి శవం!
కథః ఈ సినిమా కథను చెప్పటం చాలా కష్టం. ఎంత కష్టమంటే మానవ హృదయపు లోతులను కనుగొనే ప్రయత్నమంత.
డైవర్సీ అయిన కూతురు వదిలి వెళ్ళిన మనుమడిని భరిస్తున్న మి-జా అనే వృద్ధురాలు జ్ఞాపక శక్తి తగ్గుతోందని గ్రహిస్తుంది. క్రమంగా తన చేయి తిమ్మిరి ఎక్కినట్లుగా ఉండటం, సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుండటంతో ఇక తప్పదనుకుని డాక్టర్ను సంప్రదించటంతో అసలు కథ మొదలవుతుంది. రంగు రంగుల పూల పూల స్కర్ట్స్ వేసుకునే మి-జా, ఒక చిన్న పిల్లలా తమాషాగా సరదా అయిన వ్యక్తి. గవర్నమెంటిస్తున్న సబ్సిడీల మీద బ్రతుకు బండిని లాగిస్తుంటుంది. వేణ్ణీళ్ళకు చన్నీళ్ళలా పక్షవాతంతో బాధ పడుతున్న మరొక వృద్ధుడికి నానీలా పని చేస్తూ, అతను ఇచ్చే డబ్బుతో కాలం గడుపుతుంటుంది. అలాంటి పరిస్థితులలో ఉన్న మి-జా కు కవిత్వమంటే ఉన్న ఆసక్తి వల్ల దగ్గరలోనే ఉన్న లోకల్ కమ్యూనిటీ సెంటర్లో జరుగుతున్న పోయెట్రీ క్లా౨సుల్లో చేరుతుంది. అక్కడ కవిత్వం వ్రాయటం గురించి కన్నా, అనుభూతులను గమనించటం, వాటిని మాటల రూపంలో పెట్టటం ఎలా అన్న దానిమీద చర్చ నడుస్తున్న సమయంలో మి-జా అక్కడ అడుగు పెడుతుంది. ఇలా ఎలాగోలా తన జీవనాన్ని ఆనందంగానే గడుపుతున్న ఆమె జీవితంలో ఒక పెద్ద కుదుపు మనవడి స్నేహితుని తండ్రి వల్ల వస్తుంది.
ఒక రోజు మి-జా తన కవిత్వపు క్లా౨సుకు వెళ్ళబోయే సమయంలో ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆమె విషయం చెప్పి, క్లా౨సు ముగిశాక కలుద్దామని అంటుంది. చెప్పిన టైముకు వచ్చిన ఒకతనితో ఆమె వెళుతుంది. అప్పుడు అక్కడ మరో నలుగురు పరిచయమవుతారు.  వారు మి-జా మనుమడి స్నేహితుల తండ్రులు. హైస్కూలులో చదివే హీ-జిన్ అనే బాలికను ఆరు నెలల పాటూ రేప్ చేసి హింసిస్తారు. ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుంటుంది. అయితే ఈ వివరాలన్నీ ఒక డైరీలో వ్రాసుకుని పెడుతుంది. అది పోలీసుల చేతికి అందితే తమ పిల్లలకు ప్రమాదమనీ, దాన్ని తప్పించాలంటే ఆ పిల్ల తల్లిని కన్విన్స్ చేసి కేసు ఉపసంహరించుకునేలా చెయ్యాలనీ, దాని కోసం అవసరమయితే ఆమెకు డబ్బునిచ్చి అయినా ప్రమాదం నుంచీ గట్టెక్కాలనీ చెప్తారు. తన మనుమడు కూడా ఈ వ్యవహారంలో ఉండటం మి-జాను బాధిస్తుంది. ఆ పిల్ల తల్లి వేదనను గ్రహించి తల్లడిల్లుతుంది. తన మనుమడు ఇందులో ఇరుక్కున్నాడని తెలిసినా సరియయిన న్యాయం జరగాలని, అందు కోసం తను కృషి చెయ్యాలని అనుకుంటుంది.
కథనం: చూడటానికి సాదా సీదాగా ఉన్న ఈ కథ లీ చాం-డాంగ్ చేతిలో పడటం వల్ల అద్భుతమైన సినిమాగా మారింది. సినిమా అన్నది దృశ్య మాధ్యమం. ఇక్కడ కథను మాటల్లో కాకుండా బొమ్మలలో చెప్పాలి. అలా కాకుండా మొత్తం మాటల రూపంలోనే లాగిస్తే అది డ్రామాకన్నా ఎక్కువేమీ కాదు. ఈ విషయం బాగా తెలిసిన అతి కొద్ది దర్శకులలో లీ ఒకడు. మొదటి సినిమా గ్రీన్ ఫిష్ మినహాయిస్తే మిగిలిన అన్నిటిలోనూ తనదైన ముద్రను వేస్తాడు. తెర మీద కనిపించే ప్రతి దృశ్యంలోనూ ఎన్నో విషయాలు. ఒక్క చిన్న వివరం కూడా అనవసరంగా ఉండదు. కథా, కథనాలు కలగలసి ఉండటం అతని సినిమాలలోని ప్రత్యేకత. ఈ సినిమా కూడా ఇందుకు మినహాయింపు కాదు.
కథను దృశ్యాత్మకంగా చెప్పటమే కాదు. ప్రేక్షకుని తెలివి తేటల మీద గౌరవం ఉండటం కూడా లీ కలిగి ఉన్న సుగుణాలలో ఒకటి. అందుకే అనుకున్నదంతా గుమ్మరించ కుండా ప్రేక్షకుల ఆలోచనకు కూడా వదలివేస్తాడు. తెర మీద కనిపించే బొమ్మ ఎంత కథ చెపుతుందో, కనిపించని మన ఆలోచన కూడా అంతే స్పందనను మనలో కలుగజేస్తుంది. Th e ability to help the viewer to integrate his imagination with the pictures shown on the screen is of highest class. అలా చెయ్యగలగటమే లీ ను తన సమకాలికులలో ప్రత్యేకమైన వాడిగా నిలుపుతున్నది. విక్రమార్కుని కదన కౌశలాన్ని తలపించే కథన కౌశలంతో వీక్షకుణ్ణి కట్టి పడేస్తాడు లీ. సాధారణ పరి భాషలో చెప్పాలంటే లీ వన్నీ ఆర్టు సబ్జెక్ట్స్. అతని సినిమాలు కూడా. కానీ, అవన్నీ బాక్సాఫీసు దగ్గర కూడా చెప్పుకోదగ్గ విజయాలు సాధించాయి. అలాంటి విలక్షణమైన దర్శకుడు కనుకనే లీ అంటే ప్రపంచ సినిమాలో గౌరవం.
ఈ సినిమాను మొదటి పది నిముషాలు కనుక ఓపిక చేసుకుని చూస్తే ఎలాంటి ప్రేక్షకుడైనా ఇక ముగిసే దాకా వదలడు. అమ్దుకేనేమో ఎన్నో చోట్ల ఈ సినిమా స్క్రీన్‍ప్లే కు అవార్డులొచ్చాయి.
నటీనటులు.: యాంగ్ మి-జా. ఒక్కసారి చూడగానే చిరకాల సన్నిహితత్వాన్ని కలిగించే పాత్ర. సినిమా ముగిశాక  చాలా రోజుల పాటూ వెంటాడుతుంది. అలాంటి పాత్రను సృష్టించటం దర్శకుని గొప్పదనమయితే, దాన్ని అంతే సమర్థవంతంగా పోషించి వీక్షకులను కట్టి పడేటం నటీనటుల గొప్పతనం. Yoon Jeong-hee. ఆరవ, ఏడవ దశకాలలో కొరియెన్ సినిమాను ఏలిన గొప్ప నటి. ఇరవై నాలుగుకు పైగా అత్యున్నత పురస్కారాలను పొందిన విదుషీమణి. పదహారేళ్ళ క్రితం తెర జీవితానికి స్వస్తి పలికి, విశ్రాంత జీవనం గడుపుతున్నది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది.  ఒకానొక కాలంలో గొప్ప నటులుగా బాక్సాఫీసును దున్నేసిన వాళ్ళు చాలా కాలం గా౨ప్ తరువాత తెరమీదకు వస్తే, వారి నటనలో పాత వాసనలు ఉంటాయి. అవసరమైన దానికన్నా ఎక్కువగా మెలో డ్రామా పండిస్తారు. ఇప్పటి కాలానికి తగ్గట్టుగా నటించ లేరు. వారిదైన పాత తరహా నటనతోనే అలరించాలని చూస్తారు. అది తప్పు అనలేము కానీ, ఇబ్బంది కరమైన విషయమన్నది మాత్రం ఒప్పుకోవాల్సిందే. కానీ యూన్ జ్యాంగ్‍-హీ ఆ ఇబ్బందిని అధిగమించింది. చాలా సహజమైన నటనతో పాత్రకు ప్రాణం పోసింది. తెరపైన మనకు యూన్ కన్నా మి-జానే కనిపిస్తుంది. ఇది ఆమె నటనను తొలిసారి చూడటం వల్ల అలా అనిపించిందా అని అనుమానం వచ్చి సినిమా సగమ్ కాకుండానే ఆమె నటించిన ఇతర సినిమాలు చూశాక వాటిలో కనిపించిన యూన్ ను పోల్చుకుంటూ మళ్ళా మొదటి నుండీ చూశాను. అయినా నాకు పోయెట్రీలో కనిపించింది ‘మి-జా’నే :-)
ఇక మిగిలిన నటీ నటులలో, మి-జా మనుమడిగా వేసిన కుర్రాడి గురించి. కథలో అతని పాత్రను ముందే ప్రస్తావించాను కదా! అప్పుడు మన మనో ఫలకం మీద కనిపించే లాగానే ఉంటాడు. మి-జా గా వేసిన యూన్ తో పోటీ పడుతాడు. అతని పేరు డేవిడ్ లీ.
మరొక ప్రధాన పాత్ర ప్రెసిడెంట్ కాంగ్. స్ట్రోక్ విక్టిమ్. ఈ పాత్ర పోషించినది కిమ్ హీ-రా, మరొక వెటరన్ నటుడు. అత్యంత సహజమైన నటనతో కట్టి పడేస్తాడు. తప్పదు. ఎందుకంటే అతను నిజ జీవితంలో కూడా పక్షవాతం బారిన పడ్డాడు. అయినా నటన మీద ఉన్న ఆ మక్కువకూ, ఓపికకూ, ఉన్న అవరోధాన్ని అనుకూలంగా మల్చుకుని అద్భుతంగా పాత్ర పోషించిన హీ-రా కు నమో నమః అంతే.మిగిలిన వారు ఇతోధికంగా నటించారు. నటీనటుల సెలెక్షన్ దగ్గర నుండీ, వారి నుంచీ కావలసిన నటనను రాబట్టుకోవటం వరకూ లీ తనదైన ముద్ర వేస్తాడు.
సాంకేతిక నిపుణులు: కెమేరా పనితనాన్ని ఎంత పొగిడినా తక్కువే. కేవలం దాని గురించే ఒక వ్యాసాన్ని వ్రాయ వచ్చు. ఎడిటింగ్ లీ శైలిలోనే నింపాదిగా, జెర్కులు లేకుండా సాగుతుంది. బాగుంది. నేపథ్య సంగీత అతి తక్కువ. కానీ సినిమాకు తగిన సహకారాన్నందించింది. బఖా సటాంగ్ లో హాంటింగ్ మెలడీస్ ను ఉపయోగించిన లీ ఇక్కడ నిశ్శబ్దాన్ని భలే ఉపయోగించాడు. మిగిలినవన్నీ చిత్రాన్ని ఒక మాడ్రన్ క్లా౨సిక్ గా మిగల్చటంలో తగు పాత్రను పోషించాయి.
దర్శకత్వం: Deserves a special post.
రేటింగ్: 4.5/5
PS:  1. Filmmakers కావాలనుకునే ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా స్టడీ చేస్తూ చూడాల్సిన సినిమా.
2. సినిమా టైటిల్ యొక్క అంతరార్థం గురించి చెప్పాలంటే ఈ పరిచయ వ్యాసానికున్న స్కోప్ చాలదు.
నోట్: వ్యాసం మొదట నవతరంగం లో ప్రచురింప బడినది. 

Read more...

Wednesday, October 5, 2011

కొరియానం: ప్రేమించ్Ing...! ;-)

/hihi

కొన్ని సినిమాలుంటాయి. ఎన్ని సార్లు చూసినా మళ్ళా ’ఇంకోసారి’ అంటే, సారీ అనకుండా చూసేయగలం. మరికొన్ని ఉంటాయి. చూడం చూడం అంటూ చూసినా క్రమంగా పడతాయవి. ఒక్కసారి పట్టాయా ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు. ఏదో మా౨జిక్ ఉంటుంది వాటిలో. సంగీతమో, దృశ్యమో, ఎమోషనో, నటీ నటుల ప్రతిభో, హీరోయిన్/హీరోల అందమో (మన జండర్ ను బట్టీ. అవసరమనుకుంటే డెల్లీ హైకోర్టు తీర్పును కూడా జత పర్చుకోవచ్చు ;) ), ఇలా ఏ ఒక్కటో అనే కాకుండా అన్నీ తెగ నచ్చేస్తాయి. మైమరపిస్తాయి. అప్పుడది ట్రా౨జెడియా, కామెడీయా అని చూడము. సినిమాను మాత్రమే చూస్తాము.

అలాంటి ఒక సినిమాను ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. 

Past is past. Future is future. But present is a Present. Earn it, and Enjoy it - నేను పాటించే ఒక సిద్ధాంతం.

అలాంటి సిద్ధంతం మీద నడిచేదే ఈ సినిమా. నాకు ఈ సినిమా వేరొకరి ద్వారా పరిచయం కాబడ్డది. అప్పట్లో అంత ఆసక్తిగా చూడలేదు. కానీ ఒకసారి పూర్తిగా చూశాక మాత్రం ఇక వదల్లేక పోతున్నాను. చాలా మందికి రికమెండ్ చేశాను దీన్ని. నా ఆల్టైమ్ సినిమాల లిస్టు తీస్తే ఇది తప్పక ఉండక పోయినా ఆల్టైమ్ ఎప్పుడైనా సరే చూట్టానికి రెడీ అన్న వాటిలో మాత్రం దీనిది అగ్రతాంబూలమే. ప్రేమ గురించి అంత గొప్పగా చెప్పబడ్డదీ సినిమాలో. 

చాలా మామూలు కథ, అంతకన్నా మామూలు కథనం. మరి ఎక్కద ఇ సినిమా స్కోర్ చేస్తుంది? దానికి సమాధానం... ప్రేమలో. ప్రేమ అన్న కాన్సెప్ట్ లో. అంత మాత్రాన ఇది ప్రేమ కథా అంటే కాదు. అవును. అవునూ కాదు, కాదూ అవును. 

తల్లీ బిడ్డల అనుబంధం, ప్రేయసీ ప్రియుల అనుబంధం, ప్రధానాంశాలు.

కథ: మి సుక్ కు కూతురే లోకం. భర్త మరణిస్తాడు. చిన్నతనంలోనే తన కూతురుకు అనారోగ్యం. ఎన్నాళ్ళు బ్రతుకుతుందో తెలియని స్థితి. ఆ పిల్లను వీలైనంత సంతోషమ్గా ఉంచాలనేది మి సుక్ ఆలోచన. 


The unusual title of this introspective and well-executed film refers to the present continuous tense in English. For the film's main character Min-ah -- a high school girl who has spent much of her youth in the hospital -- the present may hold a deeper meaning than for most of us. Living with a disease can sharpen your appreciation for the ordinary days that pass before you. Min-ah's single mother, who has already lost a husband, has also learned to focus her attention on the present, rather than on a future that is struck through with uncertainty.

...ingOne day, a young photographer (played by actor Kim Rae-won. కొరియెన్ మహేష్ బాబు అనుకోవచ్చు. అంత అందమ్గా ఉంటాడు మరి ;) ) moves into the apartment below their home. He tries to win over Min-ah's friendship, first by stealing her lighter and later by calling her incessently on her new phone. Min-ah is quite put off by all this, and has no intention of becoming friends with him, although her mother seems to be encouraging her.ఇదీ కథ. విశేషం: చాలా సినిమాల్లో ఇలాంటి కథా కథనాలొచ్చాయి. కానీ ఇక్కడి విశేషమేమిటంటే మనకు అస్సలా ఫీలింగే కలుగదు. కారణం ప్రతీ సన్నివేశం ఒక శిల్పి చెక్కినట్లు ఉండటం. నటీనటుల హావభావాల దగ్గర నుండీ, ఫొటోగ్రఫీ, బా౨క్‍గ్రౌండ్ స్కోర్, సీన్ కంపోజిషన్, దర్శకురాలు రాబట్టిన ఎమోషన్స్, అన్నీ సరిక్రొత్తగా ఉంటాయి. Very refreshing. 

నటీ, నటులు: With her debut film, young director Lee Eon-hee has created a simple, moving story as well as one of Korean cinema's most vivid mother-daughter relationships ever. Im Su-jung -- virtually everyone's choice for the best new actress of 2003, after her award-winning performance in A Tale of Two Sisters -- plays Min-ah with a convincing mixture of reclusiveness and vulnerability. Meanwhile the supremely talented veteran actress Lee Mi-sook plays Min-ah's mother with a cool, hip demeanor that hides the concern she feels underneath. The bond between mother and daughter is touching but also unconventional by Korean standards. Min-ah even refers to her mother by first name, virtually unheard of in Korea.

ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది హీరోగా నటించిన కిమ్ రే-వన్ గురించి. నటన అంటే ఇదే అనేంత గొప్పగా నటించాడు. ఒక్క సినిమాకే నా అభిమాన నటుల జాబితాలో చేరిపోయాడు. పాత్రలో జీవించాడనే చెప్పాలి. ఎమ్తలా అంటే అతని ఎమోషన్స్ అన్నీ మనం కూడా రియల్ టైమ్ లో పంచుకుంటాము. ఈ క్రింద ఇచ్చిన వీడియోలో చూడండి. 


ఐదవ నిమిషం దగ్గర నుంచీ ఆరవ నిమిషం వరకు. సినిమా మొదట నుండీ చూస్తూ అక్కడకు వచ్చేసరికి కళ్ళు చెమర్చక మానవు. ఆపుకోవాలన్నా ఒక్క కన్నీటి బొట్టైనా రాలక మానదు. కేవలం విషాద సన్నివేశాలలొ నటించటమే నటనా? అనే వాళ్ళకు సరదా అయిన సన్నివేశాల్లో అతని నతన చూస్తే, మనకూ అలాంటి మిత్రుడూంటే ఎంత బావుణ్ణు అనేలా నటిస్తాడు. ఒక నటుని ప్రతిభను అమ్చనా వెయ్యటానికి ఇంతకన్నా వేరే నిదర్శనం ఏముంటుంది? 

ఈ క్రింది వీడియోలో రెండవ నిమిషం నుండీ, నాల్గవ నిమిషం వరకూ గమనించండి. ఎంత సహజంగా చెస్తాడో...


ఇక మిగిలిన సహాయ నటులు కూడా పాత్రోచితంగా బ్రహ్మాండమైన నతన కనబరుస్తారు. అంటే మొహాన్ని ముప్పై మెలికలు త్రిప్పి... మన అరవ తరహా నతన కాదు. అంతా natural expressions. There is one man whose story is told in the first 10 minutes, we can not forget his acting, especially the expressions given with his eyes. ఆ కళ్లలా వెంటాడుతూనే ఉంటాయి. 

అతని కథ కానీ, సినిమాలోని కథ గురించి కానీ ఇంతకన్నా ఎక్కువ చెప్పను. చూసి ఆస్వాదించండంతే.

ఫొటోగ్రఫీ చాలా లైవ్లీగా ఉంటుంది. సన్నివేశపు మూడ్ కు తగ్గట్టు. కన్నుల పండుగ అన్నది ఒక్కటే సరి అయిన మాట.

నేపథ్య సంగీతం వీనుల విందు. అంతే! సందర్భానికి తగ్గట్టు ఉండి సన్నివేశపు గాఢతను పట్టి ఇస్తుంది. (Jun-Seok Bang)

ఎడిటింగ్ నేను చూసిన అత్యుత్తమ ఎడిటింగ్ వర్క్స్ లో ఇదొకటి. కేవలం ఈ సినిమా ఎడిటింగ్ గురించే ఒక పెద్ద వ్యాసాన్ని వ్రాయొచ్చు. తప్పక ఈ సీరీస్ లోని వ్యాసాల్లో వ్రాస్తాను. (Hyeon-mi Lee)

ఎక్కడా బోరు కొట్టకుండా సాఫీగా సాగిపోయే ఈ సినిమాను వీలైనంత త్వరగా చూసేయండి. 

రేటింగ్: 4.5/5

పైనిచ్చిన యూట్యూబ్ లింకులను పట్టుకుంటే సినిమా మొత్తాన్నీ చూసేయొచ్చు. 

అసలు దర్శకుడు/రాలు గురించి ఒక్కముక్కైనా చెప్పలేదేమి అంటారా? ఇన్ని రంగాల చేత అదరగొట్టే పని చేయించిన ఆ దర్శకురాలి పేరు ... Eon-hie Lee.

ఇంకొక్క సినిమానే చేసిన ఈ దర్శకురాలు ఇంత అందమైన హిట్ ఇవ్వలేక పోయిందంటే ఆశ్చర్యమే. వన్ హిట్ వండర్ గా నిల్చిపోరాదని అభిలషిస్తున్నాను

/bye
సినిమా ట్రైలర్...


http://www.youtube.com/watch?v=vO1HwVqeFPI

Read more...

Monday, October 3, 2011

Five Blogs You Must Read Before You Die

నువ్వు చచ్చే లోగా చూడాల్సిన ఐదొందల సినిమాలు, చదవాల్సిన ఐదొందల పుస్తకాలు చెయ్యీ, ఎట్సెటరాదులైన  పుస్తకాలప్పుడప్పుడూ ఏ వాల్డెన్లోనో, బుక్ స్పియెర్లోనో, లాం౨డ్ మార్క్ లోనో, హిమాలయాలోనో, కనిపిస్తుంటాయి. అలా ఓసారి చేతిలోకి తీసుకుని అలా అలా తడవకో సినిమా గురించో, పుస్తకమ్ గో గురించో చదివేస్తుంటాను కదా! అప్పుడో అవిడియా వచ్చింది. వై నాట్ లిస్ట్ బ్లాగ్స్ అని. ఆలోచించగా, చించగా, గా ఇప్పటికి సాధ్యమైంది. 

సరె! ఇప్పుడే నైట్ స్ప్రైట్ త్రాగాను కనుక సూటిగా వస్తాను సుత్తిలేకుండా విషయానికి :D

1. అప్పుడు ఏమి జరిగిందంటే.. (ఎల్లెహే! విషయానికొస్తానని మళ్ళా అప్పుడు ఏమిజరిగిందంటే అంటున్నావు. అంటారా?) అది బ్లాగ్ పేరు. వ్రచైత్రి పేరు, క్రాంతి

రాసే వాళ్ళు రచైతలైతే, నా లాగా వ్రాసే వాళ్ళు వ్రచైతలు 

This really is one of the best blogs I read. పాండితీ ప్రకర్ష, హాస్యం కోసం హాస్యం (ఇది నా దృష్టిలో అపహాస్యం. ఎందుకంటే హాస్యం కోసం హాస్యం ఛీ! చెత్త. అనిపిస్తుంది నాకు), వాపోవటాలూ, ప్రోపగాం౨డాలూ, కెలుకుళ్ళూ, పెరుకుళ్ళూ లాంటివి లేకుండా హాయిగా ఒక ఫీల్ గుడ్ సినిమా చూసినట్లు, ఎండాకాలపు సాయంత్రం చిరుజల్లులు కురుస్తుంటే అలా వరండాలో కూచుని పిల్లకాయలందరూ కబుర్లాడుతున్నట్లు, ఎప్పుడో ఎక్కడో మిస్సయిన పాత నేస్తాల కబుర్లు వింటున్నట్లు, ఒక్క ముక్కలో చెప్పాలంటే It is a very lively blog literally. 

మరీ దమ్చి కొట్టి వదిలినట్లు ఎక్కువ టపాలు లేకుండా అప్పుడప్పుడూ మాత్రమే వ్రాస్తుంటారు. ఎక్కువగా బ్లాగుల్లోకి రారేమో, ఇమేజ్ అలాంటివేమీ పట్టించుకోరేమో కూడానూ. అందుకే ఎన్ని సార్లు చదివినా చాలా ఫ్రెష్ గా ఉంటాయి. అన్నట్లూ, నా బ్లాగ్ పఠనం ప్రారంభమైంది ఈ బ్లాగ్ తోనే. చదవటం ప్రారంభించండి, చదువుతూనే ఉంటారు. వంద శాతం చిర్నవ్వులు గా౨రంటీ. నాదీ హామీ :). 


2. తెలుగోడి వాడీ, వేడీ తెలియని వారుండరు. ఎన్ని రకాల టపాలు, ఎన్ని అంశాలు, ఎన్ని చిత్రాలు. ఎప్పుడు తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకి తేడా ఏటుంటాది? కుసింత కలాపోసనుండొద్దేటి? ఇక్కడ దొరికేది ఆ ఆ ఆ అన్నమాట.

ఈ బ్లాగ్ కు విసిన కర్రలూ, ఏసీలూ, కూలర్లూ కాని బ్లాగర్లరుదు. ఆ స్టైలే వేరు, ఇనిమిటబుల్. ఏ అంశాన్ని తీసుకున్నా ఎన్ని సార్లైనా చదివింప జేసే ఈ బ్లాగర్ను బ్లాగుల్లో జేమ్స్ కా౨మెరాన్ అనవచ్చు :D

చదువుడీ, చదువుడి, చదువుడి. ఒక్క టైపో పట్టుకున్నా వెయ్యిన్నర మిలియెన్ డాలర్ల ప్రైజు మనీ అన్న ప్రకటన ఇచ్చినా మన జేబుకు బొక్క పడదు. అంత accuracy. భాషా పరిఙ్ఞానం, విషయ పరిఙ్ఞానం వగైరహాదులు... You can surely learn something from it. 

చాలా ఆలస్యంగా ఈ బ్లాగు కెళ్ళాను. అబ్రకదబ్ర, తెలుగోడు ఇత్యాదులైన పేర్లు చూసి, హాస్యం కోసం హాస్యమో, లేదా వాపోవుడు నమ్బర్ వన్ అలాంటి తరహా అనుకుని భయ పడ్డాను కానీ, ఇప్పుడు బుక్ మార్క్డ్ అయిన ఒకే ఒక్క బ్లాగ్ :)

3. ఈ కత్తి త్రుప్పు పట్టదు. బోరు కొట్టదు. ఎన్ని గొడవలైనా, హడావిడులైనా అదైనా, ఇదైనా, ఏదైనా అంతే!. చదవాల్సిన బ్లాగ్స్ లో ఒకటి. ఇందులోని విషయాలన్నిటితో ఏకీభవించాలని లేదు. కానీ, చదివి తీరాల్సిన బ్లాగుల్లో ఇదొకటి. You can learn something from it here too :)

The posts on his college days is a high light, and there are many posts on language barriers, and what not? You can take it as your reference book ;)

4. Sowmya Writes... On Everything She Wants to... ఇదొక మాయా ప్రపంచం. ఇందులోని నిశ్యాలోచనా పథం కు నేను ఒహప్పుడు రెగ్యులర్ రీడర్ను. అదేంటో ఆ బ్లాగులోనే వెతికి చూసుకోవచ్చు. సినిమాలూ, పుస్తకాలూ, కబుర్లూ, కాకరకాయలూ, సాఫ్ట్వేర్ అంశాలూ, ఇలా ఒకటని కాకుండా... oఒక్క ముక్కలో... A Versatile Blogger. 

అన్నీ బాగనే ఉన్నాయ్ కానీ ఈ మధ్య వచ్చిన మంచమ్మాయ్ సిరీస్ చూశాక మళ్ళా ఈ బ్లాగ్ జోలికి పోయే ధైర్యం చాల్లేదు :D 

5. ఇహ సివరాహరైనా మా గొప్ప బ్లాగిది. నాన్న. నేను చెప్పేకన్నా అక్కడ ఒక దృక్కు సారించి అనుభూతించండి, ఫీలింగు కండి. 

ఈమధ్య లాం౨డ్మార్కులో 3 for 2 offer ఒకటుంది. అలా ఈ ఐదింటితో పాటూ మరో బ్లాగు ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ. అలా అని మాది తెనాలి కాదు. మీది అయితే మాత్రం నా బాధ్యత కాదు :D

6. బ్లాగు వనం! ఛీ దీనమ్మా జీవితం అనిపించినప్పుడల్లా ఇక్కడకు వెళితే బ్రహ్మాండమైన రీఛార్జయ్యి వస్తారు. 100% time back guarantee నాదీ! ;)
***   ***   *** 

ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడన్నా అప్పుడప్పుడూ చదువుకోదగ్గ బ్లాగులైదు ఇప్పుడు... 

1. నెమలి కన్ను. అభిమానులెక్కువైనా కూడా ఆ మాయలో పదకుండా తన కోసం తను వ్రాసుకుంటున్నారా అన్నంత స్వచ్ఛంగా ఉంటాయి టపాలు. గొప్ప శైలి కాదు. అద్భుతమైన పద విన్యాసం కాదు. Simply simple. But, it rocks. Thatz all :) ఒక ట్రెషర్ లాంటి బ్లాగు. పుస్తకాలకు సంబంధించి ఏ వివరాలైనా దొరుకుతాయా అన్నంత... చదవండి వార్చండి. మీకే తెలుస్తుంది 

2. వేణూశ్రీకాంతుడి మురళీ గానమిది. One of the purest blog experiences you can have. ఏదో ఒక అనుబంధం ఏర్పరచుకుంటారీ పేట్రియాటిక్ బ్లాగు చదివితే.

3. తృష్ణ చదివి తెలుసుకోండి. ఎందుకిక్కడ లిస్టవుట్ చేశానో :)

4. సాహితీ మాల - A Good Granny హిహిహి. చదివితే తెలుస్తుంది. ప్రారంభ టపాల్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కువ. కొన్ని విసుగు. కానీ తరువాత్తరువాతవి మాత్రం సూపరో సూపరు. 

5. అసలు బ్లాగు టాలీవుడ్ ప్రముఖ హీరోల తరహాలో మిగిలిపోయినా, ఇక్కడ మాటలుండవు కనుక... బ్రహ్మాండమైన ఫోటో బ్లాగిది. రెగ్యులర్ అప్౬డేట్స్ ఉంటాయిక్కడ.

బోనస్ కావాలంటే కాలాస్త్రి చదవండి ;-)
***   ***   ***

ఇహ పోతే, ఇంకొక్క బ్లాగ్ ఉంది. అది, ఛీ పోదురూ! ఆల్రెడీ చదివేస్తున్నారు. 

ఏనాడూ శ్రద్ధ పెట్టి వ్రాయలేదు. ఎవరైనా చదవాలని అస్సలు ఉండదు. ఒక్కళ్ళనీ బ్లాగుకలవాటు పడనివ్వ లేదు. నివ్వటం లేదు. నివ్వబోవటం లేదు. రెగ్యులర్ రీడర్స్ తక్కువ. కామెంట్స్ కు రిప్లైస్ అరుదు. ఎప్పుడు టపా పడుతుందో, ఎప్పుడు పడదో తెలియదు. ఏదన్నా మొదలెడితే పూర్తవుతుందనే గా౨రంటీ లేదు. కానీ,

లాయల్ ఫా౨న్స్, అరుదైన తరహా టపాలూ...

చదివిన వాటిలో పదికి రెండో, బహు అరుదుగా మూడో బాగుంటాయి తప్ప, చదివినదల్లా బాగుంటుందనే గా౨రంటీ కూడా ఉండదు. అయినా అరుదుగా వచ్చే కామెంట్లేవైనా జెన్యూన్! అంతే కానీ, అలవాటై పోయి పెట్టే రెగ్యులర్ తరహా వ్యాఖ్యలు ఉండవు. 

ఆ బ్లాగ్...

Yours truly, 

/bye

PS: కొత్త పాళీ గారి బ్లాగొకటి మిస్సయ్యింది. వెతుక్కుని చదవండి. తీరుబాటు సమయాల్లో.

ఇంకా ఒకటి రెండు బ్లాగులున్నాయి కానీ నేను రెగ్యులర్ గా చూసేవి, బాగుండవు అని కాదు. ఇవ్వదల్చుకోలేదంతే! :D

గమనిక ఒకే శైలిలో ఒకే తరహాలో, నెక్స్ట్ పదమేమిటో కూడా కనిపెట్టేసేంతలా తయారనవి కొన్ని బ్లాగులున్నా అవి ఒకప్పుడు బాగుండేవి. వాటి గురించి నాకు లెక్క లేదు. ఎంత మంది ఫా౨న్స్ వాళ్ళకున్నా. వాళ్ళూ అదే అనుకున్నా నో ఇబ్బంది. పైగా Happieసూ :D 

Read more...

Saturday, October 1, 2011

తిరక్కథ: ఇది సినిమా కాదు :D

రేయ్ శరత్తూ! కాస్త నన్ను ఇంటిదాకా దింపరా.  కిరణ్ అడిగాడు.

ఒరే నాకు డబుల్స్ రాదురాశరత్ అన్నాడు.

ఏముందిలేరా. నేను తొక్కుతాను. నువ్వు వెనకాల కూచో. మా ఇల్లు మీ ఇంటి కెళ్ళే దారే కదా. సరిపోతుందికిరణ్ నచ్చజెప్పాడు.

సరే! అలాక్కానీఅని శరత్ సైకిల్ వెనుక కూచుని అలా లిఫ్టిచ్చాడు.
***   ***   *** 

ఏరా శరత్తూ! ఇందాకన నీ సైకిల్ని తొక్కిందెవర్రా? గోపాల్ బాబాయడిగాడు.

మా ఫ్రెండ్ కిరణ్ బాబాయ్శరత్ అన్నాడు.

ఇంకెప్పుడూ వాడికి లిఫ్టివ్వకు. నిన్ను కూచోబెట్టి వాడే సైకిల్ తొక్కేస్తాడునువ్వు చవటల్లే వెనక్కూచోవాలి.

అలాగే బాబాయ్శరత్ కాస్త నొచ్చుకుంటూ బెరుకు బెరుగ్గా అన్నాడు.
***   ***   ***

రేయ్ శరత్తూ! కాస్త నన్ను ఇంటి దాకా దింపరాకిరణ్ అన్నాడు.

కాసేపు కిందా మీదా పడ్డాక శరత్ అన్నాడుసరే రా! వెనక్కూచో.

అదేంట్రా! నీకు డబుల్స్ రాదుగా? కిరణ్ అన్నాడు.

వచ్చులేరా. నేర్చుకున్నానుశరత్ సమాధానం చెప్పాడు.
***   ***   ***

ఏరా శరత్తూ! ఆ కిరణ్ గాడు మహరాజులా వెనక కూచుంటే నువ్వు రిక్షా వాడిలా ముందు కూచుని సైకిల్ తొక్కుతా వాడికి లిఫ్టిస్తూ... గోపాల్ బాబాయ్ అన్నాడు.

దీనికి సమాధానంగా శరత్ ఏమన్నాడు? ఏమి చేశాడు?

నీతిఇంకెప్పుడూ సైకిల్ వాడ కూడదు. :D

Read more...

Saturday, September 24, 2011

కొరియానం: Oldboy and New Cinema


If unnecessary smilies appear in this post, they are due to the fact that this article was written in MS Word, and copied in to this blog. Error regretted. Also request friends how to avoid that problem. Thanks in advance


ప్రోలోగ్
ఆదామూ, అవ్వా, లేదా మనువూ, అతని భార్య, లేదా ఇంకెవరైనా తొట్టతొలి మానవులు, ఎవరైనా సరే! మళ్ళా మనువూ, గినువూ అంటే నువ్వూ నీ మతతత్వ పోకడలూ అంటారు కనుక సిమ్పులుగా ఆది మానవుడూ, ఆది మానవీ ఉన్నారనుకుందాము. వాళ్ళ పేర్లు కాసేపు ఆదామూ, అవ్వా అనుకుందాము. పామొచ్చి అవ్వ చేత ఆ౨పిలు పండు తినిపించింది. బాగనే ఉంది. ఆదాము ఆచ్చి నుంచీ రాగానే విషయం చెప్పి, “డాళింగూ లిటుకూ లేకుండా ఈ ఆ౨పిల్ తినేసెయ్! సూపర్ టేస్టుంది,” అంది. “దేవుడు వద్దన్నాడు కదా బ్యూటీ!” “పర్లేదు డాళింగ్! తినేసెయ్. టేస్టు చూస్తే నీకే అర్థమవుతుంది.” “అస్సరే కానీ బ్యూటీ, నీకు ఇది తినమని ఎవరు చెప్పారు?” “ఒక పాము డాళింగ్.”
“ఎవరా పాము? ఏమా కథ?”
“అగో, నువ్వు ఆచ్చెళ్ళినప్పుడు ఒక పామొచ్చింది డియర్! అది దీన్ని చూపించి కోసి ఇవ్వమంది డియర్. నా దగ్గర చాకు లేదు కదా! అన్నాను డియర్. అప్పుడది నీ పేరు గీతాచార్యనా అంది డియర్. అదేంటి అట్లా అన్నావ్! ఇంతకీ ఆడెవడు? అన్నాను డియర్. ఆడా? రైట్రు. ఇప్పుడిదంతా రాస్తోంది ఆడే. కాస్త తింగరోడు. అని జనం అనుకుంటారు అని ఆడనుకుంటాడు. నేను కోసివ్వ మంది చెట్టు నుంచీ కాయని. చాకుతో పండుని కోసివ్వ మని కాదు. ఆడిట్లా అంటుంటాడు ఎప్పుడూ. అందుకే అలా అడిగాను. అన్నది డియర్. అప్పుడు సరే! అని నేను చెట్టుకి ఉన్న కాయ కోసిచ్చాను డియర్! అప్పుడది ఆ కాయని తిని సూపర్ టేస్ట్! అంది డియర్. పామూ, పామూ సూపర్ టేస్ట్ అంటే ఏంటిరా? అన్నాను డియర్. అప్పుడది ఇంకో పండు కొయ్ అంది డియర్. అప్పుడు నేను కోశాక కొరికి చూడు అంది డియర్. ఒక్కసారి కొరికానో లేదో, సూపర్ టేస్ట్! అన్నాను డియర్. ఇప్పుడర్థమైందా? సూపర్ టేస్ట్ అంటే అంది డియర్. అవును అని తలూపాను డియర్. అప్పుడది, ఇదిగో చూడు పిల్లా! అంది డియర్. నేను పిల్లను కాదు. నా పేరు అవ్వ అన్నాను డియర్! అప్పుడది ఛప్! ఇదే గీతాచార్య గోలంటే. చెప్పేది వినడు. ఉన్నట్టుండి డిస్టార్షన్ ఇస్తాడు. అంది డియర్! సరే చెప్పరా అన్నాను డియర్. ఇంకా లోహ యుగం రాలేదు. కనుక చాకులూ గట్రా అనకు. దాన్ని స్టీల్ లేదా ఐరన్ తో చేస్తారు. అవింకా కనిపెట్టబడలేదు. కథలో ఇంటిగ్రిటీ దెబ్బతింటుంది. కనుక ఇప్పటి వాతావరణానికి తగ్గట్టు మాట్లాడు. ఇక నుంచీ రోజుకొక ఆ౨పిల్ నైనా తిను. ఆ౨న్ ఆ౨పిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ ఎవే. నా మాట విను. అంది డియర్. పాము చెప్పింది అర్థం కాకపోయినా తలూపాను డియర్. అది డాళింగ్ జరిగింది.” అంటూ అవ్వ ముగించింది.
“అంతా బాగానే ఉంది కానీ, ఆ గీతాచార్య రాస్తోంది ఏవిటట?” ఆదాము అన్నాడు.
Chapter 1                          పూర్వ కథ
ఇంతలో దేవుడు రావటం, రెస్ట్ ఈజ్ హిస్టరీ. అంటే విశ్రాంతి తీసుకోవటం చరిత్ర అని కాదు. ఇక మిగిలింది అందరికీ తెలిసిందే అని కహృ.
పైన అవ్వ ఆదాముకు ఉన్నది ఉన్నట్టుగానో, లేనిది ఉన్నట్టుగానో, లేదా ఉండీ లేనట్టు ఉన్న దాన్ని అలాగేనో చెప్పింది కదా! దాన్నే narration అంటారు. అలా జరిగిన దాన్నో, లేదా జరుగని దాన్నో, ఒకరు ఇంకొకరికి చెప్పటం అన్నది ఎప్పుడు మొదలయిందో, అప్పుడే కథ, కథనాలన్నవి పుట్టాయని విలియమ్ బాయ్డ్ మహాశయుడు చెప్పారు. అలా పుట్టిన కథ ఎన్ని మలుపులనో చవి చూసి, ప్రస్తుతం నవలలూ, సినిమాల రూపంలో అలరిస్తున్నది. షార్ట్ స్టోరీస్, లేదా షార్టీస్ అన్నది మరొక పేరొంది, జనాదరణలో ఉన్న రూపం. ఈ షార్టీస్ లేదా మామూలుగా మనం పిలుచుకునే కథ అన్నవి లేని, రాని పత్రికలంటూ ఉండవంటే అతిశయోక్తే! ఎందుకంటే సైన్సు, బిజినెస్, ఇలాంటి వాటిలో ఎక్కడో ఉదాహరణ కోసం తప్ప రావు కదా! :D చెప్పింది కదా అవ్వ తమ ట్రూలీ ఎలాంటి వాడో అని.
ప్రస్తుతం ఇక్కడ నేను చర్చిస్తున్నది సినిమాల గురించి కనుక ఆ విషయానికొద్దాము, ఏన్షియంట్ హిస్టరీనొదలి.
సినిమా అన్నది ఒక విజువల్ మీడియమ్. ఈ విజువల్ మీడియమ్ అన్నది చూట్టానికి ఆపరెంట్ గా ఈ మధ్య కాలంలోనే వచ్చినట్టు అనిపించినా, అని మనము అనుకున్నా, విజువలైజేషన్ అన్న ప్రక్రియ కథ అన్నది పుట్టినప్పుడే ఉంది. అంటే చెప్పే వారు వారి మనో ఫలకం మీద ఒక ఊహాత్మకమైన కా౨న్వాస్ ను నిర్మించుకుని అక్కడ తాము చెప్పే దాన్ని విజువలైజ్ చేసుకుంటారు. అన్ని కేస్ లలో నా అంటే చెప్పలేము. But ninety per cent of narrators easily visualize what they are narrating. అలాగే, వినే వాళ్ళు కూడా విజువలైజ్ చేసుకోక మానరు. ఈ విజువల్ స్టోరీ టెల్లింగ్ అని పేరొందిన సినిమా ప్రధానంగా ఆధార పడేదీ, పడాల్సిందీ కథ అన్న దాని మీదే. ఆ కథ అన్నది లేకపోవటం వల్ల సినిమాలెంత దెబ్బతింటాయో మనకు తెలిసిందే. మా సినిమాలో కథే హీరో అన్న పడికట్టు పదమూ మనం వింటూనే ఉంటాము.
అలాంటి కథను సినిమాకు తగ్గట్టుగా, అంటే విజువలైజ్ చేసి, జనానికి చేర్చే బాధ్యత దర్శకునిది. ఒక కథకుడు కథను వ్రాస్తాడు. ఆ వ్రాసిన కథను, విస్తరించి, సినిమాకు తగ్గట్తుగా స్క్రీన్‍ప్లే వ్రాస్తాడు స్క్రీన్‍ప్లే రచయిత, లేదా చిత్రానువాదకుడు. దాన్ని దృశ్యాత్మకంగా ఊహించుకుని, తెరకెక్కించే వాడు దర్శకుడు. అంటే ఎవరో వ్రాసిన కథనూ, ఇంకెవరో వ్రాసిన స్క్రీన్‍ప్లేనూ ఆధారంగా చేసుకుని తన చేత ఉన్న కథను దృశ్య రూపంలో ప్రేక్షకులకు చేర్చే వాడు దర్శకుడు. ఇక్కడో చిత్రం చూడండి. కథ ఒకరిది. స్క్రీన్‍ప్లే మరొకరిది. తీరా చూస్తే, దాన్ని విజువలైజ్ చేసి జనాన్ని మెప్పించాల్సిన బాధ్యత మటుకూ దర్శకునిది. అంటే ఎక్కువ మంది చేసుకునే దానికన్నా లేదా వారి ఊహలకు తగ్గట్టో లేదా ఊహించినదానికన్నా మిన్నగానో తయారు చేసి జనానికి చేర్చాల్సింది దర్శకుడే. ఒక్కోసారి కథకుడే దర్శకుడవుతాడు. అతనే స్క్రీన్‍ప్లే కూడా వ్రాసుకోగలుగుతాడు. అంటే కథా, కథన సంవిధానాలు కూడా అతని ఊహలకు తగ్గట్టు గానే ఉంటాయి. అంటే తాను ఊహించుకుంటూ వ్రాసిన దాన్ని అలాగే తెరకెక్కించి జనాలకు అందిస్తాడు దర్శకుడు. అతని విజువలైజేషన్నే చూసి, నచ్చితే ఆనందించి, ఆదరిస్తారు ప్రేక్షకులు. అలాంటి దర్శకులలో ఒక్కొక్కరిదీ ఒక్కో పంథా.
ఏదీ ఏమైనా ఒక సినిమా తీయాలంటే (ఇదేమన్నా తలుపనుకున్నావా తీయటానికి అంటే, బాబులూ, పాపలూ, వారి బిడ్డలూ తీయటం అంటే… making a film అని) ముఖ్యంగా కావాల్సింది కథ. ఎక్కడో ఎప్పుడో ఒక ఆలోచనో, ఐడియానో తళుక్కున మెరుస్తుంది. దానికి మరికొన్ని చేర్పులు చేర్చి, అంటే ఒక మాదిరిగా చెప్పాలంటే ఇలా… ఎవరి గురించి? దేని గురించి? ఎందుకుకు ఇలానే? అన్న ప్రశ్నలను ఆధారంగా చేసుకుని కథలల్లుతారు. అలాంటి ఒక కథే, ఓల్డ్‍బాయ్ అనే మాంగా. మాంగా అంటే జపనీస్ కార్టూన్ లేదా కామిక్స్. పిల్లల కన్నా సాధారణంగా పెద్దలను టార్గెట్ గా పెట్టుకుని వస్తాయవి. ఆ ఓల్డ్‍బాయ్ అనే మాంగాను ఆధారం చేసుకుని కొరియెన్ డైరక్టర్ పార్క్ చాన్-వుక్ అదే పేరుతో తీసిన సినిమా మన ప్రస్తుత వ్యాస వస్తువు.

Chapter 2                    దర్శకుని కథ

జాయింట్ సెక్యూరిటీ ఏరియా  అనే సూపర్ హిట్ సినిమాతో జనాన్నీ, నిర్మాణ సంస్థలనూ ఏకకాలంలో తన వైపు తిప్పుకున్న కొరియెన్ డైరక్టర్ పార్క్ చాన్-వుక్. అంతకు మునుపు వేరే సినిమాలను తీసినా, ఈ సినిమాతో అతనికి వచ్చిన పేరు, పరపతి అంతా ఇంతా కాదు. ఒక రకంగా బ్లాం౨క్ చెక్ ను అతనికిచ్చేశాయి నిర్మాణ సంస్థలు. ఆ క్రితం సంవత్సరమే వచ్చిన షిరి  అన్న సూపర్ హిట్ (అప్పట్లో అది కొరియాలో అత్యంత సంచలనం సృష్టించి, టైటానిక్ రికార్డులను ఆ దేశంలో తిరగ రాసింది. అది నార్త్ కొరియా, సౌత్ కొరియాల మధ్య ఉన్న సంబంధాలను తడిమి చూసింది. హాలీవుడ్ బిగ్ బజెట్ సినిమాల స్థాయిలో ఉందనే పేరు పొంది ఒక లాం౨డ్ మార్క్ సినిమాగా నిలిచిపోయింది. వెంటనే ఒక సంవత్సరం లోపే అదే థీమ్ ను బేస్ చేసుకుని ఉన్న సినిమాను, ముందు సినిమా ఛాయలేమాత్రం కనిపించకుండా అంతకు మించిన కథన నైపుణ్యంతో నడిపించటం, మెగా హిట్ చెయ్యటం సామాన్యమైన విషయం కాదు. అలాంటి ఘనతను సాధించిన పార్క్ తరువాత ఎలాంటి సినిమాను తీస్తాడో అని జనం ఎదురుజూస్తున్నారపుడు.
పార్క్ ఆలోచనలు సుమారుగా పుష్కర క్రితం తనకొచ్చిన ఒక ఆలోచన వైపుమళ్ళాయి. ఇప్పుడు దాన్ని తెరకెక్కిస్తే ఎలా ఉంటుందనుకున్నాడు. ఒక చిన్న పిల్లను కిడ్నాప్ చెయ్యటం, ఆ పిల్ల తండ్రి ఆ కిడ్నాపర్ల మీద ప్రతీకారం తీర్చుకుంటం అన్నదా కథాంశం. 1995 నాటికి ఆ కథకు ఒక రూపం తెచ్చిన పార్క్ కు అప్పటి పరిస్థితులలో నిర్మాతలు దొరకటమే గగనం. అలాంటిది తను వ్రాసుకున్న అత్యంత భయంకరమైన (విపరీతమైన వయలెన్స్) సినా౨రియోను సినిమాగా తీయటమంటే కలలో కూడా సాధ్యం కాని పని. కానీ జేఎస్‍ఏ తెచ్చిన క్రేజ్ వల్ల తనకు లభించిన క్రియేటివ్ ఫ్రీడమ్ ను ఉపయోగించుకుని అదే కథను సినిమాగా తీస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన మొదలయి, చివరకు One of the most violent and pessimistic tales of revenge ever seen on screen గా బయటకొచ్చింది. దానిఫలితం…
Viewers who may have expected a Joint Security Area 2 largely stayed away from the movie. Also there was some pessimistic nature in his previous film, but in this it exceeded the levels of bearability for many. Actually at one time yours truly vomited twice, and stayed away from it for more than 6 months. JSA had some light hearted episodes of humor, and warmth, which this movie Sympathy for Mr. Vengeance lacking. అయితే అనుకున్న దానిని అనుకున్నట్టు తీశాడు పార్క్. అలా పడ్డది వెన్జెన్స్ ట్రైలాజీకి పునాది. అందులోని రెండవ భాగమే మనం చెప్పుకుంటున్న ఓల్డ్‍బాయ్! బాక్సాఫీసు దగ్గర మిస్టర్ వెన్జెన్స్ బొక్కబోర్లా పడటమే కాకుండా క్రిటికల్ గా కూడా హింసాత్మక దృశ్యాల గురించి కూడా బాగా విమర్శలెదుర్కున్న పార్క్ ఈ సారి కాస్త సేఫ్ గేమ్ ఆడాడు. కానీ, ఎంతైనా క్రియేటివిట్టీ ;-) ఉన్న మనిషాయే.
సరి అయిన కథ కోసం చూశాడు. స్టార్లను రంగంలోకి దింపాడు. వాళ్ళంతా మన వాళ్ళలా పుట్టుకతో స్టార్లు కాదు. చాలా వరకూ స్వయం కృషితో ఎదిగున వాళ్ళు. నటనలో తల పండిన వాళ్ళు. కోతికి కొబ్బరి కాయ దొరికినట్లు, వీవీఎస్ లక్ష్మణ్ కు ఆస్ట్రేలియా దొరికినట్లు, మహేంద్ర ధోనీకి గంగూలీ తయారు చేసి, పటిష్ట పరచిన టీమ్ దొరికినట్లు, జపనీస్ మాంగా అయిన ఓల్డ్‍బాయ్ దొరికింది. ఉన్న దాన్ని ఉన్నట్లు తీస్తే ఇక్కడ మనం మాట్లాడుకునేందుకు ఏమీ లేదు. మరి పార్క్ ఏమి చేశాడు?
వెయిట్ అండ్ సీ! :)

Read more...

Friday, September 23, 2011

కొరియానం: A Journey Thru Korean Cinema


/hihihi                                 

రెండున్నరేళ్ళ క్రితం లీ చాంగ్-డాంగ్ తీసిన బఖా సటాంగ్ లేదా పిపెర్మిన్ట్ కాం౨డీ అన్న సినిమాని మా ఫ్రెండ్ బలవంతం మీద చూశాను. పేరు తమాషాగా ఉంది. నాకసలే రొమాన్సెస్, రొమాన్టిక్ కామెడీలంటే ఇష్టం. అఫ్కోర్స్! ఒక జాన్ర కి చెందిన త్రిల్లర్స్ అన్నా కూడా ఇష్టమే. కాకపోతే అవి పాప్కార్న్ తింటూ ఎన్జాయ్ చేసే తరహావి :). ఇది కూడా అలాంటిదేనేమో అని చూసే ప్రయత్నం చేస్తే, ప్రారంభమే అదో రకంగా అనిపించింది.  ఎక్కడో తేడా కొట్టి కాస్త ఎన్క్వైరీ చేస్తే ఇది నేననుకున్న రొమాన్టిక్ కామెడీనో, పేరులాగా పాప్కార్న్ ఎన్టర్టైన్మెంట్ తరహానో కాదు. చూడాలన్నా కాస్త స్టఫ్ ఉండాలి అని అర్థమయింది. సరే అని మళ్ళా చూశాను.
Narration లో ఒక రకమైన రిథమ్ ఉంది. గుండెనెక్కడో తట్టి పలకరించే తది ఉంది. ఏడు భాగాలుగా (narration packets అనుకోవచ్చు. అంటే ఏడు ఎపిసోడ్లలో సినిమా కథ నడుస్తుంది)) ఉన్న సినిమాలో మొదటి భాగం చివర ప్రోటగనిస్ట్ (హీరో అనుకోవటం తప్పు) “I’m going back,” అంటూ మనని వెనక్కి తీసుకుని వెళతాడు. అంత వరకూ ముగిసే సరికి కథలో లీనమయ్యాను. Then rest is history! :D  
ఈ సినిమాని గురించి వివిధ రకాలుగా నేను చాలా చోట్ల వ్రాశాను. నవతరంగంలోనే మొదటగా తెలుగులో వ్రాసినా, తరువాత వ్రాసినది మాత్రం ఆంగ్లంలోనే. అలా ఆంగ్లంలో మొదటగా వ్రాసినది… Passion for Cinema లో. అక్కడ వచ్చిన వ్యాఖ్యలలో ఒకటి ఓల్డ్‍బాయ్ గురించి పరిచయం చేసింది. చేస్తూ, సినిమా ఎంత బాగుంటుందో, వయలెన్స్ అంత భీకరంగా (Shall we say gruesome?) ఒక కాషన్ కూడా అందింది. కాస్త ప్రయత్నాలు చేసి, దొరక్క అక్కడే వ్యాఖ్యలో ఇదే విషయాన్ని మెన్షన్ చేస్తే, మరికొన్ని వివరాలు తెలిశాయి. యూట్యూబ్ లో చూస్తుంటే 25:1 Best fight scene in movie history అన్న పేరుతో ఓల్డ్‍బాయ్ లో దాదాపూ నలభై నిమిషాల దగ్గర వచ్చే ఒక ఐకానిక్ సన్నివేశం దొరికింది. నాలుగైదు సార్లు చూస్తే బాగా నచ్చింది. అక్కడే దొరికిన మిగతా వీడియోలను చూశాను. రకరకాల సినిమాలు. ఎక్కువ భాగం స్టంట్ సన్నివేశాలే. అన్నింటి గురించీ ఎన్క్వైరీ చేశాను. ఆ ప్రయత్నంలో నాకు మొదటగా దొరికింది సిమ్పతీ ఫర్ మిస్టర్ వెన్జెన్స్. అప్పుడే తెలిసింది ఓల్డ్‍బాయ్ ఇదే డైరక్టర్ తీసిన వెన్జెన్స్ ట్రైలాజీ లో రెండవ భాగమని. మొదట మిస్టర్ వెన్జెన్స్ చూస్తే ఒక పనైపోతుందని వెతికితే, అసలలాంటివి మా ఊళ్ళో దొర్కనే దొరకవని తేలింది. పైగా కొంత మంది వింతగా చూడటం కూడా తటస్థించింది. లాభం లేదని ఆశలు వదిలేసుకుంటున్న తరుణంలో ఆల్రెడీ కొరియానంలో మునిగి తేలుతున్న వ్యక్తి పరిచయమయ్యాడు. కొన్ని హలోలూ, మరికొన్ని హలోలూ తరువాత, ఇనీవిటబుల్ గా, “నువ్వేమి చేస్తుంటావబ్బాయీ?” అన్న ప్రశ్న వచ్చింది. ఫలానా, ఫలానా అన్న వివరాలు ఇచ్చాను. మాటల్లో బఖా సటాంగ్ గురించి రావటంతో, ఆ మిత్రుడితో నేను వ్రాసిన ఆర్టికిల్స్ గురించి చెప్పాను (సెల్ఫ్ డబ్బా, స్వోత్కర్షా, స్టెఫీ గ్రాఫ్, అనిల్ కుంబ్లే ఎట్సెటరా ఎట్సెటరా). పంపించరా పిల్లకాయ్ అంటే పంపించాను. బ్రహ్మాండంగా వ్రాశావురా బాలకా (SSSA ;- ) అని అయితే కొరియన్ సినిమా మీద ఇంటరెస్టుందా? అన్న వేశారు. రవి తేజ ఇష్టైల్లో, “ఫఢి ఛచ్చిఫోథానన్హుఖోంఢీ”. అన్నా. “అయితే నీకు కిమ్ రే-వన్ తెలుసా?” అన్నారు. “వాడా? మా ఇంటి ప్రక్కనే,” అన్న లెవిల్లో… “సూపరు, ఫాస్పేటు, లైము,” అదీ ఇదీ అంటూ బిల్డప్ ఇచ్చాను. ఎందుకంటే ఆ సదరు మా సూపరు, ఫాస్పేటు, లైము నటించిన “…ఇంగ్” అన్న సినిమాని చూసి ఉన్నాను. “అయితే సోక్రటేస్ చూశావా?” అన్నారు. “సోక్రటీస్ తెలుసు కానీ, మీరు చెప్పిన సినిమా తెలియదు. సోక్రటీస్ జీవిత చరిత్రా? అది సెవెన్త్ లోనో, ఎయ్త్ లోనో ఇంగ్లీషు రీడర్లో ఉండేది,” అన్నా. “ఇలా అయితే నీకు ఘాట్ఠిగా తెలిసిన నాలుగు వరల్డ్ సినిమా చెప్పు బాబూ,” అన్నారు. “మైకెలా౨న్జెలో ఆం౨టానియానీ (అప్పట్లో కాస్త ప్రెస్టీజియస్ ఆ పేరు ;-) ), మార్టీన్ స్కోర్సెసే, పీటర్ జాక్సన్… అలా నాలుగైదున్నరారు పేర్లు వదిలి చివరగా అస్మత్ (సినిమా) గురుభ్యోన్నమః, “ అన్నాను. “ఆయనెవరు?” అన్న ప్రశ్న వస్తే, “ఆయనెవరో తెలియదా? ఆగస్టు పాదారున పుట్టిన వీరుడూ, కెనడియన్ యోధుడూ…,” అన్న లెవిల్లో బిల్డప్పిచ్చాను.
రెండు నెల్ల పాటూ అటు వైపు నుంచీ సమాధానం లేదు. నేనూ నా గొడవల్లో పడి మర్చిపోయాను. కానీ ఓల్డ్‍బాయ్ వదల్లా నన్ను. దాంతో అసలు ఏమి జరిగిందబ్బా అని కాస్తంత ఎన్క్వైరీ చేస్తే తెలిసిన విషయం… మా కొరియాన మిత్రుడికి ఒక మెసేజ్ వెళ్ళిందట! ఏమనంటే… “ఒక్కొక్కటీ కాదు షేర్ ఖాన్! వంద సినిమాల్ని పంపు. లేక పోతే వీణ్ణి భరించటం కష్టం,” అని. గట్టిగా ఆన్లైన్ పరిచయమే తప్ప ముఖం కూడా చూసి ఎరుగను. వీడికి అన్ని సినిమాలా?” అనుకుని, వాడు అడిగినప్పుడే చూద్దామని ఊరుకున్నారట. నేనూరుకోనుగా, మెయిల్స్ పెట్టి, నా వ్రాత కోతలు పంపీ, అలా ఇలా విసిగిస్తే, చివరాఖరికి “నీ రాతల్లో ఒక స్పార్కుమ్దబ్బాయీ,” అన్నారు. “అయ్యా! స్పార్కుంది హైదరాబాదు విద్యానగర్ లో కదా! (స్పార్క్ ఒక గేట్/పీజీ ఎన్ట్రన్స్ కోచింగ్ సెన్టర్)” అన్నాను as usual గా నా స్టైల్లో. “ఇదే నీతో సమస్య. కుళ్ళు జోకులేస్తావు. నువ్వు వ్రాసిన స్టైల్లో ఒక స్పార్క్ ఉంది. స్ట్రీమాఫ్ కాన్షస్నెస్ లా ఉన్నా, మల్టిపుల్ రీడింగ్స్ కి ఆస్కారమిచ్చే గుణముంది. కీపిటప్! అని కహృ,” అన్నారు. (SSSA ;-) ). “ధన్యః, ఆ విషయం నాకునూ తెలుసును,” అని పళ్ళికిలించా ఇలా :D “నీకు సరిగ్గా సినిమాలు చూట్టం రాదు. ముందు అది నేర్చులో. ఇప్పటికి వెన్జెన్స్ ట్రైలాజీ పంపుతున్నాను. సినిమాల మీద మామూలు ఇంట్రస్టు కాకుండా కాస్త అపేక్ష ఉంటే కనుక వీటిని చూడు. నువ్వు విన్నట్టే వయలెన్స్ ఎక్కువ వీటిలో. కానీ, ఎలాగోలా చూడు. ఏమన్నా సాయం కావాలంటే నన్ను అడుగు. అంటే వన్ ఫీట్ కాదు. ఆస్క్ మీ అని కహృ. ఆ పెసిమిజ్మ్ నీకు నచ్చదు. డార్కర్ టోన్ నీకు సహించదు as of what I gathered in our conversations. కానీ సినిమాల మీద మామూలు ఇష్టం కన్నా ఎక్కువ ఇష్టం ఉంటె మట్టుకూ చూడు. అలా అయితే చెప్పు. బాక్స్ సెట్ పంపుతాను,” అన్నారు.
“తప్పకుండా! ధన్యోస్మి సోదరా!” అన్నాను. “నాకు తెలుగు రాదు కనుక ఇంగ్లీషులో చెప్పు,” అన్నారు. “Thanks a lot అని కహృ,” అని సెలవిచ్చాను. పదిహేను రోజుల తరువాత బాక్స్ సెట్ అందింది. అలా ఆ మిత్రుని సహాయమ్తో, కొరియానం మొదలెట్టాను. క్రమంగా ఆయన చెప్పిన ‘నాకు సినిమాలు చూట్టమ్ రాదు’ అన్న మాటకర్థం తెలిసింది. విషయం తెలిసింది కనుక ఎలా చూడాలో (ఒక ఫిల్మ్‍మేకర్) అలా చూట్టమ్ నేర్చుకున్నాను. క్రమంగా కొరియన్ సినిమాతో ప్రేమలో పడి, దాన్నే మాతృ భాష గా అంగీకరించి, దాదాపూ 250 సినిమాలు చూశాను. బఖా సటాంగ్ తో మొదలయి, ఓల్డ్‍బాయ్ సెర్చింగ్ లో లోపలకు వెళ్ళి, వెన్జెన్స్ ట్రైలాజీ బాక్స్ సెట్ తో వేగ పుంజుకున్న నా కొరియానం ఎంతో అద్భుతంగా సాగిమ్ది. సాగుతూనే ఉంది. అదే మిత్రుని సహాయంతో వరల్డ్ సినిమా సాగరాన్ని కూడా ఈదగలుగుతున్నాను. ఆ ఎడ్వెన్చరస్ జర్నీలోని కొన్ని ఘట్టాలే ఈ కొరియానం – A Journey Thru (Korean) Cinema.
ఇంతకీ కొరియానం అంటే కొరియన్ సినిమా ప్రయాణమనే కాదు. కొరియన్ సినిమా అనే పడవనెక్కి చేసిన వరల్డ్ సినిమా ప్రయాణమన్నమాట. ఈ కొరి Kori కాదు. Query. ప్రశ్న, బదులు రూపంలో సినిమాను గురించి నేను నేర్చుకుంటూ చేసిన ప్రయాణం. అలా ఓల్డ్‍బాయ్ అన్నది నా సినీ ప్రస్థానంలో ఒక మైలు రాయిలా నిల్చిపోయింది. టెర్మినేటర్ 2: జజ్‍మెంట్ డే తరహాలో.
/bye

Read more...

Tuesday, September 20, 2011

Happy Birthday, dear uncle ;-)

ఆచార్యా! మీకు జన్మదిన శుభాకాంక్షలు. పదకొండు రోజులాలస్యమైంది. గుర్తుంచుకుని మరీ చెప్పేందుకు కూతురినో, కొడుకునో కాదాయే! ;)

చాలా రోజులైంది కలిసి. దేవుడు మీకు మేలు చేయు గాక. 

Read more...

Thursday, September 8, 2011

పిల్లల చేత "క" పలికించటం ఎలా?


పొద్దున్నే ఫోన్ మా ఫ్రెండ్ దగ్గర నుంచీ (నిన్న) మా పిల్ల గాడి బర్త్ డే. కాస్త వచ్చి పోదువూ అని అని ఫోన్ వచ్చింది :-o . చూద్దాం లేరా! అన్నాను. వచ్చితీరాల్సిందే అన్నాడు. సరే! నన్ను కూడా పిలిచేంత ధైర్యముంటే :p ఎందుక్కాదనాలి? ముచ్చట పడి ;) (దెబ్బలేం తగల్లేదులే :D ) వెళ్ళాను. అక్కడ మా వాడు వాపోయాడు /omg . మీకో విషయం తెలుసా? :o వాడు చాలా మహాత్ముడు. అంటే కొంచం మహాత్ములు కూడా ఉంటారా? అనొద్దు. అది నాకే తెలియదు :( . నాకు తెలియంది జనాలకేమి చెప్తాను? ఇంతకీ మా వాడు మహాత్ముడెందుకంటే వాపోయాడు కనుక B-) . మేధావులంతా వాపోతుంటారని విన్నాను. అలాంటి వాళ్ళకే గౌరవం దక్కుతుందనీ విన్నాను :p . సర్లే! వాపోవటం గురించి నా బాధలూ, ఆపై పరిశోధనలూ ఎప్పుడైనా చెప్తాను బ్రతికుంటే... ;) అసలు విషయానికొద్దాము. 

వాళ్ళ పిల్లగాడికి "క" పలకదట. ఆ మధ్య ఎవరో బంధువుల ఇంటికి వెళితే వాడి చేత "కన్ను" అనిపించి వాడలా అనలేక "తన్ను" అంటుంటే... ఇహదన్నమాట సంగతి. 

వాణ్ణి కాసేపు సముదాయించి, (ఎందుకంటే వాడూ నన్ను సముదాయిస్తుంటాళ్ళే) నాకు తెలిసిన ఒక టెక్నిక్ చెప్పాను. ఇది ఎప్పుడో క్రీ.పూ. వ్రాసిన టపా. ఉపయోగ పడే సమాచారముంది కనుక మళ్ళా డిగ్గింగ్. తెలిసిన వాళ్ళోకే. తెలియని వాళ్ళు ఉపయోగించుకొనుడి...

ఇక ఈ క్రింది ప్రహసనం చదివి విషయం తెలుసుకోండి. అప్పుడప్పుడూ మంచి పన్లు చేస్తుండాలి కదా B-)   /wahaha !

ప్రపంచంలో కల్లా అందమైన అక్షరం ఏదంటే నేను క అంటాను. ఎందుకంటే అది నిజంగానే అందమైన అక్షరం. అంతేనా! 'క' లో S ఉంది. S అంటే సక్సెస్ కదా. మరిదాని పైన తలకట్టు కిరీటం లాగా ఉందికదా.

క అక్షరం ఎంత అందమైనది కాకపోతే మా కృష్ణుడు ఆ పేరు పెట్టుకున్నాడు. నల్లనయ్య కళ్లు పడ్డ ఆ అక్షరం ఎంత అదృష్టం చేసుకుందో కదా!

కాకి కూడా రామ బాణం వల్ల అంత ప్రాముఖ్యం పొందినదీ క అనే అక్షరం వల్లే కదా. అసలు జనమంతా క కోసం కొట్టుకుంటున్నారు. క పలకనివారు అందరిలోనూ బకరాలే కదా. చిన్నతనంలోనే క అక్షరం పలికింది అంటే ఆ పిల్లలకి స్పష్టత మాటల్లో ఉన్నట్లే కదా.

చిన్నప్పుడు మా బాబాయి కొడుకు శరత్ గాడికి క పలికేది కాదు. వాడు నాకన్నా 9 ఏళ్ళు చిన్న. మేమందరం వాడిని ఏడిపించేవాళ్ళం. "కన్ను" అనరా అంటే "తన్ను" అనే వాడు. డిప్ప మీద ఒక్కటిచ్చుకునేవాళ్ళం. కారు కావాలి అనటానికి తారు తావాలి అనే వాడు. ఒకసారి మా మేన మామ వాడిని ఏడిపిద్దాం అని కొంచం తారు ఒక పాకెట్లో ఉంచి "ఇదిదో తారు" అన్నాడు. వాడు నిజంగానే కారు తెచ్చాడేమో అని ప్యాకెట్ విప్పితే అందులో నల్లగా తారు. ఇక వాళ్ల అమ్మ ఒకటే పోట్లాట. మధ్యలో గ్యాప్ వస్తే వాడు దిది దేంతి అన్నాడు. అంతే వాళ్ళమ్మ ఒక్కటిచ్చి నువ్వు నోరు తెరవకపోతే ఈ గోలా ఎక్కిరింపులూ ఉండవ్గా అంది. పాపం వాడు బిక్క చచ్చి పోయాడు.

కాలం ఎవరికోసం ఆగిపోదు. ఎవరికీ తల వన్చదు. మరో రెండేళ్ళు గడిచి పోయినాయి. వాడికిప్పుడు ఐదేళ్లు. ఇంకా క పలకటం రాలేదు. అది సామాన్యమైన అక్షరమా! ప్రపంచం లోనే అందమైనదాయే.


ఒకరోజు మా వేదక్కయ్యా వాళ్ల ఇంటికి వెళ్ళాడు, మన కథా నాయకుడు. ఆవిడ మా మూడో మేనత్త. మా బాబాయిలతో పాటే అందరికీ ఆవిడను వేదక్కయ్య అనటం అలవాటై పోయింది. అందుకే నేను ఆవిడని ఆల్ ఇండియా రేడియో అక్కయ్య వేదక్కయ్య అంటాను. సరే! విషయానికొద్దాం. అక్కడ ఎవరో పిల్లలతో గొడవ వస్తే మా అన్నయ్య వాడిని కుమ్మరా అన్నాడట. వాడేమో పెద్దగా లేని తుమ్ముని తెచ్చిపెట్టుకుని తుమ్మాడు. మా అన్నయ్య అర్ధం కాక ఎంట్రా తుమ్మావు అంటే, వాడు నువ్వే తదాతుమ్మరా అన్నావు అన్నాడు. అందరూ ఒకటే నవ్వులు. విషయం ఏమిటంటే వాడిని ఎక్కిరించటం అలవాటై పోయి తను కూడా కుమ్మరా అనబోయి తుమ్మరా అన్నాడు.
ఇంకోసారి వాళ్ళింట్లోనే శరత్ "యెదత్తయ్యా! చెత్త పెత్తవా?" అన్నాడు. (తినే చెక్క). వాళ్ల మనుమరాళ్ళు ఆ రోజంతా వాడిని ఆటపట్టించడమే. ఆ నోటా ఈ నోటా విషయం మా పిన్ని దాకా వచ్చి తను అగ్గి మీద గుగ్గిలం అయ్యింది. నాకు కూడా కోపం వచ్చింది. ఎందుకంటే మా పిన్ని నన్ను చిన్న తనం నుంచీ వాళ్ల పిల్లలకంటే ఎక్కువగా చూసుకునేది. దీనికో పరిష్కారం కనుక్కోవాలి అనుకుని నాగార్జున లాగా నిర్ణయం తీసుకున్నాను. నాకే పరిష్కారం తోచలా!


కాలమాగదు సుమీ నీకోసం అని మా శర్మా మాస్టరు ఎవరైనా బోర్డు మీదది ఎక్కించుకోవడం లేటయితే అనేవారు, ఏడిపిస్తూ. అలాగే కాలం ఆగలేదు. మరో ఆరు నెలలు గడిచాయి. నాకు కాలిలో శనక్కాయంత ఆనె ఒకటి లేస్తే ఒక చిన్న ఆపరేషన్ చేశారు. (కోసి పడేశాడ్లే డాక్టర్). కట్టు కట్టిన వెంటనే బెంబాన్డంగా బౌలింగ్ చేసి చూసుకున్నాను. అయినా వింబుల్డన్ టైము కదా నెప్పి బాబోయ్! అంటూ వారం రోజులు బడి ఎగ్గోట్టాను. ఆ టైములో నాకు పగలు ఏమీ తోచదు. వింబుల్డన్ సాయంత్రమాయే. హైలైట్లు అంత ఎక్కువగా వచ్చేవి కాదు. బోరుగా ఉండేది. ఎంచేయ్యాలా అని తెగ ఆలోచిస్తే శరత్ ప్రాబ్లం గుర్తుకు వచ్చింది. వాడిని ఇంకా బడిలో వెయ్యలా, మాటలు సరిగా రాలేదని. వాడేమో ఇంట్లో తెగ గోల. ఒక మెరుపు మెరిసింది. వెనకాల బాక్ గ్రౌండ్ స్కోరు వచ్చింది. నేను ఇంక కార్య సాధకుడిలాగా నించున్నాను. శరత్ ఇటురారా అని పిలిచాను. వాడు వచ్చాడు. ప్రక్కనే ఉన్నా మా బాబాయి స్టూడెంట్ సీనుని పిలిచి శరత్ నోరు తేరు అన్నా. వాడు తెరిచాడు. సీనూ వాడి నాలిక మీద వేలు పెట్టి నొక్కు అన్నా. శీను నోట్లో వేలు పెట్టాడో లేదో శరత్ లటక్కున కోరికేసాడు. రంగు పడింది. సీనేమో మొర్రో అంటూ ఎడిచాడు. డిగ్రీకి వచ్చినా వాడివన్నీ సినేమాల్లో బ్రహ్మానందం లక్షణాలే. గగ్గోలు పెట్టాడు. అందరూ వాడి చుట్టూ చేరి పరామర్శిస్తున్నారు. కొంతమంది నన్ను తిట్టటం. ఇంతలొ శరత్ ఏడుపు లంకించుకున్నాడు. సందట్లో సదేమియాగా నేను వాడిని చెయ్యి పట్టుకుని మేడ మీదకి లాక్కు పోయాను. ఒర్ నువ్వు నోరు తేరు. నేను వేలు పెడుతా. కోరికావంటే నాలుగుకాళ్ళ బూచికి పట్టిస్తా! అన్నా. వాడు భయంతో ఒకే! అన్నాడు. నేను నాలిక మీద వేలు పెట్టి  అనరా అన్నా. వాడు యాజ్ యూజువల్  అనబోయాడు. కానీ నాలుక మీద బండరాయి లాగా నా వేలు ఉందిగా! క అన్నాడు. మళ్ళీ అనరా అన్నాను. క. తరువాత మళ్ళీ మళ్ళీ క. క. క. చెల్లికి మళ్ళీ పెళ్లి లాగా మళ్ళీ మళ్ళీ క.
ఇంతలో మమ్మల్ని తందామని మా బాబాయి మేడ మీదకి వచ్చాడు. క. క. క. క. క. ఇక పో! ఒకటే పుత్రోత్శాహం. నాకు ఎన్నాళ్ళ నుంచో ఊరిస్తున్న జీన్స్ ప్యాంటు కొని పెట్టాడు. నాలుగు రోజుల్లో వాడికి గ, ట, కూడా నేర్పించేశాను. మా పిన్ని వాణ్ని వెంటనే బడిలో వేసింది బతుకు జీవుడా అనుకుంటూ. (మాది ఉమ్మడి కుటుంబం).

పోస్ట్ స్క్రిప్ట్: హాలీవుడ్ నటి కీరా నైట్లీ అంత అందంగా ఉండటానికి కారణం ఏమిటి అనుకున్నారూ.....

ఇదంతా ఏన్షియంట్ హిస్టరీ. ఇప్పుడు "క" మాత్రమే కాదు. పెద్ద వాళ్ళకు కూడా పలుకసాధ్యం కాని కొన్ను శబ్దాలను కూడా సులభమైన పద్ధతిలో పలికించే మార్గాలు కనుక్కున్నాను. 

Thatz all. 

/bye


Read more...

Monday, September 5, 2011

Save the kid, చిన్నారిని బ్రతికించండి

ఇప్పుడే మెయిల్లో ఒక బ్లాగు టపా అందింది. నా బ్లాగు తప్ప ఇతరాలకు దూరంగా ఉంటున్న నాకు ఇదెక్కడి తలనొప్పిరా దేవుడా అనుకుంటూనే చూశాను. విషయం అర్థమయ్యింది. నాకు లింకు పంపిన వారికీ, అసలు విషయాన్ని అందరకూ తెలియజెప్పిన వారికీ కృతఙ్ఞతలు చెప్పుకుని, ఇటొచ్చాను. అప్పుడనిపించింది. Why not help reach the info to wider circles అని. అందుకే చిన్న ప్రయత్నం. ఇక్కడి బ్లాగు లోకంలోని వారందరకు దాదాపుగా తెలిసినా, నా బ్లాగులను ప్రత్యేకంగా చదివే వారుంటారు కనుక ఈ టపా.

వివరాలకు ఈ రెండు చోట్లా చూడండి...

http://www.help-prateek.blogspot.com/

http://vivaha-bhojanambu.blogspot.com/2011/09/blog-post.html

చేతనైనంతలో సాయం చెయ్యమని మనవి. వీలైనంత మందికి విషయాన్ని స్ప్రెడ్ చెయ్యమని మనవి.

ధన్యః


Read more...

Saturday, August 20, 2011

అణుయుద్ధం

 
/hihi
నువ్వూ
నేను
ఇకపై
మనం

దేశం
కోసం
సామాన్యుడి
పోరు

అణువంతేగా
అనకు
అణుయుద్ధం
తెలుసుగా

ఆధాటికి
అయినది
హిరోషిమా
స్మశానం
 /bye

Read more...

Tuesday, August 16, 2011

అన్నాను అరెస్ట్ చేసినందుకు వాపోతున్నాను!

!

అన్నా హజారే ని అరెస్ట్ చేసి మనందరమూ వాపోయేందుకు ఛాన్సిచ్చిన కాంగౌ వారికి, మరీ ముఖ్యంగా అమ్మ సోనియా సీతమ్మ తల్లి గారికీ, పేద ప్రజల ఆశాదీపం గారికీ, కృతఙ్ఞతలు తెలుపుకుంటూ... జగనన్న వాపోతున్నప్రజానీకాన్ని ఊరడించేందుకు ఓదార్పు యాత్రకు రావాలని డిమాం౨డు చేస్తూ... తెలుగు బ్లాగ్జనులెల్లరకును యంకితమిచ్చుచుంటిని...
:D

/bye

Can anyone suggest an action plan to counter that arrest? 

ఇప్పటికే బ్లాగుల్లోనూ ఫేసుబుక్కులోనూ వాపోవుడు చూసి, నేను కూడా మొదలెట్టేశాను. అసలే మా ఫ్రెండ్స్ (???) నీకు వాపోవటం రాదు కనుక నువ్వో సైకోవని అంటున్నారు. అందుకే నేను కూడా ఘాట్ఠిగా వాపోతున్నాను

Read more...

Saturday, August 13, 2011

ధోనీ, మరియూ క్రికెట్ దేvoodoo

Kapil brought the cup to India... 1983... Cricket world learnt to show Respect to Indian Team, at least at home matches.

Sourav beat Aussie juggernaut... 2001... World began to take India as a world beater.

Then came Dhoni phenomenon... 2007 T20 WC... IPL came into picture, and see what?2008 Dhoni and Sachin wanted rest for an important Sri Lankan tour.

2009 Sehwag injured. India lost T20 WC.

2010 Sehwag injured. Same to Shame.

2011 Sehwag injured. these SehWAGS are lookee what happened... :D

Blaming Sehwag is not the thing to do. He played like he always did. The Team must play to win, and must know the priorities. At least he can dash the opponents with his presence. Being partial deaf, and lost some of his sight made a mockery of him right now. Surely he will be to his elements soon. What about the cricket దేvoodoo? Pig shit. What about the others? Where is the inspiration to the team? Is this the team that won the WC?

Read more...

Friday, August 12, 2011

నీ ఉనికే అక్షరం, నీ ఙ్ఞాపకం నాకు వరం

మాటలకందని నీ మౌనమే నాకు చాలు
పై మెరుగులు చూపని నీవు 
కంటి కన్నా
మనసుని మురిపిస్తావు
గుండెని తట్టే నీ ప్రేమ
నా జీవితానికో క్రొత్త అర్ధం

నువ్విచ్చిన చిరు కానుకలు
మరపురాని తీపి గురుతులు
నీ ఊసులతో కవితలల్లను
నీ రూపు రేఖల చిత్రం గీయను
చెప్పనా నాకు
నీ ఉనికే అక్షరం
నీ ఙ్ఞాపకం నాకు వరం

RIP

Read more...

"అయ్యో వ్రత కథ" అనఁబడు స్కాంద పురాణమందలి అఙ్కోపరి ఖండము


/hihi

ఇవాళ వరలక్ష్మీ వ్రతం కదా! అప్పుడప్పుడూ ’అయ్యో రామా!’ అనుకొనెడి ఆడ పడుచుల కొఱకై...
కంపుటేరు/టైపురైటరు కీబోర్డు నందు (సినిమాల్లో ఆర్తీ అగర్వాల్ పెట్టుకునే నందు, నందిని అనే పేరుకూ, దీనికీ ఏ సంబంధమును లేదని తెలియజేయుటకు చిదానించుచుంటిమి) 

అనబడే (ఐ బడా/బడే అక్షరమే. ఎంత పొగరో దానికి. ఒహఠి లాగా ఉంటుంది. మరియూ ఇగో నకు సంకేతము. అసలైన ఇగో అయిన నేవిధమైన ఇబ్బందియు లేదు గాని, దాని యసలు యర్థము తెలియని వారికుండిన ఎన్నియో ఇబ్బందులు) అక్షరము ప్రక్కనే  అను మరియొక అక్షరము కలదు. కమ్ప్యూటరు వాడక సమయమున ఐ బదులు ఓ, మరియూ ఓ బదులు ఐ వచ్చిన ఇబ్బందులు గూర్చి పలువురు పలుమార్లు వాపోయి యుంటిరి.
అట్టి సమయమున మనిషి వెలువరించు భావమునకు సంకేత రూపమొహఠి కలదు. దాని గూర్చి తరువాత చర్చించెదము. 

మన తెలుగు భాష యందలి పదమయిన అయ్యో ఎటుల వచ్చెననిన... కమ్ప్యూటరు కీబోర్డు వలన. ఇది పలువురకు యాశ్చర్యముగ తోచినను, ఇది యదార్థము. నిక్కము. సత్యము. ఐ, మరియు, ఓ ల వల్ల సమస్య ఉత్పన్నమైనది కాన దానికి సంకేత నామముగ ఐఓ అని ఉంచితిరి. క్రమముగ నదియె (ఏ నది కాదు. ఉంచిన అదియె అని భవము) ఐయో గను, ఆ పైన జనుల నోళ్ళ యందు నాని క్రమముగ అయ్యో గ స్థిర పడెను. అప్పటి నుంచీ, సమస్యలేవి యైనను ఉత్పన్నమయినప్పుడు మనుజులు అయ్యో అని అనుచుంటిరి


స్కాంద పురాణము: అఙ్కోపరి ఖండము, 3:2

ఆతనిన్!

Read more...

మావాడూ పుట్టాడోయ్! :D

"I don't believe in fate or destiny. I feel that you just got to go out play and Win."

And how? With resound victories.

"People don't remember who came first, let alone the second They  remember only those who made their mark on their hearts."

How to make a mark on the hearts?

By being the BEST.

మావాడూ వచ్చాడోయ్...!
జరుగు జరుగు జరుగు...
మెరుపల్లే వచ్చాడోయ్...!
జరుగు జరుగు జరుగు...
దమ్మున్నా చిన్నోడోయ్...!
జరుగు జరుగు జరుగు...
దుమ్మూ దులిపేస్తాడోయ్...!

దులిపేశాడు కూడా.

ఇంతకీ ఎవరోడూ?

దిగ్గజాలున్నప్పుడు రంగంలోకి దిగాడు. ఎదిరించి నిలబడే ప్రత్యుర్థుల మధ్య నిలిచాడు. అందగాడు కాదు. అమ్మాయిల కలల రాకుమారుడు కాదు. ఆవేశపరుడసలే కాదు. గెలిచినప్పుడు పొంగిపోనూ లేదు. ఓడినప్పుడు కంట నీరొలికించి మెలోడ్రామాలూ క్రియేట్ చెయ్యలేదు. నేనింత వాడినీ, అంతవాడినీ అని హడావిడి చేయలేదు. లేదా? నాదేముందీ అని ఫాల్స్ హమ్బ్లిటీనీ చూపలేదు. కేవలం నేను గెలిచే వాడిని అని చెప్పి తన వాడిని పదేళ్ళ పాటూ చూపి, చివరిగా కూడా అన్ని ఆటంకాలనూ అధిగమించి తన సామర్థ్యాన్ని చాటి చెప్పి, తన వాళ్ళందరి ముందూ రిటైరయ్యాడు.

ఇంతకీ ఎవరతడు?

The One & Only PETE SAMPRAS

Heyy Pete! You are the King Man!

 Trademark shot this is...
Taken from net

W(ah) hat a serve!


King of Over Head shots


The Father, he is...

Read more...

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

Archiva

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP