Thursday, September 20, 2012

ఓయ్! డిటెక్టివ్ రాజు ఫ్రం మిస్సమ్మా, ఇదిగో నా ట్రిబ్యూటు నీకు: పదకొండు స్క్రీములు

ఇవాళ అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు. వైవిధ్యమైన పాత్రలు ఎన్నో వేశాడు. ఇలా అందరూ చెప్పుకుని పోతూనే ఉంటారు. ఇవన్నీ కాదు కానీ, నాకు నచ్చిన ఆయన పాత్రలు పది ఇక్కడ. ఎవరి కోసం? ఎవరికి వాళ్ళే డిసైడ్ చేసుకోండి.

1. డిటెక్టివ్ రాజు ఫ్రొం మిస్సమ్మ.

ఎంటీయార్, సావిత్రి అద్భుత ణటన, భాను మిస్డ్ చాన్స్, సంగీతం, రేలంగి కామెడీ... అనీ వదిలెయ్యండి. నేను మిస్సమ్మ చూసేది మటుకూ, నాగేశ్వరరావు పోషించిన డికెస్టీ పాత్రకోసమో, ఏఎం రాజా పాటలకోసమో చుస్తాను. ఆ హా2టూ, సావిత్రి సంగీతం నేర్పేప్పుడు చూసే కంగారు తింగరి చూపులూ, చివర్లో అసలు విషయం పసిగట్టెయ్యతం...

2. నా మొదటి, చివరి, ఏకైక జానపద రాకుమారుడు కాంతారావైనా కీలుగుర్రం లో నాగేశ్వరరావు పాత్ర కూడా బాగా నచ్చుతుంది. బహుశా సాయంత్రాలు నాన్న విధి అరుగు మీద ఒళ్ళో కూచోపెట్టుకుని చెప్పిన కథల వల్లనేమో. కీలుగుర్రమొకటీ, సువర్ణ సుందరి ఒకటీ చెప్పేవాడు. వినీ, వినీ, చూడాలని తపించి వీసీడీ తెప్పించుకుని మరీ చూశా. అంజలీదేవి సాఫ్టు పాత్రలకన్నీ, ఇందులోని విలనీ భలే నచ్చింది. తన అక్క దగ్గరకు నాగేశ్వరరావు వెళ్ళినప్పుడు లేఖ ఇవ్వటం, దాన్ని మరొక రాకుమారి మార్చి వ్రాయటం, ఆ రాక్షసి ఆ మారిన లేఖ చూసి అతన్ని ఆదరించతం... ఈ సన్నివేశాలు భలే ఉంటాయి.

3. ఇంకో సినిమా శ్రీకృష్ణార్జున యుద్ధం. కథ ఎలా ఉన్నా, మిగతా విషయాలు ఎలా ఉన్నా నాగేశ్వరరావు పెద్ద మునిగా వేసిన వేషం, అన్నియ్యా గారాలపట్టి బీ సరోజాదేవి తో రొమాన్స్ (వీళ్ళిద్దరు సుభద్రార్జునులంటే ఎవరు నమ్ముతారు? నా వరకూ అర్జునుడంటే సూపర్‌స్టార్ కృష్ణో, నర్తనశాలలో ఎన్‌టీయారో...), ఎస్ వరలక్ష్మి పాడిన ఒక పాట. తన శక్తికి మించిన పాత్రైనా సటుల్టీ తో నాగేశ్వరరావు నడిపించి మెప్పించిన తీరు పది స్క్రీముల పెట్టు.

4. ఆస్థి, అంతస్థులకు విలువ నిచ్చే తండ్రి బాధ తట్టుకోలేక ఇంట్లోంచీ పారిపోయే కుర్రాడిగా, తరువాత తిరిగి వచ్చి పరిస్థితులను చక్కదిద్దే బాధ్యతాయుతమైన వ్యక్తిగా, కృష్ణకుమారి (?) తో రొమాన్సు చేసే ప్రేమికుడిగా ఆ సినిమాలో నాగేశ్వరరావు "నిను వీడని నీడను నేనే" దయ్యం పాటనూ, దుమ్ము దులిపేసిన భానుమతి హుషారైన నటననో కాకుండా నా దౄష్టిని కేవలం తన మీదకే మళ్ళించుకున్నాడు. నువ్వంటే నకెందుకో అదో ఇది అని కూడా అనిపించుకున్నాడు. సినిమా పేరు చెప్పక్కర్లేదనుకుంటా?

5. తొండరడిప్పొడియాళ్వార్ పాత్రలో, మహా భక్తునిగా, ప్రేమికునిగా, విప్రనారాయనలో నాగేశ్వరరావు నటించ లేదు. జీవించాడు. ఒక సెల్ఫ్ ప్రొక్లెయిండ్ నాస్తికుడు అలాంటి పాత్రలో మెప్పించాడంటేనే ఈయన నటన గొప్పది అని ఒప్పుకోక తప్పలేదు నాకు. మా భానూ ఉంది ఎటూ. ఇక పాటలు మరీ మరీ వినాలనిపించేలా ఉంటాయి కూడా. సిక్కు కాని అద్భుతమైన క్లాసిక్కా సినిమా

6. పైన చెపుకున్న సినిమాలో ఎంతలా జీవించాడాంటే, భక్తుల వేషాలకు పేటెంటయ్యి సివరాఖ్రికి నాగార్జునకు కూడా ఆ పాత్రలలో నటించే అవకాశమొచ్చేలా చేశాడు. అంతేనా, బాపూ రమణల బుద్ధిమంతుడు లో అదే తరహా వేషకట్టు పెట్టుకున్నారంటే ఎంతబాగా చేశాడో మరి! ఇదిగో ఇక్కద చెప్పబోయేది బుద్ధి మంతుడు గురించే. అందరికీ తెలుసు, కోతి కొమ్మచ్చిలో చదివేశారు. చదవకపోతే కొనుక్కుని చదివెయ్యండి. నా వర్చువల్ స్పేస్ దండగ చేసుకోకుండా ఇంకో నంబరు లోకి వెళుతున్నా

7. ఎప్పుడన్నా డల్లుగా అనిపిస్తే దేవదాసు చూసి ప్డీ పడీ నవ్వుకుంటా. నా సంగతి సరే కానీ, దేవదాసుగా నాగేశ్వరరావు మాత్రం.... స్క్రీమో స్క్రీము

8. ఆ సినిమా చుసింది ఒక్కసారే అయినా చిన్నప్పట్లో కాలేజి బుల్లోడు లో అక్కినేని నటన ఎందుకో బాగా నచ్చింది. ఒక హుషారైన తాతయ్యను చూసిన ఫీలింగుండటం వల్లనేమో మరి.

9. మరో ప్రపంచం సినిమా లో ఆహ్! చెప్పనలవి కాదు. ఆల్రెడీ నవతరంగం లో వ్రాశాను. కావలంటే వెతుక్కుని చదవండి. లేదా అడిగిన వారికి లింకిస్తాను.

10. ఇద్దరు మిత్రులు లాంటి సినిమాలు కొన్ని ఉన్నా, నాకు ఈ మధ్య నాగేశ్వరరావు నటించిన ఈ సినిమానిక్కడ చేర్చాలనిపించింది. శ్రీరామదాసు నా దృష్టిలో చెత్తన్నర చెత్త సినిమా. దానికన్నా తిలక్ కథలే నయమనిపిస్తుందప్పుడప్పుడూ. ఆయినా దానిలో అక్కినేని పాత్ర నచ్చింది. అంత వయసులోనూ తనకన్నా దశాబ్దాలు తక్కువ వయసున్న వారుతో అంత హుషారుగా పోటీ పడి మరీ నటించాడంటే ఆ మాత్రం నచ్చొద్దూ. పైగా పాత్రను చెడగొట్ట లేదు కూడానూ.

11. చివరగా చెంచు లక్ష్మి. శ్రిమహావిష్ణువగా ఫర్లేదనిపించినా, చెట్టులెక్కే నరహరి గా బాగా అలరించాడు.

అదన్నమాట సంగతి. మొత్తానికీ నా ట్రిబ్యూటు ఇచ్చేశాను. పైగా పెద్ద డెప్తున్న వ్యాసం కాకుండా జాగ్రత్తపడ్డానుకూడానూ.

Read more...

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP