Tuesday, August 2, 2011

అయిబు పాడిన అమ్మ పాట


Once again my Aiibu story, before going for a sequel...

పండు వెన్నెల 

ఆ పిల్లలిద్దరూ చెరువు ఒడ్డున కూచున్నారుఒక బల్లఆ బల్ల మీదిద్దరూదేనికోసమో ఎదురుచూస్తున్నట్లున్న ఆ పిల్లల కళ్ళలో తెలియని వేదనముద్దులొకికే చిన్నారుల వదనమ్ముల వేదన గాంచలేని వెన్నెల రాజు మబ్బు చాటున దాక్కున్నాడునీళ్ళలో అలికిడిఇసుక తెన్నె మీద పిల్ల తెమ్మెరలు.ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో అంత విషాదమైన వదనాలతో ఎవరా పిల్లలుఅడిగిందొక చేపఎవరో మరినాలుగు రోజులుగా ఇక్కడే కూచుంటున్నారుఅంది రెండో చేపఒక్కసారి గాల్లోకెగిరి చూసిందా మొదటి చేపకిలకిలా నవ్విందా పిల్లకేరింతలు కొట్టింది.

ఆ పిల్లడు లేచి గంతులేశాడుఎగిరిన చేప కాసేపలా గాల్లోనే నిలిచిపోయిందిఆశ్చర్యంతో.
*** *** ***

చిమ్మ చీకటి 

ఏవో గుసగుసలు వినిపించటంతో హితైషి లేచి కూచున్నాడుఏమిటా అని చెవులు రిక్కించి వినసాగాడుఅమ్మనాన్నాదేని గురించో మాట్లాడుకుంటున్నారు.
నాన్న ఏదో చెప్తున్నాడుఅమ్మ గొంతు ఆతుర్దాగా ఉంది. "అలా ఎలా?" అంటోంది అమ్మ. "ఎలా అయినా సరే తప్పదు మరిఇది జరిగి తీరాలిఆ రెండు చేపల్నీ చంపి వాటిని అమ్మేయాల్సిందేలేందే మనకు డబ్బులు దొరకవుదీపావళి జరుగదు."

"అయ్యో మరి అవి మన పిల్లలు పెంచుకుంటున్నవి కదారోజూ సాయంత్రాలు వాటికి మేత పెట్టి ఆడుకుంటారుపాపం దూర తీరాలనున్న దీవుల్ని చూడాలని మన వాడి ఆశఆ చేప పెద్దదైతే దాని వీపు మీద కూచుని అవన్నీ చూసి రావాలని ఎన్ని సార్లంటుంటాడో కదా."

ఎక్కడో వాన వాసనమెరుపులు మెరిశాయిహితైషి హతాశుడయ్యాడు. "నా చేప పిల్లని నాన్న చంపి అమ్మేసి ఇంట్లో దీపావళి జరుపుతాడాపండుగంటే మాకిష్టం.కానీ మా చేప పిల్లల్ని చంపేస్తే ఎలాపాపం చిన్న చిన్నవివాటిని చంపి మాకు పండుగ చేస్తే మరి వాటి కోసం పండుగ చేస్తారు?"
*** *** ***

విపరీతమైన ఎండ.

మధ్యాహ్న భానుడు జరిగిన ఘోరాన్ని చూశా అన్నట్లు ఆవేశాన్నంతా భూమి మీద తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడుశ్రద్ధ మొహం చేతులతో కప్పుకుని ఏడుస్తున్నదిఅన్నయ్యకి విషయం చెప్పాలి.ఎలా చెప్పాలివాడూ తనలాగే చిన్న వాడే కదాఎలా తట్టుకుంటాడుకానీ ఎలాగోలా తెలుస్తుంది కదా.నాభి దగ్గర నుంచీ దు:ఖం పొంగుకుని వస్తుంటే ఇసుకలోనే కుప్పకూలిపోయిందిబోర్లా పడుకుని రోదిస్తోంది.కన్నీళ్ళూ ఇసుకలో ఇంకిపోయినైనోట్లోకి ఇసుక పోతున్నా తెలియని దు:ఖంవళ్ళు మాడిపోతున్నా పట్టించుకోలేనంత దు:ఖం.
*** *** ***

జోరున వాన

టపాకాయలన్నీ తడిసిపోయాయినాన్న వళ్లంతా తడిసిపోయిందిపిల్లల కోసం తెస్తున్న టపాసులన్నీ తడిసి ముద్దైపోయాయిపిల్లల కోసంపిల్లల కోసంపిల్లల... ఊపిరాగిపోతున్నంత బాధ.అసలు పిల్లలు ఈ రెండు రోజుల్నుంచీ ఎందుకలా ఉన్నారువాళ్ళ సంతోషం కోసమే కదా తను ఈ టపాసుల్ని తెచ్చిందిపండుగ జరగదనే భయమాచేపల్ని చంపి అమ్మేశనని బాధాపండుగ జరుగదనే భయమైతే ఇప్పుడు అన్నీ తీసుకొస్తున్నాడుఇంక ఇవి చూసి కేరింతలు కొడతారువాళ్ళ కళ్ళలో ఆనందమే కదా తనకీ అతివకీ కావాల్సిందీ?

మరి అదే చేపల్ని చంపి అమ్మేశానని బాధాఅలా అయితే ఈ టపాసుల్ని చూపి ఎలాగన్నా వాళ్ళ బాధను రూపుమాపొచ్చుకానీకానీ... ఇప్పుడివన్నీ... అటు చేపలూ పోయి ఇటు పండుగకు తెచ్చినవన్నీ వాన పాలయి... ఏమి ఆలోచించాలో తెలియని పరిస్థితిఇంతలో దాటుతున్న కాలువ పోటెత్తిందిమొండిగా దాటేద్దామని అడుగు ముందుకేశాడుకుడికాలు పెట్టి ఎడమకాలు ఎత్తాడోలేదో...
*** *** ***

విపరీతమయిన గాలి 

విసురుగా వీస్తోందిచితి మంటల్లోని బూడిద ఎగిరొచ్చి అతివ కళ్ళలో పడిందిఇది కన్నీరాలేక కళ్ళలో పడిన బూడిద వల్ల వచ్చిన నీరాభర్త పోయాడుపిల్లల బాధ వర్ణనాతీతంనాన్న కోసంపోయిన చేపల కోసంతను దైవంగా భావించిన భర్త ఒక వైపు తనను వంటరి దాన్ని చేసిపిల్లలు దిగులుగా మరో వైపువారినెలా తను సాకాలిడబ్బు లేదుతోడుగా భర్త లేడు.

ఈదురుగాలికి ఆమె జుట్టు ఎగిరి ఎగిరి పడుతోంది. "దేవుడాఈ దు:ఖాన్ని నేను భరించ లేనుఏమి తప్పు చేశానని నాకీ శిక్షనీకేం కావాలిఎందుకిలా మమ్మల్ని వేధిస్తున్నావునన్ను తీసుకుని నా పిల్లల్ని సంతోష పరిచేలా ఏదన్నా చెయ్యి.మనసులోనే గొంతెత్తి అరిచింది.

ఆ రాత్రికి పిల్లలు ఏడుస్తూనే ఉన్నారుఎలాగోలా వారినూరడించే ప్రయత్నం చేస్తూనే ఉందిగానీ పిల్లలు కదా.ఒకరాత్రి వేళకు ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారికళ్ళ క్రిందాబుగ్గల మీదా కన్నీటి చారికలుఅతివ లేచిమ్ది.ఒక్కసారి పిల్లలని ముద్దాడాలనుకుంది. " ఎలాగూ ఈ బంధనాలని త్రెంచుకుని పోతున్నానునన్ను తీసుకునైనా ఆ దేవుడు నా పిల్లలకు మంచి జీవితం ఇవ్వక పోతాడాఅన్నీ వదులుకున్నాక ఇక ఇది మాత్రం ఎందుకు?" తన కోరికని అణచుకుని చెరువు వైపు అడుగులు వేస్తున్నదిగాలింకా వీస్తూనే ఉంది.
*** *** ***


మంచు 

విపరీతమైన మంచుదారంతా పరుచుకుందిపొడూగ్గా నల్లటి కొటేసుకున్న మనిషి నడుస్తున్నాడు.అతని వెనుక ఒక పొట్టి మనిషిచేతిలో వేట కొడవలుందిమీద పడుతున్న మంచు తునకల్ని దులుపుకుంటూ వెనక్కి తిరిగి అరిచాడు. "ఏహోయ్పాటేసుకోరా అయిబూ!" అతని స్వరం ఖంగు మనేలా ఉందిఒకరకమైన గాంభీర్యంఒకరకమైన పొగరుతనే సర్వంహసహా అన్నట్లు.


"కాళ్ళుకాళ్ళు మంచులో కూరుకున్నాయికాస్త లేవదియ్యి దొరా," సాయమడిగాడా పొట్టి వ్యక్తి.

"హోరినీబరువెక్కువఎత్తెక్కునాకాళ్ళే కూరుకోలేదునీకాళ్ళాపొట్టోడివిబరువు తక్కువ."

"అట్టగాదులే దొరానీపాటి బలం లేదు నాకుకాస్త సాయమందివ్వు దొరాపాటేసుకుంటానుగానీ." ఆ మనిషి అటువైపు వెళ్ళి జుట్టు పట్టుకుని ఒక్క లాగు లాగాడుఅంతేపొట్టి మనిషి మంచులోంచీ బయట పడ్డాడు. "నా బూటులిస్తానుగానీ వాటినేసుకోఇవైతే మంచులో దిగబడవు."

"మరి నీకెట్టా దొరా?"

"ఉహూరుకొహోరా పొట్టోడా!" పెద్దగా నవ్వాడా మనిషిఆ నవ్వు ఆ అడవంతా ప్రతిధ్వనించిందిఅంతే!మంచు కురవటం ఆగిపోయిందిచుట్టూ ఉన్న చీకట్లు చెదిరిపోయి వెలుతురు పరచుకుందిఅతను నవ్వుతూనే ఉన్నాడుఆ పొట్టి వ్యక్తి పాటందుకున్నాడుఆ నవ్వూపాటా శృతిగలిసి...
*** *** ***

హోరు గాలి

దుమ్మురేగుతోందివాతావరణమంతా చిందర వందరగా ఉందిహితైషిశ్రద్ధా అమ్మకోసం వెతుకుతున్నారు పొద్దున్నుంచీఎక్కడా కనబడదేఎక్కడని వెతకాలిఎవరినని అడగాలివెతుకుతూనే ఉన్నారుకనపడ్డ చెట్టునడిగారుపుట్టనడిగారు. రాళ్ళనడిగారురప్పలనడిగారుమనుషుల్నడిగారు.బంగారు రంగు ఛాయతోనీలం రంగు చీరెలో పొడుగాటి ఆవిడనెక్కడన్నా చూశారా అనిఎవరూ చెప్పలేదు.వీళ్ళకి సాయంత్రమైనా దొరకలేదుముక్కునోళ్ళలో దుమ్ము పడకుండా రుమాలు నడ్దం పెట్టుకుని దగ్గరలో ఉన్న సావిడిలోకి పరిగెత్తారు. "అన్నయ్యాఆకలౌతోందిరా," శ్రద్ధ అంది.
*** *** ***


దబా దబా పడుతోంది వాన 

ఆ పొడుగాటి మనిషి రెండు భుజాల మీదా ఇద్దరు పిల్లలువెనక్కి తిరిగి పెద్దగా అరిచాడు. "ఏహోయ్నాలుగు దుంపలేవన్నా దొరికితే పట్టుకురారా అయిబూ." ఆ కేకకి పిల్లలిద్దరూ కళ్ళు తెరిచారుమగతగా చుట్టూ చూసికళ్ళ మీద పడుతున్న చినుకుల్ని తుడుచుకున్నారు. "మే... మే...మెక్కడున్నాంనువ్వెవరు?" ఇద్దరూ కాస్త భయంతోనూమరికాస్త ఆశ్చర్యంగానూ అన్నారు.

అతను బదులివ్వలేదుఓ నాలుగంగల్లో ఎదురుగా ఉన్న రాతి మేడలోకి దారి తీశాడువాళ్ళనిదరికీ తన కోటులోంచీ రెండు తువ్వాళ్ళు తీసిచ్చితుడుచుకుని కట్టుకోమన్నాడుశ్రద్ధ ప్రక్కనే ఉన్న గదిలోకి వెళ్ళింది.హితైషి అక్కడే తుడుచుకునిదాన్ని కట్టుకున్నాడు. "ఏం పిల్లా భయమేయటంలాసాయం కావాలా?"అడిగాడా మనిషి. "ఊఁ..." నీరసంగా అందిలోపల ఒకమ్మాయి ప్రత్యక్షం అయింది. "ఇటురా పిల్లానేను తుడిచి కడతాను," అందిశ్రద్ధ ఆ గుడ్డను ఆ అమ్మాయికిచ్చిందిపనయ్యాక "ఓహ్నాంగవయంతి," అందా అమ్మాయిఅంతే మాయంశ్రద్ధకివేమీ పట్టేలా లేదుఅంత సమయాన్ని కూడా ఆ మనిషివ్వలేదు. "అన్నం తిందువు రా పిల్లా," పిలిచాడుకలిపి గోరు ముద్దలు పెడుతూ వారి కథంతా విన్నాడు.
*** *** ***


ఎర్రని ఎండ 

చెమట్లు కక్కిస్తోందిఆ పొడుగాటి మనిషి ఒక చెట్టుని కొడుతున్నాడుఇల్లు కట్టటం కోసం. "ఏహోయ్గొడ్డలి పిడిరిగిందిమరో పిడి పట్రారా అయిబూ." చెమట్లు కారిపోతున్నాయికాస్త దూరంగా హితైషీశ్రద్ధా ఆడుకుంటున్నారుదిగులుగ్ కూచుంటే ఊరుకోనని చెప్పాడా మనిషి మరికుడిచేతి బొటన వేలితో నుదుటనున్న చెమటను తీసివిదిలించాడుఅంతేఅక్కడంతా చాలా ఖాళీ స్థలమొచ్చిందిచేతులు ఝాడించి వళ్ళు విరుచుకున్నాడుఅక్కడో మేడ ప్రత్యక్షమయిందితల విదిలించాడుచెమట చుక్కలు ఎగిరెళ్ళి కాస్త దూరాన పడ్డాయిచిత్రం అక్కడో చెరువుదాని ముందు ఒక బల్లపిల్లలిద్దరూ ఆశ్చర్యంతోనూ,ఆనందంతోనూ చూస్తున్నారుఇంతలో ఆ పొట్టి మనిషి వచ్చాడురెండడుగులెత్తున ఆ పొట్టి వ్యక్తి, "నాకు తెలుసులే దొరనువ్వు దేవుడివిఎప్పుడు కావాలనుకుంటే అప్పుడది చేస్తావునడుమ నడుమ ఆటలాడుతావు బొమ్మలతో."

పెద్దగా నవ్వాడా పొడుగాటి మనిషి.చుట్టు ఉన్న చెట్ల నుంచీ పూలొచ్చి అక్కడ వానలా కురిశాయి.
*** *** ***

కన్నుపొడుచుకున్నా కనబడని చీకటి

"ఏహోయ్కొవ్వొత్తి పట్టుకురారా అయిబూ," అరిచాడా పొడుగాటి మనిషి.
 
"అంటే నువ్వు దేవుడివన్న మాట!" కళ్ళు త్రిప్పుతూ అంది శ్రద్ధ. "అవును." సమాధానం వచ్చింది. "మరైతే మా అమ్మ ఎక్కడుందో చెప్పవూ?" ఆశగా అడిగాడు హితైషికోటు సవరించుకుంటూ, "మరైతే మీరు ఏడ్వనంటేనే..." విషయం కాస్త గ్రహించింది శ్రద్ధఏడుపు తన్నుకొచ్చిందిపరిగెత్తుకెళ్ళి ఆ పొడుగాటి మనిషి కాళ్ళు చుట్టేసింది. "నాకమ్మ కావాలినాకమ్మ కావాలి." అడుగుతూనే ఉంది. "మరదే నేను చెప్పింది.నువ్వేమనుకుంటున్నావునా దగ్గరే ఉందిక్షేమంగామీకోసమే నా దగ్గరకొచ్చింది."


"మరైతే మా అమ్మని మాకిచ్చేయ్."

"కుదరదమ్మా."

"ఏంఎందుకు కుదరదునాకు అమ్మ కావాల్సిందే."

"మీ అమ్మ చనిపోయింది కదా?"

"అంటే చనిపోయిన వాళ్ళే నీ దగ్గరకొస్తారా?"

"అవును."

"అంటే మేము కూడా చనిపోయామా?"

"అదేమిఅలా అన్నావు?" నవ్వాడుశ్రద్ధ నెత్తుకుంటూ.

"మరి మేమూ నీదగ్గరకే వచ్చాముగా!"
"కాదు కదానేనే మీ దగ్గరకొచ్చాను."

"మరి మా నాన్న?" ఈసారి హితైషి అడిగాడు.

"మరి మీ నాన్న కూడా మీ అమ్మలానే."

"ఒక్కసారి అమ్మనాన్నలని మాకు చూపించవూ?" జాలిగా అడిగాడు హితైషి. "ఊఁ..." వంత పాడింది శ్రద్ధ.

"నేను చూపిస్తానుకానీ వాళ్ళకి మీరు గుర్తుండరే..."

"అదేమి?" ఇద్దరూ ఒక్కసారే అడిగారు." వాళ్ళు నా దగ్గరికొచ్చాక మళ్ళా ఇక్కడి విషయాలు గుర్తుండవు."చెప్పాడా పొడుగాటి మనిషి. "మరి నువ్వెందుకు మాకోసం వచ్చావువాళ్ళకి గుర్తుండేది ఇక్కడ ఉన్నంత వరకే కదామా అమ్మ మాకోసం ఆలోచించేది ఇక్కడున్నంతసేపే కదామరి ఇక్కడున్నప్పుడు అడిగినది వాళ్ళకు గుర్తుండనప్పుడు నువ్వు కష్టపడి మాకోసం మంచులోవానలోఎండలో ఎందుకొచ్చావు?" హితైషి అడిగాడు.

ఆ పొడుగాటి మనిషి నవ్వాడుచీకటి పోయి వెలుగొచ్చిందిచక్కని సువాసనలు చుట్టుముట్టాయి. "ముచ్చటైన ప్రశ్నమీ అమ్మ వేరే ఊరికెళ్తూ నీకో పనిచెప్పిందనుకోఅమ్మ లేదు కదాను నువ్వా పని ఆపేస్తావా చేయటం?"

"ఉహూఁఅమ్మ చెప్పిన పనేదైనా చేస్తాను నేనుఉన్నా లేకున్నా."

"నేను కూడానేను కూడా చేస్తాను దేవుడూ!" ముద్దు మాటలతో అంది శ్రద్ధ.

"మరి నేనూ అంతే పిల్లలూఅమ్మ చెప్పిన పనేదైనా చేస్తానుఅమ్మ చనిపోయే ముందునన్ను తీసుకుని నా పిల్లల బాగు చూడు," అందిఅందుకే వచ్చాను నేను మీ కోసం."


"అంటే అమ్మ చెప్పినదేదైనా చేస్తావాదేనికిమరి నీ అమ్మ ఎవరు?" శ్రద్ధ అంది.

"అమ్మ చెప్పినదేదైనా అంటే చేయదగినదేదైనా చేస్తానుేయరానిదేదీ చేయనునాకు అమ్మ లేదు."

"మరి అమ్మ లేకుండా నువ్వెలా పుట్టావు?"

"మీ అమ్మను పుట్టించింది నేనునాకు అమ్మ లేదునేనసలు పుట్టలేదుఅయినా నీకు ఇప్పుడు అర్థం కాదులే శ్రద్ధాచెప్పాల్సొచ్చినప్పుడు చెప్తాను."

"అవునుకొన్ని విషయాలు మాకు అర్థం కావుచిన్న పిల్లలం కదాఅమ్మ కూడా చెప్పాల్సొచ్చినప్పుడు చెప్తాను అనేది," హితైషి అన్నాడు.

"సరేలే దేవుడూనువ్వు మాకోసం వచ్చావుమాకిక భయం లేదుకానీఅమ్మకి మేము గుర్తు లేకున్నా మాకు అమ్మ గుర్తుంది కదాఒక్కసారి చూపవూ?"

"అయ్యోనీకెలా చెప్పనమ్మానువ్వు మీ అమ్మను చూడాలంటే నువ్వు కూడా చచ్చిపోవాలి."

"ఐతే నన్నూ చంపేయ్," చేతులు పైకెత్తి అదేదో పెద్ద ఘనకార్యం అన్నట్లు అందిదేవుడు పెద్దగా నవ్వాడు."నువ్వు నాతో వస్తే నువ్వు కూడా ఇక్కడి సంగతులు మర్చిపోతావుఅసలు మీ అమ్మని నువ్వే గుర్తుపట్తలేవుఇక నువ్వు నాతో వచ్చుపయోగమేముంది?" ఇంతకు ముందు చావు అన్న మాటనన్న దేవుడా మాట ఈసారి వాడదల్చుకోలేదుతనతో రావటమన్నాడు.

శ్రద్ధ బిక్క మొహం వేసింది. "అంటే అమ్మనికెప్పుడూ చూడలేనా?" ఏడుపు గొంతుతో అంది. "ప్లీజ్ దేవుడూ.నువ్వు ఏదైనా చేస్తానంటావుఅన్నీ నేనే అంటావు కదాప్లీజ్ దేవుడూఒక్కసారి అమ్మని చూపవూ." గడ్డం పట్టుకుని బ్రతిమిలాడుతున్నట్లందిదేవుడు చిరునవ్వు నవ్వి అన్నాడు. "అమ్మనడిగావు సరేమరి నాన్న?మీ చేప పిల్లని చంపాడని కోపమా?"

"ఛీ లేదు దేవుడూఅమ్మెప్పుడూనాన్న పక్కనే ఉంటుందిఅందుకే అడగలేదునాకు నాన్న మీద కోపం లేదు దేవుడూప్లీజ్ దేవుడూఒక్కసారి అమ్మను చూపు దేవుడూ." ఏడుస్తూచేతులతో గుండెల మీద కొడుతూ అడుగుతూనే ఉందిఅది చూసి హితైషికి కూడా ఏడుపొచ్చింది.

దేవుడికి నవ్వొచ్చింది. "ఆహా పిల్లలుఎన్నిచ్చినాఆఖరికి నేనొచ్చినా అమ్మే కావాలంటారు కదా."

పెద్దగా కేకేశాడు. "ఏహోయ్అయిబూఇల్లారా!"

అయిబు పరిగెత్తుకుని వచ్చాడు. "ఒక పాట పాడవోయ్." "ఏం పాట దొరా?" "నీకు నచ్చిందేదైనా సరే." "చిత్తం దొరా." అమ్మ పాడే జోల పాట పాడాడుఒక మెరుపు మెరిసిందిచలటి గాలి వీచింది.

"మీ అమ్మా నాన్నా వస్తున్నారుకానీ కాసేపేమీకోసం రప్పించానునా కోసం కాసేపట్లో పంపేయాలి,"దేవుడన్నాడు.

"సరేఅని ఇద్దరూ బుద్ధిగా తలూపారుఆ మెరుపులోంచీ అమ్మనాన్న దిగొచ్చారుఇద్దరూ నిర్వికారంగా చూస్తూ నిలబడ్డారు. "అమ్మ!" అంటూ ఆత్రంగా వెళ్ళబోయింది శ్రద్ధకానీ ఆమె మొహంలోని నిర్వికారతను చూసి బిక్క మొహం వేసిందిదేవుడు నవ్వుకున్నాడుచెప్పినా ఈ పిల్లలకు అర్థం కాదని. "శిశూనాం మాతృ ప్రాప్తి:" అని నవ్వాడువాళ్ళిద్దరికీ పుర్వ ఙ్ఞాపకం వచ్చిందిఅతివ చేతులు జాపి పిలిచిందిప్రేమగా.ఇకాగలేదు శ్రద్ధపరిగెత్తుకుని వెళ్ళి మరీ చంకనెక్కిందిహితైషి నాన్న భుజానెక్కాడుకాసేపు వారలా ఉండగా దేవుడుఅయిబూ ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకున్నారు. "వాళ్ళకు నన్ను గూర్చి చెప్పిందే అమ్మ కదాగురువెప్పుడూ గొప్ప అని నేను చెప్పే కదా గురు పరంపరను మొదలిడిందిఅమ్మే ఆది గురువు మానవులకు," దేవుడన్నాడు.

శ్రద్ధ అమ్మ చంకన నుండి దిగి దేవుడి దగ్గరకొచ్చింది. "దేవుడూనన్నెత్తుకోవూ?"

దేవుడు రెండు చేతులూ పట్టి లేపి భుజానేసుకుని మిగిలిన ముగ్గురి వైపూ నడిచాడు. "దేవుడూఅడగ్గానే అమ్మనీనాన్ననీచూపావుసరేనువ్వన్నట్లే వాళ్ళని పంపెయ్యి." దేవుడు నవ్వాడువాళ్ళ నిజాయితీకి.వాళ్ళను సాగనంపాడు"రేపటినుంచీ మీరు ఆ కొత్త ఇంట్లో ఉండండిమీకు కావలసినవన్ని అందులో ఉన్నాయినేను కనబడకపోయినా ఎప్పుడు పిలుస్తే అప్పుడొస్తానుమీకో చిన్న బహుమతిమీ నిజాయితీకి."మీకోసం చెరువులో చేప పిల్లలుకానీ ఎప్పుడొస్తాయనేది మాత్రం చెప్పనుఒక చిన్న షరతుఇకపైన మీకంట నీరొలక కూడదుభయం ఉండకూడదుదేనికీ అశక్తత పనికిరాదుసరేనా?"

వాళ్ళిద్దరూ సంతోషంగా నవ్వారు.
*** *** ***

పండు వెన్నెల

అలా గాల్లో ఉన్న చేప మళ్ళా నీళ్ళలో పడ్డదిపిల్లలిద్దరూనీళ్లలోకి పరిగెత్తారుఏయ్ చేపలూ మీరు మాకోసమేనేనూ అన్నా మనం పెద్దయాక దేశాలన్నీ చూడాలిసరేనా?" అరుస్తోంది శ్రద్ధ సంతోషంగా.అప్పుడే టపాసుల మ్రోత మొదలైందిమన నల్ల కోటు దేవుడు ఆ సమయంలో తెల్ల కోటేసుకుని ఆనంద తాండవం చేస్తున్నాడు తన దేవేరులతోఆరోజు కార్తీక పున్నమి.

అయిబు పాడుతున్నాడు...

ఎచటనైతే భయముండదో...
ఎచటనైతే కంట నీరొలకదో...
ఎప్పుడైతే ప్రపంచంలో అసత్తువుండదో...
ప్రేమైక జీవనం వర్ధిల్లు సమయాన
సృష్టి అందం ఇనుమడిస్తుంది.

3 comments:

Shiva Krishna August 3, 2011 at 12:44 AM  

excellent బ్రదర్.. ఎంత అద్భుతంగా రాసావు.. మొదటి లైన్ నుండి చివరి లైన్ దాకా చాలా ఇంటరెస్ట్ తో చదివాను ,, ఆనందము గా ఉండాలి ఎల్లప్పుడూ ,ఏది దూరమయిన గాని.. కాన్సెప్ట్ చాలా కొత్తగా బాగా చెప్పావు.. సో నైస్..

Unknown April 22, 2013 at 11:34 AM  

ఏదైనా కథ లో పదాడంబరాలు, దృశ్య వర్ణనలు లేకున్నా కథ కథనం తో మెప్పిస్తూ ,మెల్లిగా ఆసక్తి రేకెత్తిస్తూ వాక్యాల వెంట పరిగెత్తించగలిగితే ,కాసిన్ని రోజులు పాఠకుడు ఆ కథ ఫీల్ లో ఓలలాడుతాడు,చదివి దాదాపు వారం రోజులైనా ఒక చిన్నకథ నన్ను ఇంకా వెంటాడుతోంది,కథకి కొనసాగింపుగా ఒక నవల రానుంది అని తెలిసి అది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా..చాలా బాగుంది GitacharYa vedala...

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

Archiva

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP