దర్శకుడు శ్రీనివాస్ ను పాతాళానికి చేర్చిన రచయిత త్రివిక్రమ్
లొల్లాయి చొల్లాయి, త్రివిక్రమ్ జులాయి
------------------------------------
ఇంగ్లీషు సినిమాలంటే అవేవో చిత్రాలన్న దశలో మా గురువు గారు జేమ్స్ కే౨మెరాన్ టెర్మినేటర్ చూశాక చెదిరిపోయి, కాస్తో కూస్తో ఆంగ్ల సినిమాలను చూడనిచ్చారు, చూడటం మొదలెట్టారు ఇంట్లో. ఆ దశ కొన్నాళ్ళకు ముగిసి పూర్తి స్థాయిలో ప్రపంచ సినిమా చూడబోయే ముందు అప్పుడప్పుడూ తెలుగు డబ్బింగ్ ఆంగ్ల సినిమాలు చూసే రోజుల్లో వచ్చిన చిరునవ్వుతో చూసి అబ్బ ఎంత గొప్ప సినిమా అనుకున్నా. దర్శకుని చాతుర్యానికి మురిసిపోయా... ఎంత మంచి సినిమా తీశాడని. త్రివిక్రమ్ అన్న పేరున్న (గొప్ప పేరు అని కాదు) రచయిత చక్కని మాటలు వ్రాశాడని. ఇంకా గమనించగా, గమనించగా ఇతనే ఆ మధ్య కాలంలో నాకు నచ్చిన సినిమాలకు కథా, మాటల్లాంటివి అందించాడని.
కొద్దిరోజుల్లోనే ఇతనే దర్శకునిగా నా అభిమాన నటుడు (హీరో కాదు) తరుణ్ హీరోగా సినిమా వచ్చింది. నువ్వే నువ్వే ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదు. ఆ రోజుల్లో నేను సినిమాలు చూసేది చాలా తక్కువ. అలాంటప్పుడే ఓ పదిసార్ల పైన (అంటే ఏ సార్ల మీదా పడి వాళ్ళిచ్చిన డబ్బులతో చూశానని కాదు. ఓ టెన్ టైమ్స్ చూశానని) చూశాను. చాలా నచ్చింది. మధ్యలో కొన్ని ఎపిసోడ్లను వదిలేస్తే సినిమా చాలా గ్రిప్పింగా ఉంటుంది. పాటలు బాగుంటాయ్, కథా కొట్టుకొచ్చిందైనా చాలా బాగుంది. మాటలు తూటాల్లా పేలాయ్. నటీనటులు వాళ్ళ వాళ్ళ పరిథిలో బాగా చేశారు. తరుణ్, ప్రకాష్ రాజ్ అయితే తారాస్థాయికి చేరారు (పాపం ఆ తరువాత ప్రకాశరాజుడు అక్కడే ఆగిపోతే, తరుణ్ బాబు దిగి'పోయాడు' కూడా :P). ఆ పాత్రల్లో వాళ్ళను తప్ప వేరొకరిని ఊహించికోలేము. కాకాపోతే ఈమధ్య చూస్తుంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే దర్శకుణ్ణి త్రివిక్రమ్ అనే మాటల రచయిత మూడో అడుగులోకి తీసుకున్నాడని. అయినా ఫర్లేదు. కాస్తో కూస్తో బా౨లెన్స్ అయిందనిపించేలాగానే ఉందనిపించింది.
తరువాత అప్పట్లో నా ఫా౨వరిట్ నటుడు/హీరో మహేష్ (సూపర్‍స్టార్ కృష్ణ కొడుకు కదా. మురారి, ఒక్కడు హాం౨గోవరు నడుస్తోంది) మహేష్ తో action film చేస్తున్నాడనగానే ఒక రేంజిలో అంచనాలు పెరిగిపోయాయి. అందులోనూ మురళీ మోహన్ సంస్థ కదా. నిర్ణయం లాంటి సినిమాలు (నాకు తెలిసి) తీశాడాయెనూ. ఎంత నెగటివ్ టాక్ వచ్చినా ఏదో మా౨జిక్ జరిగి సినిమా భలే ఉందే అనిపించింది. ఎంత కాపీ అయినా చివరి ఫైట్ ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు అనిపించేలా ఉంది. పాటలూ, కామెడీ, ఈ మధ్య కాలంలో వచ్చిన వనాఫ్ ద కంప్లీట్ పా౨కేజ్. కానీ ఎక్కడో తేడా. ఎక్కడ?
అప్పుడొచ్చింది 'జల్సా' జల్Saw. నా అంచనాల్నీ, అభిమానాన్నీ సా/రంపం పెట్టి కోసి పడేసిన సినిమా. పవన్ కళ్యాణ్ సినిమా కాకుంటే, రెండు సార్లు పవన్ తన లవ్ గురించి ప్రకాశ్ రాజ్ కు చెప్పే సీన్లు లేకుంటే, దేవిశ్రి ప్రసాద్ ముజిక్ మా౨జిక్ లేకుంటే ఏమాత్రం భరించలేని సినిమా అది. మాటల రచయిత త్రివిక్రమ్ దర్శకుడు శ్రీనివాస్ ను భూమి క్రింద ఓ రెండు లోకాల క్రిందకు తొక్కేశాడనిపించింది. ఆ బాంబు బ్లాస్ట్ సన్నివేశం తప్ప (ఏమాటకామాటే. అది అద్భుతం. అలాగే విలన్ ఇంట్రడ్యూసింగ్ సీన్ కూడా బ్రహ్మాండం) ఎక్కడా దర్శక మెరుపులు లేవు.
ఇక్కడే ఇంకో ప్రమాదమ్ ముంచుకొచ్చి పడింది. నవతరంగంలోకి ఎన్తర్ ద ద్రాగన్. అంటే నేనే అన్నమాట. సెప్తెమ్బరు పదకొండున (ఆరోజు స్పెషాలిటీ తెల్సుగా) లెగ్గెట్టి. క్రమమ్గా వ్రాతకోతల్లో నన్ను నేను డిస్కవర్ చేసుకుని, ప్రపంచ సినిమాతో పరిచయం పెంచుకుని (శివాజీలో రజనీ స్టైల్) ఇంకొన్నాళ్ళకు కొరియెన్ సముద్రంలో చిక్కుకోబోయే రోజులు. ఇహ ఆగుతానా? పోలికలు చిక్కితే చెలరేగిపోనూ...
అతడుకీ, ఫేసాఫ్, మిగతా ఇతర సినిమాలకూ ఉన్న రిలేషన్స్ సెట్ల వారీగా, రింగుల వారీగా, గ్రూపుల వారీగా దొరకటమ్మొదలైంది.. అయినా ఎక్కడో ఫర్లేదులే అనుకున్నా.
అప్పుడు దిగింది ఖలే(కి)జా. ఇహ ఈ శీనుగాడి దర్శకత్వమ్మీద ఆశాలు వదిలేసుకోవచ్చు అనుకునేలా. టూ మెనీ కుక్స్ స్పాయిల్స్... అన్న చందాన, టూమెనీ ఎత్తుకొచ్చింగ్స్ స్పాయిల్స్ సినిమా అయిందన్నమాట.
దానికి తోడు మహేష్ బాబు గారి (పాపం ఆయన అమాయకుడు. తనకు రానిది రాదని చెప్పుకున్నాడెప్పుడూ), మహేషే, నతనా పరిశోధన. అదే అప్పట్లో తీసుకున్న విరామంలో ఆధునిక నటనా పద్ధతులని పరిశీలించాను, ఇహ ఇరగదీస్తాను అని చెప్పుకున్నారు కదా... అదన్నమాట. ఆ ఇరగదీపుడు ఏంటంటే 1940. 1950 ల కాలమ్ నాటి హాలీవుడ్ నటుల్ని సటుల్ (subtle) గా అనుకరించి పదెయ్యటమన్నమాట. సర్లే. అసలు పోస్టు విషయానికొద్దాము.
కథ ఎత్తుగడ ఒకటి. మధ్యలో హీరో ఇన్ట్రో గోల ఇంకో కామెడీ. బాగుందా బాగొలేదా తెలియని చందాన చావగొట్టి వదిలేశాడు. ఏ సన్నివేశానికా సన్నివేశం బ్రహ్మాండమ్. అన్నీ కలిపిజూస్తే, హహ్హహ్హ. వాటికి తోడు పొసగని కామెడీ. అనుషక్క (అనుష్క కొంతమందికి) ఐరన్ లెగ్గేమో కానీ, సినిమాకు దర్శకుడు శ్రీనివాస్ నిజమైన లెగ్గు. ఎంతో ఆశతో ఎదురుజూసిన మహేష్ అభిమానులు బలయ్యి ఊరుకున్నారు. కామెడీ బాగుంది, ఇంకేదో బాగుంది, అలాంటి తొక్కా, చెత్తా, చాదారం లాంటి కబుర్లు ఎన్ని చెప్పినా పరమ కంగాళీ, నీచ్ కమీనే కుత్తే సినిమా అది. అయినా రచయిత త్రివిక్రమ్ అదరగొట్టాడు. ఆ మాట ఒప్పుకోవాలి. ఒప్పుకున్నాం కదా... ఆ త్రివిక్రమ్ దర్శకుడు శ్రీనివాస్ ను మరో రెండు లోకాలు క్రిందకు నెట్టాడు. ఇదియునూ సూనృతమే.
హబ్బ! ఇంట్రడక్షన్ ముగిసింది కదా! ఇహ కథలోకి వద్దాము (రెండున్నర గంటల సినిమాలో రెండు గంటల ఇంట్రడక్షానాఫ్ స్టోరీ ఉండి చివరి అరగంటలో తేల్చి పడేస్తే ఎలా ఉంటుందో నా ఈ వ్యాసాన్ని చూసినా అలాగే అనిపిస్తే తప్పు నాది కాదు.
సినిమా పేరు... జులాయి
విశేషం... దర్శకుడు శ్రీనివాస్ ను రచయిత త్రివిక్రమ్ పాతాళానికి చేర్చిన మహత్తర ఘట్టం. గొప్ప పౌరాణిక ఘట్టం. అనగా ఎపిక్.
నేనూ తేల్చేస్తున్నా. వ్రాయటానికి కూడా బోర్ గా ఉంది అన్నగారి సోది.
డైలాగులు బాగున్నాయి కనుక సినిమా చూడొచ్చు.
-----------------------------------------------------------------
వాకే. అలా అయితే నాటకాలు బెటర్. అది శ్రవణ ప్రధానం. సినిమా దృశ్య ప్రధానం. ఈ త్రివిక్రమ్ గారు పూనుకుని నాటకాలను ఉద్ధరిస్తే మహా క్రేజ్ వస్తుంది. ఎంతైనా మంచి మాటల రచయిత కదా.
నాటకాలు చూసుకోవచ్చెహే. సినిమా అంటే ఇంకా ఉండాలి.
కామెడీ బాగుంది కనుక సినిమా చూడొచ్చు
-------------------------------------------------------
ఇంతకన్నా పెద్ద కామెడీ ఇంకోటుండదు. కామెడీ అంటే సుఖాంతం అన్న మాటను సొల్లు హాస్యం అన్న రీతికి తెచ్చినంత ఖామ్హెఢీ ఇది.
బోల్డు కామెడీచానళ్ళూ, సినిమా వచ్చాక మూడో రోజే వచ్చే ప్రోగ్రాముల్లో బోల్డు సీన్లూ, మిస్టర్ బీన్, పోగో, అబ్బో, ఎసెమెస్ జోకులూ, నెట్ జోకులూ, ఫేసుబుక్కు జోకులూ, నవ్వులు-పువ్వులు గ్రూపు... ఇంకా కామెడీ కోసం సినిమా కెళ్ళాలా? కామెడీ కాకపోతే?
పాటలూ డా౨న్సులూ బాగున్నాయి కనుక సినిమాకెళ్ళొచ్చు
----------------------------------------------------------------------------
బోల్డు మ్యూజిక్ చానళ్ళున్నాయి. ఆడియోలు వినొచ్చు. పిక్చరైజేషన్ ఎలాగూ బాగోదు శ్రీనివాస్ సినిమాల్లో పాటలది. ఐపాడ్లు, ఐఫోన్లు, మొబైళ్ళు, అబ్బో... పాటలు వినలేనిదెక్కడ?
వాటి కోసం సినిమాకెళ్ళాలా?
ఇక డా౨న్సులు... అల్లు అర్జున్ అదరగొడతాడన్నది నిజమే అయినా బోల్డు డా౨న్సు షోలున్నాయి. సినిమాలో క్రొత్తగా చేశాడనుకున్నా నాల్రోజుల్లో మళ్ళా అవే టీవీలోకొచ్చేస్తాయి.
హీరొయిన్ కోసం వెళ్ళొచ్చు
----------------------------------
ఇలియానా లాంటి హీరోయిన్ను జల్సాలో ఎలా చూపించాడో చూశాక ఇహ హాలుకెళ్ళి చూడాల్సిన పని ఏముంది? నెట్లో వందల కొద్దీ పిక్చర్లూ, వీడియోలూ...
ఫొటోగ్రఫీ కోసం...
----------------------
ఇది కెవ్వు కేక. నా భాషలో అయితే CRY SCREAM.
ఎవడూ పోడు. ఒహవేళ పోవాలనుకున్నా, మా చక్రి భాయ్, రఘు మందాటి, ఎల్ లిమ్, ఇంకా బోళ్డు మంది ఫేస్బుక్ లో పెట్టే ఫొటోలకన్నా హాలుకెళ్ళి చూడాల్సినంత సీన్ ఉండదు.
ఇహ దేనికి చూడాలి?
అదే కదా నా సమస్య. ఈ సినిమా ఇందుకు చూడాల్సిందే అనుకునేది ఎప్పుడు? ఒక అనుభవం కోసం. ఆ ఒక్కటి ఉంటే మిగతావన్నీ కొట్టుకుని పోతాయి. అదొక్కటే లేదు. కిక్కు లాంటి రవితేజ తరహా సినిమా కూడా వందల సార్లు చూశానంటే చివరిలో వచ్చే ఫ్లా౨ష్‍బా౨క్ సన్నివేశాల్లో ఉన్న కాస్తంత ఉన్న ఫీల్. అది ప్లా౨స్టిక్ పువ్వు లాంటిదైనా.
జులాయి. ఉత్త లొల్లాయి. సొల్లాయి. ఇంకా చెప్పాలంటే... కుళ్ళాయి.
ఒకే ఒక్క కారణం చేత చూడొచ్చు. అదే మంటే గొప్ప పౌరాణిక ఘటం ఆవిష్కృతమయింది. బలి చక్రవర్తిని శ్రీమహావిష్ణువు పాతాళానికి త్రొక్కేశాడంటే ఎవరమూ నమ్మము. ఉత్త కథ అని కొట్టి పడేస్తాము. ఇన్నాళ్ళాకు నమ్మేలా ఒక గొప్ప పౌరాణిక ఘట్టం జరిగింది కలియుగంలో.
అదే దర్శకుడు శ్రీనివాస్ ను రచయిత త్రివిక్రమ్ విజయవంతంగా పాతాళానికి చేర్చిన మహత్తర ఘట్టాన్ని చూసే అవకాశం మరల మరల రాదు. చూడండి. తరించండి. పులకించండి.
5 comments:
అదరగొట్టేసారు......
Nuvvu vaka cinema cheyi..chudalani vundi
ఈ పోస్ట్ చూసాక, త్రివిక్రమ్ నిన్ను ఎంత గ డిస్ట్రబ్ చేసాడో అర్ధం అవుతోంది. తెలుగు సినిమా లో నే కాదు, బాలీవుడ్ లో కూడా ఈ డైరెక్టర్ సొంత కధతో చాల మట్టుకు సినిమా తీయడం లేదు అన్నది మీరు అవునన్న కాదన్న వాస్తవం. కాబట్టి, త్రివిక్రమ్ ని ఈ విషయం లో ఏమి అనలేము. ఇక పోతే మీరు చెప్పినట్టు , ఖజేజ, జల్స అండ్ జులాయి సినిమాలు మీకు నచలేదు కాబట్టి మీరు ఇంత దారుణాతి దారుణంగా ఒక పోస్ట్ రాసారు త్రివిక్రమ్ గురించి.
మీకు ఒకటి చెప్తాను. ఈ ప్రపంచం లో అందరికి నచేది అంటే ఏది ఉండదు. మీకు అతడు, జల్స, ఖలేజ సినిమా లు పరమ బోకు సినిమాలు ల అనిపించి ఉన్దోచు. అది మీ పాయింట్ అఫ్ వ్యూ. కాని చాల మంది కొత్త దర్శకులకి అవి ఒక ఇన్స్పిరేషన్. ఒకరి కి నచ్చింది ఇంకొకరికి నచక పోయి ఉన్దోచు. అంతే తప్ప, ఇందులో త్రివిక్రమ్ తప్పేం లేదు. He is always a legend.
నాకూ త్రివిక్రమ్ అంటే అభిమానమే. అందుకే ఇంకా గొప్పగా ఉండాలని వ్రాశానే తప్ప అవమానించాలనో వెక్కిఱించాలనో కాదు. Hez not improving. Thatz the problem
మీరు త్రివిక్రమ్ గారి గురించి రాసింది నచ్చ లేదు, కాని మీరు రివ్యూ రాసిన మాటల తీరు అమోఘం . మాంత్రికుడు మాటల తో గారిడీ చేసినట్టు వుంది . మీరు రివ్యూ రాసిన తీరు ఒక పోయెట్రీ లా , మహా ప్రస్థానం లా వుంది
Post a Comment