Saturday, November 29, 2008

'థూ'గ్రవాదం - 'ఛీ'వ్రవాదం

ఇల్లు కాలి ఇల్లాలేడుస్తుంటే రా రమ్మని రంకు మొగుడు రాళ్ళేశాడంట.

రాయటానికి బాగోకున్నా రాయక తప్పలేదు. అలా ఉంది మా స్నేహితుని, మరికొందరి మాటలూ, చేష్టలూనూ. కడుపు రగిలిపోయింది. ముంబై లో ఉగ్రవాదుల దాడి జరిగి, ఇంగ్లాండు క్రికెటర్లు ఇంటి ముఖం పట్టారని వార్తని పేపర్లో చదివిన ఆ సదరు వ్యక్తీ, "అబ్బా! ఈ తీవ్రవాదులు ఇప్పుడే దాడి చేయాలా? ఈ రెండు వన్డే లూ మిస్సవుతున్నామే!" అన్నాడు. అంటే... ఈ రెండు వన్డేలూ ముగిసిన్తర్వాత దాడులు జరిగితే ఫర్వాలేదనా తన ఉద్దేశ్యం?

ముంబై లో మన సోదరుల జీవనం ఈ బాంబు దాడుల వల్లా, కాల్పుల వల్లా అస్తవ్యస్థం అవుతుంటే వన్డే క్రికెట్టు కావాల్సి వచ్చిందా? రేపు అదే కష్టం మనకూ వస్తే... అలాగే అనుకుంటామా? మన అమ్మా నాన్నలో, పెళ్ళాం పిల్లలో అలాగే ఏ 'బాజ్' హోటల్లోనో చిక్కుకుంటే కూడా అలాగే అనగలమా?

మొన్నటికి మొన్న హైదరాబాద్ లోనే దాడులు జరిగినై. అప్పుడు ఎంతమంది మరణించారో, ఎన్ని కుటుంబాలు నష్టపోయాయో అందరికీ తెలుసు. ఈ మధ్యలోనే ఢిల్లీ లోనూ, గౌహతీలోనూ, జైపూర్లోనూ, బెంగళూరు లోనూ, అక్కడా... ఇక్కడా... అని ఏమున్నది? ఎక్కడైనా మేము ఉంటాం. ఎంతమంది ప్రాణాలనైనా తీస్తాం అని ఉగ్రవాదులు, తీవ్రవాదులూ, తమ పంజాలను విసురుతుంటే అమాయక ప్రజా వారి కోరల నుండీ తప్పించుకునే మార్గం లేక విలవిల లాడు తూనే ఉంది.

మన నాయకులు, ఏదో సినిమా లో కోటా "మేం కండిత్తన్నం" అన్నట్టు గానే ఖండిస్తూ ప్రసంగాలను చేస్తున్నారే కానీ ఖండ ఖండాలైన చిన్నారుల దేహాల్నీ, ప్రజల మనసుల్నీ ఏనాడైనా పట్టించుకున్నారా?

"మాకే న్యాయం జరగలేదిన్తవరకూ..." అంటూ రాహుల్ గాంధీ అన్నాడే కానీ న్యాయం జరిపించే పనిని తన యువ భుజ స్కంధాల మీద వేసుకుని, పూనుకుని, తీవ్రవాదాన్ని అంతం చేసే ప్రక్రియలో పాల్గొన్నాడా?

ఈ మధ్యనే (ఒక సంవత్సర కాలంలోనే) ఎన్నో నగరాల్లో దాడులు జరిగాయి. ఇంటిలిజన్స్ నివేదికలూ ఉన్నాయి. అయినా మన ప్రభుత్వం కళ్లు తెరవలేదు. తెరచి నిజం చూడలేదు. ఎంత సేపూ, ప్రతిపక్షాలని ఎలా దెబ్బతీయాలా అనే ఆలోచనే కానీ, దెబ్బ తింటున్న ప్రజల హృదయాల్నీ, దేహాల్నీ బాగుచేయాలనే ఆలోచనా సాలోచనా లేదు. ఉన్నదల్లా ఓటాలోచనే. ఓటి ప్రభుత ఇది.

హిందూ ఉగ్రవాదం తయారైందని వ్యాఖ్యానించగలరు కానీ, దేశం లోకి భూ, వాయు, మార్గాలలోనే కాదు, జల మార్గాల నుంచీ చొచ్చుకుని రాగలం అనే ఆ 'ఛీ'వ్రవాదులని మాత్రం పసిగట్టలేదు. అలా చేస్తే ప్రజలు బాగుంటారు కదా. బాగుంటే తమని లక్క చేయరు కదా. అలా ఐతే తమకు ఓట్లుండవు కదా. సంతోషం గా ఉన్నా మనిషికి వేరెవరితోనూ అవసరం ఉండదు. కానీ మన నాయక వాయసాలకి జనం తో అవసరం. జనం వారి మాటలని వినేది కష్టాలలో ఉన్నప్పుడే. అందుకే ఏ నాయకుడూ ఈ రోజుల్లో జనాలు సుఖం గా ఉండాలనుకోవటం లేదు. ఎంత సేపూ మీకు అవి ఇస్తాం, ఇవి ఇస్తాం, అంటారే కానీ, మీ ధన మాన ప్రాణాలని కాపాడుతాం అని ఏ రోజూ చెప్పరు.

జనం కూడా ఏదైనా మ్యాచి ఈ రోజు వస్తే చాలు, ఈ హీరోయిను ఎలా తిరుగుతున్నది, నా కడుపు చల్లగా ఉంటే చాలు, ఎవదేలా చస్తే నాకెందుకు? అనే భావనలతో ఉంటున్నారు కానీ సమైక్య భావాలని కూడా గట్టుకుని కనీసం నాయకులని నిలేద్దాం అనే ఆలోచన కూడా లేకున్నారు.

ఎంత సేపూ, హిందూ తీవ్రవాదం, ముస్లిం తీవ్రవాదం, అనే కానీ, తీవ్రవాదాన్ని ఏ మతమూ ప్రోత్సహించదు. అనే నిజాన్ని గుర్తించరు. మనలో ఉన్న లోపాలే మనలని కబళిస్తున్నాయనే కనీసపు స్పృహ లేకుండా ఆ మతం వారు మమ్మల్ని చంపారు కనుక మేమూ వారిని చంపుతామనే భావజాలాన్ని పెంచుకుని, సమస్యని జటిలం చేస్తున్నారే కానీ పరిష్కార మార్గాలని ఆలోచించటం లేదు.

మన కోసం ఎందఱో జవానులు ఈ రోజున తమ ప్రాణాలని లెక్క చేయకుండా పోరాడి ఆ తుచ్చులని మట్టు పెట్టారు. వారిని సేబాషందాం. కానీ మనం మాత్రం ఏ మాత్రం వీర్యం లేకుండా ఏదో నడిచి పోతే చాలు అనుకుందాం. మనిషికి కావలసినది ఆలోచన. అంతే కానీ మూక మనస్తత్వం, ఏ ఆలోచనా లేని వ్యక్తిత్వం కాదు.

క్రికెట్టు కన్నా మనుషుల ప్రాణాలే మిన్న అని చెప్పిన కెవిన్ పీటర్సన్ నయం. ధనమెంతున్నా జనం లేని దేశమేనాడూ బాగు పడదు. ప్రజల ప్రాణాలని కాపాడలేని ప్రభుత ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. అందుకే ప్రజలే కళ్లు తెరవాలి ఆలోచించాలి. ఒక rational దృక్పథాన్ని అలవరుచుకుని తమని తామే ఎలా కాపాడు కోవాలని యోచించాలి. ఆట ఈరోజు కాకుంటే రేపు చూడొచ్చు. ప్రాణాలు ఈ రోజు పోతే రేపు రావు. జనహితం కానిదేదైనా మాంసపు ముక్కలో పడ్డ విత్తు లాంటిదే. కుళ్ళటమే కానీ, మొలకెత్తదు.

Read more...

Wednesday, November 26, 2008

రాధాకృష్ణం

కళ్ళలో నీవు ఉంటే...
చీకటే లేదుగా...

శ్వాసగా నీవు ఉంటే...
మరణమే రాదుగా...

రూపమే వేరు అయినా...
మనసు ఒకటే కదా...

మనసులో ప్రేమ ఉంటే...
ద్వేషమే లేదుగా...

ప్రేమలో కరిగిపోదాం....
సత్వరం ఒక్కటౌదాం ...

ఏకమయినా మనసులోని...
ఎత్తునే చాటుదాం...

గాలిలో ఏకమవుదాం...
తనువులే విడిచి పోదాం...

ప్రకృతి పురుషులవుదాం...
పృద్విలో కరిగిపోదాం...

దేవునీ రూపమంటూ...
ప్రేమనే చాటుకుందాం...

ప్రేమలో ఇంకిపోతూ ...
లోకమే వీడిపోదాం...

Read more...

Monday, November 24, 2008

తేలుకుట్టింది.

ఒక సారి ధోనీ భజ్జీని మూడో వన్డేలో గెలిపించిన సందర్భంగా రాంచీకి పిల్చి ఆతిథ్యం ఇచ్చాడు. కొంసేపు గడిచినతర్వాత, వాళ్ళిద్దరూ ఒక పాడుబడ్డ ఇంట్లోకి షికారు కెళ్ళారు. అప్పుడో తెలు భజ్జీని కుట్టింది.

Bhajjee: A crab just bit my toe.

Dhonee: Which one? .

Bhajjee: How do I know? All crabs are look alike.

మరిన్ని జోకులకి చూడండి... booksandgalfriends.blogspot.com

Read more...

Sunday, November 23, 2008

నువ్వూ నేనూ

సప్త స్వరాలన్నీ
సప్త వర్ణాలుగా మలచి
నా మది పై బాణమేశావు

వర్ణాస్త్రానికి బందీనై
ఊహాలోకాన విహరించాను.

ప్రేమసాగారాన పవళించిన నీకు
పూజా పుష్పాలుగా నీ రంగులనే
పువ్వులుగా మలచి మాలగా ఇద్దామంటే
నాకు ఎదురైంది పుష్ప విలాపం.

జాలి ముప్పిరి గొన వాటినొదలి
నన్నే నీకిచ్చాను.

ప్రేమతో పాలిస్తావో...
అమ్మలా లాలిస్తావో...
నాలా నిలబెడతావో ఇక నీ ఇష్టం.

వర్ణరంజితమైన లోకంలో
వానజల్లు లా కురిశావు.
మోడువారిన నా గుండె పై
ఆశా పుష్పాలు చిగురిప జేశావు.

చెట్టునడిగాను, పుట్టనడిగాను,
నీ పేరు చెప్పమని,
నాకొకటే చెప్పావయి
నీవూ నేనూ వేరుకామని.

Read more...

Sunday, November 9, 2008

నన్నపనేని బాంబు

ఒకసారి రోజా, నన్నపనేని రాజకుమారి ఇద్దరూ కలిసి వై ఎస్ రాజశేఖర రెడ్డి కారులో బాంబు పెట్టాలని ప్లాన్ చేసుకున్నారు. వన్ ఫైన్ మార్నింగ్ వాళ్ళిద్దరూ కలిసి సెక్యూరిటీని ఛేదించుకుని మొత్తానికీ కారు దగ్గరకు వెళ్ళగలిగారు.

ఎన్నో సినిమాల్లో ఈ బాంబుల ప్రహసనం చూసినందువల్ల ఈ పనిని రోజానే నెత్తికెత్తుకోగా, నన్నపనేని మాత్రం ఊపెకుహ లాగా ఎవరన్నా వస్తున్నారా అనికాపలాగా నించుంది. రోజా సీరియస్ గా తన పనిలో నిమగ్నమైంది. బాంబుని దాదాపుగా సెట్ చేసే టైం లో నన్నపనేని రోజాతో ఇలా అంది, "అమ్మే రోజా! మనం సెట్ చేసేలోపల్నే ఈ బాంబు గానీ పెల్తే ఏముతాది?"

"నువ్వూకో అక్కా! అందుకేగా నేను ఇంకో బాంబు తెచ్చీసినాను."

Read more...

Tuesday, November 4, 2008

సెహ్వాగ్ - హర్భజన్

వీరేంద్ర సెహ్వాగ్ కి తానూ ఢిల్లీ నుంచీ వచ్చానని మహా పొగరు. ఆ పొగరంతా సర్దార్జీ ఐన హర్భజన్ మీద చూపుతుంటాడు. ఐతే మన భజ్జీ కూడా తక్కువేమీ తినలేదు.

ఒకసారేమైందంటే...

"నేను దేశ రాజధాని నుంచీ వచ్చాను. మా నగరం లో ఎందఱో దేశ భక్తులు జన్మించారు. ఒకవేళ జన్మించక పోయినా వారందరూ మా నగరం లో ఉన్నారు." అని సెహ్వాగ్ అన్నాడు.

"రాష్ట్రం లోనూ తక్కవా 'కేసరి' అనే బిరుదు పొందిన వ్యక్తీ మా సొంతం" దానికి సమాధానంగా భజ్జీ.

ఐతే మనం ఒక పందెం వేసుకుందాం. ఎవరురాష్ట్రాల వారి దేశ భక్తులని వారు చెపుదాం. చెప్పిన ప్రతీసారీ అవతల వారి ఒక వెంట్రుకని పీకాలి." (సెహ్వాగ్ కి భజ్జీ పొడుగు వెంత్రుకలంటే కొంచం అసూయ.

భజ్జీ ఓకే అన్నాడు.

పందెం మొదలైంది. ముందు భజ్జీ ఒక పేరు చెప్పి సెహ్వాగ్ వెంట్రుకని పీకాడు. ఈసారి వీరు వంతు. తానొక పేరు చెప్పి భజ్జీ వెంట్రుకని పీకాడు. కొంత సేపటికి భజ్జీకి పేర్లు తట్టటంలేదు. మధ్యలో వీరూ కొందరు పంజాబీలని ఢిల్లీ లో ఉన్నారనే సాకుతో కబ్జా చేసి భజ్జీ వెంత్రుకాలని పీకాడు. సందర్భంలో వీరూ లాలా లజ్పత్ రాయ్ పేరుని కూడా కబ్జా చేశాడు. దాంతో భజ్జీకి మండింది.

కొంసేపు ఆలోచించి, తన వంతు రాగానే 'జలియన్ వాలా బాగ్' అని వీరూ జుట్టు అంతా పీకేశాడు. అప్పటి నుంచీ సెహ్వాగ్ మనకి గుండుతోనే దర్శనం ఇస్తున్నాడు.

ఇది మా ఫ్రెండ్ చైతన్య చెప్పింది. జోక్ ట.

:నోట్: సరదాకి మాత్రమే వ్రాసింది. వీరేంద్ర సెహ్వాగ్ అలాంటి వాడు కాదు. పైగా భజ్జీ వీరూ ఫ్రెండ్స్. గంగూలీ శిష్యులు కూడా.

Read more...

Saturday, November 1, 2008

ఐసు - బిప్పు రూలు.

ఒకప్పుడు 'అమలా పురం ఐశ్వర్యా రాయ్', 'భీమవరం బిపాషా బసు' అని ఇద్దరమ్మాయిలు స్నేహితులు. ఇద్దరిదీ ఒకే కంచం, ఒకే మంచం. పెళ్లి కాక ముందు లెండి.

వీళ్ళకి కాలం ఖర్మం కలిసొచ్చి (కలిసి రాక) పెళ్లి అయింది. వీళ్ళ భర్తలూ పాపం స్నేహితులే. వీళ్ళ స్నేహాన్ని చూసి దేవుడికి కుళ్ళు పుట్టిందేమో... పాపం వాళ్ల వాళ్ల భర్తలు ఒకేసారి యాక్సి డెంటు లో మరణించారు.

అమ్మలక్కలూ, అయ్యలన్నలూ వచ్చి వారిని పరామర్శించే వారు. కొంతకాలానికి 'భీమవరం బిపాషా బసు' ఒకతన్ని ఇష్టపడి పెళ్లి చేసుకుని మళ్ళీ సుఖం గాఉంది. ఐతే ఆమె స్నేహితురాలు 'అమలా పురం ఐశ్వర్యా రాయ్' మాత్రం విషాదం లోనే మునిగి ఉంది. (ఇక్కడ విలువలగురించి కాదు. విషయం వేరే!).

అప్పుడు అమ్మలక్కలూ, అయ్యలన్నలూ, తనతో "ఎందుకమ్మాయీ అంత బాధ పడి పోతావూ... పాపం! ఎంతకాలమలా ఉంటావ్/ నువ్వూ ఉప్పూ కారం తినే దానివే కదా! చిన్న వయసు లోనే ఎంత కష్టం?" అనే వాళ్లు. కొంత కాలం తరువాత "అమ్మాయీ! మళ్ళీ పెళ్లి చేసుకుని హాయిగా గతాన్ని మరచి పోయి జీవితాన్ని అనుభవిన్చమ్మా! చిన్న దానివి. ఇంకా ఎంతో జీవితాన్ని చూడాలి." అన్నారు.

ఇక 'భీమవరం బిపాషా బసు' గురించి మాత్రం "భర్త పోయి రెండేళ్లన్నా కాలేదు. మళ్ళీ పెళ్లి చేసుకుని కులుకుతోంది. చూడమ్మా చోద్యం!!!???" అన్నారు.

అందుకే 'మై డియర్ ఫ్రెండ్స్...' లోకుల గురించి కాదు. మన గురించి బ్రతకాలి. వారికి కావలసింది కేవలం 'ఉపదేహామ్రుతాన్ని' పంచి పెట్టే మహదవకాశం.

'ఉపదేశామృతం' మాట 'వైష్ణవి' వ్రాసిన 'దీపావళి వంటకం' లో చూశాను. పదం బాగుందని adopt చేసుకున్నాను. తనకి థాంక్స్. ఒప్పుకున్నందుకు.

Read more...

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP