చిరాకు టు ద పవరాఫ్ చిరాకు
రచన
వందనూరి జోగేంద్ర దేవి
ఖద
ఛాంగీ ఒక నిరుద్యోగ యువకుడు. యాజ్యూజువల్ గా అతని తల్లి ఈ మధ్యే చనిపోయింది. ఎందుకంటే హీరో అనాథ అయితే వచ్చే ఎఫెక్టే వేరప్పా!
డైరక్టర్ అనుకున్న పరిస్థితుల్లో అతనికి రక్ష్మి అనే ఇంకో అనాథ తోడవుతుంది. ఇద్దరూ బోల్డు తెలివైన వాళ్ళు. ఛాంగీ ఎంత తెలివైన వాడో చారికకు తెలుసు. ఎలా అంటే అదొక పెద్ద flashback.
తల్లి బ్రతికున్నప్పుడు మందులకు డబ్బు అవసరమై వెతుకుతున్నపుడు చారిక కనిపిస్తుంది. చారిక పదహారేళ్ళకే ఆక్సుఫర్డులో యూకేజీ చదివేసింది. హయ్య బాబోయ్ కదా యిది. చారిక దగ్గరకు వెళ్ళి సాయి కుమార్తె సహాయంతో పందెం వేస్తాడు. పందెంలో గెల్చినందుకు చారిక వంద నోటు ఇవ్వబోతే సున్నా కు విలువ లేదనీ, పైగా తను నంబర్ వన్ హీరో కనుక ఒక్క రూపాయి చాలని చెప్తాడు. అలా చారిక కు ఛాంగీ తెలివైన వాడని నమ్మకం ఏర్పడి పోతుంది. మందులకు వంద కావాలి. రూపాయే ఉంటంతో ఛాంగీ మందులు కొనలేడు. అవ్విధంబున సమయానికి మందులు అందక ఛాంగీ వాళ్ళ అమ్మ చనిపోతుంది.
కమ్యూనిస్టులు దీనికంతటికీ కారణం పెట్టుబడి దారీల దౌష్ట్యం అని బంద్ కు పిలుపిస్తారు. తిక్క రేగి అయన్ రాండ్ అట్లాస్ ష్రగ్డ్ వ్రాసింది. అది చూసి ఇన్స్పైరయి జోగేంద్ర దేవి ఈ ఖద వ్రాసింది.
ఒక రోజు రక్ష్మి స్ట్రాబెర్రీ లు తరుగుతుంటుంది. డబ్బు లేదు కదా స్ట్రాబెర్రీ లు ఎలా వచ్చాయ్ అనకండి. నంబర్ వన్ హీరో ఇక్కడ! !!
అవి తరిగి పోస్తున్న కాయితం లో ప్యూను ఉద్యోగానికి యాడ్ పడుతుంది. దానికి అప్లయ్ చేయమంటుంది రక్ష్మి. రూపాయి శ్టాంపంటించాల్సిన చోట పదకొండు రూపాయల లకు అంటించి పంపిస్తాడు ఛాంగీ.
ఇంటర్వ్యూకు పిలుస్తాడు రావు గోపాల రావు.
రాగోరా: ఏం చదువుకున్నావ్?
ఛా: కేంబ్రిడ్జి లో ఎలక్ట్రికల్ ఇంజనియెరింగ్. ( నంబర్ వన్ హీరో ఇక్కడ! )
రాగోరా: అలా అయితే నీకు ప్యూను ఉద్యోగం ఎందుకు బాబూ? Manager ని చేస్తాను.
ఛా: ఎంత కండ కావరం? ప్యూను ఉద్యోగం కోసం వచ్చిన నన్ను manager ని చేస్తా అంటావా?
రాగోరా: రూపాయి శ్టాంపు అవసరమైన చోట పదకొండు రూపాయిల శ్టాంపు అంటించావు. నీ తెలివి మరియూ తేటలు బహు ముచ్చటగా నున్నవి. పావలా అవసరం అయిన చోట ముప్పావలా మాటలు చెప్పి మా కంపెనీని పైకి తీసుకొస్తావనీ... నీ బుర్ర లో కరంటు ఉంది.
ఇంతలో చారిక అక్కడికి వస్తుంది. ఛాంగీ ని చూసి ఆశ్చర్యంతో నిలబడి పోతుంది. ఈ తింగరోడు plucking what అని!
ఛా: ఇంట్లో కరంటుందని ఎంత ఫొఘఱు నీకు! ఐదేళ్ళలో నీ factory ని ఐదు రోజులు మూయించక పోతే నా పేరు చిరంజీవే కాదు.
రాగోరా: ఏంచేసి మూయిస్తావ్? బందులు చేశా? రాస్తా రోకోలు చేశా? ఒకవేళ అలా చేస్తే మా పని మనిషి కూతురు నిచ్చి పెళ్ళి చేస్తాను.
చారిక: (మనసులో) now his work, armpit lick chandole go.
AGREEMENT
ఇక్కడ ఇంటర్వెల్.
దర్శకత్వ పర్యవేక్షణ: కారుతీ
కాసేపు బ్రహ్మానందాన్ని కొడతారు. అంటే కామెడీ సీన్లు. రెండు ఐటంసాంగ్ లు. సెకండాఫుకు కథ పెద్దగా మిగల్లేదు. అందుకు.
ఛాంగీ పావలా బిళ్ళ తో ట్రిక్కులు చేసి రాహుల్ గాంధి ని మెప్పించి కాంగ్రేస్ కు మద్దతిచ్చి ప్రభుత్వం పడిపోకుండా చూస్తాడు. కాంగ్రేస్ పాలనలో కరంటుత్పాదన తగ్గి current holiday ప్రకటిస్తారు. రాగోరా factory మూత పడుతుంది. ఐదో రోజు సాయంత్రం చిరరంజీవి రాగోరా ఇంటికి వెళతాడు. ఓటమినంగీకరించిన రాగోరా చిరంజీవి కి పని మనిషి కూతురు నిచ్చి, రాహుల్ గాంధీ కి చారికనిచ్చి పెళ్ళి చేస్తాడు.
Climax twist
రక్ష్మి ముఖ్య మంత్రి అవుతుంది
ఖద, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలూ, బొమ్మలు, ఎడిటింగ్, తీసింది, చూసేది: హెమర్ గవేష్
4 comments:
akkadakkada ardham kaaledu kaani, laaast like keko keka, hemar gavesh, atagadu tappite ilanti cinemalu inkevadu teeyaledante
హీరో no.1 గారి flashback అదిరింది. UKG ఆక్సుఫర్డులో, ఇంజనీరింగ్ కేంబ్రిడ్జ్ లో కాక, మన ఇండియా లో అంటే చెత్తగా వుంటుంది ... no.1 హీరో కదా మరి... ఆ తర్వాత second half అత్తారింటికి దారేది లెవెల్ నే మించిపోయింది ... ఇక ముగింపు కేకే.
హీరో no.1 గారి flashback అదిరింది. UKG ఆక్సుఫర్డులో, ఇంజనీరింగ్ కేంబ్రిడ్జ్ లో కాక, మన ఇండియా లో అంటే చెత్తగా వుంటుంది ... no.1 హీరో కదా మరి... ఆ తర్వాత second half అత్తారింటికి దారేది లెవెల్ నే మించిపోయింది ... ఇక ముగింపు కేకే.
హీరో flashback అదిరింది... మన no.1 హీరో UKG ఆక్స్ఫర్డ్ లో, ఇంజనీరింగ్ కేంబ్రిడ్జ్ లో చదవకుండా ఇండియా లో చదివితే చెత్త గా వుంటుంది.. no.1 హీరో కదా మరి. సెకండ్ హాఫ్ అత్తరింటికి దారేది నే తలదాన్నెలా వుంది , ఇక ముగింపు కేకే
Post a Comment