Saturday, August 20, 2011

అణుయుద్ధం

 
/hihi
నువ్వూ
నేను
ఇకపై
మనం

దేశం
కోసం
సామాన్యుడి
పోరు

అణువంతేగా
అనకు
అణుయుద్ధం
తెలుసుగా

ఆధాటికి
అయినది
హిరోషిమా
స్మశానం
 /bye

Read more...

Tuesday, August 16, 2011

అన్నాను అరెస్ట్ చేసినందుకు వాపోతున్నాను!

!

అన్నా హజారే ని అరెస్ట్ చేసి మనందరమూ వాపోయేందుకు ఛాన్సిచ్చిన కాంగౌ వారికి, మరీ ముఖ్యంగా అమ్మ సోనియా సీతమ్మ తల్లి గారికీ, పేద ప్రజల ఆశాదీపం గారికీ, కృతఙ్ఞతలు తెలుపుకుంటూ... జగనన్న వాపోతున్నప్రజానీకాన్ని ఊరడించేందుకు ఓదార్పు యాత్రకు రావాలని డిమాం౨డు చేస్తూ... తెలుగు బ్లాగ్జనులెల్లరకును యంకితమిచ్చుచుంటిని...
:D

/bye

Can anyone suggest an action plan to counter that arrest? 

ఇప్పటికే బ్లాగుల్లోనూ ఫేసుబుక్కులోనూ వాపోవుడు చూసి, నేను కూడా మొదలెట్టేశాను. అసలే మా ఫ్రెండ్స్ (???) నీకు వాపోవటం రాదు కనుక నువ్వో సైకోవని అంటున్నారు. అందుకే నేను కూడా ఘాట్ఠిగా వాపోతున్నాను

Read more...

Saturday, August 13, 2011

ధోనీ, మరియూ క్రికెట్ దేvoodoo

Kapil brought the cup to India... 1983... Cricket world learnt to show Respect to Indian Team, at least at home matches.

Sourav beat Aussie juggernaut... 2001... World began to take India as a world beater.

Then came Dhoni phenomenon... 2007 T20 WC... IPL came into picture, and see what?2008 Dhoni and Sachin wanted rest for an important Sri Lankan tour.

2009 Sehwag injured. India lost T20 WC.

2010 Sehwag injured. Same to Shame.

2011 Sehwag injured. these SehWAGS are lookee what happened... :D

Blaming Sehwag is not the thing to do. He played like he always did. The Team must play to win, and must know the priorities. At least he can dash the opponents with his presence. Being partial deaf, and lost some of his sight made a mockery of him right now. Surely he will be to his elements soon. What about the cricket దేvoodoo? Pig shit. What about the others? Where is the inspiration to the team? Is this the team that won the WC?

Read more...

Friday, August 12, 2011

నీ ఉనికే అక్షరం, నీ ఙ్ఞాపకం నాకు వరం

మాటలకందని నీ మౌనమే నాకు చాలు
పై మెరుగులు చూపని నీవు 
కంటి కన్నా
మనసుని మురిపిస్తావు
గుండెని తట్టే నీ ప్రేమ
నా జీవితానికో క్రొత్త అర్ధం

నువ్విచ్చిన చిరు కానుకలు
మరపురాని తీపి గురుతులు
నీ ఊసులతో కవితలల్లను
నీ రూపు రేఖల చిత్రం గీయను
చెప్పనా నాకు
నీ ఉనికే అక్షరం
నీ ఙ్ఞాపకం నాకు వరం

RIP

Read more...

"అయ్యో వ్రత కథ" అనఁబడు స్కాంద పురాణమందలి అఙ్కోపరి ఖండము


/hihi

ఇవాళ వరలక్ష్మీ వ్రతం కదా! అప్పుడప్పుడూ ’అయ్యో రామా!’ అనుకొనెడి ఆడ పడుచుల కొఱకై...
కంపుటేరు/టైపురైటరు కీబోర్డు నందు (సినిమాల్లో ఆర్తీ అగర్వాల్ పెట్టుకునే నందు, నందిని అనే పేరుకూ, దీనికీ ఏ సంబంధమును లేదని తెలియజేయుటకు చిదానించుచుంటిమి) 

అనబడే (ఐ బడా/బడే అక్షరమే. ఎంత పొగరో దానికి. ఒహఠి లాగా ఉంటుంది. మరియూ ఇగో నకు సంకేతము. అసలైన ఇగో అయిన నేవిధమైన ఇబ్బందియు లేదు గాని, దాని యసలు యర్థము తెలియని వారికుండిన ఎన్నియో ఇబ్బందులు) అక్షరము ప్రక్కనే  అను మరియొక అక్షరము కలదు. కమ్ప్యూటరు వాడక సమయమున ఐ బదులు ఓ, మరియూ ఓ బదులు ఐ వచ్చిన ఇబ్బందులు గూర్చి పలువురు పలుమార్లు వాపోయి యుంటిరి.
అట్టి సమయమున మనిషి వెలువరించు భావమునకు సంకేత రూపమొహఠి కలదు. దాని గూర్చి తరువాత చర్చించెదము. 

మన తెలుగు భాష యందలి పదమయిన అయ్యో ఎటుల వచ్చెననిన... కమ్ప్యూటరు కీబోర్డు వలన. ఇది పలువురకు యాశ్చర్యముగ తోచినను, ఇది యదార్థము. నిక్కము. సత్యము. ఐ, మరియు, ఓ ల వల్ల సమస్య ఉత్పన్నమైనది కాన దానికి సంకేత నామముగ ఐఓ అని ఉంచితిరి. క్రమముగ నదియె (ఏ నది కాదు. ఉంచిన అదియె అని భవము) ఐయో గను, ఆ పైన జనుల నోళ్ళ యందు నాని క్రమముగ అయ్యో గ స్థిర పడెను. అప్పటి నుంచీ, సమస్యలేవి యైనను ఉత్పన్నమయినప్పుడు మనుజులు అయ్యో అని అనుచుంటిరి


స్కాంద పురాణము: అఙ్కోపరి ఖండము, 3:2

ఆతనిన్!

Read more...

మావాడూ పుట్టాడోయ్! :D

"I don't believe in fate or destiny. I feel that you just got to go out play and Win."

And how? With resound victories.

"People don't remember who came first, let alone the second They  remember only those who made their mark on their hearts."

How to make a mark on the hearts?

By being the BEST.

మావాడూ వచ్చాడోయ్...!
జరుగు జరుగు జరుగు...
మెరుపల్లే వచ్చాడోయ్...!
జరుగు జరుగు జరుగు...
దమ్మున్నా చిన్నోడోయ్...!
జరుగు జరుగు జరుగు...
దుమ్మూ దులిపేస్తాడోయ్...!

దులిపేశాడు కూడా.

ఇంతకీ ఎవరోడూ?

దిగ్గజాలున్నప్పుడు రంగంలోకి దిగాడు. ఎదిరించి నిలబడే ప్రత్యుర్థుల మధ్య నిలిచాడు. అందగాడు కాదు. అమ్మాయిల కలల రాకుమారుడు కాదు. ఆవేశపరుడసలే కాదు. గెలిచినప్పుడు పొంగిపోనూ లేదు. ఓడినప్పుడు కంట నీరొలికించి మెలోడ్రామాలూ క్రియేట్ చెయ్యలేదు. నేనింత వాడినీ, అంతవాడినీ అని హడావిడి చేయలేదు. లేదా? నాదేముందీ అని ఫాల్స్ హమ్బ్లిటీనీ చూపలేదు. కేవలం నేను గెలిచే వాడిని అని చెప్పి తన వాడిని పదేళ్ళ పాటూ చూపి, చివరిగా కూడా అన్ని ఆటంకాలనూ అధిగమించి తన సామర్థ్యాన్ని చాటి చెప్పి, తన వాళ్ళందరి ముందూ రిటైరయ్యాడు.

ఇంతకీ ఎవరతడు?

The One & Only PETE SAMPRAS

Heyy Pete! You are the King Man!

 Trademark shot this is...
Taken from net

W(ah) hat a serve!


King of Over Head shots


The Father, he is...

Read more...

Thursday, August 11, 2011

మూడు రూపాయల్ని రష్చించిన రూపాయి ఖద/hihi

అనగా అనగా (ఎవరిని? నాకు తెల్వదబ్బా! నేనైతే ఎవరినీ ఏమీ అనను) ఒక రెండు రూపాయల బిళ్ళ, రెండు రూపాయి బిళ్ళలు ఫ్రెండ్సు. అంటే సాయంత్రం పూట కల్సి మందు కొడతాయన్నమాట! అలా అని మా పక్కింటమ్మాయ్ వాళ్ళ బాబాయ్ చెప్పాడు. బాబాయ్ అంటే లవ్వు స్టోరీల్లో హీరోవిను అన్నయ్యల్తరువాత ఇలన్లన్నమాట! అరదం ఐందా? ఏం? ఇక మనం ముందుకు పోదాం. మందుకు కాదు. ఏం? ఇప్పుడు అవి ఫ్రెండ్సు కదా! అంటే బైటికి అంటే బజారు కెళ్ళి తిరిగి రావాలి కదా. అలా బజారుకెళ్ళాలని ప్లా౨న్ చేసే లోపులేమో ధోనీ ఆ మూడింటినీ ఇంకో ఆర్రూపాయల్తో కలిపి జేబులో వేసుకుని బైటికెళ్ళిపోయాడు. దారిలో స్ట్రాసు కనపడి బెల్లు నొదిలేసినందుకు పార్టీ ఇస్తాను రారా! అన్నాడు. మనోడేమో రారా అన్నది రండి రండి టైపు రారా ఏమో అనుకుని ఎగేసుకుని వెళ్ళాడు. ఇద్దరూ కల్సి, నమీబియాలో ఉన్న మలావీ హోటలు కెళ్ళి నాలుగు నాలుగు మిరపకాయ బజ్జీలు ఆర్డర్ చేశారు. తిన్నారు. తీరా బిల్లు కట్టేప్పటికి టిప్పు కోసం స్ట్రాసు దగ్గర డబ్బుల్లేవ్. 

ధోనీ జేబులు తడుముకుని చూసి... నా దగ్గర చిల్లర ఉందిలేరా స్ట్రాసూ. అన్నాడు. 

ఎన్తలా బిల్లూ అన్నాడు సర్వర్తో. సర్వరంటే ఇంటర్నెట్ సర్వరని కాదు. maitre d' అన్నమాట. వాకే! ఊఁ అరదమైందా? సరే! మళ్ళీ యెనక్కొద్దాం. ఐదు రూపాయలు సర్వరు టిప్పైతే, మిగతా నాల్రూపాయల్తో లెమన్ షోడా తాగొచ్చు కదా! అనుకుంటూ ఎన్తలా అన్నాడు.

అయ్ బాబోయ్! ఐతే మన్ని ఈ ధోనీ గాడు ఇడగొట్టేస్తాడేమోరా అనుకుని, తెగ ఫీలైపోతున్నాయి. 

maitre d' ఆర్రూపాల్రా ధోనీ గారూ అన్నాడు. 

హ్మ్! ఇక ఇవాళ్టికి నాకు లెమన్ షోడా తాగే అదృష్టం లేదు అనుకుంటూ ధోనీ ఆ టిప్పిచ్చి బైటకొచ్చేశాడు. దారిలో ప్రవీణ్ కుమార్ ఎవరినో కొడుతూ కనిపించాడు. ఛీ ఛీ! ఈ తప్పంతా శ్రీశాంతుదే! వాడికి తెలుగు రాక పోవటం వల్లే ప్రవీణు గాడు ఇలా తయారయ్యాడనుకుని, మీనంబాక్కమ్ బస్సెక్కి కోడంబాక్కమ్ లో దిగి, పురుశవాక్కమ్ లోని తన ఇంటికొచ్చాడు.

ఒరే ఒరే మన రెండో రూపాయ గాడేడ్రా? అనుకున్నాయి ఒక రెండు రూపాయల బిళ్ళా, ఒక ఒక రూపాయ బిళ్ళా. 

***   ***   ***

మర్నాడు సాక్షీ సింగు సింగుతూ వాషింగు మిషన్లో ధోనీ షర్టు వెయ్య బోతోంది. అది మొన్నటిది. దాన్లో ఒక రూపాయ బిళ్ళ దొరికింది. నాదే నాదే! అంటూ పెద్దగా అరిచింది. అంటే రూపాయ బిళ్ళ నాదే నాదే అని కాదు. మరేంటంటే, మరేమో సాక్షి కి ’ధ’ పలకటం రాదన్న మాట! అందుకే నాధే నాధే అనాల్సింది. నాదే నాదే అంది. అప్పుడు ధోనీ ఆర్పీ సింగుతో, అకాలాపకాలా లూపెంగ్-ముయ్ అనే ప్లేస్టేషను గేమాడుతూ, ఉన్నాడు. నాదే నాదే అని వినిపించగానే. దీన్దుమ్పతెగ! నాదే నాదే అంటోంది. ఖచ్చితంగా అది ఏదో నాదే అయి ఉంటుంది. దొబ్బేస్తుందేమో అని భయపడి  లేవకుండానే పరిగెత్తుకునెళ్ళాడు. లోపలకి.

నాదే! ఇదిగో ఈ రూపాయ బిళ్ళ మీ జేబులో దొరికింది నాదే! అంది. 

హమ్మయ్య! ఈ నాదే నా? ఇంకో నాదే అనుకుని భయపడ్డాను అని మనసులో అనుకుని, సాష్చీ, చూశావా? ఈ రూపాయి తగ్గే నిన్న నమీబియాలో లెమన్ షోడా తాగేవాడిని కాస్తా ఉసూరనుకుని వెనక్కొచ్చాను. దీని వల్లే మిగిలిన మూడు రూపాయలూ రష్చించ బడ్డాయి. అన్నాడు.
***   ***   ***

మర్నాడు ట్విట్టర్లో వేజలిన్ పుయ్యటం వల్లే ధోనీ దగ్గర అక్రమంగా రూపాయి మిగిలింది అని మైకేల్ వాన్ ట్వీటాడు. 

సచిన్ టెండూల్కర్ ఇలాగే రనవుటైతే మీ ఇండియాలో ఊరుకుంటారా? అని ఆం౨డీ ఫ్లవరడిగాడు. 

ఇదే గొడవలు మా ఇండియాలో జరిగితే మీరొచ్చి ఆడుతారా? అని క్రిస్నమాచారి గవాస్కర్ పత్రికలో కాలమ్ రాశాడు.
***   ***   ***

హమ్మయ్య నీవల్లే మేమ్ముగ్గురమూ బ్రతికి బట్ట కట్టాము. అని ఒక రెండు రూపాయల బిళ్ళా, ఒక రూపాయ బిళ్ళా అన్నాయి మిగిలిన ఒక రూపాయ బిళ్ళతో.

నీతి: ఖద కంచికి, మనం తెలుగు బ్లాగులకీ /wahaha/bye

Read more...

Wednesday, August 10, 2011

Must read books for ScreenWriting

ScreenWriting అని సెర్చ్ సైట్లలో కొడితే వందల పుస్తకాలొచ్చాయి. ప్రతిదీ అద్భుతమే, అమోఘమే, అత్యద్భుతంగా స్ట్రక్చర్ చెయ్యబడ్డదే! మస్ట్ రీడ్ అన్న మాట బహు చక్కగా అబ్యూజ్ చెయ్యబడటం ఈ సన్నివేశంలోనూ గమనించ వచ్చు. అన్ని పుస్తకాలోంచీ దేన్ని ఎన్నుకోవాలి? అసలు స్క్రీన్ రైటింగ్ అన్న దాని కోసం పుస్తకాలు చదవాలా? పుస్తకాలు చదివితే కానీ వ్రాయలేమా? చదివినవి మనకు ఎంత వరకు ఉపయోగ పడుతాయి? అసలు ఎలాంటి పుస్తకాలు ఎన్నుకోవాలి? అవే సరియైనవని నమ్మకం ఏమిటి?

సమాధానాలకు ప్రయత్నిద్దాము. 

అసలు ఏదైనా పని మొదలు పెట్టే ముందు, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవటమనేది మంచి పద్ధతి. దానికి సంబంధించిన పుస్తకాలేమన్నా ఉన్నాయేమో చూడటం, పనికొచ్చే సమాచారం సేకరించటం మొదలైనవన్నమాట. ఇంతకు మునుపు ఏమి జరిగింది, ప్రస్తుతం ఏమి జరుగుతున్నది, మొదలైనవి తెలిస్తే, మన స్థాయి ఎక్కడ ఉన్నది? అలాగే, మనమే విధంగా మొదలు పెట్టవచ్చన్నదీ అంచనా వేసుకోవచ్చు. 

మరి ఎలాంటి పుస్తకాలు చదవాలి? చాలా చిన్న సమాధానం. మన అవసరానికి తగినటువంటివి. నెట్లోనూ, మార్కెట్లోనూ ఎన్నో పుస్తకాలుండగా ఏది మనకు తగినదని తెలుసుకోగలం? ఎవరికి వారే నేర్చుకోవాలి/వెతుక్కోవాలి అన్నమాటైతే కనుక కనిపించిన పుస్తకాన్నల్లా చదవటమే బెస్టాప్షన్ ;) టైమ్ కన్జ్యూమింగ్, మరియూ, ఉపయోగ శూన్యం ప్రాక్టికల్ గా చూస్తే. అందుకే, ఏ విషయాన్నైనా గతంలో జరిగిన వాటిని పరిశీలించటం అన్నది ముఖ్యం. ఇక్కడైతే చదివిన వాళ్ళెవరన్నా ఇచ్చే సలహాలూ, సంప్రదింపులూ.

ఉపోద్ఘాతమైంది కనుక అసలు విషయానికొద్దాము. టాపికిక్కడ స్క్రీన్‍రైటింగ్ కనుక, ఆ పేరుతో ఉన్న పుస్తకాలని ముందు చూడాలి. వాటిలో నేను చదివిన ఆరింటిలోనూ ఉపయోగ కరమైనది... సిడ్ ఫీల్డ్ ట్రైలజీ. అంటే మొత్తం సిడ్ ఫీల్డ్ కాక మరో ఐదు పుస్తకాలు చదివానని.

సిడ్ ఫీల్డే ఎందుకు గొప్పది అంటే... 

1) There is logical arrangement of the subject. 
2) Vast experience, and exploratory nature.
3) His invaluble experience with Jean Renoir
4) Explained every minute detail with suitable examples. 
5) Perfect updation
6) Authentic, and readable presentation of subject matter.

ఇంతకీ సిడ్ ఫీల్డ్ ట్రైలజీ అంటే ఏ పుస్తకాలు?

ఆయన వ్రాసినవి మొత్తం ఏడు పుస్తకాలున్నాయి. వాటిలో నేను సిడ్ ఫీల్డ్ ట్రైలజీగా చెప్పేవి ఇవీ...

1) Screenplay
2) Four Screenplays
3) The Screenwriter's Workbook.

మిగిలిన పుస్తకాలనూ తిరగేశాను గానీ, స్క్రీన్‍రైటింగ్ పరంగా మన ఇండియన్ కంటెక్స్ట్ కి అంత ఉపయోగ పడుతాయని నేను భావించటం లేదు.

మొదట స్క్రీన్‍ప్లే చదివాక, ఏవన్నా ఓ నాలుగైదు సినిమాల స్క్రీన్‍ప్లే లను తీసుకుని, పుస్తకంలో చెప్పిన విధంగా ఎనలైజ్ చేసుకోవాలి. దాని వల్ల కాస్త అప్ప్లికేషన్ తెలుస్తుంది. తరువాత ఫోర్ స్క్రీన్‍ప్లేస్ చదివితే, మన ఎనలైజేషన్ ఎలా ఉందో ఒక అవగాహనకు వస్తాము. తరువాత పట్టుకోవాల్సింది... వర్కుబుక్. కాస్త శ్రద్ధగా చదవాల్సిన పుస్తకం. చర్విత చరణం అనిపిస్తుంది కానీ, బాగా ఆసక్తికరంగానూ చదివిస్తుంది. కానీ ఈ పుస్తకం చదవటం చాలా ముఖ్యం. అందులో చెప్పిన విధంగా ఫాలో అవుతూ, అందులో ఇచ్చిన ఎక్సెరెసైజుల్ని చేస్తే కనుక మంచి ప్రాక్టీస్ అవుతుంది. ఈ పుస్తకం పూర్తి చేస్తే, స్క్రీన్‍రైటింగ్ మీద మంచి అవగాహన వస్తుంది. 

ఇక్కడో చిన్న మాట చెప్పాలి. స్క్రీన్‍రైటింగుని సీరియస్ గా తీసుకునే పనైతే ఒక మంచి ఎక్సెరెసైజుంది. అదేమిటంటే, ఒక సినిమాను చూసి, దాని స్క్రీన్‍ప్లేని వ్రాసే ప్రయత్నం చేయటం. చేసి, అసలు స్క్రీన్‍ప్లే తో కంపేర్ చేసుకోవటం. 

దీని వల్ల లాభాలు...

1) మనమెక్కడ ఉన్నామో తెలుస్తుంది. 
2) మన లోపాలూ తెలుస్తాయి
3) ఒరిజినలు స్క్రిప్ట్ లో ఉన్న లోపాల పట్ల అవగాహన కలిగి మనమా తప్పులు చెయ్యకుండా ఉపయోగ పడుతుంది.
4) అక్షరాల్లో ఉన్నదీ తెర మీదకు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో ప్రాక్టికల్ గా తెలుస్తుంది.

తరువాత చదవాల్సిన పుస్తకం... చెప్తే ఆశ్చర్య పడవచ్చు. కానీ, మిస్ కాకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది. ఆయన్ రాం౨డ్ వ్రాసిన ద రొమాన్టిక్ మా౨నిఫెస్టో.

స్టైలైజేషన్ అంటే ఏమిటో తెలుస్తుందీ పుస్తకం వల్ల.  అందులోనూ ముఖ్యంగా ఐదవ అధ్యాయమైన బేసిక్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ లిటెరేచర్ నాలుగైదు సార్లు చదవాలి. 

అయన్ రాం౨డ్ వ్రాసిన ఈ పుస్తకంలో ఎక్కువ రిటెన్ ఫిక్షన్ (నవలలూ, షార్ట్ స్టోరీలకే) గురించే అయినా, స్క్రీన్‍రైటింగప్పుడూ బాగా పనికి వస్తుంది.

ఈ చెప్పుకున్న అధ్యాయంలో 

1) Theme
2) Theme
3) Characterization and 
4) Style 

వీటి గురించి అద్భుతమైన ఉదాహరణలతో వివరిస్తుంది రచయిత్రి. Plot-theme integrity అంటే ఏమిటో బహు చక్కగా వివరిస్తుంది. మైకెలాన్జెలో ఆ౨న్టోనియానీ చెప్పినట్టు... "Everything must fall into place" అంటే ఏమిటో ఇంతకన్నా ఇంకెక్కడా దొరకదు. కథా, కథనం, వర్ణనలూ మొదలైనవి ఎలా ఉపయోగించాలో, ఎక్కద త్రుంచాలో అన్నవి తెలుస్తాయి. 

సిడ్ ఫీల్డ్ చెప్పే "What is the story about? And who is the story about?" అన్నవి ఈ పుస్తకంలో థీమ్ అన్న విభాగంలో బాగా అర్థమవుతాయి.

అలాగే కారక్టర్ డెవలప్మెంట్ గురించీ, కారక్టర్ కన్టిన్యుటీ అన్న దాని గురించీ, కన్సిస్టెన్సీ ఆఫ్ ఎ కారక్టర్ అన్న విషయం గురించీ మంచి ఉదాహరణతో వివరిస్తుంది. 

విషయాలను స్క్రీన్‍రైటింగ్ కు అన్వయించుకుంటూ చదవాలి. రాం౨డ్ గొప్ప విజువల్ స్టైలిస్ట్ కావటం వల్ల ఈ పుస్తకంలోని వివరాలు చాలా ఉపయోగ కరం. చదివిన తరువాతెలాగూ ఆమాట అంటారు. కాకపోతే ముందు సిడ్ ఫీల్డ్ ట్రైలజీ చదివాకే ఇది పట్టుకోవాలి. 

ఒక చిన్న హెచ్చరిక... స్క్రీన్‍రైటింకోసమని రాం౨డ్ పుస్తకం చదవమన్నాను కదాని నా మీదకు యుద్ధానికి రాకూడదు. అసలే ఆమెంటే పడని వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇంకో విషయం పొరపాటున కూడా రాం౨డ్ వ్రాసిన స్క్రీన్‍ప్లేల  గురించి ఆలోచించకండి. అంత నాసి రకంవి మెయిన్‍స్ట్రీమ్ లో దొరకవు ;) She is an authentic writer. That's all.

తరువాత చూడాల్సింది/చదవాల్సింది... పుదొవ్కిన్

On Film Technique, and Film Acting అన్న ఈ పుస్తకం తప్పక చదవాల్సిన పుస్తకం. ఆన్లైన్లో ఫ్రీగానే దొరుకుతున్నదిది. నేనైతే హాయిగా అనువదించేసుకున్నాను, రెండు విభాగాలకు సంబంధించినవి యాభై యాభై వ్యాసాల చప్పున :) కావాలనుకున్న వారికి...

పుదొవ్కిన్ లో ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, మొదలైన వాటి మీద సమగ్రమైన సమాచారమిచ్చారు. అవసరం లేని వాటిని ఎలా తెగ్గొయ్యాలో, లాగి అవతల పడెయ్యాలో, అన్నదీ, మరియూ, విజువల్ స్టోరీ టెల్లింగ్ (సిడ్ ఫీల్డ్ అనే మాట) అన్నది రచయితకు కూడా ఎంత వరకూ అవగాహన ఉండాలో... నేను చెప్పే కన్నా మీరే చదివి తెలుసుకోవటం ఉత్తమం.

ఇక చివరగా చదవాల్సినది... Joseph V. Mascelli వ్రాసిన The Five C's of Cinematography: Motion Picture Filming Techniques అన్న పుస్తకము. సినిమాటోగ్రాఫర్లది స్క్రీన్‍రైటర్లకెందుకయ్యా? అంటారా? ఫర్లేదు. కాస్తన్నా చదవాల్సిన, మరీ డీప్ గా అవసరం లేదనుకోండీ. అవగాహన కోసమైనా చదివితే, ఎంత ఉపయోగకరమో అన్నది ఒక స్క్రీన్‍ప్లే వ్రాస్తున్నప్పుడు తెలుస్తుంది.

పుస్తకాలు చదవక ముందూ, చదివిన తరువాతా నేను వ్రాసిన స్క్రీన్‍ప్లేల్లో తేడా కనిపించింది. అంటే అంతకు ముందుకన్నా తేడాగా ఏమన్నా వ్రాశానా అంటే తేడా ఏమీ లేదు. నా టెక్నిక్ ను మరింత బాగా విస్తృతంగా మెరుగు పర్చుకున్నాను అంతే. Corrected, and filled the gaps అంతే! :)

ఇక next step... కొన్ని ఒరిజినల్ స్క్రీన్‍ప్లేలు చదవటం. దాని గురించి తరువాత వ్యాసంలో... :)

బ్లాగుల్లో స్క్రీన్‍రైటింగురించెందుకురా బడుద్ధాయి వెధవా అంటారా? ఖచ్చితంగా వీపు గోకుడు కోసమైతే కాదు. :D అవసరమైన వాళ్ళకు ఉపయోగ పడొచ్చని

Read more...

Tuesday, August 9, 2011

మరి కొన్ని నానోలు: ఈసారి సీరియస్

అక్షరం
అమరమైంది
పుస్తకాన
జేరి.

మనసూ
మమతా
పోయిన
కాలం.

ఇల్లూ
వాకిలి
పట్టేది
ఎవరికి?

ప్రాణం
విలువ
పోయినపుడే
తెలుస్తుంది.

రాక్షస
రాజ్యం
అయింది
రామభోజ్యం.

అలసిన
తనువుకు
నిద్ర
విశ్రాంతి.

అలసిన
మనసుకు
ధ్యానం
విశ్రాంతి.

ప్రేమ
నిలబెడుతుంది
పగ
పడగొడుతుంది.

ఇల్లు
నీడనిస్తుంది
ప్రేమ
తోడునిస్తుంది.

/bye

Read more...

Monday, August 8, 2011

ఇప్పుడు కొన్ని నానోలొదులుతున్నాను. కాసుకోండి


చంపక తాళం
వదలని రాగం
శృతి (ఎవరో నాకు తెలియదు. నన్నడక్కండి. కళ్ళు పోతాయ్) :D

ఆకాశం
అందనంటుంది.
భూమేమో
వదలనంటుంది

పక్షుల
కువకువలు
సంగీతపు 
మధురిమలు (సినీ తారకూ, ఈ పదానికీ సంబంధం లేదని వక్కాణిస్తున్నాను ;) )

ప్రాచీనుల
కవిత్వం
మనది
కపిత్వం

ఇప్పుడు నానోల డబ్లెట్స్. అంటే లైనుకు రెండు పదాల చప్పున నాలుగు లైన్లన్నమాట...!

ఫ్రెంచి మద్యము,
తెలుగు పద్యము,
జీవిత సత్యము,
కడిగిన ముత్యము.

కూచిపూడి నృత్యము,
మానేసిన పత్యము,
రాం౨డమ్మ గద్యము,
హృద్యము హృద్యము
.

(వీవెనుడూ ఇత్యాదులు లైక్కొట్టిన పాత బజ్జిది :) )

/bye

Read more...

FedEx: ఒక సన్నాసి జననం

ఇందు మూలంగా (ఇందు అనగా ఏ అమ్మాయి పేరునూ కాదు అని మనవి) యావన్మంది జనులకూ తెలియ జేయునది ఏమనగా... రోజర్ ఫెదెరర్ అను సన్నాసి ఒహడు ఇవాళ జన్మించి యున్నాడహో...! =D> =D> =D>

నేను వాడంత బాగా ఆడలేను కనుక మన తెలుగు సమ్ప్రదాయమనుసరించి (మనం చెయ్యము. ఎవరన్నా చేస్తే మాత్రం తెగ ఏడుస్తాము. చూ|| తమిళ్ ప్రాచీన భాషా హోదా ;) )వాడనిన నాకు అసూయ, కచ్ఛ :D అందుకనే సన్నాసి అన్నది. వాడోడిపోతుంటే పండుగ చేసుకుంటుంటాను నా౨చురల్ గా :D దీనికి తోడు సాంప్రాస్ ని ఎనిమిదో విమ్బుల్డన్ గెలవకుండా అడ్డుకున్నాడనే కోపం ఉండనే ఉంది ;)

అయినా గొప్ప ఛామ్పియన్. అందుకే తెలుగు వాడినన్న విషయమ్మరచిపోయి ఒక విమ్బుల్డన్ విలేజర్‍గా ఆలోచించి శుభాకాంక్షలు చెప్తున్నాను

ఇగో ఫెడెస్కూ,

నా లాంటి ఎదవల్ని పట్టింసుకోమాక. ఏదిబడితే అది కూత్తంటం గానీ, నువ్వు మాత్రం కనీసం ఇరవైయ్యోటన్నా ఎయ్యాల... అరదం సేసుకోవాల /nobigdeal  ఏటంటవ్?


Best wishes for Roger Federer, and praying the Almighty to help him win more slams, and an Olympic Gold @the  coveted Wimbledon lawns 2012, so that there will be a bigger bench mark for aspiring players, and naturally that helps increase compitition. After all Records are meant to be broken

/bye

Read more...

Sunday, August 7, 2011

Laugh my friend

/hihi

Laugh my friend as nothing changes 
In the world,
Everything's fine, and simple,
Cute and beautiful.(This first stanza is not mine) /blush

Laugh my friend as nothing bothers 
You in the world,
Every moment's 'be cherished,
Nothing will ever be perished.

Laugh my friend like when you were
A child 
And everything's at your feet,
And did not know defeat.

Laugh my friend 'cas it's heaven
To be and simple like 
A child, 
And the world's benevolent.

And Laugh my friend 'cas 
Nothing's impossible in 
A benevolent universe,
Impossible means I'm possible.

Laugh my friend,
It's just a matter of Seventeen
Muscles it cost an effort, 
And nothing more.

Laugh my friend till you die, 
And don't ask me why,
'Cas it's your life's at it's high
And never let your hope die.


(To all my friends. Not for everybody :) ) 

/nobigdeal

Read more...

Saturday, August 6, 2011

Dhoni... Dhoni... Yes Papa Papa

Attacking cricket?
No Papa
  /no

Striving for wins?
No Papa /no

Hiding behind The Wall
Yea, yea, yea
/wahaha
A post is due for Dhoni on the topic of "Dhoni and the Sanction of the Victim". Just before going for it, this rhyme :D 
Meanwhile, claps to Dravid  
=D>
=D>
=D>
=D>
=D>
=D>
 

Read more...

సన్క నాకే నాయకులున్న దేశమ్మనది. అంత రుసిగుంటదేటి?

ఒక వ్యక్తి చేసిన తప్పులు గుర్తున్నంతగా అతనిలోని గొప్పతనం గుర్తుండదు జనానికి. మానవాళి చేసుకున్న అతి పెద్ద దౌర్బాగ్యం ఇదే...

- రామానుజన్
/hmm

Historian Ramachandra Guha asserts that Rao has become "the great unmentionable" in the Congress party. In an op-ed article in The Telegraph (Calcutta), Guha writes:
"Narasimha Rao may be denied the credit by the present Congress leadership for taking the Indian economy well above the ‘Hindu rate of growth’ of two to three per cent per annum. But they do not let the public forget his greatest defeat, which was his failure to stop the demolition of the Babri Masjid in December, 1992......From the point of view of the present Congress leadership, Rao’s problem was not just that he was not a Nehru-Gandhi, it was also that as prime minister he did not genuflect enough to the Nehru-Gandhis......Now that the Nehru-Gandhis once more control both party and government, P.V. Narasimha Rao has become the great unmentionable within Congress circles. I should modify that statement — Rao can be mentioned only if it is possible to disparage him. Thus his contributions to economic growth and to a more enlightened foreign policy are ignored, while his admittedly pusillanimous attitude towards the kar sevaks in Ayodhya is foregrounded......To forget his achievements, but to remember his mistakes, is a product of cold and deliberate calculation."
మన దేశపు దౌర్భాగ్యమిది.  ఎన్సేపూ ఒహళ్ళ సన్క నాహఠం, ఒహడి మీద మిగతా వాళ్ళు రాళ్ళేస్తుంటే గుంపులో జొరబడి మరిన్ని రాళ్ళేయటం (ఇది ఇక్కడోళ్ళకు బాగా తెల్సన్నమాట :D) 

ఎన్ద పరన్ద ఎన్ద శాటా? 
Drag and drop me 

Read more...

Thursday, August 4, 2011

కర్ణాటకమా? Pig Shit: I condemn the usage of that word

తోటి రాష్ట్రం పేరైన కర్ణాటక పేరును సెన్సేషనల్ హెడ్డీంగుల కోసమని పదే పదే "కర్ణాటకం" అని డెరెగేటరీగా వాడటం ఎంత వరకు సమంజసం? ఇప్పటికే ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కుంభకోణాన్ని ఎలా భ్రష్టు పట్టించారో మనకు తెలిసిందే. మదరాసీయులన్నందుకే మనకంత బాధగా ఉంటుందే, మరి ప్రతి సారీ అలా వాడటం ఛీ!

"I condemn the usage of the word "కర్ణాటకం"
Drag and drop me

వాళ్ళన్నారూ, వీళ్ళన్నారూ అంటూ వాపోయే ముందు మనమ మాటని వాడటం వదిలెయ్యాలి
 

Read more...

= D >

=))

Frankly my dear, I don't give a damn 

/wahaha 

Read more...

Tuesday, August 2, 2011

అయిబు పాడిన అమ్మ పాట


Once again my Aiibu story, before going for a sequel...

పండు వెన్నెల 

ఆ పిల్లలిద్దరూ చెరువు ఒడ్డున కూచున్నారుఒక బల్లఆ బల్ల మీదిద్దరూదేనికోసమో ఎదురుచూస్తున్నట్లున్న ఆ పిల్లల కళ్ళలో తెలియని వేదనముద్దులొకికే చిన్నారుల వదనమ్ముల వేదన గాంచలేని వెన్నెల రాజు మబ్బు చాటున దాక్కున్నాడునీళ్ళలో అలికిడిఇసుక తెన్నె మీద పిల్ల తెమ్మెరలు.ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో అంత విషాదమైన వదనాలతో ఎవరా పిల్లలుఅడిగిందొక చేపఎవరో మరినాలుగు రోజులుగా ఇక్కడే కూచుంటున్నారుఅంది రెండో చేపఒక్కసారి గాల్లోకెగిరి చూసిందా మొదటి చేపకిలకిలా నవ్విందా పిల్లకేరింతలు కొట్టింది.

ఆ పిల్లడు లేచి గంతులేశాడుఎగిరిన చేప కాసేపలా గాల్లోనే నిలిచిపోయిందిఆశ్చర్యంతో.
*** *** ***

చిమ్మ చీకటి 

ఏవో గుసగుసలు వినిపించటంతో హితైషి లేచి కూచున్నాడుఏమిటా అని చెవులు రిక్కించి వినసాగాడుఅమ్మనాన్నాదేని గురించో మాట్లాడుకుంటున్నారు.
నాన్న ఏదో చెప్తున్నాడుఅమ్మ గొంతు ఆతుర్దాగా ఉంది. "అలా ఎలా?" అంటోంది అమ్మ. "ఎలా అయినా సరే తప్పదు మరిఇది జరిగి తీరాలిఆ రెండు చేపల్నీ చంపి వాటిని అమ్మేయాల్సిందేలేందే మనకు డబ్బులు దొరకవుదీపావళి జరుగదు."

"అయ్యో మరి అవి మన పిల్లలు పెంచుకుంటున్నవి కదారోజూ సాయంత్రాలు వాటికి మేత పెట్టి ఆడుకుంటారుపాపం దూర తీరాలనున్న దీవుల్ని చూడాలని మన వాడి ఆశఆ చేప పెద్దదైతే దాని వీపు మీద కూచుని అవన్నీ చూసి రావాలని ఎన్ని సార్లంటుంటాడో కదా."

ఎక్కడో వాన వాసనమెరుపులు మెరిశాయిహితైషి హతాశుడయ్యాడు. "నా చేప పిల్లని నాన్న చంపి అమ్మేసి ఇంట్లో దీపావళి జరుపుతాడాపండుగంటే మాకిష్టం.కానీ మా చేప పిల్లల్ని చంపేస్తే ఎలాపాపం చిన్న చిన్నవివాటిని చంపి మాకు పండుగ చేస్తే మరి వాటి కోసం పండుగ చేస్తారు?"
*** *** ***

విపరీతమైన ఎండ.

మధ్యాహ్న భానుడు జరిగిన ఘోరాన్ని చూశా అన్నట్లు ఆవేశాన్నంతా భూమి మీద తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడుశ్రద్ధ మొహం చేతులతో కప్పుకుని ఏడుస్తున్నదిఅన్నయ్యకి విషయం చెప్పాలి.ఎలా చెప్పాలివాడూ తనలాగే చిన్న వాడే కదాఎలా తట్టుకుంటాడుకానీ ఎలాగోలా తెలుస్తుంది కదా.నాభి దగ్గర నుంచీ దు:ఖం పొంగుకుని వస్తుంటే ఇసుకలోనే కుప్పకూలిపోయిందిబోర్లా పడుకుని రోదిస్తోంది.కన్నీళ్ళూ ఇసుకలో ఇంకిపోయినైనోట్లోకి ఇసుక పోతున్నా తెలియని దు:ఖంవళ్ళు మాడిపోతున్నా పట్టించుకోలేనంత దు:ఖం.
*** *** ***

జోరున వాన

టపాకాయలన్నీ తడిసిపోయాయినాన్న వళ్లంతా తడిసిపోయిందిపిల్లల కోసం తెస్తున్న టపాసులన్నీ తడిసి ముద్దైపోయాయిపిల్లల కోసంపిల్లల కోసంపిల్లల... ఊపిరాగిపోతున్నంత బాధ.అసలు పిల్లలు ఈ రెండు రోజుల్నుంచీ ఎందుకలా ఉన్నారువాళ్ళ సంతోషం కోసమే కదా తను ఈ టపాసుల్ని తెచ్చిందిపండుగ జరగదనే భయమాచేపల్ని చంపి అమ్మేశనని బాధాపండుగ జరుగదనే భయమైతే ఇప్పుడు అన్నీ తీసుకొస్తున్నాడుఇంక ఇవి చూసి కేరింతలు కొడతారువాళ్ళ కళ్ళలో ఆనందమే కదా తనకీ అతివకీ కావాల్సిందీ?

మరి అదే చేపల్ని చంపి అమ్మేశానని బాధాఅలా అయితే ఈ టపాసుల్ని చూపి ఎలాగన్నా వాళ్ళ బాధను రూపుమాపొచ్చుకానీకానీ... ఇప్పుడివన్నీ... అటు చేపలూ పోయి ఇటు పండుగకు తెచ్చినవన్నీ వాన పాలయి... ఏమి ఆలోచించాలో తెలియని పరిస్థితిఇంతలో దాటుతున్న కాలువ పోటెత్తిందిమొండిగా దాటేద్దామని అడుగు ముందుకేశాడుకుడికాలు పెట్టి ఎడమకాలు ఎత్తాడోలేదో...
*** *** ***

విపరీతమయిన గాలి 

విసురుగా వీస్తోందిచితి మంటల్లోని బూడిద ఎగిరొచ్చి అతివ కళ్ళలో పడిందిఇది కన్నీరాలేక కళ్ళలో పడిన బూడిద వల్ల వచ్చిన నీరాభర్త పోయాడుపిల్లల బాధ వర్ణనాతీతంనాన్న కోసంపోయిన చేపల కోసంతను దైవంగా భావించిన భర్త ఒక వైపు తనను వంటరి దాన్ని చేసిపిల్లలు దిగులుగా మరో వైపువారినెలా తను సాకాలిడబ్బు లేదుతోడుగా భర్త లేడు.

ఈదురుగాలికి ఆమె జుట్టు ఎగిరి ఎగిరి పడుతోంది. "దేవుడాఈ దు:ఖాన్ని నేను భరించ లేనుఏమి తప్పు చేశానని నాకీ శిక్షనీకేం కావాలిఎందుకిలా మమ్మల్ని వేధిస్తున్నావునన్ను తీసుకుని నా పిల్లల్ని సంతోష పరిచేలా ఏదన్నా చెయ్యి.మనసులోనే గొంతెత్తి అరిచింది.

ఆ రాత్రికి పిల్లలు ఏడుస్తూనే ఉన్నారుఎలాగోలా వారినూరడించే ప్రయత్నం చేస్తూనే ఉందిగానీ పిల్లలు కదా.ఒకరాత్రి వేళకు ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారికళ్ళ క్రిందాబుగ్గల మీదా కన్నీటి చారికలుఅతివ లేచిమ్ది.ఒక్కసారి పిల్లలని ముద్దాడాలనుకుంది. " ఎలాగూ ఈ బంధనాలని త్రెంచుకుని పోతున్నానునన్ను తీసుకునైనా ఆ దేవుడు నా పిల్లలకు మంచి జీవితం ఇవ్వక పోతాడాఅన్నీ వదులుకున్నాక ఇక ఇది మాత్రం ఎందుకు?" తన కోరికని అణచుకుని చెరువు వైపు అడుగులు వేస్తున్నదిగాలింకా వీస్తూనే ఉంది.
*** *** ***


మంచు 

విపరీతమైన మంచుదారంతా పరుచుకుందిపొడూగ్గా నల్లటి కొటేసుకున్న మనిషి నడుస్తున్నాడు.అతని వెనుక ఒక పొట్టి మనిషిచేతిలో వేట కొడవలుందిమీద పడుతున్న మంచు తునకల్ని దులుపుకుంటూ వెనక్కి తిరిగి అరిచాడు. "ఏహోయ్పాటేసుకోరా అయిబూ!" అతని స్వరం ఖంగు మనేలా ఉందిఒకరకమైన గాంభీర్యంఒకరకమైన పొగరుతనే సర్వంహసహా అన్నట్లు.


"కాళ్ళుకాళ్ళు మంచులో కూరుకున్నాయికాస్త లేవదియ్యి దొరా," సాయమడిగాడా పొట్టి వ్యక్తి.

"హోరినీబరువెక్కువఎత్తెక్కునాకాళ్ళే కూరుకోలేదునీకాళ్ళాపొట్టోడివిబరువు తక్కువ."

"అట్టగాదులే దొరానీపాటి బలం లేదు నాకుకాస్త సాయమందివ్వు దొరాపాటేసుకుంటానుగానీ." ఆ మనిషి అటువైపు వెళ్ళి జుట్టు పట్టుకుని ఒక్క లాగు లాగాడుఅంతేపొట్టి మనిషి మంచులోంచీ బయట పడ్డాడు. "నా బూటులిస్తానుగానీ వాటినేసుకోఇవైతే మంచులో దిగబడవు."

"మరి నీకెట్టా దొరా?"

"ఉహూరుకొహోరా పొట్టోడా!" పెద్దగా నవ్వాడా మనిషిఆ నవ్వు ఆ అడవంతా ప్రతిధ్వనించిందిఅంతే!మంచు కురవటం ఆగిపోయిందిచుట్టూ ఉన్న చీకట్లు చెదిరిపోయి వెలుతురు పరచుకుందిఅతను నవ్వుతూనే ఉన్నాడుఆ పొట్టి వ్యక్తి పాటందుకున్నాడుఆ నవ్వూపాటా శృతిగలిసి...
*** *** ***

హోరు గాలి

దుమ్మురేగుతోందివాతావరణమంతా చిందర వందరగా ఉందిహితైషిశ్రద్ధా అమ్మకోసం వెతుకుతున్నారు పొద్దున్నుంచీఎక్కడా కనబడదేఎక్కడని వెతకాలిఎవరినని అడగాలివెతుకుతూనే ఉన్నారుకనపడ్డ చెట్టునడిగారుపుట్టనడిగారు. రాళ్ళనడిగారురప్పలనడిగారుమనుషుల్నడిగారు.బంగారు రంగు ఛాయతోనీలం రంగు చీరెలో పొడుగాటి ఆవిడనెక్కడన్నా చూశారా అనిఎవరూ చెప్పలేదు.వీళ్ళకి సాయంత్రమైనా దొరకలేదుముక్కునోళ్ళలో దుమ్ము పడకుండా రుమాలు నడ్దం పెట్టుకుని దగ్గరలో ఉన్న సావిడిలోకి పరిగెత్తారు. "అన్నయ్యాఆకలౌతోందిరా," శ్రద్ధ అంది.
*** *** ***


దబా దబా పడుతోంది వాన 

ఆ పొడుగాటి మనిషి రెండు భుజాల మీదా ఇద్దరు పిల్లలువెనక్కి తిరిగి పెద్దగా అరిచాడు. "ఏహోయ్నాలుగు దుంపలేవన్నా దొరికితే పట్టుకురారా అయిబూ." ఆ కేకకి పిల్లలిద్దరూ కళ్ళు తెరిచారుమగతగా చుట్టూ చూసికళ్ళ మీద పడుతున్న చినుకుల్ని తుడుచుకున్నారు. "మే... మే...మెక్కడున్నాంనువ్వెవరు?" ఇద్దరూ కాస్త భయంతోనూమరికాస్త ఆశ్చర్యంగానూ అన్నారు.

అతను బదులివ్వలేదుఓ నాలుగంగల్లో ఎదురుగా ఉన్న రాతి మేడలోకి దారి తీశాడువాళ్ళనిదరికీ తన కోటులోంచీ రెండు తువ్వాళ్ళు తీసిచ్చితుడుచుకుని కట్టుకోమన్నాడుశ్రద్ధ ప్రక్కనే ఉన్న గదిలోకి వెళ్ళింది.హితైషి అక్కడే తుడుచుకునిదాన్ని కట్టుకున్నాడు. "ఏం పిల్లా భయమేయటంలాసాయం కావాలా?"అడిగాడా మనిషి. "ఊఁ..." నీరసంగా అందిలోపల ఒకమ్మాయి ప్రత్యక్షం అయింది. "ఇటురా పిల్లానేను తుడిచి కడతాను," అందిశ్రద్ధ ఆ గుడ్డను ఆ అమ్మాయికిచ్చిందిపనయ్యాక "ఓహ్నాంగవయంతి," అందా అమ్మాయిఅంతే మాయంశ్రద్ధకివేమీ పట్టేలా లేదుఅంత సమయాన్ని కూడా ఆ మనిషివ్వలేదు. "అన్నం తిందువు రా పిల్లా," పిలిచాడుకలిపి గోరు ముద్దలు పెడుతూ వారి కథంతా విన్నాడు.
*** *** ***


ఎర్రని ఎండ 

చెమట్లు కక్కిస్తోందిఆ పొడుగాటి మనిషి ఒక చెట్టుని కొడుతున్నాడుఇల్లు కట్టటం కోసం. "ఏహోయ్గొడ్డలి పిడిరిగిందిమరో పిడి పట్రారా అయిబూ." చెమట్లు కారిపోతున్నాయికాస్త దూరంగా హితైషీశ్రద్ధా ఆడుకుంటున్నారుదిగులుగ్ కూచుంటే ఊరుకోనని చెప్పాడా మనిషి మరికుడిచేతి బొటన వేలితో నుదుటనున్న చెమటను తీసివిదిలించాడుఅంతేఅక్కడంతా చాలా ఖాళీ స్థలమొచ్చిందిచేతులు ఝాడించి వళ్ళు విరుచుకున్నాడుఅక్కడో మేడ ప్రత్యక్షమయిందితల విదిలించాడుచెమట చుక్కలు ఎగిరెళ్ళి కాస్త దూరాన పడ్డాయిచిత్రం అక్కడో చెరువుదాని ముందు ఒక బల్లపిల్లలిద్దరూ ఆశ్చర్యంతోనూ,ఆనందంతోనూ చూస్తున్నారుఇంతలో ఆ పొట్టి మనిషి వచ్చాడురెండడుగులెత్తున ఆ పొట్టి వ్యక్తి, "నాకు తెలుసులే దొరనువ్వు దేవుడివిఎప్పుడు కావాలనుకుంటే అప్పుడది చేస్తావునడుమ నడుమ ఆటలాడుతావు బొమ్మలతో."

పెద్దగా నవ్వాడా పొడుగాటి మనిషి.చుట్టు ఉన్న చెట్ల నుంచీ పూలొచ్చి అక్కడ వానలా కురిశాయి.
*** *** ***

కన్నుపొడుచుకున్నా కనబడని చీకటి

"ఏహోయ్కొవ్వొత్తి పట్టుకురారా అయిబూ," అరిచాడా పొడుగాటి మనిషి.
 
"అంటే నువ్వు దేవుడివన్న మాట!" కళ్ళు త్రిప్పుతూ అంది శ్రద్ధ. "అవును." సమాధానం వచ్చింది. "మరైతే మా అమ్మ ఎక్కడుందో చెప్పవూ?" ఆశగా అడిగాడు హితైషికోటు సవరించుకుంటూ, "మరైతే మీరు ఏడ్వనంటేనే..." విషయం కాస్త గ్రహించింది శ్రద్ధఏడుపు తన్నుకొచ్చిందిపరిగెత్తుకెళ్ళి ఆ పొడుగాటి మనిషి కాళ్ళు చుట్టేసింది. "నాకమ్మ కావాలినాకమ్మ కావాలి." అడుగుతూనే ఉంది. "మరదే నేను చెప్పింది.నువ్వేమనుకుంటున్నావునా దగ్గరే ఉందిక్షేమంగామీకోసమే నా దగ్గరకొచ్చింది."


"మరైతే మా అమ్మని మాకిచ్చేయ్."

"కుదరదమ్మా."

"ఏంఎందుకు కుదరదునాకు అమ్మ కావాల్సిందే."

"మీ అమ్మ చనిపోయింది కదా?"

"అంటే చనిపోయిన వాళ్ళే నీ దగ్గరకొస్తారా?"

"అవును."

"అంటే మేము కూడా చనిపోయామా?"

"అదేమిఅలా అన్నావు?" నవ్వాడుశ్రద్ధ నెత్తుకుంటూ.

"మరి మేమూ నీదగ్గరకే వచ్చాముగా!"
"కాదు కదానేనే మీ దగ్గరకొచ్చాను."

"మరి మా నాన్న?" ఈసారి హితైషి అడిగాడు.

"మరి మీ నాన్న కూడా మీ అమ్మలానే."

"ఒక్కసారి అమ్మనాన్నలని మాకు చూపించవూ?" జాలిగా అడిగాడు హితైషి. "ఊఁ..." వంత పాడింది శ్రద్ధ.

"నేను చూపిస్తానుకానీ వాళ్ళకి మీరు గుర్తుండరే..."

"అదేమి?" ఇద్దరూ ఒక్కసారే అడిగారు." వాళ్ళు నా దగ్గరికొచ్చాక మళ్ళా ఇక్కడి విషయాలు గుర్తుండవు."చెప్పాడా పొడుగాటి మనిషి. "మరి నువ్వెందుకు మాకోసం వచ్చావువాళ్ళకి గుర్తుండేది ఇక్కడ ఉన్నంత వరకే కదామా అమ్మ మాకోసం ఆలోచించేది ఇక్కడున్నంతసేపే కదామరి ఇక్కడున్నప్పుడు అడిగినది వాళ్ళకు గుర్తుండనప్పుడు నువ్వు కష్టపడి మాకోసం మంచులోవానలోఎండలో ఎందుకొచ్చావు?" హితైషి అడిగాడు.

ఆ పొడుగాటి మనిషి నవ్వాడుచీకటి పోయి వెలుగొచ్చిందిచక్కని సువాసనలు చుట్టుముట్టాయి. "ముచ్చటైన ప్రశ్నమీ అమ్మ వేరే ఊరికెళ్తూ నీకో పనిచెప్పిందనుకోఅమ్మ లేదు కదాను నువ్వా పని ఆపేస్తావా చేయటం?"

"ఉహూఁఅమ్మ చెప్పిన పనేదైనా చేస్తాను నేనుఉన్నా లేకున్నా."

"నేను కూడానేను కూడా చేస్తాను దేవుడూ!" ముద్దు మాటలతో అంది శ్రద్ధ.

"మరి నేనూ అంతే పిల్లలూఅమ్మ చెప్పిన పనేదైనా చేస్తానుఅమ్మ చనిపోయే ముందునన్ను తీసుకుని నా పిల్లల బాగు చూడు," అందిఅందుకే వచ్చాను నేను మీ కోసం."


"అంటే అమ్మ చెప్పినదేదైనా చేస్తావాదేనికిమరి నీ అమ్మ ఎవరు?" శ్రద్ధ అంది.

"అమ్మ చెప్పినదేదైనా అంటే చేయదగినదేదైనా చేస్తానుేయరానిదేదీ చేయనునాకు అమ్మ లేదు."

"మరి అమ్మ లేకుండా నువ్వెలా పుట్టావు?"

"మీ అమ్మను పుట్టించింది నేనునాకు అమ్మ లేదునేనసలు పుట్టలేదుఅయినా నీకు ఇప్పుడు అర్థం కాదులే శ్రద్ధాచెప్పాల్సొచ్చినప్పుడు చెప్తాను."

"అవునుకొన్ని విషయాలు మాకు అర్థం కావుచిన్న పిల్లలం కదాఅమ్మ కూడా చెప్పాల్సొచ్చినప్పుడు చెప్తాను అనేది," హితైషి అన్నాడు.

"సరేలే దేవుడూనువ్వు మాకోసం వచ్చావుమాకిక భయం లేదుకానీఅమ్మకి మేము గుర్తు లేకున్నా మాకు అమ్మ గుర్తుంది కదాఒక్కసారి చూపవూ?"

"అయ్యోనీకెలా చెప్పనమ్మానువ్వు మీ అమ్మను చూడాలంటే నువ్వు కూడా చచ్చిపోవాలి."

"ఐతే నన్నూ చంపేయ్," చేతులు పైకెత్తి అదేదో పెద్ద ఘనకార్యం అన్నట్లు అందిదేవుడు పెద్దగా నవ్వాడు."నువ్వు నాతో వస్తే నువ్వు కూడా ఇక్కడి సంగతులు మర్చిపోతావుఅసలు మీ అమ్మని నువ్వే గుర్తుపట్తలేవుఇక నువ్వు నాతో వచ్చుపయోగమేముంది?" ఇంతకు ముందు చావు అన్న మాటనన్న దేవుడా మాట ఈసారి వాడదల్చుకోలేదుతనతో రావటమన్నాడు.

శ్రద్ధ బిక్క మొహం వేసింది. "అంటే అమ్మనికెప్పుడూ చూడలేనా?" ఏడుపు గొంతుతో అంది. "ప్లీజ్ దేవుడూ.నువ్వు ఏదైనా చేస్తానంటావుఅన్నీ నేనే అంటావు కదాప్లీజ్ దేవుడూఒక్కసారి అమ్మని చూపవూ." గడ్డం పట్టుకుని బ్రతిమిలాడుతున్నట్లందిదేవుడు చిరునవ్వు నవ్వి అన్నాడు. "అమ్మనడిగావు సరేమరి నాన్న?మీ చేప పిల్లని చంపాడని కోపమా?"

"ఛీ లేదు దేవుడూఅమ్మెప్పుడూనాన్న పక్కనే ఉంటుందిఅందుకే అడగలేదునాకు నాన్న మీద కోపం లేదు దేవుడూప్లీజ్ దేవుడూఒక్కసారి అమ్మను చూపు దేవుడూ." ఏడుస్తూచేతులతో గుండెల మీద కొడుతూ అడుగుతూనే ఉందిఅది చూసి హితైషికి కూడా ఏడుపొచ్చింది.

దేవుడికి నవ్వొచ్చింది. "ఆహా పిల్లలుఎన్నిచ్చినాఆఖరికి నేనొచ్చినా అమ్మే కావాలంటారు కదా."

పెద్దగా కేకేశాడు. "ఏహోయ్అయిబూఇల్లారా!"

అయిబు పరిగెత్తుకుని వచ్చాడు. "ఒక పాట పాడవోయ్." "ఏం పాట దొరా?" "నీకు నచ్చిందేదైనా సరే." "చిత్తం దొరా." అమ్మ పాడే జోల పాట పాడాడుఒక మెరుపు మెరిసిందిచలటి గాలి వీచింది.

"మీ అమ్మా నాన్నా వస్తున్నారుకానీ కాసేపేమీకోసం రప్పించానునా కోసం కాసేపట్లో పంపేయాలి,"దేవుడన్నాడు.

"సరేఅని ఇద్దరూ బుద్ధిగా తలూపారుఆ మెరుపులోంచీ అమ్మనాన్న దిగొచ్చారుఇద్దరూ నిర్వికారంగా చూస్తూ నిలబడ్డారు. "అమ్మ!" అంటూ ఆత్రంగా వెళ్ళబోయింది శ్రద్ధకానీ ఆమె మొహంలోని నిర్వికారతను చూసి బిక్క మొహం వేసిందిదేవుడు నవ్వుకున్నాడుచెప్పినా ఈ పిల్లలకు అర్థం కాదని. "శిశూనాం మాతృ ప్రాప్తి:" అని నవ్వాడువాళ్ళిద్దరికీ పుర్వ ఙ్ఞాపకం వచ్చిందిఅతివ చేతులు జాపి పిలిచిందిప్రేమగా.ఇకాగలేదు శ్రద్ధపరిగెత్తుకుని వెళ్ళి మరీ చంకనెక్కిందిహితైషి నాన్న భుజానెక్కాడుకాసేపు వారలా ఉండగా దేవుడుఅయిబూ ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకున్నారు. "వాళ్ళకు నన్ను గూర్చి చెప్పిందే అమ్మ కదాగురువెప్పుడూ గొప్ప అని నేను చెప్పే కదా గురు పరంపరను మొదలిడిందిఅమ్మే ఆది గురువు మానవులకు," దేవుడన్నాడు.

శ్రద్ధ అమ్మ చంకన నుండి దిగి దేవుడి దగ్గరకొచ్చింది. "దేవుడూనన్నెత్తుకోవూ?"

దేవుడు రెండు చేతులూ పట్టి లేపి భుజానేసుకుని మిగిలిన ముగ్గురి వైపూ నడిచాడు. "దేవుడూఅడగ్గానే అమ్మనీనాన్ననీచూపావుసరేనువ్వన్నట్లే వాళ్ళని పంపెయ్యి." దేవుడు నవ్వాడువాళ్ళ నిజాయితీకి.వాళ్ళను సాగనంపాడు"రేపటినుంచీ మీరు ఆ కొత్త ఇంట్లో ఉండండిమీకు కావలసినవన్ని అందులో ఉన్నాయినేను కనబడకపోయినా ఎప్పుడు పిలుస్తే అప్పుడొస్తానుమీకో చిన్న బహుమతిమీ నిజాయితీకి."మీకోసం చెరువులో చేప పిల్లలుకానీ ఎప్పుడొస్తాయనేది మాత్రం చెప్పనుఒక చిన్న షరతుఇకపైన మీకంట నీరొలక కూడదుభయం ఉండకూడదుదేనికీ అశక్తత పనికిరాదుసరేనా?"

వాళ్ళిద్దరూ సంతోషంగా నవ్వారు.
*** *** ***

పండు వెన్నెల

అలా గాల్లో ఉన్న చేప మళ్ళా నీళ్ళలో పడ్డదిపిల్లలిద్దరూనీళ్లలోకి పరిగెత్తారుఏయ్ చేపలూ మీరు మాకోసమేనేనూ అన్నా మనం పెద్దయాక దేశాలన్నీ చూడాలిసరేనా?" అరుస్తోంది శ్రద్ధ సంతోషంగా.అప్పుడే టపాసుల మ్రోత మొదలైందిమన నల్ల కోటు దేవుడు ఆ సమయంలో తెల్ల కోటేసుకుని ఆనంద తాండవం చేస్తున్నాడు తన దేవేరులతోఆరోజు కార్తీక పున్నమి.

అయిబు పాడుతున్నాడు...

ఎచటనైతే భయముండదో...
ఎచటనైతే కంట నీరొలకదో...
ఎప్పుడైతే ప్రపంచంలో అసత్తువుండదో...
ప్రేమైక జీవనం వర్ధిల్లు సమయాన
సృష్టి అందం ఇనుమడిస్తుంది.

Read more...

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

Archiva

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP