Wednesday, October 19, 2011

ప్రత్యేక నరసరావుపేట రాష్ట్రం కోసం ఆమరణ నీరాహార దీక్షరేపటి నుండే. కార్యాచరణ ప్రణాలిక త్వరలో

/bye 

Read more...

Tuesday, October 18, 2011

సంధ్యా కవిత:

P O E T R Y – ఓ హృద్యమైన కవిత

vlcsnap-2011-10-13-14h19m26s30
పక్షులు కిలకిలారావాలతో ఆ ప్రాంతం సందడిగా ఉంది. పరిమళ భరితమైన మలయ మారుతం లేలేత చిగురాకులను పలుకరిస్తూ, ఊసులాడుతున్నది. నీలి రంగు తివాచీలా ఉన్న ఆకాశపు ప్రతిబింబాన్ని తనలో చూపెడుతున్న ఆ సరస్సు ప్రత్యేకమైన అందాన్ని సంతరించుకున్నది. చుట్టూ ఉన్న పచ్చటి ప్రకృతి హొయలుబోతున్నది. స్వప్న సీమలా ఉన్న ఆ వనము సంతోషానికి చిరునామాలా ఉన్నది. అలాంటి చోట ఎవరికైనా కవిత్వం ఉప్పొంగి వస్తుంది. కానీ ఒక విషయం. ఈ రోజుల్లో కవిత్వమంటే ఎందరికి ఆసక్తి ఉంది? ఎద ఉప్పొంగి ప్రవహించే భావాలను ఎంత మంది అక్షరాల రూపంలోకి మార్చి అనుభూతింపజేయ గలుగుతున్నారు? ఏవీ ఒకప్పటి కవిత్వపు సొగసులు? ఏవీ సరియయిన కవితా సంకలనాలు? గుండెను చెమ్మగిల్లేలా చేయగలిగే ఆ మాటల మంత్రాలేవి? ప్రస్తుత ప్రపంచంలో  గొప్ప కవి ఎవరు అంటే దశాబ్దాల క్రితంలా ఏ Wordsworth లా లేదా అలాంటి పేరు ఎందరు చెప్పగలరీ రోజుల్లో? కవిత్వాన్ని అనుభూతి చెంది, ఆస్వాదించ గల యువత ఎక్కడ?
కవిత్వం ఔడ్డేటెడ్!
కవిత్వం సరే! కమ్మని అనుబంధాలేవీ? ఆ అనుబంధాల ఊసులేవీ? తాతయ్యా, నాయనమ్మల కబుర్లేవి? అమ్మమ్మ ప్రేమగా పంచే తినుబండారాల గుబాళింపులేవి?
సున్నితమైన అనుబంధాలు ఔడ్డేటెడ్!
కనుమరుగైపోతున్న మానవ సంబంధాలను, అంతకు ముందే ఆ ప్రమాదంలో పడ్డ కవిత్వంతో పోలుస్తూ, కొరియెన్ దిగ్దర్శకుడు లీ చాంగ్-డాంగ్ తీసిన అద్భుత దృశ్యకావ్యమే ‘పోయెట్రీ’. ఒక చిత్రం చూడండి. పోయెట్రీ… పోయె ట్రీ. వెళ్ళిపోయిన వృక్షం. ఒకప్పుడు మహా వృక్షంలా వెలిగిన కవితా సాహితి ఇప్పుడు కనుమరుగవుతున్నదా? అన్న ప్రశ్నను, మాన సంబంధాలకు జతగలిపి, లోతైన ప్రశ్నలు రేకెత్తిస్తూ సాగుతుందీ సినిమా.
ఏ సినిమాకైనా మొదటి పది నిముషాలు కీలకం. కథ వాతావరణం లోనికి తీసుకుని వెళ్ళేందుకు. ఈ సినిమా ప్రారంభ దృశ్యం ‘హన్’ నదీ జలాల మీద. మొదట దర్శకుడు మనకు నీటిని చూపుతాడు. అలా ప్రవహించే నదీ జలాల సవ్వడులు వింటూ, ఆ నీలి నీటి ప్రవాహాన్ని చూస్తూ, ఒడ్డున ఉన్న పచ్చటి చెట్లను చూస్తూ మనం ప్రయాణం సాగిస్తుండగా కొంత మంది పిల్లలు ఆడుకుంటూ కనిపిస్తారు. వారి ఆటల ఊసుల్లో మనమున్న సమయంలో దూరంగా నీటిలో ఏదో కొట్టుకుని వస్తూ కనిపిస్తుంది. దగ్గరకు రాగా, రాగా అది ఒకమ్మాయి శవం!
కథః ఈ సినిమా కథను చెప్పటం చాలా కష్టం. ఎంత కష్టమంటే మానవ హృదయపు లోతులను కనుగొనే ప్రయత్నమంత.
డైవర్సీ అయిన కూతురు వదిలి వెళ్ళిన మనుమడిని భరిస్తున్న మి-జా అనే వృద్ధురాలు జ్ఞాపక శక్తి తగ్గుతోందని గ్రహిస్తుంది. క్రమంగా తన చేయి తిమ్మిరి ఎక్కినట్లుగా ఉండటం, సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుండటంతో ఇక తప్పదనుకుని డాక్టర్ను సంప్రదించటంతో అసలు కథ మొదలవుతుంది. రంగు రంగుల పూల పూల స్కర్ట్స్ వేసుకునే మి-జా, ఒక చిన్న పిల్లలా తమాషాగా సరదా అయిన వ్యక్తి. గవర్నమెంటిస్తున్న సబ్సిడీల మీద బ్రతుకు బండిని లాగిస్తుంటుంది. వేణ్ణీళ్ళకు చన్నీళ్ళలా పక్షవాతంతో బాధ పడుతున్న మరొక వృద్ధుడికి నానీలా పని చేస్తూ, అతను ఇచ్చే డబ్బుతో కాలం గడుపుతుంటుంది. అలాంటి పరిస్థితులలో ఉన్న మి-జా కు కవిత్వమంటే ఉన్న ఆసక్తి వల్ల దగ్గరలోనే ఉన్న లోకల్ కమ్యూనిటీ సెంటర్లో జరుగుతున్న పోయెట్రీ క్లా౨సుల్లో చేరుతుంది. అక్కడ కవిత్వం వ్రాయటం గురించి కన్నా, అనుభూతులను గమనించటం, వాటిని మాటల రూపంలో పెట్టటం ఎలా అన్న దానిమీద చర్చ నడుస్తున్న సమయంలో మి-జా అక్కడ అడుగు పెడుతుంది. ఇలా ఎలాగోలా తన జీవనాన్ని ఆనందంగానే గడుపుతున్న ఆమె జీవితంలో ఒక పెద్ద కుదుపు మనవడి స్నేహితుని తండ్రి వల్ల వస్తుంది.
ఒక రోజు మి-జా తన కవిత్వపు క్లా౨సుకు వెళ్ళబోయే సమయంలో ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆమె విషయం చెప్పి, క్లా౨సు ముగిశాక కలుద్దామని అంటుంది. చెప్పిన టైముకు వచ్చిన ఒకతనితో ఆమె వెళుతుంది. అప్పుడు అక్కడ మరో నలుగురు పరిచయమవుతారు.  వారు మి-జా మనుమడి స్నేహితుల తండ్రులు. హైస్కూలులో చదివే హీ-జిన్ అనే బాలికను ఆరు నెలల పాటూ రేప్ చేసి హింసిస్తారు. ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుంటుంది. అయితే ఈ వివరాలన్నీ ఒక డైరీలో వ్రాసుకుని పెడుతుంది. అది పోలీసుల చేతికి అందితే తమ పిల్లలకు ప్రమాదమనీ, దాన్ని తప్పించాలంటే ఆ పిల్ల తల్లిని కన్విన్స్ చేసి కేసు ఉపసంహరించుకునేలా చెయ్యాలనీ, దాని కోసం అవసరమయితే ఆమెకు డబ్బునిచ్చి అయినా ప్రమాదం నుంచీ గట్టెక్కాలనీ చెప్తారు. తన మనుమడు కూడా ఈ వ్యవహారంలో ఉండటం మి-జాను బాధిస్తుంది. ఆ పిల్ల తల్లి వేదనను గ్రహించి తల్లడిల్లుతుంది. తన మనుమడు ఇందులో ఇరుక్కున్నాడని తెలిసినా సరియయిన న్యాయం జరగాలని, అందు కోసం తను కృషి చెయ్యాలని అనుకుంటుంది.
కథనం: చూడటానికి సాదా సీదాగా ఉన్న ఈ కథ లీ చాం-డాంగ్ చేతిలో పడటం వల్ల అద్భుతమైన సినిమాగా మారింది. సినిమా అన్నది దృశ్య మాధ్యమం. ఇక్కడ కథను మాటల్లో కాకుండా బొమ్మలలో చెప్పాలి. అలా కాకుండా మొత్తం మాటల రూపంలోనే లాగిస్తే అది డ్రామాకన్నా ఎక్కువేమీ కాదు. ఈ విషయం బాగా తెలిసిన అతి కొద్ది దర్శకులలో లీ ఒకడు. మొదటి సినిమా గ్రీన్ ఫిష్ మినహాయిస్తే మిగిలిన అన్నిటిలోనూ తనదైన ముద్రను వేస్తాడు. తెర మీద కనిపించే ప్రతి దృశ్యంలోనూ ఎన్నో విషయాలు. ఒక్క చిన్న వివరం కూడా అనవసరంగా ఉండదు. కథా, కథనాలు కలగలసి ఉండటం అతని సినిమాలలోని ప్రత్యేకత. ఈ సినిమా కూడా ఇందుకు మినహాయింపు కాదు.
కథను దృశ్యాత్మకంగా చెప్పటమే కాదు. ప్రేక్షకుని తెలివి తేటల మీద గౌరవం ఉండటం కూడా లీ కలిగి ఉన్న సుగుణాలలో ఒకటి. అందుకే అనుకున్నదంతా గుమ్మరించ కుండా ప్రేక్షకుల ఆలోచనకు కూడా వదలివేస్తాడు. తెర మీద కనిపించే బొమ్మ ఎంత కథ చెపుతుందో, కనిపించని మన ఆలోచన కూడా అంతే స్పందనను మనలో కలుగజేస్తుంది. Th e ability to help the viewer to integrate his imagination with the pictures shown on the screen is of highest class. అలా చెయ్యగలగటమే లీ ను తన సమకాలికులలో ప్రత్యేకమైన వాడిగా నిలుపుతున్నది. విక్రమార్కుని కదన కౌశలాన్ని తలపించే కథన కౌశలంతో వీక్షకుణ్ణి కట్టి పడేస్తాడు లీ. సాధారణ పరి భాషలో చెప్పాలంటే లీ వన్నీ ఆర్టు సబ్జెక్ట్స్. అతని సినిమాలు కూడా. కానీ, అవన్నీ బాక్సాఫీసు దగ్గర కూడా చెప్పుకోదగ్గ విజయాలు సాధించాయి. అలాంటి విలక్షణమైన దర్శకుడు కనుకనే లీ అంటే ప్రపంచ సినిమాలో గౌరవం.
ఈ సినిమాను మొదటి పది నిముషాలు కనుక ఓపిక చేసుకుని చూస్తే ఎలాంటి ప్రేక్షకుడైనా ఇక ముగిసే దాకా వదలడు. అమ్దుకేనేమో ఎన్నో చోట్ల ఈ సినిమా స్క్రీన్‍ప్లే కు అవార్డులొచ్చాయి.
నటీనటులు.: యాంగ్ మి-జా. ఒక్కసారి చూడగానే చిరకాల సన్నిహితత్వాన్ని కలిగించే పాత్ర. సినిమా ముగిశాక  చాలా రోజుల పాటూ వెంటాడుతుంది. అలాంటి పాత్రను సృష్టించటం దర్శకుని గొప్పదనమయితే, దాన్ని అంతే సమర్థవంతంగా పోషించి వీక్షకులను కట్టి పడేటం నటీనటుల గొప్పతనం. Yoon Jeong-hee. ఆరవ, ఏడవ దశకాలలో కొరియెన్ సినిమాను ఏలిన గొప్ప నటి. ఇరవై నాలుగుకు పైగా అత్యున్నత పురస్కారాలను పొందిన విదుషీమణి. పదహారేళ్ళ క్రితం తెర జీవితానికి స్వస్తి పలికి, విశ్రాంత జీవనం గడుపుతున్నది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది.  ఒకానొక కాలంలో గొప్ప నటులుగా బాక్సాఫీసును దున్నేసిన వాళ్ళు చాలా కాలం గా౨ప్ తరువాత తెరమీదకు వస్తే, వారి నటనలో పాత వాసనలు ఉంటాయి. అవసరమైన దానికన్నా ఎక్కువగా మెలో డ్రామా పండిస్తారు. ఇప్పటి కాలానికి తగ్గట్టుగా నటించ లేరు. వారిదైన పాత తరహా నటనతోనే అలరించాలని చూస్తారు. అది తప్పు అనలేము కానీ, ఇబ్బంది కరమైన విషయమన్నది మాత్రం ఒప్పుకోవాల్సిందే. కానీ యూన్ జ్యాంగ్‍-హీ ఆ ఇబ్బందిని అధిగమించింది. చాలా సహజమైన నటనతో పాత్రకు ప్రాణం పోసింది. తెరపైన మనకు యూన్ కన్నా మి-జానే కనిపిస్తుంది. ఇది ఆమె నటనను తొలిసారి చూడటం వల్ల అలా అనిపించిందా అని అనుమానం వచ్చి సినిమా సగమ్ కాకుండానే ఆమె నటించిన ఇతర సినిమాలు చూశాక వాటిలో కనిపించిన యూన్ ను పోల్చుకుంటూ మళ్ళా మొదటి నుండీ చూశాను. అయినా నాకు పోయెట్రీలో కనిపించింది ‘మి-జా’నే :-)
ఇక మిగిలిన నటీ నటులలో, మి-జా మనుమడిగా వేసిన కుర్రాడి గురించి. కథలో అతని పాత్రను ముందే ప్రస్తావించాను కదా! అప్పుడు మన మనో ఫలకం మీద కనిపించే లాగానే ఉంటాడు. మి-జా గా వేసిన యూన్ తో పోటీ పడుతాడు. అతని పేరు డేవిడ్ లీ.
మరొక ప్రధాన పాత్ర ప్రెసిడెంట్ కాంగ్. స్ట్రోక్ విక్టిమ్. ఈ పాత్ర పోషించినది కిమ్ హీ-రా, మరొక వెటరన్ నటుడు. అత్యంత సహజమైన నటనతో కట్టి పడేస్తాడు. తప్పదు. ఎందుకంటే అతను నిజ జీవితంలో కూడా పక్షవాతం బారిన పడ్డాడు. అయినా నటన మీద ఉన్న ఆ మక్కువకూ, ఓపికకూ, ఉన్న అవరోధాన్ని అనుకూలంగా మల్చుకుని అద్భుతంగా పాత్ర పోషించిన హీ-రా కు నమో నమః అంతే.మిగిలిన వారు ఇతోధికంగా నటించారు. నటీనటుల సెలెక్షన్ దగ్గర నుండీ, వారి నుంచీ కావలసిన నటనను రాబట్టుకోవటం వరకూ లీ తనదైన ముద్ర వేస్తాడు.
సాంకేతిక నిపుణులు: కెమేరా పనితనాన్ని ఎంత పొగిడినా తక్కువే. కేవలం దాని గురించే ఒక వ్యాసాన్ని వ్రాయ వచ్చు. ఎడిటింగ్ లీ శైలిలోనే నింపాదిగా, జెర్కులు లేకుండా సాగుతుంది. బాగుంది. నేపథ్య సంగీత అతి తక్కువ. కానీ సినిమాకు తగిన సహకారాన్నందించింది. బఖా సటాంగ్ లో హాంటింగ్ మెలడీస్ ను ఉపయోగించిన లీ ఇక్కడ నిశ్శబ్దాన్ని భలే ఉపయోగించాడు. మిగిలినవన్నీ చిత్రాన్ని ఒక మాడ్రన్ క్లా౨సిక్ గా మిగల్చటంలో తగు పాత్రను పోషించాయి.
దర్శకత్వం: Deserves a special post.
రేటింగ్: 4.5/5
PS:  1. Filmmakers కావాలనుకునే ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా స్టడీ చేస్తూ చూడాల్సిన సినిమా.
2. సినిమా టైటిల్ యొక్క అంతరార్థం గురించి చెప్పాలంటే ఈ పరిచయ వ్యాసానికున్న స్కోప్ చాలదు.
నోట్: వ్యాసం మొదట నవతరంగం లో ప్రచురింప బడినది. 

Read more...

Wednesday, October 5, 2011

కొరియానం: ప్రేమించ్Ing...! ;-)

/hihi

కొన్ని సినిమాలుంటాయి. ఎన్ని సార్లు చూసినా మళ్ళా ’ఇంకోసారి’ అంటే, సారీ అనకుండా చూసేయగలం. మరికొన్ని ఉంటాయి. చూడం చూడం అంటూ చూసినా క్రమంగా పడతాయవి. ఒక్కసారి పట్టాయా ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు. ఏదో మా౨జిక్ ఉంటుంది వాటిలో. సంగీతమో, దృశ్యమో, ఎమోషనో, నటీ నటుల ప్రతిభో, హీరోయిన్/హీరోల అందమో (మన జండర్ ను బట్టీ. అవసరమనుకుంటే డెల్లీ హైకోర్టు తీర్పును కూడా జత పర్చుకోవచ్చు ;) ), ఇలా ఏ ఒక్కటో అనే కాకుండా అన్నీ తెగ నచ్చేస్తాయి. మైమరపిస్తాయి. అప్పుడది ట్రా౨జెడియా, కామెడీయా అని చూడము. సినిమాను మాత్రమే చూస్తాము.

అలాంటి ఒక సినిమాను ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. 

Past is past. Future is future. But present is a Present. Earn it, and Enjoy it - నేను పాటించే ఒక సిద్ధాంతం.

అలాంటి సిద్ధంతం మీద నడిచేదే ఈ సినిమా. నాకు ఈ సినిమా వేరొకరి ద్వారా పరిచయం కాబడ్డది. అప్పట్లో అంత ఆసక్తిగా చూడలేదు. కానీ ఒకసారి పూర్తిగా చూశాక మాత్రం ఇక వదల్లేక పోతున్నాను. చాలా మందికి రికమెండ్ చేశాను దీన్ని. నా ఆల్టైమ్ సినిమాల లిస్టు తీస్తే ఇది తప్పక ఉండక పోయినా ఆల్టైమ్ ఎప్పుడైనా సరే చూట్టానికి రెడీ అన్న వాటిలో మాత్రం దీనిది అగ్రతాంబూలమే. ప్రేమ గురించి అంత గొప్పగా చెప్పబడ్డదీ సినిమాలో. 

చాలా మామూలు కథ, అంతకన్నా మామూలు కథనం. మరి ఎక్కద ఇ సినిమా స్కోర్ చేస్తుంది? దానికి సమాధానం... ప్రేమలో. ప్రేమ అన్న కాన్సెప్ట్ లో. అంత మాత్రాన ఇది ప్రేమ కథా అంటే కాదు. అవును. అవునూ కాదు, కాదూ అవును. 

తల్లీ బిడ్డల అనుబంధం, ప్రేయసీ ప్రియుల అనుబంధం, ప్రధానాంశాలు.

కథ: మి సుక్ కు కూతురే లోకం. భర్త మరణిస్తాడు. చిన్నతనంలోనే తన కూతురుకు అనారోగ్యం. ఎన్నాళ్ళు బ్రతుకుతుందో తెలియని స్థితి. ఆ పిల్లను వీలైనంత సంతోషమ్గా ఉంచాలనేది మి సుక్ ఆలోచన. 


The unusual title of this introspective and well-executed film refers to the present continuous tense in English. For the film's main character Min-ah -- a high school girl who has spent much of her youth in the hospital -- the present may hold a deeper meaning than for most of us. Living with a disease can sharpen your appreciation for the ordinary days that pass before you. Min-ah's single mother, who has already lost a husband, has also learned to focus her attention on the present, rather than on a future that is struck through with uncertainty.

...ingOne day, a young photographer (played by actor Kim Rae-won. కొరియెన్ మహేష్ బాబు అనుకోవచ్చు. అంత అందమ్గా ఉంటాడు మరి ;) ) moves into the apartment below their home. He tries to win over Min-ah's friendship, first by stealing her lighter and later by calling her incessently on her new phone. Min-ah is quite put off by all this, and has no intention of becoming friends with him, although her mother seems to be encouraging her.ఇదీ కథ. విశేషం: చాలా సినిమాల్లో ఇలాంటి కథా కథనాలొచ్చాయి. కానీ ఇక్కడి విశేషమేమిటంటే మనకు అస్సలా ఫీలింగే కలుగదు. కారణం ప్రతీ సన్నివేశం ఒక శిల్పి చెక్కినట్లు ఉండటం. నటీనటుల హావభావాల దగ్గర నుండీ, ఫొటోగ్రఫీ, బా౨క్‍గ్రౌండ్ స్కోర్, సీన్ కంపోజిషన్, దర్శకురాలు రాబట్టిన ఎమోషన్స్, అన్నీ సరిక్రొత్తగా ఉంటాయి. Very refreshing. 

నటీ, నటులు: With her debut film, young director Lee Eon-hee has created a simple, moving story as well as one of Korean cinema's most vivid mother-daughter relationships ever. Im Su-jung -- virtually everyone's choice for the best new actress of 2003, after her award-winning performance in A Tale of Two Sisters -- plays Min-ah with a convincing mixture of reclusiveness and vulnerability. Meanwhile the supremely talented veteran actress Lee Mi-sook plays Min-ah's mother with a cool, hip demeanor that hides the concern she feels underneath. The bond between mother and daughter is touching but also unconventional by Korean standards. Min-ah even refers to her mother by first name, virtually unheard of in Korea.

ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది హీరోగా నటించిన కిమ్ రే-వన్ గురించి. నటన అంటే ఇదే అనేంత గొప్పగా నటించాడు. ఒక్క సినిమాకే నా అభిమాన నటుల జాబితాలో చేరిపోయాడు. పాత్రలో జీవించాడనే చెప్పాలి. ఎమ్తలా అంటే అతని ఎమోషన్స్ అన్నీ మనం కూడా రియల్ టైమ్ లో పంచుకుంటాము. ఈ క్రింద ఇచ్చిన వీడియోలో చూడండి. 


ఐదవ నిమిషం దగ్గర నుంచీ ఆరవ నిమిషం వరకు. సినిమా మొదట నుండీ చూస్తూ అక్కడకు వచ్చేసరికి కళ్ళు చెమర్చక మానవు. ఆపుకోవాలన్నా ఒక్క కన్నీటి బొట్టైనా రాలక మానదు. కేవలం విషాద సన్నివేశాలలొ నటించటమే నటనా? అనే వాళ్ళకు సరదా అయిన సన్నివేశాల్లో అతని నతన చూస్తే, మనకూ అలాంటి మిత్రుడూంటే ఎంత బావుణ్ణు అనేలా నటిస్తాడు. ఒక నటుని ప్రతిభను అమ్చనా వెయ్యటానికి ఇంతకన్నా వేరే నిదర్శనం ఏముంటుంది? 

ఈ క్రింది వీడియోలో రెండవ నిమిషం నుండీ, నాల్గవ నిమిషం వరకూ గమనించండి. ఎంత సహజంగా చెస్తాడో...


ఇక మిగిలిన సహాయ నటులు కూడా పాత్రోచితంగా బ్రహ్మాండమైన నతన కనబరుస్తారు. అంటే మొహాన్ని ముప్పై మెలికలు త్రిప్పి... మన అరవ తరహా నతన కాదు. అంతా natural expressions. There is one man whose story is told in the first 10 minutes, we can not forget his acting, especially the expressions given with his eyes. ఆ కళ్లలా వెంటాడుతూనే ఉంటాయి. 

అతని కథ కానీ, సినిమాలోని కథ గురించి కానీ ఇంతకన్నా ఎక్కువ చెప్పను. చూసి ఆస్వాదించండంతే.

ఫొటోగ్రఫీ చాలా లైవ్లీగా ఉంటుంది. సన్నివేశపు మూడ్ కు తగ్గట్టు. కన్నుల పండుగ అన్నది ఒక్కటే సరి అయిన మాట.

నేపథ్య సంగీతం వీనుల విందు. అంతే! సందర్భానికి తగ్గట్టు ఉండి సన్నివేశపు గాఢతను పట్టి ఇస్తుంది. (Jun-Seok Bang)

ఎడిటింగ్ నేను చూసిన అత్యుత్తమ ఎడిటింగ్ వర్క్స్ లో ఇదొకటి. కేవలం ఈ సినిమా ఎడిటింగ్ గురించే ఒక పెద్ద వ్యాసాన్ని వ్రాయొచ్చు. తప్పక ఈ సీరీస్ లోని వ్యాసాల్లో వ్రాస్తాను. (Hyeon-mi Lee)

ఎక్కడా బోరు కొట్టకుండా సాఫీగా సాగిపోయే ఈ సినిమాను వీలైనంత త్వరగా చూసేయండి. 

రేటింగ్: 4.5/5

పైనిచ్చిన యూట్యూబ్ లింకులను పట్టుకుంటే సినిమా మొత్తాన్నీ చూసేయొచ్చు. 

అసలు దర్శకుడు/రాలు గురించి ఒక్కముక్కైనా చెప్పలేదేమి అంటారా? ఇన్ని రంగాల చేత అదరగొట్టే పని చేయించిన ఆ దర్శకురాలి పేరు ... Eon-hie Lee.

ఇంకొక్క సినిమానే చేసిన ఈ దర్శకురాలు ఇంత అందమైన హిట్ ఇవ్వలేక పోయిందంటే ఆశ్చర్యమే. వన్ హిట్ వండర్ గా నిల్చిపోరాదని అభిలషిస్తున్నాను

/bye
సినిమా ట్రైలర్...


http://www.youtube.com/watch?v=vO1HwVqeFPI

Read more...

Monday, October 3, 2011

Five Blogs You Must Read Before You Die

నువ్వు చచ్చే లోగా చూడాల్సిన ఐదొందల సినిమాలు, చదవాల్సిన ఐదొందల పుస్తకాలు చెయ్యీ, ఎట్సెటరాదులైన  పుస్తకాలప్పుడప్పుడూ ఏ వాల్డెన్లోనో, బుక్ స్పియెర్లోనో, లాం౨డ్ మార్క్ లోనో, హిమాలయాలోనో, కనిపిస్తుంటాయి. అలా ఓసారి చేతిలోకి తీసుకుని అలా అలా తడవకో సినిమా గురించో, పుస్తకమ్ గో గురించో చదివేస్తుంటాను కదా! అప్పుడో అవిడియా వచ్చింది. వై నాట్ లిస్ట్ బ్లాగ్స్ అని. ఆలోచించగా, చించగా, గా ఇప్పటికి సాధ్యమైంది. 

సరె! ఇప్పుడే నైట్ స్ప్రైట్ త్రాగాను కనుక సూటిగా వస్తాను సుత్తిలేకుండా విషయానికి :D

1. అప్పుడు ఏమి జరిగిందంటే.. (ఎల్లెహే! విషయానికొస్తానని మళ్ళా అప్పుడు ఏమిజరిగిందంటే అంటున్నావు. అంటారా?) అది బ్లాగ్ పేరు. వ్రచైత్రి పేరు, క్రాంతి

రాసే వాళ్ళు రచైతలైతే, నా లాగా వ్రాసే వాళ్ళు వ్రచైతలు 

This really is one of the best blogs I read. పాండితీ ప్రకర్ష, హాస్యం కోసం హాస్యం (ఇది నా దృష్టిలో అపహాస్యం. ఎందుకంటే హాస్యం కోసం హాస్యం ఛీ! చెత్త. అనిపిస్తుంది నాకు), వాపోవటాలూ, ప్రోపగాం౨డాలూ, కెలుకుళ్ళూ, పెరుకుళ్ళూ లాంటివి లేకుండా హాయిగా ఒక ఫీల్ గుడ్ సినిమా చూసినట్లు, ఎండాకాలపు సాయంత్రం చిరుజల్లులు కురుస్తుంటే అలా వరండాలో కూచుని పిల్లకాయలందరూ కబుర్లాడుతున్నట్లు, ఎప్పుడో ఎక్కడో మిస్సయిన పాత నేస్తాల కబుర్లు వింటున్నట్లు, ఒక్క ముక్కలో చెప్పాలంటే It is a very lively blog literally. 

మరీ దమ్చి కొట్టి వదిలినట్లు ఎక్కువ టపాలు లేకుండా అప్పుడప్పుడూ మాత్రమే వ్రాస్తుంటారు. ఎక్కువగా బ్లాగుల్లోకి రారేమో, ఇమేజ్ అలాంటివేమీ పట్టించుకోరేమో కూడానూ. అందుకే ఎన్ని సార్లు చదివినా చాలా ఫ్రెష్ గా ఉంటాయి. అన్నట్లూ, నా బ్లాగ్ పఠనం ప్రారంభమైంది ఈ బ్లాగ్ తోనే. చదవటం ప్రారంభించండి, చదువుతూనే ఉంటారు. వంద శాతం చిర్నవ్వులు గా౨రంటీ. నాదీ హామీ :). 


2. తెలుగోడి వాడీ, వేడీ తెలియని వారుండరు. ఎన్ని రకాల టపాలు, ఎన్ని అంశాలు, ఎన్ని చిత్రాలు. ఎప్పుడు తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకి తేడా ఏటుంటాది? కుసింత కలాపోసనుండొద్దేటి? ఇక్కడ దొరికేది ఆ ఆ ఆ అన్నమాట.

ఈ బ్లాగ్ కు విసిన కర్రలూ, ఏసీలూ, కూలర్లూ కాని బ్లాగర్లరుదు. ఆ స్టైలే వేరు, ఇనిమిటబుల్. ఏ అంశాన్ని తీసుకున్నా ఎన్ని సార్లైనా చదివింప జేసే ఈ బ్లాగర్ను బ్లాగుల్లో జేమ్స్ కా౨మెరాన్ అనవచ్చు :D

చదువుడీ, చదువుడి, చదువుడి. ఒక్క టైపో పట్టుకున్నా వెయ్యిన్నర మిలియెన్ డాలర్ల ప్రైజు మనీ అన్న ప్రకటన ఇచ్చినా మన జేబుకు బొక్క పడదు. అంత accuracy. భాషా పరిఙ్ఞానం, విషయ పరిఙ్ఞానం వగైరహాదులు... You can surely learn something from it. 

చాలా ఆలస్యంగా ఈ బ్లాగు కెళ్ళాను. అబ్రకదబ్ర, తెలుగోడు ఇత్యాదులైన పేర్లు చూసి, హాస్యం కోసం హాస్యమో, లేదా వాపోవుడు నమ్బర్ వన్ అలాంటి తరహా అనుకుని భయ పడ్డాను కానీ, ఇప్పుడు బుక్ మార్క్డ్ అయిన ఒకే ఒక్క బ్లాగ్ :)

3. ఈ కత్తి త్రుప్పు పట్టదు. బోరు కొట్టదు. ఎన్ని గొడవలైనా, హడావిడులైనా అదైనా, ఇదైనా, ఏదైనా అంతే!. చదవాల్సిన బ్లాగ్స్ లో ఒకటి. ఇందులోని విషయాలన్నిటితో ఏకీభవించాలని లేదు. కానీ, చదివి తీరాల్సిన బ్లాగుల్లో ఇదొకటి. You can learn something from it here too :)

The posts on his college days is a high light, and there are many posts on language barriers, and what not? You can take it as your reference book ;)

4. Sowmya Writes... On Everything She Wants to... ఇదొక మాయా ప్రపంచం. ఇందులోని నిశ్యాలోచనా పథం కు నేను ఒహప్పుడు రెగ్యులర్ రీడర్ను. అదేంటో ఆ బ్లాగులోనే వెతికి చూసుకోవచ్చు. సినిమాలూ, పుస్తకాలూ, కబుర్లూ, కాకరకాయలూ, సాఫ్ట్వేర్ అంశాలూ, ఇలా ఒకటని కాకుండా... oఒక్క ముక్కలో... A Versatile Blogger. 

అన్నీ బాగనే ఉన్నాయ్ కానీ ఈ మధ్య వచ్చిన మంచమ్మాయ్ సిరీస్ చూశాక మళ్ళా ఈ బ్లాగ్ జోలికి పోయే ధైర్యం చాల్లేదు :D 

5. ఇహ సివరాహరైనా మా గొప్ప బ్లాగిది. నాన్న. నేను చెప్పేకన్నా అక్కడ ఒక దృక్కు సారించి అనుభూతించండి, ఫీలింగు కండి. 

ఈమధ్య లాం౨డ్మార్కులో 3 for 2 offer ఒకటుంది. అలా ఈ ఐదింటితో పాటూ మరో బ్లాగు ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ. అలా అని మాది తెనాలి కాదు. మీది అయితే మాత్రం నా బాధ్యత కాదు :D

6. బ్లాగు వనం! ఛీ దీనమ్మా జీవితం అనిపించినప్పుడల్లా ఇక్కడకు వెళితే బ్రహ్మాండమైన రీఛార్జయ్యి వస్తారు. 100% time back guarantee నాదీ! ;)
***   ***   *** 

ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడన్నా అప్పుడప్పుడూ చదువుకోదగ్గ బ్లాగులైదు ఇప్పుడు... 

1. నెమలి కన్ను. అభిమానులెక్కువైనా కూడా ఆ మాయలో పదకుండా తన కోసం తను వ్రాసుకుంటున్నారా అన్నంత స్వచ్ఛంగా ఉంటాయి టపాలు. గొప్ప శైలి కాదు. అద్భుతమైన పద విన్యాసం కాదు. Simply simple. But, it rocks. Thatz all :) ఒక ట్రెషర్ లాంటి బ్లాగు. పుస్తకాలకు సంబంధించి ఏ వివరాలైనా దొరుకుతాయా అన్నంత... చదవండి వార్చండి. మీకే తెలుస్తుంది 

2. వేణూశ్రీకాంతుడి మురళీ గానమిది. One of the purest blog experiences you can have. ఏదో ఒక అనుబంధం ఏర్పరచుకుంటారీ పేట్రియాటిక్ బ్లాగు చదివితే.

3. తృష్ణ చదివి తెలుసుకోండి. ఎందుకిక్కడ లిస్టవుట్ చేశానో :)

4. సాహితీ మాల - A Good Granny హిహిహి. చదివితే తెలుస్తుంది. ప్రారంభ టపాల్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కువ. కొన్ని విసుగు. కానీ తరువాత్తరువాతవి మాత్రం సూపరో సూపరు. 

5. అసలు బ్లాగు టాలీవుడ్ ప్రముఖ హీరోల తరహాలో మిగిలిపోయినా, ఇక్కడ మాటలుండవు కనుక... బ్రహ్మాండమైన ఫోటో బ్లాగిది. రెగ్యులర్ అప్౬డేట్స్ ఉంటాయిక్కడ.

బోనస్ కావాలంటే కాలాస్త్రి చదవండి ;-)
***   ***   ***

ఇహ పోతే, ఇంకొక్క బ్లాగ్ ఉంది. అది, ఛీ పోదురూ! ఆల్రెడీ చదివేస్తున్నారు. 

ఏనాడూ శ్రద్ధ పెట్టి వ్రాయలేదు. ఎవరైనా చదవాలని అస్సలు ఉండదు. ఒక్కళ్ళనీ బ్లాగుకలవాటు పడనివ్వ లేదు. నివ్వటం లేదు. నివ్వబోవటం లేదు. రెగ్యులర్ రీడర్స్ తక్కువ. కామెంట్స్ కు రిప్లైస్ అరుదు. ఎప్పుడు టపా పడుతుందో, ఎప్పుడు పడదో తెలియదు. ఏదన్నా మొదలెడితే పూర్తవుతుందనే గా౨రంటీ లేదు. కానీ,

లాయల్ ఫా౨న్స్, అరుదైన తరహా టపాలూ...

చదివిన వాటిలో పదికి రెండో, బహు అరుదుగా మూడో బాగుంటాయి తప్ప, చదివినదల్లా బాగుంటుందనే గా౨రంటీ కూడా ఉండదు. అయినా అరుదుగా వచ్చే కామెంట్లేవైనా జెన్యూన్! అంతే కానీ, అలవాటై పోయి పెట్టే రెగ్యులర్ తరహా వ్యాఖ్యలు ఉండవు. 

ఆ బ్లాగ్...

Yours truly, 

/bye

PS: కొత్త పాళీ గారి బ్లాగొకటి మిస్సయ్యింది. వెతుక్కుని చదవండి. తీరుబాటు సమయాల్లో.

ఇంకా ఒకటి రెండు బ్లాగులున్నాయి కానీ నేను రెగ్యులర్ గా చూసేవి, బాగుండవు అని కాదు. ఇవ్వదల్చుకోలేదంతే! :D

గమనిక ఒకే శైలిలో ఒకే తరహాలో, నెక్స్ట్ పదమేమిటో కూడా కనిపెట్టేసేంతలా తయారనవి కొన్ని బ్లాగులున్నా అవి ఒకప్పుడు బాగుండేవి. వాటి గురించి నాకు లెక్క లేదు. ఎంత మంది ఫా౨న్స్ వాళ్ళకున్నా. వాళ్ళూ అదే అనుకున్నా నో ఇబ్బంది. పైగా Happieసూ :D 

Read more...

Saturday, October 1, 2011

తిరక్కథ: ఇది సినిమా కాదు :D

రేయ్ శరత్తూ! కాస్త నన్ను ఇంటిదాకా దింపరా.  కిరణ్ అడిగాడు.

ఒరే నాకు డబుల్స్ రాదురాశరత్ అన్నాడు.

ఏముందిలేరా. నేను తొక్కుతాను. నువ్వు వెనకాల కూచో. మా ఇల్లు మీ ఇంటి కెళ్ళే దారే కదా. సరిపోతుందికిరణ్ నచ్చజెప్పాడు.

సరే! అలాక్కానీఅని శరత్ సైకిల్ వెనుక కూచుని అలా లిఫ్టిచ్చాడు.
***   ***   *** 

ఏరా శరత్తూ! ఇందాకన నీ సైకిల్ని తొక్కిందెవర్రా? గోపాల్ బాబాయడిగాడు.

మా ఫ్రెండ్ కిరణ్ బాబాయ్శరత్ అన్నాడు.

ఇంకెప్పుడూ వాడికి లిఫ్టివ్వకు. నిన్ను కూచోబెట్టి వాడే సైకిల్ తొక్కేస్తాడునువ్వు చవటల్లే వెనక్కూచోవాలి.

అలాగే బాబాయ్శరత్ కాస్త నొచ్చుకుంటూ బెరుకు బెరుగ్గా అన్నాడు.
***   ***   ***

రేయ్ శరత్తూ! కాస్త నన్ను ఇంటి దాకా దింపరాకిరణ్ అన్నాడు.

కాసేపు కిందా మీదా పడ్డాక శరత్ అన్నాడుసరే రా! వెనక్కూచో.

అదేంట్రా! నీకు డబుల్స్ రాదుగా? కిరణ్ అన్నాడు.

వచ్చులేరా. నేర్చుకున్నానుశరత్ సమాధానం చెప్పాడు.
***   ***   ***

ఏరా శరత్తూ! ఆ కిరణ్ గాడు మహరాజులా వెనక కూచుంటే నువ్వు రిక్షా వాడిలా ముందు కూచుని సైకిల్ తొక్కుతా వాడికి లిఫ్టిస్తూ... గోపాల్ బాబాయ్ అన్నాడు.

దీనికి సమాధానంగా శరత్ ఏమన్నాడు? ఏమి చేశాడు?

నీతిఇంకెప్పుడూ సైకిల్ వాడ కూడదు. :D

Read more...

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP