Monday, March 30, 2009

స్పీచోయమ్మ స్పీచి. సోనియా స్పీచి. సానియా స్పీచి.

ఒకరోజు సానియా గాంధీ (సోనియా కాదు) తన సెకెట్రీ ఒహ్మద్ ధబేల్ ని తనకొక స్పీచ్ ని రాసి నాలుగు కాపీలు ఇవ్వమంది.

కొన్నాళ్ళు గడిచినై. స్పీచి చదివొచ్చిన సానియా గాంధీ ధబేల్ తో "ఏమయ్యా! ధబేల్! నీమీద నమ్మకంతో అంత ముఖ్యమైన స్పీచిని రాసిమ్మంటే నువ్వేం చేశావ్? అసలు జనం సోగం స్పీచి కూడా కాకుండానే వెళ్లిపోయారు," అని ఆ కాగితాలని ముఖం మీద కొట్టింది.

"మేడం మీరు నాలుగు కాపీలని అడిగారు కదా?" బిక్క మొహం వేసి అన్నాడు ధబేల్.

"మరి రేపు పత్రికలవాళ్ళు రేపీ విషయాన్ని ప్రముఖంగా వేసి మేడం గారిని గేలి చేస్తే ఎలా?" కర్ణుడు సింగ్ అన్నాడు అటుర్దాగా.

అప్పుడే వచ్చిన వైనో చిరంజీవి రెడ్డి "మా సోనియా నేనుజా ఏదయినా నెగటివ్ గా జరిగితే 'నాకు గాయమైనందు వల్లే నేను ఓడిపోయాను' అంటుంది. రేపు ఈ విషయాన్ని పత్రికల వాళ్లు అడిగితే గాయమైనందు వల్లే ఇలా జరిగింది అనొచ్చు," అన్నాడు.

"శభాష్ వైనోజీ! మీ సలహా అద్భుతంగా ఉంది. అందుకేనేమో మీ పాలన అంత అద్భుతంగా ఉంది. అసలు భాంద్రా ప్రదేశ్ లో అధిక సీట్లు వస్తాయి కాబట్టే మేము కేంద్రం లో అధికారంలోకి వచ్చాము. ఇందుకు ఇనాము గా మీరు ఈ తడవ ఓడి పోయేందుకు మేము కృషి చేస్తాం. అప్పుడు మీరు ఎల్లెడలా మా చెంతనుండి సలహాలు ఇస్తున్డొచ్చు," అంది సానియా గాంధీ.

కొసమెరుపు: ఆ మధ్య నాగార్జున తన కొడుకుని సినీ పరిశ్రమకి పరిచయం చేస్తూ సానియా మీర్జా ని హీరోయిన్ గా పెడుదామనుకున్నాడని వార్తలు వచ్చాయి. (ఇప్పుడు కాదులెండి). తన మేనల్లుడులు ఇద్దరికీ మొదట ఫ్లాప్ లే వచ్చాయి. కారణాలని చెప్పలేక పోయాము. మా అబ్బాయి విషయం లో ఈ పొరబాటు జరుగకూడదు. సినిమా లో సానియా హీరోయిన్ అయితే సినిమా హిట్ అయితే ఏ ప్రాబ్లం లేదు. అదే ఫ్లాప్ అయితే సానియా "నాకు గాయం అయింది కనుక సినిమా ఫ్లాప్ అయింది," అంటుంది. ఈ రకం గా బ్రతికి పోతాం అని భావించి ఉండొచ్చు.

Read more...

Sunday, March 22, 2009

కత్తి విరిగిపోయింది.


కత్తి యుద్ధాల వీరుడు, ఒక తరం పిల్లల చందమామ, తెలుగు వారి రాకుమారుడు, కాంతారావు, ఇక లేరు. ఇప్పుడే నేను న్యూస్ లో చూశాను. బాధనిపించింది.
అమ్మ చెప్పే కథలూ, నాయనమ్మ చెప్పే కబుర్లూ, నాన్న నేర్పే జీవితం, బుడుగు, చందమామ కథలు ఎలాగో తెలుగు పిల్లలకి ఒక తరంలో కాంతారావు కూడా అలాగ.
నెట్ కూడా పగ బట్టినట్టు ఎంత వెతికినా మంచి ఫోటో దొరకనీయలేదు. ఇప్పటి తరంలో ఆయన చేయదగ్గ పాత్రలని సృష్టించే సత్తా ఎటూ లేదు. (ఉన్నమాటే... ఆయనకీ ఆ ఓపిక లేదుచేయగలిగేందుకు).
కానీ జానపద చిత్రాలకి చిరునామాగా నిలచిన ఇద్దరూ ఇక లేరనేది మాత్రం ఒక చేదు నిజం.
ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ...

Read more...

Tuesday, March 3, 2009

ఇక్కడ ప్రెవేటు చెప్పబడును. టీచరమ్మ: సుజాత, బడి: మనసులోమాట.


వార్నింగ్/నోట్: ఇది కేవలం ఒక మంచి బ్లాగుని appreciate చేయటం మాత్రమే. నచ్చిన వాళ్లు చదవండి. లేని వాళ్లు, అసూయీకరించేవాళ్ళు దయచేసి జాటర్ ఢమాల్ అనుకుని వెళ్లి పొండి.
మీ (రో)బ్లాగ్లోకం లోని కుళ్ళన్తా నా మార్గంలో పోయొద్దు.

నచ్చిన వాళ్ళూ, సహృదయులు, "ఒలేయ్! లంది ప్రెవేటు సెప్పించుకుందాం."
-----------------------------------------------------------------------------------------------
నా పేలు బుడుగు. ఉంకో పేరు ఇనిసిపెటికేరు. ఎందుకంటే నేను బడికి మరీ నెలకో, రోజూనో వెళ్తాను మరి.

అసలు పేరు ఏదో ఉంది. అది మా నాన్నని అడుగు. వాడు నాకన్నా పొడుగు. మా నేను వాడి కొడుకు. వాడు మా బామ్మ కొడుకు. అలా అని బాబాయి చెప్పాడు. అదేంటో నాకు తెలీదు.

నాకు తెలుగు బాగా వచ్చు. ఉంగా భాష కూడా వచ్చు. కానీ రాయటం రాదే. అందుకే అమ్మ, అదే అమ్మంటే రాదా లే. రాదా అంటే రాదు అని కాదు. రాద. ఉంది కదా. నాకు నాన్నతో చెప్పి (నాన్న అంటే అమ్మ ముగుడు ట. అంటే పక్కన ఉంటాట్టలే. అలా అని బాబాయి చెప్పాడు) నాకు ఒక ప్రెవేటు పెట్టించింది. మేష్టారు నాకు నచ్చలేదు. ఎందుకంటే వాడు కుంచెం కూడా పకోడీ తేలేదు.

అందుకే వాడిని రెండో ప్ఫదో గోలీలతి కొట్టి, నేను ఏడుస్తూ పారిపోయాను. దెబ్బకి వాడు కాస్తా "ఇక రాను మొర్రో!" అంటూ జెండా ఎత్తేశాడు. జెండా ఎత్తేయటం అంటే ఏంటో నాకూ తెలీదు. పక్కింటి పిన్నిగారి ముగుడు అలా అన్నాడు. నాకో చిన్న దబుటు. అదంటే నాకూ తెలీదు. అప్పుడప్పుడూ అలా వస్తుంది ట. అలా అని బాబాయి చెప్పాడులే.

నాకింకా తెలుగు రాయటం రాదనీ మా అమ్మ నన్ను ఒక ప్రెవేటు లో వేసింది. అప్పటి నుండీ నాకు తెలుగు చదవటమే కాదు. రాయటం కూడా వచ్చేసింది. నాది అస్సలు తెలుగు కాదట. అలా ఉండే బుడుగు భాషట. అలా అని జనం అంటున్నారట. అంటే నాకూ తెలీదులే. అందుకని ఇప్పుడు తెలుగొచ్చిందిగా! ఇంతకీ ఆ ప్రెవేటు పేరు మీకు తెలుసా?
మనసులోమాట. మీరేదో బాగా చదివేస్తారటగా? జనం అంటున్నారులే. అదంటే నాకూ తెలీదులే. అందుకని నేను మీ తెలుగులోనే (బుడుగు భాష వదిలేసి) చెప్పుతాను.

----------------------------------------------------------------------------------------

ఒక్కొక్క బ్లాగు ఒక్కోరకంగా ఉంటుంది. (లేకపోతే రెండు రకాల అనొద్దు. నా వల్ల కాదు) చాలా సార్లు ఎంత బాగా వ్రాసినవైనా అంత ఆదరణ ఉండదు. కారణాలనేకం. విషయం అర్ధం చేయించే ప్రయత్నం లేకపోవటం కావొచ్చు, అంత ఆసక్తి కలిగించలేక పోవటం కావొచ్చు, సరీగ్గా కూడలి overflow అయ్యే సమయమ్లోనే వ్రాయటం కావొచ్చు, ఇంకా పిచ్చి బోల్డున్నాయి.

అలాగే చాలా బ్లాగుల పేర్లు చాలా 'అర్ధ'వంతంగా, పెద్ద పెద్ద పేర్లూ, పదాడంబరాలూ, (ఉదా|| నా బ్లాగు పేరు చూడండి), భావుకంగా, కవితాత్మకంగా...

కానీ సూటిగా... ఒక చక్కని పేరు, క్రింద సింపుల్ టాగ్ లైన్, ఆహ్లాదం కలిగించే పదాలతో టపాలూ, అందుకే ఇక్కడ అందరూ ప్రెవేటు చెప్పించుకుంటున్నారు. నేను ఇక్కడ ప్రేవేటులో చేరి దాదాపూ పడి నెలలు అవుతోంది. కనీ ఈ ప్రెవేటు పెట్టి సంవత్సరం అయిందట. ఇక్కడ సీనియర్ స్టూడెంట్ గా anniversary విషెస్ చెప్దామనీ...

ఈ ప్రెవేటు లు అన్నీ బాగా జరిగాయి. కలాసులన్నీ అందరికీ అర్ధం అయ్యేలాగా ఉన్నాయి. అందుకే పిలగాళ్ళు బాగా వస్తుంటారు. ఎంత పెద్ద విషయం అయినా madam (ఆంటీ అంటే నన్ను టపా లోంచే కొట్టేయగలరు. నాకసలే బైము) గారు మా బాగా అర్ధం అయ్యేలాగా చెప్తారు. మనకి కావాల్సింది అదే కదా. అందుకే అందరికీ తొందరలోనే అభిమానపాత్రమైంది.

జర్నలిజం మీద చెప్పిన కలాసుతో మొదలైన సక్సెస్ ఇక ఆగలేదు. IIT Concept oriented teaching అంటారే (అదే పిల్లలకి కొంచెం చెప్పి కొంచెం స్వతంత్రంగా చేయించటం. application oriented.) అది ఇక్కడ బాగా వర్కౌట్ అయింది. మేడం గారు కాస్త కలాసు చెపితే దాదాపూ యాబై మంది పిలకాయలు ఎన్నో, ఎన్నో విషయాలని చెప్పారు. (ఆ టపా చూడండి. ఎన్ని విషయాలు బైటకి వచ్చాయో).

తెలుగు మీద చెప్పిన కలాసు అబ్బో! అద్దిరిందిలే. జనం అంతా హడ్డిలిపోయారు. అందరూ ఈ ప్రేవేటుకే వస్తాం అన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వ అధికారి (నూర్ బాషా గారు) ఇచ్చిన సమాచారం, ఈ టపాలో జరిగిన చర్చా, సమాచార ప్రవాహం నభూతో... (న భవిష్యతి అనలేను. ఎందుకంటే ఇంకా ఇంకా ఇలాంటి నిర్మాణాత్మకమైన చర్చలు జరగాలి. అదే బ్లాగ్ పరమార్ధం. డాన్, బొమ్మాలీ తరహా సొల్లు కాదు). ఇక్కడో Hats-off కొట్టండి. బ్లాగుల విలువ పెంచే టపాలు ఇలాంటివి.

మేడం గారు నా లాంటి చిన్న పిల్లలు ఎప్పుడూ కలాసులు అర్ధం చేసుకోలేరని కామోసు, మంచి మంచి కథలు కూడా చెప్పారు. కాకపోతే అవి horror కథలు. Evil Dead-1, Evil Dead-2 కథలు. అవేంటో september 29, october 26 వ్రాసిన టపాలు చూడండి.

మేడం గారు ఇంకో చారిత్రాత్మకమైన విషయం లో కూడా రికార్డు సృష్టించారు. వంద కామెంట్లతో ఒక్కసారి ఉలిక్కి పడేలా చేశారు. (అక్కడ వండేసింది నేనే కావటం, అప్పటికి నేను వ్రాసిన టపాలన్నీ కలిసి వంద కామెంట్లని పోగేయటం జరిగింది).

వంద కామెంట్ల టపా thanks note కూడా అరొందేయటం మరో తమాషా.

మేడం గారు ఉట్టి ప్రేవేటులే కాదు (వేరే అర్ధం వద్దు. ఉట్టి మీన్స్... not only school ప్రేవేట్స్...అని అర్ధం) home tuitions కూడా చెప్తారు. (కామెంట్లేయటం). మాడు పగిలేలా దగ్గర నుంచీ (నాకో జెల్లకాయ కొట్టారు. మేరీ నేనప్పుడు చిన్న వాడినీ, చితకవాడినీ. Literally నాకప్పుడు గుండు ఉంది). మనకి ఉత్సాహం కలిగించే దాకా రకరకాల ప్యాకేజీలున్నాయి.

మేడం గారి హాస్టల్లో టిపినీలు కూడా పెడుతారు. (Chinese నుంచీ, ఆంధ్రా వరకూ ఆల్ వెరైటీస్). (మరోసారి లుక్కేయండి మీరే. దొరకని బ్లాగ్ కాదుకదా).

అచ్చ తెలుగులో చక్కని పద ప్రయోగాలతో (హాస్యం కోసం హాస్యం కాదు. అలా ఫ్లోలో పడటం వండర్. అందరికీ ఈ విద్య రాదు) తేనెలూరు తెలుగులో (ఈ మధ్యంతా కల్తీ తేనే వస్తోంది. కనుక ఈ మాటల్ని ఉపసంహరించుకుంటూ) వ్రాసే సుజాత గారికి వారి బ్లాగు ప్రారంభించి నెలలో సంవత్సరం అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ...

సెలవ్,

గీతాచార్య.

P. S.: తెలుగు బ్లాగుల్లో appreciation అనే సత్సంప్రదాయానికి తెఱ తీసి, టాప్ టెన్ టపాలూ, బ్లాగుల పరిచయం చేసే బ్లాగర్ "ప్రియ" కి మనందరం ఈ సందర్భం గా అభినందనలు చెప్పాలి. చాలా మంది సీనియర్లు ఈ పని చేస్తున్నా, ప్రియ ఈ విషయంలో కాస్త ముందే ఉంటోంది.

అలాగే గొడవల సందర్భంగా అందరికీ అండగా ఉంది, సహకరించిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు.

ఇక్కడ ప్రియ విషయం ఎందుకు ప్రస్తావించ వలసి వచ్చిందంటే... కొందరు అసూయాపరులు ఈ మధ్య (చాలా పెద్దలు వాళ్లు. వాళ్ల దృష్టిలో) చేసిన యాగీ అందరికీ తెలిసిందే. హిట్ల కోసం చేసే అలాంటి ట్రిక్స్ మధ్య తన బ్లాగ్ హిట్స్ చూసుకోకుండా... (అర్ధం అయి ఉంటుందనుకుని ముగిస్తున్నాను).

Read more...

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP