Wednesday, November 3, 2010

రాజీవ్ శయ్య: కొన్ని ఇందిరా ప్రదేశ్ ప్రేమ కథలు :D

రాజ్యాంగంలోని మొదటి వాక్యమిలా మారిపోయిన రోజులవి...

ఇందిరా, దటీజ్ ప్రియదర్శిని... (జోకర్ధం కాని వాళ్ళకు... ఇండియా దటీజ్ భారత్! నామీద అర్థం కాదని కంప్లెయింట్ కదా :D



***   ***   ***

"ఏం రాజీవయ్యా, దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?"


"ఆఁ ఏం లేదూ! మా చిన్న దానికి మొగుడుని రాజీవ్స్ నుంచీ తేవాలా? నాన్ రాజీవ్స్ నుంచీ తేవాలా? " అని.



"అందులో ఆలోచించటానికేముంది. రాజీవ్స్ నుంచీ తెస్తే సరి. మా తాత గారి కాలంలో వచ్చిన (రాజీవ్స్ ని పెళ్ళి చేసుకోటం వల్ల) రిజర్వేషన్లిప్పటికీ చెక్కు చెదరలేదు."

"నిజమే. నేను కూడా మా చంటి దానికి రాజీవ్స్ నుంచీనే సంబంధం తెస్తాను. అలాగే మా చిన్న వాడికి ఇందిరమ్మాస్ నుంచే చెయ్యాలని ఆలోచిస్తాను."
***   ***   ***

"ఏమిటి సంగతి?"

"పాప నవ్వింది."

"ఇందిరమ్మ అని గానీ పేరు పెట్టావా ఏమిటి?"

"అవును. మా అమ్మమ్మ కాలం నుంచీ మా ఇంట్లో ఇదే పేరు పెడుతున్నాము. మా పిల్లకి ఇందిరమ్మాస్ కోటాలో ఇప్పుడే ఆన్ హాస్పిటల్ జాబొచ్చింది కూడా."

"నిజమా?"

"అవును. ఇంకో ఇరవైయ్యేళ్ళు కాగానే దానికి జాబు ఖరారు. పురిటి బెడ్ మీద ఉండంగానే అప్పాయింట్‍మెంట్ ఆర్డరిచ్చేశారు."

"ఇంకేం? ఇక కట్నమే అక్కర్లేదు."

"కట్నమా పాడా? ఇందిరమ్మాస్ మా పిల్ల. ఇందిరమ్మాస్ సంబంధం కోసం మన రాష్ట్రంలో ఎంత మంది ఎదురుజూస్తున్నారో తెలుసా? కనీసం ఆ నాటికి కోతిన్నర ఎదురు కట్నం ఇస్తే కానీ పిల్ల మొహం కూడా చూపించను."
***   ***   ***

"రేయ్! ఎవడ్రా నువ్వు ఇక్కడ కూచునేందుకు? కాలేజ్ బస్ లో కూకోవాలంటే ఇందిరమ్మాస్ అన్నా కావాల.  రాజీవ్స్ అన్నా కావాల. మిగతా వాళ్ళు నించోటమే. మా చెప్పు కింద బతకాల బిడ్డా! ఎన్ను పూస ఊడబెరుకుత ఇంకోపాలిక్కడ కూకుంటే."
***   ***   ***

"నాన్నా, ఆ కాలేజ్ చాలా బాగుంటుంది కనీ, అక్కడ రాజీవ్స్ డామినేషనెక్కువట నాన్నా! నేను సెకండ్ కౌన్సెలింకు పోతాను కానీ అక్కడ జేరను."

"ఒరే! ఎలాగన్నా అక్కడికే పోవాలి నువ్వు. అక్కడైతేనే నీకు రాజీవ్ ఇంటర్వ్యూశ్రీ పథకం క్రింద ఆన్ కాం౨పస్ ఇంటర్వ్యూ లో ఉద్యోగం వస్తుంది. ఎలాగోలా సర్దుకుపోరా అబ్బీ ఈసారికి."
***   ***   ***

"రేపు నెల్లో మనోడికి నైంతయిపోతుంది. పిల్ల నాయాల్ని పేరు మార్చి బార్డరు దాటించి ఇందిరా ప్రదేశ్ లో టెంత్ లో గానీ వేస్తే, నాయాల్ది ఇక సూస్కో! మార్కులే మార్కులు. రిజర్వేషనే రిజర్వేషన్లు. ఉద్యోగం గ్యారంటీ కూడా!"
***   ***   ***

"పక్షి సోమ్ అన్నయ్యా! ఈ ఉత్తరాన్ని రుధిరాంబరికి తెలియకుండా చదువు. నేను ఒకమ్మాయిని ప్రేమించాను. ఈ మధ్య డెల్లీ హైకోర్టు పర్మిషనిచ్చినా, నాకా అమ్మాయి నచ్చిందని అబ్బాయిలెవరినీ కాకుండా అమ్మాయినే మా నాన్న ప్రాణం కన్నా ఎక్కుగా ప్రేమించాను. కానీ, కొన్నాళ్ళకు నాకో నిజం తెలిసిందన్నయ్యా! ఆ పిల్ల ఇందిరమ్మాస్ కా౨టగిరీకి చెందదు. నీక్కూడా తెలుసు కదా, ఈ మధ్యనే నీ సెగ్గడ్డ్రీ రుధిరాంబరి ఇందిరా రుధిరాంబరి అని పేరు మార్చుకుని, నువ్విచ్చిన పార్ట్ టైమ్ జాబు తో పాటూ రాజీవ్ ఉద్యోగశ్రీ పథకం క్రింద సెక్రటేరియేట్లో కూడా కాలెట్టిందని. నన్ను నీ చెల్లి తను ఇందిరమ్మాస్ క్రిందకి రాదని చెప్పకుండా నన్ను రజీవ్ మోసం చేసిందన్నయ్యా! తను నీకు చెల్లి అని అని కూడా నిన్ను అన్నయ్యా అంటంలోనే నీకు తెలుస్తోంది కదా, తను నాకిప్పుడు వద్దని. ఇంట్లో ఒక చక్కని ఇందిరమ్మాస్ అమ్మాయిని నాకు చూస్తున్నారు. ఎలాగైనా ఈ పిల్లని వదిలించుకుని ఇందిరమ్మాస్ అమ్మాయిని పెళ్ళి చేసుకునేందుకు మార్గం చెప్పన్నయ్యా! నా జీవితం నీ రాజీవ్లహా (సలహా) నే ఆధార పడ్డది.

ఇట్లు రాజీమతో (ప్రేమతో),

ఇందిరా రాజీవ్ ప్రసాద్ రాహుల్ కుమార్!"

"రాజీవమైన తమ్ముడు సాలా!

ఒరే ర్రాజీవోంగ్రీ! ఇందిరోంగ్రీ, ఖోంగ్రీ, అంగ్రీ, కుంగ్రీ.

నువ్వడిగినట్టు ఈ లెటరు ఇందిరా రుధిరాంబరికి చూపించలేదు. కానీ నిన్ను తిట్టింది మాత్రం నా పేరును తప్పు రాసినందుకు. నా పేరిప్పుడు ఇందిరా సోంరాజీవరావు.

రుధిరాంబరి లవ్వర్స్ నరసింహ రాజీవ్‍హింస గా మారాడు. మాజీ లవ్వరు బాషా కూడా రాజీవ్ షా గా మారి ఒక ఇందిరాజీవ్ షా కూరురు ఇందిరా రాజీవ్ లక్ష్మిని 2.55.1A/2.1 ని పెళ్ళి చేసుకుని సుఖంగా ఉన్నాడు. ముత్తు కాస్తా రాజీవుత్తు గా మారి పోయడు.

నీ రాజీవాభిమానానికి ఆనందంగా ఉన్నా, నువ్వు చేస్తున్న పని మాత్రం రాజీవ్‍బాజీది. ఆ నా బంగారు ఇందిరా తల్లిని మోసం చెయ్యకు. తను కూడా ఇందిరమ్మాస్ క్రిందకు వస్తానని చెప్పి మరీ నీలాంటి రాజీవ్ బాజీ, రాజీవ్ భాగ్యుడిని ప్రేమించిందంటే ఆ పిల్లకు ఉన్న రాజీవ్ ఆరాధనను గమనించు. ఆ పిల్లని కూడా రాజీవ్టైజ్ చేయించి రాజీవ్‍స్టర్  (పా౨స్టరు) సమక్షం లో ఇందిరేసు సాక్షిగా పెళ్ళి చేసుకో. ఆ పిల్లకు కూడా నిన్ను పెళ్ళి చసుకున్నందు వల్ల రాజీవ్స్ కోటాలో రిజర్వేషను సౌకర్యాలన్నీ దొరుకుతాయి. అలా మరి కొంత మంది రాజీవ్స్ గానో, ఇందిరమ్మాస్ గానో తయారవుతారు. నీ ప్రేమ కథ అమరత్వం సాధించి (నీ పెళ్ళి జరిగే లోగా ఏ తమిళ పులులో మీదకు వచ్చే అవకాశముందని నా అనుమానం...)

ఇక ఉంటాను,

ఇందీవటి పండు తీసుకుంటూ,

నీ సోంరాజీవరావు అన్నయ్య, సారీ సారీ రాహులన్నయ్య"

పీఎస్: మన ముక్కు మంత్రి రాజీవ్‍ శయ్య గారు రావు అనే పేరు బదులు రాజీవు అని పెట్టుకోవాలని శాసనం చేస్తే బావుణ్ణూ. బిల్లు పాసైతే ఏ గొడవా ఉండదు. నేను తిరుపతి వెళ్ళి నా రాజీవ్ సాల్ని. గతంలో మీసాలనే వాళ్ళు కంట్రీ బ్రూట్స్) తీయించుకుంటాను.
***   ***   ***

ఇప్పుడే అందిన తాజా వార్త...

రాజీవ్ శ్రీ, రాజీవ్ భూషణ్, రాజీవ్ విభూషణ్, ఇందిరా రత్న (గతంలో పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్, భారత రత్న అన్న పేర్లు కల అవార్డులు) అవార్డుల ప్రకటన...



బాలీవుడ్ నటుడు షారుఖ్ సోన్ (వీళ్ళు సోనియాస్ క్రిందకు వస్తారు) "తన సినిమాల్లో ఎక్కువగా రాహుల్ అన్న పేరు పెట్టుకున్నందుకు గానూ, ఇందిరా రత్న అవార్డును ప్రకటించారు. దీని పై షారుఖ్ సోన్ స్పందనను బ్రేక్ తరువాత చూద్దాం...

Read more...

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP