అందరికీ సాఫ్ట్వేర్ జాబులు రావాలి దేవుడా...!
దేవుడా/దేవతా (ఫెమినిష్టాగరిస్టుల కొరకై),
మా రాష్ట్రంలో నిరుద్యోగం సమస్య లేకుండా చూడు తండ్రీ/తల్లీ (ఫెమినిష్టాగరిస్టుల కొరకై).
అందరికీ నెలకు లక్షన్నర జీతంతో సాఫ్ట్వేరు జాబులొచ్చేట్టు చూడు తండ్రీ/తల్లీ (ఫెమినిష్టాగరిస్టుల కొరకై)
రోజూ పొద్దున్నే ఏడింటికి లేచి పరుగు మొదలెడితే రాత్రి పదిగంటల దాకా ఖాళీ లేకుండా ఉండేలా, శనాదివారాలు వీకెన్డు సెలవలుండేలా, అప్పుడు కూడా ప్రాజెక్ట్ టార్గెట్లంటూ ఎక్కువ వెసులుబాటు దొరక్కుండా (అదే బద్ధకం పెరక్కుండా అన్నమాట!), సంవత్సరానికి ఒక జనవరి ఫస్టు, ఇరవైయ్యారు, అగస్టు పదిహేను తప్ప సెలవలన్నవే లేకుండా (అదే ప్రొడక్టివ్ సమయం వృధా కాకుండా ఉండేందుకు), ఆ మర్చే పోయాను... క్రిస్మస్ కోసం ఇంకో సెలవ (ఎందుకంటే సాఫ్ట్వేరు జాబులంటే ఎమెన్సీలవే కదా). ఈ మాత్రం చాలు స్వామీ.
ఈ విధంగా సమానవత్వం సాధించి ఇలా ముందుకు పోతా ఉండేలా దీవించమని ప్రార్థిస్తూ,
మీ
(అదన్నమాట సంగతి)
:P :P :P
Read more...