కత్తి విరిగిపోయింది.
కత్తి యుద్ధాల వీరుడు, ఒక తరం పిల్లల చందమామ, తెలుగు వారి రాకుమారుడు, కాంతారావు, ఇక లేరు. ఇప్పుడే నేను న్యూస్ లో చూశాను. బాధనిపించింది.
అమ్మ చెప్పే కథలూ, నాయనమ్మ చెప్పే కబుర్లూ, నాన్న నేర్పే జీవితం, బుడుగు, చందమామ కథలు ఎలాగో తెలుగు పిల్లలకి ఒక తరంలో కాంతారావు కూడా అలాగ.
నెట్ కూడా పగ బట్టినట్టు ఎంత వెతికినా మంచి ఫోటో దొరకనీయలేదు. ఇప్పటి తరంలో ఆయన చేయదగ్గ పాత్రలని సృష్టించే సత్తా ఎటూ లేదు. (ఉన్నమాటే... ఆయనకీ ఆ ఓపిక లేదుచేయగలిగేందుకు).
కానీ జానపద చిత్రాలకి చిరునామాగా నిలచిన ఇద్దరూ ఇక లేరనేది మాత్రం ఒక చేదు నిజం.
ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ...
4 comments:
లవకుశలో లక్ష్మణుడి పాత్ర నాకు ఎంతగానో నచ్చుతుంది. కొన్ని సాంఘికాలు కూడా! ఈ పాత తరం నటుల నుంచి నేర్చుకోదగ్గ ఒక నీతి ఉంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం అన్నది. అంటే వీళ్ళని చూసి డబ్బు విషయంలో ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి.అంత పెద్ద నటుడై ఉండి చివరికి సొంత ఇల్లు కూడా లేని దీనావస్థలో చివరి రోజులు వెళ్లమారడం నిజంగానే బాధపడాల్సిన విషయం!
very sad news
కాంతా రావు గారికి నివాళులు .
నమస్కారం !
నా కొత్త తెలుగు బ్లాగు లో ఒక కొత్త టపా రాసాను - "బూటు గొప్పా ? పెన్ను గొప్పా ? "
మీ అభిప్రాయాలు తెలుపగలరు!
Post a Comment