వదులుత బొమ్మాళీ! వదులుత
పశుపతి. అఘోరాధిపతి. ఈ మధ్య జనం నన్నే తలచుకుంటున్నారు. నన్ను అసహ్యించుకుంటూనే ఉన్నారు. కానీ అచ్చు నాలానే మళ్ళా నా మాటలనే అనుకరిస్తున్నారు. "వదలను బొమ్మాళీ! వదలా." అని.
కానీ నేనిప్పుడు నా డయలాగ్ ని మార్చుకున్నాను. నాదిప్పుడు, "వదులుత బొమ్మాళీ! వదులుత."
ఎందుకంటారా? ఈ మధ్యన పనీ పాటా లేని ప్రతి ఒక్కరూ నా భాషనీ, నా చేష్టితాలనీ అనుకరించి, ఆనందిస్తున్నారు. నన్ను అనుకరిస్తే నాకు సంతోషమే. అనుకరణ అనేది అన్నిటికన్నా పెద్ద tribute. కానీ నన్ను అనుకరిచే వాళ్ళకీ కాస్తంత ethics ఉండొద్దా?
అఘోరా గాడివి. ఆడపిల్లల మాన ప్రానాలని బలిగొని, అరుంధతమ్మ చేతిలో ఒకసారి చంపబడి, మరోసారి విజ్హృమ్భించి.....," సినేమా కతలు సెప్పొద్దు. మీ రావు గోపాలరావు డయలాగే. ఎందుకంటే, నేను చేసింది చెడ్డ పనైనా, దానికి నేను కట్టుపడ్డాను. ఎక్కడా నేను స్త్రీ జనోద్ధారణే నా లక్ష్యం అని చెప్పుకోలేదు. నైతికత గురించి లెక్చర్లు దంచలేదు. నాకొకటే లక్ష్యం. నా కామ వాంచని తీర్చుకోవటం. అది బ్రతికి ఉన్నప్పుడు. మరణించాక నా ఏకైక లక్ష్యం అరుంధతిని అంతమొందించటం. కానీ నన్ననుసరించే వాళ్లు! వాళ్ల లక్ష్యం ఏమిటో వారికే తెలియదు. ఎందుకంటారో వారికే తెలియదు. ఎందుకు చేస్తారో వారికే తెలియదు.
తదేక దీక్షతో అరుంధతిని వెంటాడినా నేను చివరకి ఓడిపోక తప్పదు. కారణం తన సంకల్ప బలం. తన మంచితనం. నేను తప్పు చేసినప్పుడు ఒక సంస్తానాదీశురాలిగా నన్ను దండిన్చిందే కానీ, ఏదో ఒక కచ్చ పెట్టుకుని నా జోలికి రాలేదు. అసలు నేనున్నానన్న సంగతే పట్టించుకునేది కాదు. నేనా చెడ్డ పనులు చేయక పోతే.
నేనూ అంతే. నా లక్ష్యం కోసం నా సొంత పంథాని అవలంబించాను కానీ, ఎవరినీ అనుకరించలేదు. అందుకే అరుంధతి లాంటి గౌరవనీయురాలి చేతిలో వీర {(అ)ఘోర} మరణం పొందగలిగాను. కానీ నన్ను అనుకరించే వాళ్లు? వాళ్ళకో వ్యక్తిత్వం ఉన్నాడా? ఆఖరికి బ్రహ్మానందాన్నే, అతని డయలాగులనీ, చేష్టితాలనీ, అనుకరించటమే పని. వారికో స్వంత వ్యక్తిత్వం లేదు. అలా వ్యక్తిత్వం లేని వాళ్లు నన్ను అనుకరిస్తే నాకు అవమానం. అదే నేను ఇప్పుడు ఈ కొత్త పదాలని వాడితే ఎవరూ నన్ను పట్టించుకోరు. సహజత్వం లేదు. ఛీ. ఇలాంటి వారి మధ్యన బొమ్మాళీ కోసం ఉండే కన్నా తట్టా బుట్టా సర్దుకుని నా దారిన నేను ఏ పిశాచాల నగరాల్లోకో పోవటం మంచిది.
వెళ్ళే ముందు ఒక మాట. అనుకరణ మాని ఒక సరైన వ్యక్తిత్వం ఏర్పరుచుకోండి. అసూయతో జీవితాన్ని నాశనం చేసుకోకండి. కామ వాన్ఛలని, perversions నీ అదుపులో పెట్టు కొండి. నిస్వార్ధతని అవలంబించండి. నన్ను కాదు, అరుంధతమ్మ త్యాగాన్నీ, ఆ సాహసాన్నీ నేర్చుకోండి. కానీ మీరు చాలా మంది ఆ పని చేయలేరు. ఎందుకంటే మీకు ఒక స్వంత ఆలోచన లేదు. మీకోసం మీకు బతకటం రాదు. ఎవరో హీరోలకోసం బతకటం, ఎవరికో బానర్లు కట్టటం, మీ సంగతిని చూసుకోలేక పోయినా ఇతరులకి సుద్దులు చెప్పటం. నాయకులుగా ఎవరో రావాలంటారు కానీ, మేము నాయకులం కావాలనుకోరు. ఎందుకు మీ బతుకులు? ఛీ. ఇక ఈ లోకం లో ఉండలేను. నేను తప్పు చేసి అరుంధతి చేతిలో మరణించినప్పుడూ నాకు ఇంత బాధ వేయలేదు. అందుకే వదిలిన బొమ్మాళీ వదిలిన.
ఇక సెలవ్,
పశుపతి, అఘోరాదిపతి.
P. S.: హహహ. చెప్పటానికి ఏమీ లేదు. ఎందుకంటే మంచి చెపితే ఎవరూ వినరు. చెడంటే అంగలార్చుకుంటూ, వెళ్తారు. అందుకే వెతుక్కోండి మంచిని. మీరు అర్హులైతే తప్పక దొరుకుతుంది.
7 comments:
Cool post.
ఎవరో హీరోలకోసం బతకటం, ఎవరికో బానర్లు కట్టటం, మీ సంగతిని చూసుకోలేక పోయినా ఇతరులకి సుద్దులు చెప్పటం. నాయకులుగా ఎవరో రావాలంటారు కానీ, మేము నాయకులం కావాలనుకోరు. ఎందుకు మీ బతుకులు? ఛీ.
బాగా చెప్పారు.
ఇంతగా గుర్తింపు వచ్హిన పశుపతి ని ఒక మంచి మెసెజి పాస్ చెయటానికి బాగా ఉపయొగించారు. ఆద్బుతం గా ఉంది ...
Do you know what are you speaking Mr. Pashupati?
Nice post. As usually paradox at your best.
"నేనూ అంతే. నా లక్ష్యం కోసం నా సొంత పంథాని అవలంబించాను కానీ, ఎవరినీ అనుకరించలేదు."
"చెడంటే అంగలార్చుకుంటూ, వెళ్తారు. అందుకే వెతుక్కోండి మంచిని. మీరు అర్హులైతే తప్పక దొరుకుతుంది."
Great words.
కత్తి! కేక!
భలే అట్నించి నరుక్కొచ్చారు! విలన్ అనిపిచ్చుకోవటానికీ ఓ స్టేచర్ ఉండాలి.రైట్!
విశ్వనాథ్ మీద పోస్టులు కంప్లీట్ అయ్యేయో లేదో తెలీటం లేదు.కాస్త తికమక పడుతున్నాను.హెల్ప్ మి.
"అందుకే వెతుక్కోండి మంచిని. మీరు అర్హులైతే తప్పక దొరుకుతుంది."
మెచ్చితి అబ్బాయీ మెచ్చితి. సో క్యూట్. nice expression.
Post a Comment