Friday, May 29, 2009

చదువుకుంటే ఆనందం మిస్ - నా విమాన కష్టాలు

ఈ చిట్టితల్లిని చూడండి. ఎంత చక్కగా విమానంలోంచీ క్రిందకు చూసి ఆనందిస్తోందో! సారీ బయటకి. ఆ అదృష్టం ఎంతమందికి వస్తుంది?






మొత్తానికీ నేను విమానం ఎక్కాను. చిన్నప్పుడు అల్లరి చేసినప్పుడు "వీపు విమానం మోత మోగిస్తా..." అని మురళీ బాబు అన్న రోజుల నుండీ విమానం ఎక్కాలనే ఆశ. అది అడియాశ అవుతుందేమో అనే భయం కొన్నాళ్ళ క్రితం వరకూ ఉంది. అసలు ఆ కోరిక తీరక దయ్యం అవుతానని కూడా అనుకునే వాణ్ణి.

ఇప్పుడా సమస్య వదిలింది కానీ నా ప్రయాణం కొన్ని ప్రశ్నలని మిగిల్చింది.

















వీణ్ణి చూడండి. ఎంత హాయిగా ఆనందిస్తున్నాడో! క్యూరియస్ గా, ఆశ్చర్యంగా...

క్రింద ఉన్న ఇళ్ళూ, జనాలూ, బస్సులూ, రైళ్ళూ, చిన్న చిన్నగా చీమల్లా కనిపిస్తుంటే.

క్రింద జనం చీమల్లా. ఎంత ఆశ్చర్యం! :-O

ఊరుకో తమ్ముడూ. అంత ఎత్తుమీదున్నప్పుడు వాళ్ళలాక్కనిపిస్తారు. ఇంకేముంది. ఆనందం ఆశ్చర్యం ఫట్. కనీసం take-off, landing సమయంలో కంగారు పడదామన్నా... అబ్బే. మనలోని ఫిజిక్సోడు మేలుకునే ఉంటాడు. నాయనా... ఇంత ఎత్తుకెళ్తే ఇదీ ఎఫెక్టు, ఇంత క్రిందకి వస్తే ఇదీ ఎఫెక్టూ, take -off అప్పుడూ, landing అప్పుడూ కంగారవసరం లేదు. అదంతా మామూలే. ఆ జరిగేవన్నీ తూచ్. అంటాడు. ఇక కంగారేముంటుంది? ఆశ్చర్యం ఎముంటుంది?

అంథా మాయ. :-(

కొన్ని సార్లు చిన్న చిన్న ఆనందాలే మనిషికి ఒకరకమైన హుషారునిస్తాయి. ఆశ్చర్యాలూ, ఆనందాలూ, చిన్న చిన్నవే మనిషికి అవసరం. అన్నీ తెలిసిపోయి కూచుంటేఇక మనం తెలుసుకునేదేముంది? అలా ఒకరకమైన నిర్వేదంతో గమనించటం తప్ప. లేదా దాన్నే ఆనందం చేసుకోవాలంటే... మనం దేవుడన్నా కావాలి.

పసి పిల్లల బోసి నవ్వులూ, పిల్లగాలి తెమ్మెరలు, వాన మోసుకొచ్చే మట్టి వాసనా, కొత్త పది రూపాయిల బిళ్ళా, తొలి ముద్దులో రొమాన్స్, ఫ్రెండ్స్ తో షికార్లూ, తొలిసారి వచ్చిన సంపాదనా, ఇలా, ఇలా...

అందుకే Unleash the child in you. Then you will enjoy the life better than you now do.

గీతాచార్య

P. S.: నాకు మిస్సయిన ఫ్లైటాశ్చర్యాన్ని నేను ఇలా తీర్చుకున్నాను. నా ముందు వరసలో కూచున్న జంటతో కాసేపు బాతాఖానీ కొట్టి వాళ్ళ రెండు నెల్ల పాపతో ఫ్రెండ్షిప్ చేసి, కాసేపు ఆడుకున్నా. భలే అనిపించింది. ఇంతలో గన్నవరం వచ్చింది.

Read more...

Sunday, May 24, 2009

Are the Australians born to WIN?

IPL ముగిసింది. గిల్లీ గిల్లి మరీ గెల్చి చూపించాడు.

దీన్ని బట్టీ మనవాళ్ళు గెలవలేరా ఆస్ట్రేలియన్ల మీద?

సెంటిమెంట్ ని బట్టీ చూస్తే ఈ సారి రికీ పాంటింగ్ captaincy లో KKR గెలుస్తుందా :-)D ముంబై ఇండియన్స్ మీద?

Anyway The Gentlemans final ended and the Aussie fav son won. Winners are to be respected. It's not Kumble lost, but his team after all his great effort.

కుంబ్లే, గిల్లీలకి వింబుల్డన్ విలేజ్ స్వాగతం పలుకుతోంది.

బై బై IPL.

No more posts on cricket from now on. Thank you for all those given their support to Kumble.

నాలుగు రోజులు సెలవు దొరికింది. ఎంజోయ్ చేశాను. ఇక మళ్ళీ నా తరహా సీరియస్ పోస్టులు రాస్తాను. ఆటావిడుపు అయిపోయింది.

సే’లవ్’

గీతాచార్య

Read more...

ఇండియా Vs ఆస్ట్రేలియా IPL ఫైనల్ ఎవరు గెలుస్తారో?

ఇండియన్ captain ఉన్న RCB నా లేక ఆస్ట్రేలియన్ captain ఉన్న DC నా?










అనిల్ కుంబ్లే. జన్టిల్మన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్.





Vs




ఆడమ్ గిల్‍క్రిస్ట్. జన్టిల్మన్ ఆఫ్ ఆస్త్రేలియన్ క్రికెట్.




సో, ఇటీజ్ ఎ జన్టిల్మన్స్ గేమ్. రియల్ జన్టిల్మన్స్ గేమ్.
బాబూ ఏదో ఆట చూడకుండా ఈ ప్రాన్తీయ భేదాలెందుకంటారా? ఇక్కడ ప్రాన్తీయ భేదం కాదు. IPL అంటే భారత దేశపు కుర్రాళ్ళకి పెద్ద పెద్ద క్రికెటర్లతో భుజాభుజాలు రాసుకుని తిరిగే అవకాశం అని అంటున్నారు కదా.
మరి మన దేశపు captain ఉన్న బెంగళూరూ, ఆస్త్రేలియన్ captain ఉన్న హైదరాబాద్ అంటే IND Vs AUS అనే కదా.
అసలే ఇదే దక్షిణాఫ్రికాలో ఆస్త్రేలియా చేతిలో ఓడిపోయి మన వాళ్ళు ఫీల్ అయ్యారుకదా 2003 లో. ఇప్పుడు కుంబ్లే టీమ్ గెలిస్తే అదో తుత్తి. మనవాళ్ళే ప్రపంచ కప్పు గెల్చారని.
బహుశా రేపొకటి రాస్తానేమో. ఆతరువాత IPL కహానీలకి సే ’లవ్’.
బట్ ఎనీ వే జై హో జన్టిల్మన్ క్రికెటర్స్.

Read more...

Saturday, May 23, 2009

కుంబ్లే టీమ్ కి శుభాకాంక్షలు చెప్పండి


ఇప్పుడే సెమీ ఫైనల్లో ధోనీ సేన పైన గెలిచి ఫైనల్ కి చేరిన అనిల్ కుంబ్లే టీమ్ Royal Challengers Bangalore IPL 2009 గెలవాలని శుభాకాంక్షలు చెపుదాం.

హైదీలూ, దక్కన్ గెలవాలని మీరు అనుకోవచ్చు, కోరుకోవచ్చు. కానీ ఇక్కడ captain మనవాడండీ బాబూ. మెయిన్ ఆటగాళ్ళూ మనోళ్ళే. ఎంతైనా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కదా. ఇండియన్ captain గెలిస్తేనే బాగుంటుంది.

5/5 తో మొదలెట్టిన కుంబ్లే విజయ ప్రస్థానం ఫైనల్ గెలవటం తోనే ఆగాలని కోరుకుంటూ...

ఇక్కడా ఓ లుక్కేయండి


గీతాచార్య

Read more...

Friday, May 22, 2009

దమ్మున్న దయ్యాలు - దుమ్ము లేపే సెమీస్

Delhi Daredevils . పేరే భలే ఉంది. దమ్మున్న దయ్యాలు. హహహ.

ఇక జట్టులో ఉంది? ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనింగ్ జంట. అన్ని తరహా క్రికెట్ లలో. AB de Villiers, Tilakratne Dilshan. ఏ టి20 జట్లలో ఐనా ఉండదగ్గ ఆటగాళ్ళు.

Daniel Vettori మన ధోనీయుల్ని గత పర్యటనలో టి20 మ్యాచుల్లో ఎంత ఏడిపించాడో మనకి తెలుసు. Glen McGrath ఎప్పుడైనా ప్రమాదకరమైన ఆటగాడే. ఎవర్రీన్ ఫాస్ట్ బౌలర్. దినేష్ కార్తిక్ గురించి మనకి తెలిసిన దానికన్నా తప్పకుండా ఎక్కువే ఆడగలడు. అసలు ఈ దఫా ఇతని ఆట గురించే రెండు టపాలు రాయవచ్చు. The quiet hero in this years IPL.

వీరికి తోడు, Dirk Nannes, Rajat Bhatia, pradeep Sangwan లాటి దేశవాళీ సంచలనాలూ, ఎక్కువ కల్పించుకోని కోచ్. చాలదూ? :-)

ఇప్పుడు వీళ్ళు సెమీస్ లో దక్కన్ ఛార్జర్స్ తో తలపడనున్నారు. హుషారైన సెహ్వాగ్ captaincy, వైవిధ్యమున్న బౌలింగ్, చురుకైన ఫీల్డర్లు, సమయానుకూలంగా ఆడగలిగిన batsmen, చూద్దాం వీళ్ళు ఎలా ఆడగలరో.

నా favorite టీమ్ ఇదే. మొదటి నుంచీ. KKR కూడా ఇష్టమే కానీ గంగూలీ కి ప్రాధాన్యం తగ్గగానే నా దగ్గర ఆ జట్టు ప్రాధాన్యం దెబ్బతింది.

RockOn My dear DareDevils!

Match కాగానే విశ్లేషణ.

Read more...

Thursday, May 21, 2009

కుంబ్లేకి శుభాకాంక్షలు చెప్దాం


భారత దేశం గర్వించ దగ్గ ఆటగాడు అనిల్ కుంబ్లే. మిలియన్లు పోసి కొనుక్కున్న ఆటగాళ్ళు ముంచేసినా, ఆపద్భాంధవుని పాత్ర పోషిస్తూ Royal Challengers Bangalore ని తన స్పూర్తిదాయక captaincy తో సెమీస్ ముంగిట వరకూ తీసుకుని వచ్చిన సందర్భంలో శుభాకాంక్షలు చెప్తూ ఈ ఆఖరి మ్యాచ్ లో ఏవిధమైన ఇబ్బందులూ లేకుండా సెమీస్ చేరాలని ఆశిద్దాం. ధోనీ, సెహ్వాగ్, లాంటి యువ captains తో పోటీ పడుతూ ఇంతవరకూ తన జట్టుని నడిపించటం చాలా ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉంది.

గో జంబో గో! ఇంటూ దా సెమీస్.

Read more...

Tuesday, May 19, 2009

పెళ్ళైపోయింది.

Thats all.
:-)

Read more...

Wednesday, May 13, 2009

భై హో జాన్ బు’కుక్క’నన్ దిమ్మ తిరిగింది








=














కిర్స్టెన్ పూర్వం

కొందరు భూస్వాములుండేవారు. సర్లే. భూస్వాములెందుకు కానీ వేరే రూపంలోకి వద్దాం. ఒక హల్వాన్ ఉన్నాడు. ఆడి దగ్గర కొంత మంది అదేదో నేర్చుకునే వాళ్ళు. నేర్చుకునే వాళ్ళు ఒకపాలి చుట్టుప్రక్కల ఊళ్ళలో పోటీలు పడి తగ గెల్చేశారు.

"మమ్మల్ని కొట్టే మొనగాడు ఏడీ ఏడీ ఏడీ" అని తెగ ఏడ్చి "లేరా మాతోటి గెలిచే వీరులెవ్వరురా? మగ ధీరులెవ్వరురా ఘనా ఘన శూరులెవ్వరురా?" అనుకుంటూ జబ్బలు చరిచి తొడ గొట్టి మీసం మెలేసి రెచ్చిపోవటం మొదలెట్టారు.

For every హల్వాన్ there always exists a పిట్టల్దొర అన్నట్టు, ఒక పిట్టల్దొర కొంత మంది కుర్రాళ్ళని వెంటేసుకుని వాళ్ళకి కొన్ని పిట్ట కథలు చెప్తూ, దారిలోకి తెచ్చి పోరాడటం నేర్పి వాళ్ళతో కల్సి వెళ్ళి హల్వాన్ ఊరు వెళ్ళి వాడి శిష్యులని సవాల్ చేసి గెల్చి వచ్చాడు.

పాపం కొంత కాలానికి పిట్టల దొర కుర్రాళ్ళకి ఇళ్ళకాడ కాపలా ఉంటుందని ఒక ఆల్సేషన్ కుక్కని కొనుక్కొచ్చాడు. క్ఖర్మకాలి కుక్క హల్వాన్ గాడి ఊరిది. దానికి పిట్టల్దొర అంటే గుర్రు. మా ఊరోళ్ళనే కొట్టే మగాడా ఈడు అని. కానీ కుక్క ఈడు నిజంగానే మగాడని, ఆడు కుక్క పక్కూళ్ళోనే చొక్కా దీసి మరీ చూయించాడనీ మర్చిపోయినట్టున్నాడు.

కానీ కాలం ఖర్మం కల్సిరానప్పుడు అన్న టైపులో ఆల్సేషన్ కుక్క పిట్టల్దొర ఊళ్ళో ఒక గ్రహణం మొర్రి గాడిని అడ్డం పెట్టుకుని పిట్టల్దొరని ఊళ్ళో నుంచీ తరిమించేసింది. తగూలెడతాడు. అని.

మనోళ్ళాకి కుక్క బుద్ధి అర్థం అయే సరికి ఊరి పరువు కాస్తా పెపంచకం ముందు పోయింది. పక్కూరి బొడ్డూడని పిల్లగాళ్ళ చేతిలో ఓడిపోయారు.

నేను కుర్రాళ్ళని ఏదో చేసి యాడికో తీసుకుని పోదాం అంటె ఆళ్ళు ఆళ్ళళ్ళో ఆళ్ళే కొట్టుకుజచ్చి నా మాట ఇనలేదు. ఇక పాలి ఇలాంటి నాయాల్లకి నే జెప్ప అంటూ ఆల్సేషన్ కుక్క తన ఊరికి యెల్లిపొనాది.

పిట్టల్దొర మాత్రం తన మళ్ళా తన ఊరోళ్ళ మనసులు గెల్చుకుని తన పని తను చూసుకోసాగాడు.

కిర్స్టెన్ శకం ఎనిమిత్తొమిది సమ్వత్సరాలు

ఇండియన్ హల్వాన్ లీగ్ అని ఒక గుంపు జేరి ఇప్పుడు అదేదో ఆటలు ఆట్టం మొద్లఎట్టారు. ఒక బొల్లిచెక్క బుద్ధూషా పిట్టల్దొర ఊరి టీమ్ ని కొని ఆళ్ళకి ఆల్సేషన్ కుక్క ఊరిదే మరో డాబర్మాన్ కుక్కని తెచ్చి కాపలా బెట్టిండు. ఒక సమస్తరం ఎలాగో ఆగినా రెన్డో పాలి మాత్రం మల్లా పిట్టల్దొర మీద బడి రక్కినంత పని చేసి ఊళ్ళో నుంచీ తరిమేసి తస్సదియ్యా పోరగాళ్ళకి కోచింగిచ్చినాది కదా... ఇక బొడ్డూడని పిల్లగాళ్ళే కాదు. ఆళ్ళ కమ్టే సిన్నోళ్ళ జేతిలోకూడా నానా దెబ్బలూ తిన్నారు.

This is గీతాచార్య speaking

మనోళ్ళకి ఫారెన్ సరుకు మీద మోజెక్కువ. అందులోనూ మధ్య ఆస్త్రేలియన్ సన్నాసోళ్ళ మీద మరీనూ. వాళ్ళేదో గెలుస్తున్నారు కదా వాళ్ళ స్పిరిట్ ని అందుకోండిరా అంటే ఊఁహూఁ వాళ్ళ కేతిగాళ్ళని తెచ్చుకుంటున్నారు. వాళ్ళ ప్రధాన లక్ష్యం వాళ్ళని కూడా గెలవ వచ్చు అని చూపించిన గంగూలీ. అందుకే అందిన అన్ని వనరులనీ ఉపయోగించుకుని ఎక్కడ సందు దొరికినా గంగూలీ మీదకి తెస్తారు.

ఐనా కల్కటాకి McCullum ఎలా కెప్టైన్ అవుతాడు? తన జట్టుకే కెప్టైన్ కాలేని వాడు?

Too many cooks అని సామెజ్జెప్పిన ఇంగ్లీషోడే మల్లా బహుళ కెప్టెన్సీ తేవటం ఏమిటి?

దేశం లో ఎవరూ లేనట్టు జాన్ బుకుక్కనన్ గాడే ఎక్కడ దొరికాడు బొల్లిచెక్క బుద్ధూషా కి?

గట్టిగా కొత్త వ్యూహం పన్నితే సమాధానం చెప్పలేని బుకుక్కనన్ గాడు (బూడిద సీరీస్ 2005 యాదికి దెచ్చుకోండి reverse swing దెబ్బ) గంగూలీ జట్టుకి కేతిగాడా?

ఎవరిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో గంగూలీ కన్నా ఘోస్ట్రైడర్స్ జట్టులో ఎవరికి తెలుసు?

మన జాతీయ హీరోని ఒక ఆస్త్రేలియన్ కేతిగాడు అవమానిస్తుంటే మనకి పండగ. బెంగాలీలు ప్రశ్నిస్తే మనకి బాధ. మనం సన్నాసోళ్ళం. సరే. బెంగాలీల మీద పడి ఏడవటం దేనికి?

ఐనా ఇది Indian Premiere Leaగా లేక ఆస్త్రేలియన్ ప్రీమియర్ లీగా? మన కుర్రాళ్ళకి అంతర్జాతీయ అనుభవం రావటం ముఖ్యోద్దేశ్యం (???) అని చెప్పబడే పోటీల్లో ఇంకా విదేశీ ఆటగాళ్ళు ఉండాలని బుకుక్కనన్ అంటే మన వాళ్ళకి చీమైనా కుట్టినట్టుండదా?

ఆఖరికి Stefen Fleming నయం. ఇది భారతీయ కుర్రాళ్ళకి ఉపయోగ పడాలి కానీ ఇదేమీ World premiere League కాదు అని చెప్పాడు. గంగూలీ మీద ఆస్త్రేలియన్ కేతిగాళ్ళకి ఉన్న కోపం జగమెరిగినదే. ఐనా మన వాళ్ళకి సిగ్గు శరం ఉండదు.

అందుకే మన మీద పడి బుకుక్కనన్ గాళ్ళు రాజ్యం ఏలుతున్నారు.

ఈసారి ఏమైనా Kolkata Ghost Riders ఒక్క match కూడా గెలవకూడదు. నిన్న కుంబ్లే టీం మంచి షాక్ ఇచ్చింది. చిత్తు చిత్తు కావాలి ఎవరన్నా రెండొందల పరుగులతో వాళ్ళని ఓడించాలి. అప్పటికి గానీ తన వల్ల కాదు గెల్చింది... వార్న్, McGrath లాటి హీరోల వల్లా, Steve Waugh లాటి సారథుల వల్లే విజయాలు సాధ్యం అయ్యాయని బుకుక్కనన్ కి తెలిసిరాదు.

సెగ్గీ నువ్వే పూనుకుని పని సాధించాలి. గురువు ఋణం aతీర్చుకో.

టేలర్ కొట్టిన దెబ్బకి pబుకుక్కనన్ కి దిమ్మతిరిగింది.

గంగూలీ ని వెనకేసుకుని రావటం నా Brahminical prejudice అన్న నా మిత్రుడొకడు బు’కుక్క’నన్ అన్న మాటకి అభ్యంతరం చెప్పాడు. కానీ అరగంటయ్యాక వాడే మాటలసందర్భంలో మాదిగ NK (క్షమించాలి) అన్న పదం వాడాడు. అప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. ఐనా ఆస్త్రేలియన్ జాతోళ్ళ సంస్కార హీనత్వం గురించి చెప్పలేం.

ఒక చిన్న కథ. నిజంగా జరిగింది.

ఒక International Conference కి వెళ్ళాను. అక్కడ 2003 world cup final లో Ricky Ponting అంతలా రెచ్చిపోయి ఆడటానికి కారణం గంగూలీయే కారణం అని Astralian మిత్రుడు (బాలకృష్ణ మిత్రుడు కాదు) అన్నాడు.

ఎలా అంటే లార్డ్స్ లాంటి పవిత్ర (??? షాంపేన్ బాటిళ్ళతో...) మైదానంలో చొక్కా విప్పి అపవిత్రం చేసిన గంగూలీ ఈసారి ఏకంగా ప్రపంచ కప్పే గెలుస్తే పాన్ట్ విప్పదీసే లాంటి ఆటవిక పని చేస్తాడని భయపడ్డాడు అని.

మరి ముమ్బై మనకి పవిత్రం కాదా? ముమ్బాదేవి పేరు కదా? ఫ్లింటాఫ్ చేసింది? అది ఆటలో భాగమైతే గంగూలీదీ అంతే కదా.

అందులో ఆటవికం ఏముంది? ఇదీ Astralian mentality.

బుకుక్కనన్ గురించి వార్న్ చేసిన, గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయా?

అగార్కర్ ని జాతివివక్ష వ్యాఖ్యలు చేయటం సంగతేంటి మరి?

Read more...

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP