Friday, May 29, 2009

చదువుకుంటే ఆనందం మిస్ - నా విమాన కష్టాలు

ఈ చిట్టితల్లిని చూడండి. ఎంత చక్కగా విమానంలోంచీ క్రిందకు చూసి ఆనందిస్తోందో! సారీ బయటకి. ఆ అదృష్టం ఎంతమందికి వస్తుంది?






మొత్తానికీ నేను విమానం ఎక్కాను. చిన్నప్పుడు అల్లరి చేసినప్పుడు "వీపు విమానం మోత మోగిస్తా..." అని మురళీ బాబు అన్న రోజుల నుండీ విమానం ఎక్కాలనే ఆశ. అది అడియాశ అవుతుందేమో అనే భయం కొన్నాళ్ళ క్రితం వరకూ ఉంది. అసలు ఆ కోరిక తీరక దయ్యం అవుతానని కూడా అనుకునే వాణ్ణి.

ఇప్పుడా సమస్య వదిలింది కానీ నా ప్రయాణం కొన్ని ప్రశ్నలని మిగిల్చింది.

















వీణ్ణి చూడండి. ఎంత హాయిగా ఆనందిస్తున్నాడో! క్యూరియస్ గా, ఆశ్చర్యంగా...

క్రింద ఉన్న ఇళ్ళూ, జనాలూ, బస్సులూ, రైళ్ళూ, చిన్న చిన్నగా చీమల్లా కనిపిస్తుంటే.

క్రింద జనం చీమల్లా. ఎంత ఆశ్చర్యం! :-O

ఊరుకో తమ్ముడూ. అంత ఎత్తుమీదున్నప్పుడు వాళ్ళలాక్కనిపిస్తారు. ఇంకేముంది. ఆనందం ఆశ్చర్యం ఫట్. కనీసం take-off, landing సమయంలో కంగారు పడదామన్నా... అబ్బే. మనలోని ఫిజిక్సోడు మేలుకునే ఉంటాడు. నాయనా... ఇంత ఎత్తుకెళ్తే ఇదీ ఎఫెక్టు, ఇంత క్రిందకి వస్తే ఇదీ ఎఫెక్టూ, take -off అప్పుడూ, landing అప్పుడూ కంగారవసరం లేదు. అదంతా మామూలే. ఆ జరిగేవన్నీ తూచ్. అంటాడు. ఇక కంగారేముంటుంది? ఆశ్చర్యం ఎముంటుంది?

అంథా మాయ. :-(

కొన్ని సార్లు చిన్న చిన్న ఆనందాలే మనిషికి ఒకరకమైన హుషారునిస్తాయి. ఆశ్చర్యాలూ, ఆనందాలూ, చిన్న చిన్నవే మనిషికి అవసరం. అన్నీ తెలిసిపోయి కూచుంటేఇక మనం తెలుసుకునేదేముంది? అలా ఒకరకమైన నిర్వేదంతో గమనించటం తప్ప. లేదా దాన్నే ఆనందం చేసుకోవాలంటే... మనం దేవుడన్నా కావాలి.

పసి పిల్లల బోసి నవ్వులూ, పిల్లగాలి తెమ్మెరలు, వాన మోసుకొచ్చే మట్టి వాసనా, కొత్త పది రూపాయిల బిళ్ళా, తొలి ముద్దులో రొమాన్స్, ఫ్రెండ్స్ తో షికార్లూ, తొలిసారి వచ్చిన సంపాదనా, ఇలా, ఇలా...

అందుకే Unleash the child in you. Then you will enjoy the life better than you now do.

గీతాచార్య

P. S.: నాకు మిస్సయిన ఫ్లైటాశ్చర్యాన్ని నేను ఇలా తీర్చుకున్నాను. నా ముందు వరసలో కూచున్న జంటతో కాసేపు బాతాఖానీ కొట్టి వాళ్ళ రెండు నెల్ల పాపతో ఫ్రెండ్షిప్ చేసి, కాసేపు ఆడుకున్నా. భలే అనిపించింది. ఇంతలో గన్నవరం వచ్చింది.

3 comments:

సుజాత వేల్పూరి May 29, 2009 at 12:18 PM  

మీలో మంచి భావుకుడున్నాడు. అప్పుడప్పుడూ రిఫ్రెష్ అవడానికి ఇలాంటి టపాలు రాస్తూ ఉండండి! బాగుంది మీ పోస్టు.

కొత్త పాళీ May 29, 2009 at 3:34 PM  

Nice.
Poet Vinnakota Ravisankar wrote a very nice poem about the air travel, especially about leaving homeland to fly west.

సూర్యుడు May 29, 2009 at 8:02 PM  

"క్రింద జనం చీమల్లా. ఎంత ఆశ్చర్యం! :-O

ఊరుకో తమ్ముడూ. అంత ఎత్తుమీదున్నప్పుడు వాళ్ళలాక్కనిపిస్తారు."

ఇది చదవంగానే మా కాలేజీలో ఎవరో చెప్పిన జోక్ గుర్తొచ్చింది:

ఇలాగే ఓ ఇద్దరు పల్లెటూరినుండొచ్చి విమానమెక్కి కూర్చున్నారు, అందులో ఒకడు కిటికీలోంచి కిందకుచూసి, ఒరే విమానంలోంచి చూస్తే మనుషులు సీవఁల్లాగ అగుపడతారంట కదా, అలాగే అగుపడతన్నార్రా అని అంటే రెండొవాడు, ఉండెహె, అయి నిజంగా సీవఁలే, విమానవింకా కదల్లేదు అన్నడుట :-)

~సూర్యుడు :-)

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP