Thursday, September 8, 2011

పిల్లల చేత "క" పలికించటం ఎలా?


పొద్దున్నే ఫోన్ మా ఫ్రెండ్ దగ్గర నుంచీ (నిన్న) మా పిల్ల గాడి బర్త్ డే. కాస్త వచ్చి పోదువూ అని అని ఫోన్ వచ్చింది :-o . చూద్దాం లేరా! అన్నాను. వచ్చితీరాల్సిందే అన్నాడు. సరే! నన్ను కూడా పిలిచేంత ధైర్యముంటే :p ఎందుక్కాదనాలి? ముచ్చట పడి ;) (దెబ్బలేం తగల్లేదులే :D ) వెళ్ళాను. అక్కడ మా వాడు వాపోయాడు /omg . మీకో విషయం తెలుసా? :o వాడు చాలా మహాత్ముడు. అంటే కొంచం మహాత్ములు కూడా ఉంటారా? అనొద్దు. అది నాకే తెలియదు :( . నాకు తెలియంది జనాలకేమి చెప్తాను? ఇంతకీ మా వాడు మహాత్ముడెందుకంటే వాపోయాడు కనుక B-) . మేధావులంతా వాపోతుంటారని విన్నాను. అలాంటి వాళ్ళకే గౌరవం దక్కుతుందనీ విన్నాను :p . సర్లే! వాపోవటం గురించి నా బాధలూ, ఆపై పరిశోధనలూ ఎప్పుడైనా చెప్తాను బ్రతికుంటే... ;) అసలు విషయానికొద్దాము. 

వాళ్ళ పిల్లగాడికి "క" పలకదట. ఆ మధ్య ఎవరో బంధువుల ఇంటికి వెళితే వాడి చేత "కన్ను" అనిపించి వాడలా అనలేక "తన్ను" అంటుంటే... ఇహదన్నమాట సంగతి. 

వాణ్ణి కాసేపు సముదాయించి, (ఎందుకంటే వాడూ నన్ను సముదాయిస్తుంటాళ్ళే) నాకు తెలిసిన ఒక టెక్నిక్ చెప్పాను. ఇది ఎప్పుడో క్రీ.పూ. వ్రాసిన టపా. ఉపయోగ పడే సమాచారముంది కనుక మళ్ళా డిగ్గింగ్. తెలిసిన వాళ్ళోకే. తెలియని వాళ్ళు ఉపయోగించుకొనుడి...

ఇక ఈ క్రింది ప్రహసనం చదివి విషయం తెలుసుకోండి. అప్పుడప్పుడూ మంచి పన్లు చేస్తుండాలి కదా B-)   /wahaha !

ప్రపంచంలో కల్లా అందమైన అక్షరం ఏదంటే నేను క అంటాను. ఎందుకంటే అది నిజంగానే అందమైన అక్షరం. అంతేనా! 'క' లో S ఉంది. S అంటే సక్సెస్ కదా. మరిదాని పైన తలకట్టు కిరీటం లాగా ఉందికదా.

క అక్షరం ఎంత అందమైనది కాకపోతే మా కృష్ణుడు ఆ పేరు పెట్టుకున్నాడు. నల్లనయ్య కళ్లు పడ్డ ఆ అక్షరం ఎంత అదృష్టం చేసుకుందో కదా!

కాకి కూడా రామ బాణం వల్ల అంత ప్రాముఖ్యం పొందినదీ క అనే అక్షరం వల్లే కదా. అసలు జనమంతా క కోసం కొట్టుకుంటున్నారు. క పలకనివారు అందరిలోనూ బకరాలే కదా. చిన్నతనంలోనే క అక్షరం పలికింది అంటే ఆ పిల్లలకి స్పష్టత మాటల్లో ఉన్నట్లే కదా.

చిన్నప్పుడు మా బాబాయి కొడుకు శరత్ గాడికి క పలికేది కాదు. వాడు నాకన్నా 9 ఏళ్ళు చిన్న. మేమందరం వాడిని ఏడిపించేవాళ్ళం. "కన్ను" అనరా అంటే "తన్ను" అనే వాడు. డిప్ప మీద ఒక్కటిచ్చుకునేవాళ్ళం. కారు కావాలి అనటానికి తారు తావాలి అనే వాడు. ఒకసారి మా మేన మామ వాడిని ఏడిపిద్దాం అని కొంచం తారు ఒక పాకెట్లో ఉంచి "ఇదిదో తారు" అన్నాడు. వాడు నిజంగానే కారు తెచ్చాడేమో అని ప్యాకెట్ విప్పితే అందులో నల్లగా తారు. ఇక వాళ్ల అమ్మ ఒకటే పోట్లాట. మధ్యలో గ్యాప్ వస్తే వాడు దిది దేంతి అన్నాడు. అంతే వాళ్ళమ్మ ఒక్కటిచ్చి నువ్వు నోరు తెరవకపోతే ఈ గోలా ఎక్కిరింపులూ ఉండవ్గా అంది. పాపం వాడు బిక్క చచ్చి పోయాడు.

కాలం ఎవరికోసం ఆగిపోదు. ఎవరికీ తల వన్చదు. మరో రెండేళ్ళు గడిచి పోయినాయి. వాడికిప్పుడు ఐదేళ్లు. ఇంకా క పలకటం రాలేదు. అది సామాన్యమైన అక్షరమా! ప్రపంచం లోనే అందమైనదాయే.


ఒకరోజు మా వేదక్కయ్యా వాళ్ల ఇంటికి వెళ్ళాడు, మన కథా నాయకుడు. ఆవిడ మా మూడో మేనత్త. మా బాబాయిలతో పాటే అందరికీ ఆవిడను వేదక్కయ్య అనటం అలవాటై పోయింది. అందుకే నేను ఆవిడని ఆల్ ఇండియా రేడియో అక్కయ్య వేదక్కయ్య అంటాను. సరే! విషయానికొద్దాం. అక్కడ ఎవరో పిల్లలతో గొడవ వస్తే మా అన్నయ్య వాడిని కుమ్మరా అన్నాడట. వాడేమో పెద్దగా లేని తుమ్ముని తెచ్చిపెట్టుకుని తుమ్మాడు. మా అన్నయ్య అర్ధం కాక ఎంట్రా తుమ్మావు అంటే, వాడు నువ్వే తదాతుమ్మరా అన్నావు అన్నాడు. అందరూ ఒకటే నవ్వులు. విషయం ఏమిటంటే వాడిని ఎక్కిరించటం అలవాటై పోయి తను కూడా కుమ్మరా అనబోయి తుమ్మరా అన్నాడు.
ఇంకోసారి వాళ్ళింట్లోనే శరత్ "యెదత్తయ్యా! చెత్త పెత్తవా?" అన్నాడు. (తినే చెక్క). వాళ్ల మనుమరాళ్ళు ఆ రోజంతా వాడిని ఆటపట్టించడమే. ఆ నోటా ఈ నోటా విషయం మా పిన్ని దాకా వచ్చి తను అగ్గి మీద గుగ్గిలం అయ్యింది. నాకు కూడా కోపం వచ్చింది. ఎందుకంటే మా పిన్ని నన్ను చిన్న తనం నుంచీ వాళ్ల పిల్లలకంటే ఎక్కువగా చూసుకునేది. దీనికో పరిష్కారం కనుక్కోవాలి అనుకుని నాగార్జున లాగా నిర్ణయం తీసుకున్నాను. నాకే పరిష్కారం తోచలా!


కాలమాగదు సుమీ నీకోసం అని మా శర్మా మాస్టరు ఎవరైనా బోర్డు మీదది ఎక్కించుకోవడం లేటయితే అనేవారు, ఏడిపిస్తూ. అలాగే కాలం ఆగలేదు. మరో ఆరు నెలలు గడిచాయి. నాకు కాలిలో శనక్కాయంత ఆనె ఒకటి లేస్తే ఒక చిన్న ఆపరేషన్ చేశారు. (కోసి పడేశాడ్లే డాక్టర్). కట్టు కట్టిన వెంటనే బెంబాన్డంగా బౌలింగ్ చేసి చూసుకున్నాను. అయినా వింబుల్డన్ టైము కదా నెప్పి బాబోయ్! అంటూ వారం రోజులు బడి ఎగ్గోట్టాను. ఆ టైములో నాకు పగలు ఏమీ తోచదు. వింబుల్డన్ సాయంత్రమాయే. హైలైట్లు అంత ఎక్కువగా వచ్చేవి కాదు. బోరుగా ఉండేది. ఎంచేయ్యాలా అని తెగ ఆలోచిస్తే శరత్ ప్రాబ్లం గుర్తుకు వచ్చింది. వాడిని ఇంకా బడిలో వెయ్యలా, మాటలు సరిగా రాలేదని. వాడేమో ఇంట్లో తెగ గోల. ఒక మెరుపు మెరిసింది. వెనకాల బాక్ గ్రౌండ్ స్కోరు వచ్చింది. నేను ఇంక కార్య సాధకుడిలాగా నించున్నాను. శరత్ ఇటురారా అని పిలిచాను. వాడు వచ్చాడు. ప్రక్కనే ఉన్నా మా బాబాయి స్టూడెంట్ సీనుని పిలిచి శరత్ నోరు తేరు అన్నా. వాడు తెరిచాడు. సీనూ వాడి నాలిక మీద వేలు పెట్టి నొక్కు అన్నా. శీను నోట్లో వేలు పెట్టాడో లేదో శరత్ లటక్కున కోరికేసాడు. రంగు పడింది. సీనేమో మొర్రో అంటూ ఎడిచాడు. డిగ్రీకి వచ్చినా వాడివన్నీ సినేమాల్లో బ్రహ్మానందం లక్షణాలే. గగ్గోలు పెట్టాడు. అందరూ వాడి చుట్టూ చేరి పరామర్శిస్తున్నారు. కొంతమంది నన్ను తిట్టటం. ఇంతలొ శరత్ ఏడుపు లంకించుకున్నాడు. సందట్లో సదేమియాగా నేను వాడిని చెయ్యి పట్టుకుని మేడ మీదకి లాక్కు పోయాను. ఒర్ నువ్వు నోరు తేరు. నేను వేలు పెడుతా. కోరికావంటే నాలుగుకాళ్ళ బూచికి పట్టిస్తా! అన్నా. వాడు భయంతో ఒకే! అన్నాడు. నేను నాలిక మీద వేలు పెట్టి  అనరా అన్నా. వాడు యాజ్ యూజువల్  అనబోయాడు. కానీ నాలుక మీద బండరాయి లాగా నా వేలు ఉందిగా! క అన్నాడు. మళ్ళీ అనరా అన్నాను. క. తరువాత మళ్ళీ మళ్ళీ క. క. క. చెల్లికి మళ్ళీ పెళ్లి లాగా మళ్ళీ మళ్ళీ క.
ఇంతలో మమ్మల్ని తందామని మా బాబాయి మేడ మీదకి వచ్చాడు. క. క. క. క. క. ఇక పో! ఒకటే పుత్రోత్శాహం. నాకు ఎన్నాళ్ళ నుంచో ఊరిస్తున్న జీన్స్ ప్యాంటు కొని పెట్టాడు. నాలుగు రోజుల్లో వాడికి గ, ట, కూడా నేర్పించేశాను. మా పిన్ని వాణ్ని వెంటనే బడిలో వేసింది బతుకు జీవుడా అనుకుంటూ. (మాది ఉమ్మడి కుటుంబం).

పోస్ట్ స్క్రిప్ట్: హాలీవుడ్ నటి కీరా నైట్లీ అంత అందంగా ఉండటానికి కారణం ఏమిటి అనుకున్నారూ.....

ఇదంతా ఏన్షియంట్ హిస్టరీ. ఇప్పుడు "క" మాత్రమే కాదు. పెద్ద వాళ్ళకు కూడా పలుకసాధ్యం కాని కొన్ను శబ్దాలను కూడా సులభమైన పద్ధతిలో పలికించే మార్గాలు కనుక్కున్నాను. 

Thatz all. 

/bye


3 comments:

Sree September 8, 2011 at 11:37 AM  

ఎంత మంచి సలహా ఇచ్చరండి , పిల్లలకు ఇలాంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి

Anonymous,  September 9, 2011 at 2:07 AM  

మంచి విషయం పై వ్రాసారు, ఎందుకంటే ఇలా ఉచ్చారణ ఇబ్బంది ఉన్న పిల్లలు సరియైన సమయానికి చికిత్స తీసుకోకుంటే మిగతా పిల్లల్లా నేను పలకలేను నాలో ఏదో లోపం ఉంది అని అనుకొనే ప్రమాదం ఉంది.అంతే గాక వారు సరిగా తన సహా విద్యార్థులతో, మిత్రులతో కలవరు, ఈ ఇబ్బంది నుంచి ఇతరుల దృష్టిని మళ్ళించడానికి వేరే మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఇవన్నీ కలసి వారి ఆత్మసైర్యానన్ని మరియు వ్యక్తిత్వాన్ని కూడా దేబ్బతీసే పరిస్తితి ఏర్పడుతుంది. (కొంచం ఎక్కువే వ్రాసా అనుకొంటా కాని వ్రాయక తప్పదు నేను ఈ విషయం లొ నిపుణుడని మీకు ఎలా తెలిసేది?)

మీ ‘క’ అక్షరం పలికించే విధాననానికి కొనసాగింపు ఈ కామెంట్
అందులోనూ నేను ప్రతిరోజూ చేసే వ్రుత్తి గనుక ఇలా వ్రాయకుండా ఉండలేను
మనం ఉచ్చారణ వ్యవస్త ఒక హర్మోనియం పెట్టె వంటిది. హర్మోనియం లోని వివిధ మీటలను మీట కుండా వెనుక భాగాని కదిపితే వట్టి శబ్దం మాత్రమే వస్తుంది స్వరాలు ఏర్పడవు. అదే దానిలోని మీటలను ఒక క్రమ పద్దతిలో కదిపినపుడు ఒక లయ బద్దమైన స్వరాలుగ ఏర్పడతాయి. ఎలాగైతె హర్మోనియం లోని వివిధ మీటలను మీట కుండా వెనుక భాగాని కదిపితే వట్టి శబ్దం వస్తుందో అలాగే మానవ శ్వాశక్రియ ప్రక్రియ ద్వారా కొంత గాలి స్వర పేటిక ద్వారా బయటికి వచ్చేటపుడు స్వర పెటికలోని స్వర తంత్రులను కదిలిస్తాయి. ఈ కదిలిక శబ్దాన్ని కలుగ జేస్తుంది ఇలా ఏర్పడిన శబ్దము నోటిలోని నాలుక, కొండ నాలుక, పెదవులు, పళ్ళు, దవడలు(హర్మోనియం లోని వివిధ మీటలు లాగ)మొదలైన వాటి కదలికల, కలయికల ద్వారా వివిధ అక్షరాలుగ మనం ఉచ్చారణ చేస్తాము. ఈ ప్రక్యియను అర్థం చేసుకోగలిగితే వేరే ఏవిదమైన నిర్మానాత్మకంగా ఇబ్బందులు లేని ఉచ్చారణ దోషాలను సరిచేయవచ్చును.

గీతాచార్య September 9, 2011 at 10:30 AM  

ధన్యవాదాలండీ అరవం గారూ. చాలా వివరణాత్మకమైన వ్యాఖ్య చేశారు.

And I can say proudly say, I discovered methods to pronounce/make people pronounce all most every sound with out any technical aids. There are natural methods.

I want a such a world where people does not suffer with speech problems, and must not be made laughing stock due to his disability.

Once again thanks a lot for your comment.

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP