Saturday, December 24, 2011

కరణం మల్లేశ్వరికి భారత రత్న ఇవ్వాలి!

సచిన్ టెన్డూల్కర్ కు భారత రత్న ఇవ్వాలని ఆ క్రికెట్ దేvoodoo గారి భక్తులు తెగ ఇదై పోతున్నారు. కానీ సచిన్ వల్ల దేశానికి ఏమి ఒరిగిందని? ఆడినందుకు డబ్బు తీసుకున్నాడు. కష్టపడి ఆడి అన్ని పరుగులు చేసినంత మాత్రానా భారత రత్నకు అర్హుడు ఎలా అవుతాడు?

కరణం మల్లేశ్వరికన్నా అర్హుడా? 

అసలు కరణం మల్లేశ్వరికి అవార్డు ఎందుకు ఇవ్వాలి?

౧) మహిళలకు ముప్పైమూడు శాతం రిజర్వేషన్లెటూపార్లమెంటుల్లో ఇవ్వలేదు కనుక అవార్డుల్లో అన్నా ఇచ్చితీరాలి.
౯) ఒలింపిక్స్ లో పతకం గెలిచిన ఏకైక మహిళ కనుక.
౧౭౬) అన్నిటికన్నా ముఖ్యంగా  దేశ యువతకు ఆదర్శంగా నిల్చినందుకు. వారికి స్ఫూర్తినిస్తున్నందుకు,

ఎలా అంటారా?

౧౦౧) రెండువేల సంవత్సరంలో ఒలిమ్పిక్ కాంస్య పతకం గెలిచినప్పుడు కోటి రూపాయిలిచ్చారు. చక్కగా వాటిని తీసుకుని బాం౨కులో వేసుకుని హాయిగా సెటిలైపోయింది. ఎంత చక్కని మార్గం? టీనేజ్ లో కాస్త కష్టపడి ఏదన్నా ఒక పతకం గెలిస్తే (ఒలిమ్పిక్స్ లో) గవర్నఎంటు ఇచ్చే డబ్బును ఫిక్సెడ్ చేసుకుని, ఆ వచ్చే వడ్డీతో కాలక్షేపం చెయ్యవచ్చు అని నిరూపించింది. ఇంకా...
౧౦౮) గవర్నమెంటువాళ్ళనడిగి ఏదైనా ఒక ఎకాడమీని స్థాపించవచ్చు. దానికో నాలుగైదారేడెనిమిత్తొమ్మిదిపదిపదకొండు ఎకరాల స్థలం వస్తుంది. సమయం చూసుకుని దాన్లో కొంత అమ్ముకుని మరికాస్త సొమ్ము చేసుకోవచ్చు. ఏదన్నా అంటే క్రీడాకారులకు ప్రభుత్వ మద్దతు లేదని వాపోవచ్చు.  తెలుగులో బ్లాగింగ్ వస్తే ఇంకా మంచిది వాపోయేందుకు :D
1098) అప్పుడప్పుడూ ఏవన్నా పదవులొస్తే వాటికి రాజీనామాలు చేసి వార్తల్లో నిలువవచ్చు.

100) ఇలా కడుపులోచల్ల కదలకుండా ఎలా హాయిగా బ్రతికేయ వచ్చో యువతకు ప్రాక్టికల్ గా చూపి ఆదర్శంగా నిలిచిన మల్లేశ్వరికి కాకుండా సచిన్ కు ఎలా ఇస్తారు భారత రత్న??? కమాన్! టెల్మీ!



ఏం? ఎందుకు ఇవ్వకూడదు?

చీక్కులంకు చెందినందుకా?

ఎతెన్స్ ఒలిమ్పిక్స్  మధ్యలోనే వచ్చినందుకా?

డబ్బు బాగా సమకూరాక ట్రయినింగు డుమ్మా కొట్టి వళ్ళు పెంచినందుకా?

2 comments:

John December 24, 2011 at 2:47 PM  

ఆధార్ కార్డు తోపాటు అందరికీ ఓ భారతరత్న కూడా ఇచ్చేస్తే పోతుంది..

Anonymous,  December 24, 2011 at 8:43 PM  

ఇంకా నయం. ఇవ్వాళ చానల్స్ మారుస్తున్నప్పుడు NDTVలో చూసాను.
సానియా మీర్జాకి భారతరత్న ఇవ్వాలని ఎవరో చెపుతున్నారు.

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP