ఐసు - బిప్పు రూలు.
ఒకప్పుడు 'అమలా పురం ఐశ్వర్యా రాయ్', 'భీమవరం బిపాషా బసు' అని ఇద్దరమ్మాయిలు స్నేహితులు. ఇద్దరిదీ ఒకే కంచం, ఒకే మంచం. పెళ్లి కాక ముందు లెండి.
వీళ్ళకి కాలం ఖర్మం కలిసొచ్చి (కలిసి రాక) పెళ్లి అయింది. వీళ్ళ భర్తలూ పాపం స్నేహితులే. వీళ్ళ స్నేహాన్ని చూసి దేవుడికి కుళ్ళు పుట్టిందేమో... పాపం వాళ్ల వాళ్ల భర్తలు ఒకేసారి యాక్సి డెంటు లో మరణించారు.
అమ్మలక్కలూ, అయ్యలన్నలూ వచ్చి వారిని పరామర్శించే వారు. కొంతకాలానికి 'భీమవరం బిపాషా బసు' ఒకతన్ని ఇష్టపడి పెళ్లి చేసుకుని మళ్ళీ సుఖం గాఉంది. ఐతే ఆమె స్నేహితురాలు 'అమలా పురం ఐశ్వర్యా రాయ్' మాత్రం విషాదం లోనే మునిగి ఉంది. (ఇక్కడ విలువలగురించి కాదు. విషయం వేరే!).
అప్పుడు అమ్మలక్కలూ, అయ్యలన్నలూ, తనతో "ఎందుకమ్మాయీ అంత బాధ పడి పోతావూ... పాపం! ఎంతకాలమలా ఉంటావ్/ నువ్వూ ఉప్పూ కారం తినే దానివే కదా! చిన్న వయసు లోనే ఎంత కష్టం?" అనే వాళ్లు. కొంత కాలం తరువాత "అమ్మాయీ! మళ్ళీ పెళ్లి చేసుకుని హాయిగా గతాన్ని మరచి పోయి జీవితాన్ని అనుభవిన్చమ్మా! చిన్న దానివి. ఇంకా ఎంతో జీవితాన్ని చూడాలి." అన్నారు.
ఇక 'భీమవరం బిపాషా బసు' గురించి మాత్రం "భర్త పోయి రెండేళ్లన్నా కాలేదు. మళ్ళీ పెళ్లి చేసుకుని కులుకుతోంది. చూడమ్మా చోద్యం!!!???" అన్నారు.
అందుకే 'మై డియర్ ఫ్రెండ్స్...' లోకుల గురించి కాదు. మన గురించి బ్రతకాలి. వారికి కావలసింది కేవలం 'ఉపదేహామ్రుతాన్ని' పంచి పెట్టే మహదవకాశం.
'ఉపదేశామృతం' మాట 'వైష్ణవి' వ్రాసిన 'దీపావళి వంటకం' లో చూశాను. పదం బాగుందని adopt చేసుకున్నాను. తనకి థాంక్స్. ఒప్పుకున్నందుకు.
5 comments:
chaalaa correct gaa cheppaaru.
నిజమే మనం మన గురించి బ్రతకాలి. కానీ ఈ లోకుల కారడవిలో కష్టమే. మీ ఉపదేశామృతం బావుంది.
బాగుంది మీ రూలు. ఇంకొంచం వివరిస్తే ఇంకా పేలేదేమో.
'ఉపదేశామృతం' నాకన్నా మీరే బాగా వాడారు. ;-)
లోకుల గురించి కాక, మన గురించి బతకాలి.....పటం కట్టించి పెట్టుకోదగ్గ మాట.
మీ బ్లాగు చ్చాలా బాగుందండి... దీంట్లో ఉన్న మేటర్ మాత్రం మొత్తం చదవలేదు... తీరిగ్గా చదవుతా...:-)
Post a Comment