దైవం మానుష రూపం లో...
ఎడారిలో నేనొంటరినైతే...
వర్షం నన్ను కౌగిలించుకుంది.
కష్టాల కడలిలో నేనీదుతుంటే...
చిరునవ్వొకటి నన్ను పలకరించింది.
సుఖాల తీరంలో నే సేద తీరుతుంటే ...
కర్తవ్యం నన్ను కార్యోన్ముఖుడిని చేసింది.
బంధాల పాశాలలో నే చిక్కుకుంటే...
దైవం నన్ను విముక్తుడిని చేసింది.
భయం నన్ను నీలా చేస్తే...
నాలోని అహం నన్ను నాలా నిలబెట్టింది.
నిరాశ నన్ను మరణించమంటే...
ఆశ నన్ను జీవించమంది.
పగ నన్ను రాక్షసుడిని చేస్తే...
ప్రేమ నున్ను దైవంలా మార్చింది.
ఇక నన్ను ఎవరూ ఏమీ చేయలేరు...
నేనే అందరినీ నాలా చేస్తా...
అందరిలో దైవాన్ని చూస్తా.
Note: వర్షం నన్ను కౌగిలించుకుంది, అనే మాట ఆమధ్య సాక్షిలో ఎం డి యాకూబ్ పాషా గారు వ్రాసిన ఆర్టికల్ లో నన్ను ఆకర్షిచింది. ఆలోచిస్తుంటే ఈ వాక్యాలు తట్టాయి.
I CAN NOT SAY I LOVE YOU WITHOUT SAYING I
4 comments:
అత్యద్భుతం గా వుంది ..
ఎడారిలో వర్షం .. కష్టాలలో చిరునవ్వు .. సుఖాలలో కర్తవ్యం .. బంధాలలో దైవం .. భయానికి అహం(self respect) .. నిరాశలో ఆశ .. పగకు ప్రేమ ..
baagundi.
చాలా బాగుంది. మంచి
భిన్నవిషయములను బింబప్రతిబింబములవలే చెప్పటం గొప్ప అందాన్నిచ్చిందీ కవితకు. (అలా చెప్పటాన్ని దుష్టాంతాలంకారము అంటారనుకుంటా)
వాక్యాన్ని ధ్వంశం చేస్తే మరింత చిక్కపడుతుంది ఈ కవిత గమనించారా? కొద్దిగా గందరగోళం అయ్యే పరిస్థితే అనుకోండి. కానీ బాగుంటుంది.
అంటే
1.ఎడారిలో నేనొంటరినైతే...
2.కష్టాల కడలిలో నేనీదుతుంటే...
........
1.1వర్షం నన్ను కౌగిలించుకుంది.
2.1చిరునవ్వొకటి నన్ను పలకరించింది
మంచి ఉపమానాలు ఎన్నుకొని కవితకు గొప్ప అందాన్ని ఇచ్చారు.
బొల్లోజు బాబా
"బంధాల పాశాలలో నే చిక్కుకుంటే...
దైవం నన్ను విముక్తుడిని చేసింది"
గీతాచార్య, పైన పంక్తులు ఒక్కోసారి నన్నీ నిర్వేదంలోకి తోస్తాయి "జగదాధారా! జరామరణ జీవితం చాలదనా, ఇంకా లీలచూపుతున్నావు? " http://maruvam.blogspot.com/2009/04/blog-post_06.html అంతలోనే కార్యోన్ముఖురాల్ని చేస్తాయి. నేనింకేదో చేయాలి అని తట్టిచెప్తాయి. మీ కవితని బాబా గారు బాగా విశ్లేషించారు. అంకన్నా నేనింకేమి అనగలను. పైకి క్రిందకి చదివాను మళ్ళీ మళ్ళీ...
Post a Comment