Well then, I'm back!!!
ఏడాదిన్నర దాటి పోయింది సత్యాన్వేషి ఆగిపోయి.
Inquisitor + Transistor = Inquisistor అంటూ మొదలెట్టిన నా సత్యాన్వేషణ, ఒక పర్పస్ ముగియగానే ఆపేశాను. ఇక పొడిగించ దల్చుకోక. కూడలి నుండీ కూడా దూరమయ్యాను కూడా.
మళ్ళా ఇప్పుడు ఇంకో పర్పస్ పడింది. అందుకే మళ్ళా వస్తున్నాను.
ఈ సందర్భంగా నాకు బాగా ఇష్టమైన నా కవిత ఒకదానితో నా ప్రయాణాన్ని మొదలెడుతాను. చదివిన వాళ్ళకు సరే, చదవని వాళ్ళకు...
ఎడారిలో నేనొంటరినైతే...
వర్షం నన్ను కౌగిలించుకుంది.
కష్టాల కడలిలో నేనీదుతుంటే...
చిరునవ్వొకటి నన్ను పలకరించింది.
సుఖాల తీరంలో నే సేద తీరుతుంటే ...
కర్తవ్యం నన్ను కార్యోన్ముఖుడిని చేసింది.
బంధాల పాశాలలో నే చిక్కుకుంటే...
దైవం నన్ను విముక్తుడిని చేసింది.
భయం నన్ను నీలా చేస్తే...
నాలోని అహం నన్ను నాలా నిలబెట్టింది.
నిరాశ నన్ను మరణించమంటే...
ఆశ నన్ను జీవించమంది.
పగ నన్ను రాక్షసుడిని చేస్తే...
ప్రేమ నున్ను దైవంలా మార్చింది.
ఇక నన్ను ఎవరూ ఏమీ చేయలేరు...
నేనే అందరినీ నాలా చేస్తా...
మనిషిలో దైవత్వాన్ని మేల్కొలుపుతా!
రాసి చాలా కాలమైంది. నచ్చుతుందా చదివిన వారికి?
Well then, I'm back!!!
4 comments:
very very nice.
సత్యాన్వేషి strikes back?
చాలా బాగుంది గీతాచార్య గారు.....అన్ని లైన్లు చదువుతూ వచ్చి "నేనే అందరినీ నాలా చేస్తా..." చదవగానే ఇదేంటి ఈ మనిషి ఇలా రాసాడు, పాయసంలో పంటికింద రాయి, అనుకున్నా కాని ముక్తాయింపు చదివాక అర్ధమయింది...అది రాయికాదు ఇలాచి అనీ...
sir really superb....telugulo Ilanti kavithalu vini chala rojulaindi..edho praasa kosam padalanu palikinche vaare tappa..Bhavalanu samakurchadam chala arudu..
Post a Comment