వినాయక చవితి శుభాకాంక్షలు
శ్రీ వైష్ణవ సంప్రదాయం లో విఘ్నేశ్వరాధానం లేదు. ఎందుకంటే ఇక్కడ విష్వక్సేనుడు ప్రధానం. అందుకే కొందరు సనాతన సంప్రదాయాలని పాటించే శ్రీవైష్ణవులు వినాయక చవితిని జరుపుకోరు.
అయినా వారుకూడా కొన్నిసార్లు ఆయనని పూజిస్తారు. అసలు నాకు అందిన వినాయకుని ప్రాధాన్యం ఏమిటంటే అమ్మానాన్నలని ఎంత గౌరవించాలో, వారి ప్రాధాన్యం ఏమిటో ఆయన వల్ల తెలుస్తుంది.
అంతే కాకుండా బుద్ధి బలం శారీరక బలం కన్నా ఏవిధంగా గొప్పదో ఆయన కథ వల్ల తెలుసుకోవచ్చు. అమ్మానాన్నలని గౌరవించటమనే కాన్సెప్ట్ లో మా నాన్న గారు మా కుటుంబాలలో వినాయక చవితిని ప్రవేశ పెట్టారు.
తెలుగు బ్లాగర్లందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
అంటే వినాయక చవితి జరుపుకుంటమంటే శైవారాధానం కాదు. మన అమ్మానాన్నలని పూజించుకుంటమే.
పిల్లలకు ఆయనకు గణాధిపత్యం ఎలా వచ్చిందో తెలిపే కథను చెపుతూ ఈ విషయాన్ని ప్రాజెక్ట్ చేయవచ్చు.
3 comments:
“వినాయక చవితి శుభాకాంక్షలు”
గీతాచార్యా, క్లుప్తంగా నేను చెప్పేదే మీరు కొంచం వివరంగా వ్రాసారు. వినాయకచవితితో ఎన్నో సంవత్సరాల తరబడి అనుభవాలు. పత్రి కోసుకురావటం, ఆ వంకన అందరి ఇళ్ళలో పూల సర్వే చేసిరావటం. కృష్ణ వొడ్డున ఉత్తరేణి కోసం వెదుకుతూ, ఆ సాకుతో తుప్పల్లో అన్నలున్నారేమోనని ఆశగా చూడటం, ప్రతి సంత్సరం విన్నా మళ్ళీ నాన్నగారి వంక నోరొదిలి చూస్తూ వినటం, అమ్మ వంటల లెక్కలేయటం, పూజ మధ్యలో నానమ్మ మీద వాలి ఆకలి తట్టుకోలేక కాసింత పటికబెల్లం లంచాలు లాగించేయటం [ఆవిడకి నేను పార్వతి వర ప్రసాదం అని నమ్మకం కనుక అన్ని నియమాలు మినహాయింపే ;) ] ముఖ్యంగా భోజనాల తర్వాత తాంబూలం వేసుకోవటానికి అనుమతి వుండటం, స్వామి ముందు పెట్టే పుస్తకాలలో నాది పైన పెట్టటం ఇలా ఎన్నో, ఈ రోజు మరో గంటలో జరగబోయే నా తెలుగు క్లాసులో ఈ రోజు ఇదే కథ చెప్పబోతున్నాను నా ABCD బూచాళ్ళకి. ఓ మంచి పాట నేర్పాలి కూడా బొజ్జ గణపయ్య మీద...
మీ కుటుంబానికి కూడావినాయక చవితి శుభాకాంక్షలు.
వినాయకచవితి శుభాకాంక్షలు :)
Post a Comment