Thursday, August 11, 2011

మూడు రూపాయల్ని రష్చించిన రూపాయి ఖద/hihi

అనగా అనగా (ఎవరిని? నాకు తెల్వదబ్బా! నేనైతే ఎవరినీ ఏమీ అనను) ఒక రెండు రూపాయల బిళ్ళ, రెండు రూపాయి బిళ్ళలు ఫ్రెండ్సు. అంటే సాయంత్రం పూట కల్సి మందు కొడతాయన్నమాట! అలా అని మా పక్కింటమ్మాయ్ వాళ్ళ బాబాయ్ చెప్పాడు. బాబాయ్ అంటే లవ్వు స్టోరీల్లో హీరోవిను అన్నయ్యల్తరువాత ఇలన్లన్నమాట! అరదం ఐందా? ఏం? ఇక మనం ముందుకు పోదాం. మందుకు కాదు. ఏం? ఇప్పుడు అవి ఫ్రెండ్సు కదా! అంటే బైటికి అంటే బజారు కెళ్ళి తిరిగి రావాలి కదా. అలా బజారుకెళ్ళాలని ప్లా౨న్ చేసే లోపులేమో ధోనీ ఆ మూడింటినీ ఇంకో ఆర్రూపాయల్తో కలిపి జేబులో వేసుకుని బైటికెళ్ళిపోయాడు. దారిలో స్ట్రాసు కనపడి బెల్లు నొదిలేసినందుకు పార్టీ ఇస్తాను రారా! అన్నాడు. మనోడేమో రారా అన్నది రండి రండి టైపు రారా ఏమో అనుకుని ఎగేసుకుని వెళ్ళాడు. ఇద్దరూ కల్సి, నమీబియాలో ఉన్న మలావీ హోటలు కెళ్ళి నాలుగు నాలుగు మిరపకాయ బజ్జీలు ఆర్డర్ చేశారు. తిన్నారు. తీరా బిల్లు కట్టేప్పటికి టిప్పు కోసం స్ట్రాసు దగ్గర డబ్బుల్లేవ్. 

ధోనీ జేబులు తడుముకుని చూసి... నా దగ్గర చిల్లర ఉందిలేరా స్ట్రాసూ. అన్నాడు. 

ఎన్తలా బిల్లూ అన్నాడు సర్వర్తో. సర్వరంటే ఇంటర్నెట్ సర్వరని కాదు. maitre d' అన్నమాట. వాకే! ఊఁ అరదమైందా? సరే! మళ్ళీ యెనక్కొద్దాం. ఐదు రూపాయలు సర్వరు టిప్పైతే, మిగతా నాల్రూపాయల్తో లెమన్ షోడా తాగొచ్చు కదా! అనుకుంటూ ఎన్తలా అన్నాడు.

అయ్ బాబోయ్! ఐతే మన్ని ఈ ధోనీ గాడు ఇడగొట్టేస్తాడేమోరా అనుకుని, తెగ ఫీలైపోతున్నాయి. 

maitre d' ఆర్రూపాల్రా ధోనీ గారూ అన్నాడు. 

హ్మ్! ఇక ఇవాళ్టికి నాకు లెమన్ షోడా తాగే అదృష్టం లేదు అనుకుంటూ ధోనీ ఆ టిప్పిచ్చి బైటకొచ్చేశాడు. దారిలో ప్రవీణ్ కుమార్ ఎవరినో కొడుతూ కనిపించాడు. ఛీ ఛీ! ఈ తప్పంతా శ్రీశాంతుదే! వాడికి తెలుగు రాక పోవటం వల్లే ప్రవీణు గాడు ఇలా తయారయ్యాడనుకుని, మీనంబాక్కమ్ బస్సెక్కి కోడంబాక్కమ్ లో దిగి, పురుశవాక్కమ్ లోని తన ఇంటికొచ్చాడు.

ఒరే ఒరే మన రెండో రూపాయ గాడేడ్రా? అనుకున్నాయి ఒక రెండు రూపాయల బిళ్ళా, ఒక ఒక రూపాయ బిళ్ళా. 

***   ***   ***

మర్నాడు సాక్షీ సింగు సింగుతూ వాషింగు మిషన్లో ధోనీ షర్టు వెయ్య బోతోంది. అది మొన్నటిది. దాన్లో ఒక రూపాయ బిళ్ళ దొరికింది. నాదే నాదే! అంటూ పెద్దగా అరిచింది. అంటే రూపాయ బిళ్ళ నాదే నాదే అని కాదు. మరేంటంటే, మరేమో సాక్షి కి ’ధ’ పలకటం రాదన్న మాట! అందుకే నాధే నాధే అనాల్సింది. నాదే నాదే అంది. అప్పుడు ధోనీ ఆర్పీ సింగుతో, అకాలాపకాలా లూపెంగ్-ముయ్ అనే ప్లేస్టేషను గేమాడుతూ, ఉన్నాడు. నాదే నాదే అని వినిపించగానే. దీన్దుమ్పతెగ! నాదే నాదే అంటోంది. ఖచ్చితంగా అది ఏదో నాదే అయి ఉంటుంది. దొబ్బేస్తుందేమో అని భయపడి  లేవకుండానే పరిగెత్తుకునెళ్ళాడు. లోపలకి.

నాదే! ఇదిగో ఈ రూపాయ బిళ్ళ మీ జేబులో దొరికింది నాదే! అంది. 

హమ్మయ్య! ఈ నాదే నా? ఇంకో నాదే అనుకుని భయపడ్డాను అని మనసులో అనుకుని, సాష్చీ, చూశావా? ఈ రూపాయి తగ్గే నిన్న నమీబియాలో లెమన్ షోడా తాగేవాడిని కాస్తా ఉసూరనుకుని వెనక్కొచ్చాను. దీని వల్లే మిగిలిన మూడు రూపాయలూ రష్చించ బడ్డాయి. అన్నాడు.
***   ***   ***

మర్నాడు ట్విట్టర్లో వేజలిన్ పుయ్యటం వల్లే ధోనీ దగ్గర అక్రమంగా రూపాయి మిగిలింది అని మైకేల్ వాన్ ట్వీటాడు. 

సచిన్ టెండూల్కర్ ఇలాగే రనవుటైతే మీ ఇండియాలో ఊరుకుంటారా? అని ఆం౨డీ ఫ్లవరడిగాడు. 

ఇదే గొడవలు మా ఇండియాలో జరిగితే మీరొచ్చి ఆడుతారా? అని క్రిస్నమాచారి గవాస్కర్ పత్రికలో కాలమ్ రాశాడు.
***   ***   ***

హమ్మయ్య నీవల్లే మేమ్ముగ్గురమూ బ్రతికి బట్ట కట్టాము. అని ఒక రెండు రూపాయల బిళ్ళా, ఒక రూపాయ బిళ్ళా అన్నాయి మిగిలిన ఒక రూపాయ బిళ్ళతో.

నీతి: ఖద కంచికి, మనం తెలుగు బ్లాగులకీ /wahaha/bye

0 comments:

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

Archiva

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP