Wednesday, August 10, 2011

Must read books for ScreenWriting

ScreenWriting అని సెర్చ్ సైట్లలో కొడితే వందల పుస్తకాలొచ్చాయి. ప్రతిదీ అద్భుతమే, అమోఘమే, అత్యద్భుతంగా స్ట్రక్చర్ చెయ్యబడ్డదే! మస్ట్ రీడ్ అన్న మాట బహు చక్కగా అబ్యూజ్ చెయ్యబడటం ఈ సన్నివేశంలోనూ గమనించ వచ్చు. అన్ని పుస్తకాలోంచీ దేన్ని ఎన్నుకోవాలి? అసలు స్క్రీన్ రైటింగ్ అన్న దాని కోసం పుస్తకాలు చదవాలా? పుస్తకాలు చదివితే కానీ వ్రాయలేమా? చదివినవి మనకు ఎంత వరకు ఉపయోగ పడుతాయి? అసలు ఎలాంటి పుస్తకాలు ఎన్నుకోవాలి? అవే సరియైనవని నమ్మకం ఏమిటి?

సమాధానాలకు ప్రయత్నిద్దాము. 

అసలు ఏదైనా పని మొదలు పెట్టే ముందు, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవటమనేది మంచి పద్ధతి. దానికి సంబంధించిన పుస్తకాలేమన్నా ఉన్నాయేమో చూడటం, పనికొచ్చే సమాచారం సేకరించటం మొదలైనవన్నమాట. ఇంతకు మునుపు ఏమి జరిగింది, ప్రస్తుతం ఏమి జరుగుతున్నది, మొదలైనవి తెలిస్తే, మన స్థాయి ఎక్కడ ఉన్నది? అలాగే, మనమే విధంగా మొదలు పెట్టవచ్చన్నదీ అంచనా వేసుకోవచ్చు. 

మరి ఎలాంటి పుస్తకాలు చదవాలి? చాలా చిన్న సమాధానం. మన అవసరానికి తగినటువంటివి. నెట్లోనూ, మార్కెట్లోనూ ఎన్నో పుస్తకాలుండగా ఏది మనకు తగినదని తెలుసుకోగలం? ఎవరికి వారే నేర్చుకోవాలి/వెతుక్కోవాలి అన్నమాటైతే కనుక కనిపించిన పుస్తకాన్నల్లా చదవటమే బెస్టాప్షన్ ;) టైమ్ కన్జ్యూమింగ్, మరియూ, ఉపయోగ శూన్యం ప్రాక్టికల్ గా చూస్తే. అందుకే, ఏ విషయాన్నైనా గతంలో జరిగిన వాటిని పరిశీలించటం అన్నది ముఖ్యం. ఇక్కడైతే చదివిన వాళ్ళెవరన్నా ఇచ్చే సలహాలూ, సంప్రదింపులూ.

ఉపోద్ఘాతమైంది కనుక అసలు విషయానికొద్దాము. టాపికిక్కడ స్క్రీన్‍రైటింగ్ కనుక, ఆ పేరుతో ఉన్న పుస్తకాలని ముందు చూడాలి. వాటిలో నేను చదివిన ఆరింటిలోనూ ఉపయోగ కరమైనది... సిడ్ ఫీల్డ్ ట్రైలజీ. అంటే మొత్తం సిడ్ ఫీల్డ్ కాక మరో ఐదు పుస్తకాలు చదివానని.

సిడ్ ఫీల్డే ఎందుకు గొప్పది అంటే... 

1) There is logical arrangement of the subject. 
2) Vast experience, and exploratory nature.
3) His invaluble experience with Jean Renoir
4) Explained every minute detail with suitable examples. 
5) Perfect updation
6) Authentic, and readable presentation of subject matter.

ఇంతకీ సిడ్ ఫీల్డ్ ట్రైలజీ అంటే ఏ పుస్తకాలు?

ఆయన వ్రాసినవి మొత్తం ఏడు పుస్తకాలున్నాయి. వాటిలో నేను సిడ్ ఫీల్డ్ ట్రైలజీగా చెప్పేవి ఇవీ...

1) Screenplay
2) Four Screenplays
3) The Screenwriter's Workbook.

మిగిలిన పుస్తకాలనూ తిరగేశాను గానీ, స్క్రీన్‍రైటింగ్ పరంగా మన ఇండియన్ కంటెక్స్ట్ కి అంత ఉపయోగ పడుతాయని నేను భావించటం లేదు.

మొదట స్క్రీన్‍ప్లే చదివాక, ఏవన్నా ఓ నాలుగైదు సినిమాల స్క్రీన్‍ప్లే లను తీసుకుని, పుస్తకంలో చెప్పిన విధంగా ఎనలైజ్ చేసుకోవాలి. దాని వల్ల కాస్త అప్ప్లికేషన్ తెలుస్తుంది. తరువాత ఫోర్ స్క్రీన్‍ప్లేస్ చదివితే, మన ఎనలైజేషన్ ఎలా ఉందో ఒక అవగాహనకు వస్తాము. తరువాత పట్టుకోవాల్సింది... వర్కుబుక్. కాస్త శ్రద్ధగా చదవాల్సిన పుస్తకం. చర్విత చరణం అనిపిస్తుంది కానీ, బాగా ఆసక్తికరంగానూ చదివిస్తుంది. కానీ ఈ పుస్తకం చదవటం చాలా ముఖ్యం. అందులో చెప్పిన విధంగా ఫాలో అవుతూ, అందులో ఇచ్చిన ఎక్సెరెసైజుల్ని చేస్తే కనుక మంచి ప్రాక్టీస్ అవుతుంది. ఈ పుస్తకం పూర్తి చేస్తే, స్క్రీన్‍రైటింగ్ మీద మంచి అవగాహన వస్తుంది. 

ఇక్కడో చిన్న మాట చెప్పాలి. స్క్రీన్‍రైటింగుని సీరియస్ గా తీసుకునే పనైతే ఒక మంచి ఎక్సెరెసైజుంది. అదేమిటంటే, ఒక సినిమాను చూసి, దాని స్క్రీన్‍ప్లేని వ్రాసే ప్రయత్నం చేయటం. చేసి, అసలు స్క్రీన్‍ప్లే తో కంపేర్ చేసుకోవటం. 

దీని వల్ల లాభాలు...

1) మనమెక్కడ ఉన్నామో తెలుస్తుంది. 
2) మన లోపాలూ తెలుస్తాయి
3) ఒరిజినలు స్క్రిప్ట్ లో ఉన్న లోపాల పట్ల అవగాహన కలిగి మనమా తప్పులు చెయ్యకుండా ఉపయోగ పడుతుంది.
4) అక్షరాల్లో ఉన్నదీ తెర మీదకు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో ప్రాక్టికల్ గా తెలుస్తుంది.

తరువాత చదవాల్సిన పుస్తకం... చెప్తే ఆశ్చర్య పడవచ్చు. కానీ, మిస్ కాకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది. ఆయన్ రాం౨డ్ వ్రాసిన ద రొమాన్టిక్ మా౨నిఫెస్టో.

స్టైలైజేషన్ అంటే ఏమిటో తెలుస్తుందీ పుస్తకం వల్ల.  అందులోనూ ముఖ్యంగా ఐదవ అధ్యాయమైన బేసిక్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ లిటెరేచర్ నాలుగైదు సార్లు చదవాలి. 

అయన్ రాం౨డ్ వ్రాసిన ఈ పుస్తకంలో ఎక్కువ రిటెన్ ఫిక్షన్ (నవలలూ, షార్ట్ స్టోరీలకే) గురించే అయినా, స్క్రీన్‍రైటింగప్పుడూ బాగా పనికి వస్తుంది.

ఈ చెప్పుకున్న అధ్యాయంలో 

1) Theme
2) Theme
3) Characterization and 
4) Style 

వీటి గురించి అద్భుతమైన ఉదాహరణలతో వివరిస్తుంది రచయిత్రి. Plot-theme integrity అంటే ఏమిటో బహు చక్కగా వివరిస్తుంది. మైకెలాన్జెలో ఆ౨న్టోనియానీ చెప్పినట్టు... "Everything must fall into place" అంటే ఏమిటో ఇంతకన్నా ఇంకెక్కడా దొరకదు. కథా, కథనం, వర్ణనలూ మొదలైనవి ఎలా ఉపయోగించాలో, ఎక్కద త్రుంచాలో అన్నవి తెలుస్తాయి. 

సిడ్ ఫీల్డ్ చెప్పే "What is the story about? And who is the story about?" అన్నవి ఈ పుస్తకంలో థీమ్ అన్న విభాగంలో బాగా అర్థమవుతాయి.

అలాగే కారక్టర్ డెవలప్మెంట్ గురించీ, కారక్టర్ కన్టిన్యుటీ అన్న దాని గురించీ, కన్సిస్టెన్సీ ఆఫ్ ఎ కారక్టర్ అన్న విషయం గురించీ మంచి ఉదాహరణతో వివరిస్తుంది. 

విషయాలను స్క్రీన్‍రైటింగ్ కు అన్వయించుకుంటూ చదవాలి. రాం౨డ్ గొప్ప విజువల్ స్టైలిస్ట్ కావటం వల్ల ఈ పుస్తకంలోని వివరాలు చాలా ఉపయోగ కరం. చదివిన తరువాతెలాగూ ఆమాట అంటారు. కాకపోతే ముందు సిడ్ ఫీల్డ్ ట్రైలజీ చదివాకే ఇది పట్టుకోవాలి. 

ఒక చిన్న హెచ్చరిక... స్క్రీన్‍రైటింకోసమని రాం౨డ్ పుస్తకం చదవమన్నాను కదాని నా మీదకు యుద్ధానికి రాకూడదు. అసలే ఆమెంటే పడని వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇంకో విషయం పొరపాటున కూడా రాం౨డ్ వ్రాసిన స్క్రీన్‍ప్లేల  గురించి ఆలోచించకండి. అంత నాసి రకంవి మెయిన్‍స్ట్రీమ్ లో దొరకవు ;) She is an authentic writer. That's all.

తరువాత చూడాల్సింది/చదవాల్సింది... పుదొవ్కిన్

On Film Technique, and Film Acting అన్న ఈ పుస్తకం తప్పక చదవాల్సిన పుస్తకం. ఆన్లైన్లో ఫ్రీగానే దొరుకుతున్నదిది. నేనైతే హాయిగా అనువదించేసుకున్నాను, రెండు విభాగాలకు సంబంధించినవి యాభై యాభై వ్యాసాల చప్పున :) కావాలనుకున్న వారికి...

పుదొవ్కిన్ లో ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, మొదలైన వాటి మీద సమగ్రమైన సమాచారమిచ్చారు. అవసరం లేని వాటిని ఎలా తెగ్గొయ్యాలో, లాగి అవతల పడెయ్యాలో, అన్నదీ, మరియూ, విజువల్ స్టోరీ టెల్లింగ్ (సిడ్ ఫీల్డ్ అనే మాట) అన్నది రచయితకు కూడా ఎంత వరకూ అవగాహన ఉండాలో... నేను చెప్పే కన్నా మీరే చదివి తెలుసుకోవటం ఉత్తమం.

ఇక చివరగా చదవాల్సినది... Joseph V. Mascelli వ్రాసిన The Five C's of Cinematography: Motion Picture Filming Techniques అన్న పుస్తకము. సినిమాటోగ్రాఫర్లది స్క్రీన్‍రైటర్లకెందుకయ్యా? అంటారా? ఫర్లేదు. కాస్తన్నా చదవాల్సిన, మరీ డీప్ గా అవసరం లేదనుకోండీ. అవగాహన కోసమైనా చదివితే, ఎంత ఉపయోగకరమో అన్నది ఒక స్క్రీన్‍ప్లే వ్రాస్తున్నప్పుడు తెలుస్తుంది.

పుస్తకాలు చదవక ముందూ, చదివిన తరువాతా నేను వ్రాసిన స్క్రీన్‍ప్లేల్లో తేడా కనిపించింది. అంటే అంతకు ముందుకన్నా తేడాగా ఏమన్నా వ్రాశానా అంటే తేడా ఏమీ లేదు. నా టెక్నిక్ ను మరింత బాగా విస్తృతంగా మెరుగు పర్చుకున్నాను అంతే. Corrected, and filled the gaps అంతే! :)

ఇక next step... కొన్ని ఒరిజినల్ స్క్రీన్‍ప్లేలు చదవటం. దాని గురించి తరువాత వ్యాసంలో... :)

బ్లాగుల్లో స్క్రీన్‍రైటింగురించెందుకురా బడుద్ధాయి వెధవా అంటారా? ఖచ్చితంగా వీపు గోకుడు కోసమైతే కాదు. :D అవసరమైన వాళ్ళకు ఉపయోగ పడొచ్చని

2 comments:

Tejaswi August 10, 2011 at 11:54 PM  

స్క్రీన్ ప్లే అంటే ఏమిటో తెలుసుకోవాలని చాలా రోజులనుంచి అనుకుంటుంటాను. అసలు మౌలికంగా స్క్రీన్ ప్లే అంటే ఏమిటో, ఫిల్మ్ మేకింగ్ లో దాని పాత్ర ఏమిటో తెలుపగలరా...మీకు అభ్యంతరం లేకపోతే. క్లుప్తంగా చాలు.

గీతాచార్య August 11, 2011 at 11:45 AM  

Tejaswi గారు,

స్క్రీన్‍ప్లే అంటే... మనం కథను తెర పైన ఎలా చూడాలనుకుంటున్నామో సరిగ్గా అదే విధంగా పేపరు మీ ఒక పద్ధతి ప్రకారంగా వ్రాసుకునేది. అంటే తెరపైన మొదట ఏమి కనిపించాలి. తరువాత ఏమి కనిపించాలి? ఇలా ఉన్న కథను తెరకెక్కించాల్సిన ఆర్డర్లో వ్రాయటమే స్క్రీన్‍ప్లే. అంటే తెర పైన కనిపించేదంతా స్క్రీన్‍ప్లే లో భాగమే. పేరులోనే ఉన్నట్టు... ప్లే అంటే రంగస్థలమ్మీద ఒక వరసలో కథ నడుస్తుంది కదా. అలాగే తెర మీద ఒక వరసలో కథ నడిచేలా వ్రాసుకునేదే స్క్రీన్ ప్లే. పూర్తి విరాలతో త్వరలోనే ఒక టపా వ్రాస్తాను.

A story told with pictures, with dialogues and descriptions is called a screenplay అని Syd Field అంటాడు. తెర పైన మనకు కనిపించేదంతా స్క్రీన్‍ప్లేనే... కాకపోతే ఎడిటింగ్ జరిగి ఉంటుంది.

మీకు మరింత బాగా అర్థం కావాలంటే http://thinkquisistor.blogspot.com/2011/08/blog-post.html

ఈ లింకులో ఉన్న కథను చదవండి. స్క్రీన్‍ప్లే తరహాలోనే వ్రాశాను. నేను వ్రాసిన దాన్ని ఒక స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఊహించు కుంటే నేను చెప్పింది మీకు అర్థమవుతుంది.

Whatz the deal?

I gets the wrong idea only when it suits me - Man with NoName

Archiva

సత్యమేవ జయతే!

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పాన్థా వితతో దేవయానః
యేన క్రమాన్త్యా ఋషయోహ్యాప్త కామః
యాతాః తత్ సత్యస్య పరమం నిధానం

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం ద్వారానే దైవ మార్గం ఏదో మనకు తెలుస్తుంది. ఆ దారినే నడిచి ఋషులు తమ అభీష్టాలని నెరవేర్చుకున్నారు. చివరకి ముక్తిని పొందగలిగారు.

  © Blogger templates ProBlogger Template by Ourblogtemplates.com 2008

Back to TOP