'గన్'గూలి : ది లాస్ట్ ఎయిమ్.
మొత్తానికీ అందరూ కలిసి గంగూలి ని దించేశారు. The pride of India has hung up his boots.
భారత కెప్టెన్ గా గుబాళించిన సౌరభం తన సువాసనలని మన కందరికీ వదిలేసి తను మాత్రం అంతర్జాతీయ యవనిక మీద నుంచీ తొలగి పోతున్నాడు. Pure and stylish తరహా క్రికెట్ ని ఇష్టపడే వాళ్ళకి ఇప్పుడు ఆ భాగ్యం లేకుండా చేసి, 'దాదా'పుగా గెంతెయబదకుండానే గౌరవం గా తప్పుకుంటున్నాడు.
సౌరవ్ గంగూలీ గురించి నేను వ్రాయాలని అనుకున్నాను. కానీ ఇలా అని మాత్రం అనుకోలేదు. సరే! మనమందరం ఆ కలకత్తా రాకుమారునికి దసరా శుభాకాంక్షలతో వీడుకోలు చెబుదాం. ఆస్సీస్ సీరీస్ లో గంగూలీ విజయవిహారం చేయాలని అందరం కోరుకుందాం. అతని శిష్యుడు సెహ్వాగ్ అన్నట్టుగా కనీసం 3-1 తేడాతో మన వాళ్లు గెల్చి 'గన్'గూలి కి విజయానందం తో వీడుకోలు చెప్పాలని... మన విజయ సారధి... సగర్వంగా తన కేరీయర్ ని ముగించాలి అని కోరుకుంటూ.
మీకు కూడా దుర్గాష్టమి శుభాకాంక్షలు.
5 comments:
గంగూలీ గొప్ప ఆటగాడే కానీ pride of India అనేది పెద్దమాటలాగుంది.
Shocked. When will you write about him?
@అబ్రకదబ్ర,
ఐతే సానియా మీర్జానా pride of India? :-)
గంగూలీ నిజం గానే భారత దేశం గర్వించ దగ్గ ఆటగాడు.
గంగూలీ నిజం గానే భారత దేశం గర్వించ దగ్గ ఆటగాడు.
కానీ,
pride of india సచిన్ టెండూల్కర్ అనుకుంటా.
@గీతాచార్య గారూ,
క్రికెట్ కూ భారతదేశానికీ ఎటువంటి సంబంధమూ లేదు.
ఎందుకంటే BCCI ఒక ప్రైవేటు సంస్థ, ప్రభుత్వ సంస్థ కాదు. కాబట్టి గంగూలీని pride of India అనలేము.
Post a Comment