"రామాయణం"
నాకు అంతర్జాలంతో పరిచయం శూన్యం. ఎప్పుడన్నా పిల్లలు చెప్పి చూపిస్తే చూడటమే. ఈ మధ్య మా అబ్బాయి బ్లాగులనే పేరుతో అంతర్జాలంలో ఏవేవో వ్రాస్తున్నానని చెప్పాడు. వాటిని పరిశీలిస్తే కొన్ని బాగానే అనిపించాయి. కొందరు బ్లాగ్గర్లు వ్రాసిన వాటిని తెచ్చి చూపగా అంతర్జాలంలో తెలుగు బాగానే వెలుగుతున్నదన్న ఆశ కలుగుతున్నది.
కూజంతం రామ రామేతి
మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితా శాఖం
వందే వాల్మీకి కోకిలం
నన్ను సంక్షేప రామాయణాన్ని వ్యాఖ్యాన సహితంగా వ్రాయమని ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. అయితే ఓపిక లేక ఉపేక్షిస్తూ వచ్చాను. అయితే తన వాదనతో నన్ను మొత్తానికీ ఉత్సాహ పరిచి నన్ను ఒప్పించాడు. అంతర్జాలం లో పెడతానని అనటం తో, ఆ మధుర కావ్యాన్ని మరలా తలుచుకునే భాగ్యం నాకు కలిగింది.
ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు కోరుతూ నా వీలుననుసరించి 'రామాయణం' అనబడే ఆ మధుర కథను నా శైలిలో అనువాదము చేసే పనిని చేపడుతాను.
సెలవ్.
వేదాల రాజగోపాలాచార్య.
4 comments:
రాజగోపాలాచార్యగారు,
రామకథామృతం ఎన్నిసార్లు విన్నా మధురమే కదా. శుభస్యశీఘ్రం.
అరిపిరాల సత్యప్రసాద్
shreeraamachamdra parabrahmane namah
bhakta kavulaku aahvaanam
బ్లాగ్లోకానికి స్వాగతం... మీ రచనల కోసం ఎదురు చూస్తూ ఉంటాము.
నమస్కారం ఆచార్యులవారు.
తప్పక చెయ్యండి.
Post a Comment